
విదాముయార్చి మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వేసవిలో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.
అయితే అదే రోజు ధనుశ్ హీరోగా నటిస్తోన్న ఇడ్లీ కడై విడుదల కానుంది. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే రోజు కావడంతో ఇడ్లీ కడై మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఇడ్లీ కడై మూవీ రిలీజ్ వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. తిరుచిత్రంబలం మూవీ తర్వాత ధనుశ్, నిత్యా మీనన్ మరోసారి జంటగా కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ధనుశ్ డైరెక్షన్‌లో అజిత్ కుమార్ నటించనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ధనుశ్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ పిక్చర్స్ బ్యానర్‌లో అజిత్ కుమార్ నటించే అవకాశం ఉందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు కోలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment