
విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్దమైంది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఈ మూవీకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ ఏర్పాట్లతో బిజీగా ఉన్నారు. థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఓ థియేటర్ వద్ద బిగ్గెస్ట్ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. చాలా ఎత్తులో ఈ కటౌట్ నిర్మించడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న అజిత్ అభిమానులు పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ అభిమానులంతా తప్పించుకోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#Ajithkumar𓃵 #GoodBadUgly pic.twitter.com/mOhztO63OS
— 𝘼𝙅𝙄𝙏𝙃 𝙑𝙄𝙇𝙇𝘼𝙄𝙉 𝘼𝙆 ᴿᵉᵈ ᴰʳᵃᵍᵒⁿ 🐉 (@AJITHVILLAINAK) April 7, 2025