వై.ఎస్. జగన్ రైతు దీక్ష పోస్టర్ విడుదల | poster releases on ys jagan formers inmates | Sakshi
Sakshi News home page

వై.ఎస్. జగన్ రైతు దీక్ష పోస్టర్ విడుదల

Published Mon, Jan 19 2015 4:09 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వై.ఎస్. జగన్ రైతు దీక్ష పోస్టర్ విడుదల - Sakshi

వై.ఎస్. జగన్ రైతు దీక్ష పోస్టర్ విడుదల

ఏలూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సమస్యలపై  ఈ నెల 31, ఫిబ్రవరి 1న తణుకులో దీక్ష చేయనున్నారు. దీక్షకు సంబంధించిన పోస్టర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసింది. కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి, ప్రసాద్ రాజు , జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని, ఎమ్మెల్యేలు, జ్యోతుల నెహ్రూ, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ మేక శేషుబాబు,  నియోజక వర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తణుకులోని దీక్షా స్థలం ను త్రిసభ్యకమిటీ సభ్యులు పరిశీలించారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement