
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.
కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్‌లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.
తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
— vijayantony (@vijayantony) April 27, 2025
— vijayantony (@vijayantony) April 28, 2025