
ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?)
1952లో పుట్టిన ఈయన.. సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా మారారు. మోహన్ లాల్ తో 'వానప్రస్థం' సినిమా ఈయనకు చాలా పేరు తీసుకొచ్చింది. అలానే పిరవి మూవీతో జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. 2011లో ఈయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది.
ఈయన తీసిన సినిమాల్లో పిరవి, స్వాహం, వానప్రస్థం, నిషాద్, కుట్టి శృంఖు, స్వప్నం.. ప్రేక్షకుల నుంచి అద్బుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి ఈయన ఇప్పుడు మృతి చెందడంతో సినీ ప్రముఖులు షాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం)