
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిం. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసింది.
తాజాగా ఈ మూవీలోని సూపర్ హిట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఓజీ సంభవం పేరిట అజిత్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోన్న పాటను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ వర్షన్ కూడా వచ్చేసింది. ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
The unmatched style and swag ❤️🔥#OGSambavam video song from #GoodBadUgly out now!
Tamil - https://t.co/knfimOefHV
Telugu - https://t.co/XgRHz7UxHh
Book your tickets for #GoodBadUgly now!
🎟️ https://t.co/jRftZ6vpJD#BlockbusterGBU pic.twitter.com/h7wmmbZvbH— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025