Pahalgam
-
సన్నద్ధతకు సంసిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మాక్‌డ్రిల్స్‌కు సర్వం సిద్ధమైంది. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒక్కటవుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయి. పట్టణాల నుంచి గ్రామస్థాయి దాకా వాటిలో ప్రజలంతా చురుగ్గా భాగస్వాములు కానున్నారు. 6.5 లక్షల మందికి పైగా వలెంటీర్లు ఈ క్రతువులో వారికి సాయపడనున్నారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో బుధవారం సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి దాకా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరుగుతాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది. వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశీ్మర్, పశి్చమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదిక కానున్నాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.కేంద్రం సమీక్ష పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దేశవ్యాప్త డ్రిల్స్ సన్నద్ధతను కేంద్ర హోం శాఖ మంగళవారం సమీక్షించింది. డ్రిల్స్ విధివిధానాలు తదితరాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రక్షణ, పోలీసు విభాగాల అత్యున్నత స్థాయి అధికారులు భేటీలో పాల్గొన్నారు. డ్రిల్స్‌లో విద్యార్థులు, ఎన్సీసీ కాడెట్లు, యువతతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఆస్పత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో ఉద్యోగులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.ఎక్కడికక్కడ పోలీసు, సైనిక సిబ్బంది వారితో సమన్వయం చేసుకోనున్నారు. 1971 తర్వాత రక్షణపరంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతుండటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా పాక్‌తో యుద్ధ నేపథ్యంలోనే ఈ కసరత్తు నిర్వహించారు. అంతకుముందు 1962, 1965ల్లో కూడా చైనా, పాక్‌తో పూర్తిస్థాయి యుద్ధం సందర్భంగా మాక్ డ్రిల్స్ జరిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ సన్నాహక కసరత్తులు పోలీసు తదితర బృందాల పర్యవేక్షణలో ముమ్మరంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలుకుని ప్రజలంతా పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొన్నారు.డ్రిల్స్ ఇలా...⇒ మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు విని్పస్తాయి. ⇒ వెంటనే పరిసర ప్రాంతాల పౌరులంతా క్షణాల్లో అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలాలి. వీలైన చోట్ల బంకర్లు, సబ్‌వేలు, అండర్‌గ్రౌండ్ మెట్రో తదితర చోట్ల తలదాచుకోవాలి. ⇒ ఈ కసరత్తులో యువత, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కాడెట్లు మొదలుకుని హోం గార్డుల దాకా అందరినీ భాగస్వాములను చేస్తారు. ⇒ కీలక సంస్థలు, మౌలిక సదుపాయ వ్యవస్థలను దాడుల నుంచి కాపాడుకోవడం, అవి శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడటం తదితరాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగి్నమాపక తదితర బృందాలు వారికి శిక్షణ ఇస్తాయి. ⇒ బ్లాకౌట్ వంటివి చోటుచేసుకుంటే ఎలా స్పందించాలో, స్వీయరక్షణతో పాటు పౌరులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తాయి. ⇒ రాత్రి 7.30 నుంచి 10 నిమిషాల పాటు క్రాష్ బ్లాకౌట్ ‘లైట్లను ఆపేయడం) కసరత్తు జరుగుతుంది. ⇒ డ్రిల్స్ కోసం హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ వంటివాటిని వైమానిక దళ లింకులతో అనుసంధానిస్తారు. ⇒ కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ విపత్తులకు ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. ⇒ డ్రిల్స్ నిమిత్తం స్పందన బృందాలన్నింటికీ ఇప్పటికే కోడ్ వర్డ్స్ కేటాయించారు. ⇒ ఎప్పుడేం చేయాలో పేర్కొంటూ టైమ్‌లైన్‌ను కూడా స్పష్టంగా నిర్దేశించారు. ⇒ వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల సమర్థతను డ్రిల్స్ ద్వారా పరిశీలించనున్నారు. ⇒ కేంద్ర హోం శాఖ పౌర రక్షణ నిబంధనలు (1968) సెక్షన్ 19 ప్రకారం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇవి అందుబాటులో ఉంచుకోవాలి⇒ మాక్ డ్రిల్స్‌కు పౌరులు పూరిస్థాయిలో సన్నద్ధం కావాలి. ⇒అత్యవసర చికిత్స నిమిత్తం మెడికల్ కిట్లు, కరెంటు కోత తదితరాల కోసం టార్చిలు, క్యాండిళ్లు వెంట ఉంచుకోవాలి. అలాగే వీలైనంత నగదు కూడా దగ్గరుంచుకోవాలి. ⇒ వీటిపై పౌరులను అప్రమత్తం చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ⇒ ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పౌర రక్షణ బృందాలు ఇప్పటికే చురుగ్గా పని చేస్తున్నాయి. ⇒ అయితే ఇవన్నీ స్వచ్ఛంద స్వభావంతో కూడిన బృందాలే.ఎక్కడెక్కడ?దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరుగుతాయి.⇒ వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి.⇒ 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ వంటివి ఉన్నాయి.ఈసారి తగ్గేదే లే! ⇒ ఉరి, బాలాకోట్ మాదిరిగా కాదు ⇒ త్వరలో బాహాటంగా భారీ ‘ఆపరేషన్’ ⇒ ఆ రాజకీయ సందేశమే డ్రిల్స్ లక్ష్యం2016లో సర్జికల్ స్ట్రైక్స్. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు. ఉగ్రవాద దుశ్చర్యలకు గతంలో మోదీ సర్కారు ప్రతిస్పందనలు. రెండూ సైలెంట్‌గా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్లే. ఉరి, పుల్వామా ఉగ్ర చర్యలతో పోలిస్తే ‘పహల్గాం’ దాడి పరిస్థితి పూర్తి భిన్నం. 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ మతం అడిగి పిట్టల్లా కాల్చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేగాక ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ కేంద్రానికి సూటిగా సవాలు విసిరారు. దాడిని తలచుకుని భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈసారి కొట్టబోయే దెబ్బ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈసారి భారత ప్రతి చర్య పూర్తి భిన్నంగా ఉండటం ఖాయమంటున్నారు. బాహాటంగా, అత్యంత భారీ స్థాయిలో సైనిక చర్య ఉండనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత, పౌర అవగాహన కోసం దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గట్టి రాజకీయ సందేశమివ్వడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఉగ్రవాదానికి, దానికి తల్లివేరు వంటి పొరుగు దేశానికి బుద్ధి చెప్పే విషయంలో దేశమంతా ఒక్కతాటిపై ఉందని ప్రపంచానికి చాటేందుకే మోదీ సర్కారు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ‘ఆపరేషన్’కు పాక్ స్పందనను బట్టి ఒకవేళ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా అందుకు దేశమంతా సంసిద్ధంగా ఉందని చాటడం కూడా ఈ డ్రిల్స్ ఉద్దేశమని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రాజ్‌నాద్ సింగ్. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.भारत माता की जय!— Rajnath Singh (@rajnathsingh) May 6, 2025కాగా భారత్ దాడుల అనంతరం పాకిస్తాన్ ఎదురు దాడులు చేయగా వాటిని భారత సైన్యం తిప్పి కొడుతుంది. -
ఇది ఐక్యతా సమయం
గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్లో నోటిఫికేషన్ పింగ్ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీని సాధించాడు. ఇన్ స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్ 7 – లోక్ కల్యాణ్ మార్గ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్. జనరల్ నార్మన్ స్క్వార్జ్కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్ సిక్స్త్ ఫ్లీట్ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యలు బీజింగ్ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్ లేదా పాకిస్థాన్ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్ దాడి పట్ల భారత్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అయినా, లేదా బాలాకోట్ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఏప్రిల్ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. -
పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్నాయి. ప్రతిదాడి కోసం భారత్ పక్కాగా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఈ తరుణంలో మే 7న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ 48 గంటల్లోనే రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జరగనున్న ఈ కేబినేట్ మీటింగ్‌పై అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.ఉగ్రదాడి జరిగిన సమయం నుంచి దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పాక్ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచదేశాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశ భద్రతపై ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో పాక్‌లో అలజడి రేగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కేబినేట్ సమావేశం జరగనుంది. అందులో దాయాది దేశానికి ఎలా బుద్ధి చెప్పాలి వంటి అంశాల గురించి చర్చించనున్నారు. భారత్‌పై పాక్ వైమానిక దాడులకు దిగితే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలాంటి సూచనలు చేయాలి..? దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాధం జరిగితే హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలు ఏంటి..? వంటి అంశాలు చర్చకు రానున్నాయి.ప్రధాని మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ (సీసీఎస్) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూజలాల ఒప్పందంపై ఆంక్షలు. దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు, గగనతలాన్ని మూసివేయడం వంటి నిర్ణయాలను భారత్ తీసుకుంది. -
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు
-
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.ఈ మాక్ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రంకేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు Category-II: పోర్ట్ బ్లెయిర్2. ఆంధ్ర ప్రదేశ్Category-II: హైదరాబాద్, విశాఖపట్నం3. అరుణాచల్ ప్రదేశ్ Category-II: • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్) • ఇటనగర్ • తవాంగ్ • హయులింగ్ • Category-III: బొమ్డిలా4. అస్సాం Category-II: • బోంగైగావోన్ • డిబ్రూగఢ్ • ధుబ్రి • గోల్పారా • జోర్హాట్ • శిబ్‌సాగర్ • టిన్సుకియా • తేజ్‌పూర్ • డిగ్బోయ్ • దిలీజన్ • గువహాటి (డిస్పూర్) • రంగియా • నమ్రుప్ • నజీరా • నార్త్-లక్ష…26.ఒరిస్సా (ఒడిశా)Category-II: • టాల్చర్ Category-III: • బలాసోర్ • కోరాపుట్ • భువనేశ్వర్ • గోపాల్పూర్ • హిరాకుడ • పారాదీప్ • రౌర్కెలా • భద్రక్ • ధేంకనాల్ • జగత్సింగ్పూర్ • కేండ్రాపాడా27. పుదుచ్చేరి Category-II:పుదుచ్చేరి28. పంజాబ్Category-II: • అమృత్సర్ • భటిండా • ఫిరోజ్‌పూర్ • గుర్దాస్పూర్ • హోషియార్పూర్ • జలంధర్ • లుధియానా • పటియాలా • పఠాన్‌కోట్ • అడాంపూర్ • బర్ణాలా • భాఖ్రా-నంగళ్ • హల్వారా • కొఠ్‌కాపూర్ • బటాలా • మోహాలి (ససనగర్) • అబోహర్Category-III: • ఫరీద్పూర్ • రోపర్ • సంగ్రూర్29. రాజస్థాన్Category-II: • కోటా • రావత్భాటా • అజ్మీర్ • అల్వార్ • బార్మేర్ • భరత్పూర్ • బీకానేర్ • బుండీ • గంగానగర్ • హనుమాన్‌గఢ్ • జైపూర్ • జైసల్మేర్ • జోధ్‌పూర్ • ఉదయ్‌పూర్ • సికార్ • నాల్ • సూరత్‌గఢ్ • అబూ రోడ్ • నసీరాబాద్ (అజ్మీర్) • భివారీ Category-III: • ఫులేరా (జైపూర్) • నాగౌర్ (మెర్టా రోడ్) • జాలోర్ • బేవార్ (అజ్మీర్) • లాల్‌గఢ్ (గంగానగర్) • సవాయ్ మాధోపూర్ • పాలి • భిల్వారా👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలుఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్మొబైల్ సిగ్నల్స్ నిలిపివేతట్రాఫిక్ దారి మళ్లింపుప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలుపబ్లిక్ అనౌన్స్మెంట్స్👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానంసివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానంఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలివదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దుకరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే వినాలిప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలిమార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు 👉రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలిక్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ -
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఇస్లామాబాద్: 1971లలో నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు. -
పౌరులను అప్రమత్తం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
-
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ఢిల్లీ: యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది. రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సోమవారం కేంద్రం ఆదేశించించిన సంగతి తెలిసిందే. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది.కాగా, సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ నిన్న (సోమవారం) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.కాగా, దేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సోమవారం) కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు. -
భారత్‌కే మా మద్దతు
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉ గ్రవాదులను, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. బాధిత కుటుంబాలకు పుతిన్ సానుభూతి ప్రకటించారు. ఆయన సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే నామరూపాల్లేకుండా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. భారత్–రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్ పేర్కొన్నారు. రష్యా ‘విక్టరీ డే’ 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌తోపాటు రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ ఏడాది జరగబోయే ఇండియా–రష్యా ద్వైపాక్షిక సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా, పుతిన్ అందుకు అంగీకరించారు. -
ఉగ్రవాదులకు స్థానిక స్లీపర్‌సెల్స్ సాయం?
శ్రీనగర్: పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కర్కశకాండ వెనుక స్థానిక స్లీపర్‌సెల్స్ హస్తం దాగుందని నిద్రాణంగా ఉండే ఉగ్ర బృందంలోని మాజీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఇలాంటి పలు విషయాలను పంచుకున్నాడు. ‘‘స్థానికంగా ఉండే వాళ్ల నుంచి కనీస సహకారం లేకుండా ఇంతటి దాడి చేయడం అసాధ్యం. దాడిచేసిన లష్కర్ ఉగ్రవాదులతో కనీసం ఐదారుగురు స్థానిక స్లీపర్‌సెల్ సభ్యులు సాయపడి ఉంటారు. సాధారణంగా ఇలాంటి దాడుల్లో కనీసం నెల రోజుల ముందే స్లీపర్ సెల్ సభ్యులను దాడిచేయబోయే ఉగ్రవాదులు సంప్రదిస్తారు. దాడి ఎలా చేయాలి? ఎటు వైపు తప్పించుకోవాలి?లాంటివన్నీ ముందే ప్లాన్ చేస్తారు’’అని మాజీ స్లీపర్‌సెల్ సభ్యుడు చెప్పాడు. ‘‘ఒకవేళ నేనే స్వయంగా శ్రీనగర్‌లో దాడిచేయాలనుకుంటే గుడ్డిగా శ్రీనగర్‌కు వెళ్లను. ముందుగా శ్రీనగర్‌లో దాడిచేయబోయే చోట తరచూ ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు అనే ఖచ్చితమైన అంచనా ఉండాలి. ఆ ప్రాంతంపై నాకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన మనకు స్లీపర్‌సెల్స్ సభ్యులు కల్పిస్తారు. భద్రతా బలగాలు ఎంత మంది ఉండొచ్చు, దాడికి సఫలమయ్యే అవకాశాలు లాంటివన్నీ వాళ్లే చెప్తారు. తర్వాత ఉగ్రవాదులు రంగంలోకి దిగుతారు. బైసారన్లోనూ ఇదే జరిగి ఉంటుంది’’అని అన్నాడు.గతంలో జైలుకు వెళ్లి.. ఇతను గతంలో స్లీపర్‌సెల్‌లో పనిచేసిన నేరానికి కొన్నేళ్లు జైలులో గడిపి బయటికొచ్చాడు. ‘‘స్లీపర్‌సెల్ సభ్యులు దాడి చేయరు. దాడి చేయబోయే ఉగ్రవాదులకు ఆర్మీ కదలికలపై నిఘా సమాచారం అందిస్తారు. ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అత్యయిక అవసరాలు తీరుస్తారు. నేను కూడా గతంలో 2–4 ఏళ్లు స్లీపర్‌సెల్ సభ్యునిగా పనిచేశా. ఉగ్రవాదులకు కావాల్సినవి అందించా. రాత్రిళ్లు తిరిగి సమాచారం సంపాదించి ఇచ్చా. నేను ఇచ్చిన సమాచారంతో వాళ్లు ఎన్నో దాడులు చేశారు’’అని చెప్పాడు. గ్రనేడ్ దాడి ప్రయత్నంలో భద్రతా బలగాలు ఇతడిని అరెస్ట్‌చేశారు. నేరం నిరూపణ అయ్యాక కొంతకాలం జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ‘‘ఆనాడు నేను మైనర్‌గా ఉండబట్టే విడుదలయ్యా. అది నా అదృష్టం. లేదంటే ఎప్పటికీ నేను విడుదలకాకపోయే వాడినేమో’’అని అతను అన్నాడు. ‘‘2015 కాలంలో నన్ను ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకున్నారు. అప్పట్లో ఫేస్బుక్, వాట్సాప్ యాప్‌లపై నిఘా అంతగా లేదు. అందుకే ఫేస్బుక్లో నాకు మెసేజ్‌లు పంపేవాడు. కొంతకాలానికి నిఘా పెరగడంతో బీబీఎం యాప్‌కు మారా. ఈ యాప్‌లో చేసే వీడియో, వాయిస్ కాల్స్‌ను ఎవరూ కనిపెట్టలేరు’’అని అతను చెప్పాడు. ఉగ్రవాదులతో పనిచేయడం 110 శాతం తప్పు ‘‘స్లీపర్‌సెల్ సభ్యునిగా ఉంటూ చిట్టడవిలోకి వెళ్లి ఉగ్రవాదులకు ఆహారం అందించి రావడం నా తొలి పని. తర్వాతర్వాత ఒక చోట ఉన్న వస్తువును రహస్యంగా మరో చోటుకు చేర్చాల్సి వచ్చేది. నాకు ఈ పనులు పురమాయించే ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే నేను నమ్మకస్తుడినా కాదా అని నిర్ధారించుకునేందుకు నాపై కూడా నిఘా కొనసాగేది. ఇప్పుటికీ నా స్నేహితుల్లో ఇద్దరు ఉగ్రవాదులుగా కొనసాగుతున్నారు. మరో 13–14 మంది స్నేహితులు ఉగ్రవాదులుగా మారి భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఏ విధంగా చూసినా ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం 110 శాతం తప్పు. నా పదేళ్లగతాన్ని చూసుకుంటే అసలు నేనింకా బతికే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది’’అని అతను చెప్పాడు. -
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్ బీట్ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్ లోయలోని చిట్టిసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్‌లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్‌వర్క్‌లలో అందు బాటులో ఉన్నదంతా పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్ ్స ఫ్రంట్’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్ హ్యాక్ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్‌లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని వాన్ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్ 7 తర్వాత ఏ అమెరికన్ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్‌తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్ లోపల... కశ్మీర్ వెలుపలా.!పహల్గామ్ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్‌లోనూ, కశ్మీర్ వెలుపల కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్‌వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి -
Mock drills: భారత్‌లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు. -
రక్షణశాఖ డేటాను పాక్ హ్యాక్ చేసిందా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి భారత్ ను టార్గెట్ చేస్తూ హ్యాకింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న తరుణంలో పాక్ హ్యాకర్లు ఒక ప్రకటన చేశారు. తాము భారత రక్షణశాఖ సైట్లను లక్ష్యంగా చేసుకుని డేటాను హ్యాక్ చేసినట్లు స్పష్టం చేశారు.మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటాను అపహరించినట్లు పాకిస్తాన్ సైబర్స్ ఫోర్స్ అనే హ్యాండిల్ పోస్ట్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజులుగా పాకిస్తాన్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. , ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు. అయితే తమ వెబ్ సైట్ లో డేటాను పాక్ హ్యాక్ చేసినట్లు వార్తలను నోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఖండించింది. అందులో వాస్తవం లేదని పేర్కొంది. -
ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్! వీడియో వైరల్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్‌దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు. -
ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్
-
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్ మరో మిసైల్ ప్రయోగం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ ఫతహ్ అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిసైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో ఈ మిసైల్ టెస్ట్ ప్రధానంగా మిస్సైల్ హార్డ్‌వేర్,సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించడం, అలాగే మిసైల్‌లో ఉపయోగించిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్తాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిసైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది.కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ మిలటరీ చర్యలు పాకిస్తాన్-భారతదేశాల మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ఈ దారుణానికి ఒడిగట్టింది. పాక్‌పై భారత్ ఆంక్షలుదీనికి ప్రతిగా, భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.ఏక్షణంలోనైనా పాక్‌పై భారత్ దాడిప్రధానమంత్రి మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత సైన్యం పాకిస్తాన్‌పై ఏ క్షణంలో మెరుపు దాడి చేసే దిశగా సన్నాహాలు కొనసాగిస్తోంది. -
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ పంచాయతీ
-
ట్రోలింగ్‌పై సీరియస్
పహల్గాం ఉగ్రదాడిలో 26మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో.. నేవీ అధికారి అయిన తన భర్త వినయ్ నర్వాల్ మృతదేహం వద్ద భార్య హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఆ ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) తీవ్రంగా స్పందించింది.న్యూఢిల్లీ: నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్షిపై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు. లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్‌ను మతం అడిగి మరీ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అయితే వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గం.కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దారుణం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అలా కామెంట్లు చేయడం సరికాదు అని ఎన్సీడబ్ల్యూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా గౌరవాన్ని, ఔనత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు.. కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఉదంతంపై స్పందించారు. నేవీ అధికారి వినయ్ నర్వాల్ స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని... శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి" అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలకు గానూ సోషల్ మీడియాలో ఆమెను కొందరు నిందిస్తూ పోస్టులు చేయసాగారు.గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్డీ స్కాలర్. కేవలం కొద్ది వారాల క్రితమే, ఏప్రిల్ 16న ఆమెకు నేవీ అధికారి వినయ్ నర్వాల్‌తో వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం, వారు హనీమూన్ కోసం కశ్మీర్‌లోని పహల్గామ్కు వెళ్లారు. అయితే, ఏప్రిల్ 22న వారు సేదతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినయ్ నర్వాల్ అంత్యక్రియలను హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త శవపేటిక వద్ద హిమాన్షి సెల్యూట్ చేసిన దృశ్యాలు పలువురిని కదిలించాయి. जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकी हमले में देश के अनेक नागरिकों की हत्या कर दी गई थी। इस हमले में अन्य लोगों के साथ लेफ्टिनेंट विनय नरवाल जी से उनका धर्म पूछकर उन्हें गोली मार दी गई थी। इस आतंकी हमले से पूरा देश आहत व क्रोधित है। लेफ्टिनेंट विनय नरवाल जी के मृत्यु के पश्चात…— Vijaya Rahatkar (@VijayaRahatkar) May 4, 2025 -
మైసూరులో పాకిస్తానీ మహిళ
మైసూరు(కర్ణాటక): మైసూరులో పాకిస్తాన్‌కు చెందిన మహిళ స్వదేశానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్లో ఉన్న తన భర్త పిలుచుకుపోతాడని ఆమె భారత్– పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లింది, కానీ భర్త రాకపోవడంతో ఒంటరిగా వెళ్లలేక ఉస్సూరంటూ మైసూరుకు తిరిగి వచ్చింది. మైసూరులో నివాసం వివరాలు.. మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాకిస్తాన్‌కు చెందిన మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వ్యక్తితో వివాహమైంది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కలిసి పాకిస్తాన్లో జీవించింది, పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆమె, పిల్లలతో కలిసి మైసూరుకు వచ్చి ఉంటోంది. పహల్గాంలో ఉగ్రవాదుల మారణహోమం తరువాత పాకిస్తాన్ పౌరులందరూ వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఫలితంగా ఆ మహిళ పాకిస్తాన్‌కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భర్తకు ఫోన్ చేయగా పిల్లలతో కలిసి సరిహద్దుల వద్దకు రా, నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆమె పిల్లలను వెంటేసుకుని సరిహద్దులకు వెళ్లింది. భర్తకు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మళ్లీ మైసూరుకు తిరిగి వచ్చింది. ఆమె విజిటర్స్ వీసాతో మైసూరులో ఉంటోంది. -
ఐరాసలో నేడు పాక్-భారత్ పంచాయితీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు. -
కేవలం 4 రోజుల్లో చేతులెత్తేయడమే!
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏ క్షణాన ఎలా విరుచుకుపడుతుందోనని బిక్కుబిక్కుమంటోంది. దీటైన ప్రతిస్పందన, అవసరమైతే అణుబాంబులు అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం వణికిపోతోంది. భారత్‌ను ఎలాగోలా నిలువరించండంటూ అరబ్ దేశాలను బామాలుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పాక్ సాయుధ సన్నద్ధత, ఆయుధ సంపత్తి అత్యంత దారుణంగా ఉన్నట్టు అక్కడి మీడియానే చెబుతోంది. ఇప్పటికిప్పుడు భారత్‌తో యుద్ధానికి తలపడాల్సి వస్తే పాక్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఎంతో కొంత పోరాడగలదని, తర్వాత చేతులెత్తేయడం మినహా మరో మార్గం లేదని తెలుస్తోంది. నిండుకున్న మందుగుండు భూతల యుద్ధంలో కీలకమైన శతఘ్నులు, మోరా్టర్లు, తుపాకుల్లో వాడే అన్నిరకాల మందుగుండూ పాక్ వద్ద దాదాపు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. సైన్యం వద్ద కేవలం నాలుగు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాక్‌కు ప్రధానంగా మందుగుండు సరఫరా చేసే సంస్థలు ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధాలకు మందుగుండు సరఫరాలో బిజీగా ఉన్నాయి. దాంతో పాక్ అవసరాలను తీర్చే నాథుడే లేకుండా పోయాడు.అంతర్జాతీయంగా మందుగుండుకు ఇప్పుడున్న డిమాండ్ నేపథ్యంలో వాటిని కొనే స్తోమత, ఆర్థిక బలం కూడా పాక్‌కు లేవు. దీనికితోడు దేశీయంగా మందుగుండు, ఆయుధాలను తయారు చేసే పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీవ్ర ముడిసరుకుల కొరతను ఎదుర్కొంటోంది. పైగా దాని సాంకేతికత పాత తరానిది కావడంతో పెద్దగా పనికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఉక్రెయిన్‌తో గత ఒప్పందం మేరకు ఆ దేశానికి పాక్ ఇటీవలి దాకా భారీగా మందుగుండు సరఫరా చేసింది. తీరా ఇప్పుడు సొంత అవసరాలకు సరిపడా నిల్వల్లేక తెగ తిప్పలు పడుతోంది. యుద్ధమే వస్తే ప్రస్తుత మందుగుండు నిల్వలు 96 గంటల్లోపే ఖాళీ అవుతాయని పాక్‌లోని విశ్వసనీయ సైనిక వర్గాలు వెల్లడించాయి.హోవిట్జర్లకూ మందుగుండు కొరతే పాక్ ఎం109 హోవిట్జర్లలో ఉపయోగించే 155 ఎంఎం షెల్స్, బీఎం–21 మలి్టపుల్ రాకెట్ లాంచింగ్ వాహనాల్లో వాడే 122 ఎంఎం రాకెట్లకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో ఆ దేశానికి పాక్ 155 ఎంఎం షెల్ మందుగుండు ఎడాపెడా ఎగుమతి చేసింది. దాంతో వాటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. మౌంటెడ్ గన్ సిస్టమ్(ఎంజీఎస్) వ్యవస్థలో వాడే మందుగుండునూ ఉక్రెయిన్‌కు భారీగా ఇచ్చేసింది. అవీ తగ్గిపోవడంతో గాబరా పడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ గనుక అధునాతన ఆయుధాలతో సరిహద్దు దాటి వస్తే నిలువరించేందుకు శతఘ్నులు మందుగుండుతో సిద్ధంగా లేవని మే 2న జరిగిన పాక్ స్పెషల్ కోర్ కమాండర్స్ భేటీలో సైన్యాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాలూచేయీ కూడదీసుకుంటూ...అందుబాటులో ఉన్న కొద్దిపాటి మందుగుండును వీలైనంతగా భారత సరిహద్దులకు పాక్ తరలిస్తోంది. అక్కడ ఇప్పటికే మందుగుండు నిల్వ చేసి పెట్టుకుందని విశ్వసనీయ సమాచారం. మందుగుండు కొరతను గతంలో కూడా పాక్ ప్రభుత్వ వర్గాలే ఒప్పుకున్నాయి. యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సరిపడా ఆయుధాలు కూడా లేవని నాటి పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా వాపోయారు. దీర్ఘకాలం పాటు యుద్ధం చేయడం పాక్ దళాలకు అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. గగనతలంలో యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఎంతగా పోరాడినా భూభాగాన్ని కాపాడుకోవడమే యుద్ధాల్లో కీలకం. కానీ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పోలిస్తే పాక్ ఆర్మీ పాటవం, సన్నద్ధత అత్యంత అధ్వానమని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవే ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్‌తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా మండలికి పాక్ పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్‌ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ భారత్‌తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్ పార్లమెంట్ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు పాక్ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్‌లోని కొన్ని భూభాగాలపై భారత్ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్‌కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్‌పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌మంత్రి హనీఫ్ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు, భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
అదే జరిగితే.. భారత్‌కు పాక్ మరోసారి అణు బెదిరింపులు
మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. దీంతో భారత్ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది. -
కొలంబో విమానాశ్రయంలో పహల్గామ్ ఉగ్రదాడి అనుమానితుల అరెస్టు
-
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?
కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్ చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్‌ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.పహల్గాం దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఉగ్రవాదుల్నే కాదు.. వారి మద్దతుదారుల అంతు కూడా చూస్తాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.ఈరోజు (శనివారం) అంగోలా అధ్యక్షుడు మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకోతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్పరెన్స్ లో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అసువులు బాసిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు ఒకవైపు హెచ్చరికలు పంపుతూనే, ఏ క్షణంలో ఏం జరిగిన భారత బలగాలు సిద్ధంగా ఉండాలనే స్వేచ్ఛను కూడా వారికి అప్పగించింది. దాంతో పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే అందుకు బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. -
పాకిస్తాన్ ఓడలపై భారత్ నిషేధం
ఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్ వరుస షాకులిస్తోంది. ఇవాళ పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో , మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పాకిస్తాన్ విమానాలకు ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది భారత్. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్ కొనసాగిస్తోంది. -
పహల్గాం ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో షాక్
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్,పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకు దెబ్బ తీస్తోంది. ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్ దేశ మీడియా,సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది. -
అభిమాని కోరికను ‘పహల్గాం’ఘటనతో పోల్చిన సింగర్.. కేసు నమోదు!
కాన్సర్ట్ మధ్యలో పహల్గాం దాడి గురించి ప్రస్తావించినందుకుగానూ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్(Sonu Nigam) చిక్కుల్లో పడ్డారు. అతని వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగమ్‌పై కర్ణాటక రక్షణ వేదిక (KRV)బెంగళూరు నగర జిల్లా అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? కన్నడ ప్రజలు అతనిపై ఎందుకు అసహజం వ్యక్తం చేస్తున్నారు?కన్నడ పాటలోనే పాడాలిబాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కి సంగీత ప్రపంచంలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలోనే ఎక్కువ పాటలు పాడినప్పటికీ..తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ..ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. తుళు, మైథిలీ, నేపాలి భాషల్లోనూ ఆయన పాటలు ఆలపించారు. ఆయన నిర్వహించే సంగీత కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు హాజరవుతుంటారు. తాజాగా ఆయన బెంగళూరులో కాన్సర్ నిర్వహించారు. సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడ భాషలో పాడాలంటూ డిమాండ్ చేశారు. ఆ అభిమాని పదే పదే అదే కోరడం..గట్టిగా అరవడంతో సోనూ నిగమ్ సహనం కోల్పోయాడు. పాటలు పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకుల గురించి మాట్లాడారు. కన్నడ భాష అంటే తనకు కూడా ఇష్టమేనని..కానీ ఆ అభిమాని ఆ భాషలోనే పాడాలని బెదిరించడం తనకు నచ్చలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి ప్రస్తావించారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాం దాడికి ఇలాంటి వ్యాఖ్యలే కారణం. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని ఘాటుగా స్పందించారు.Look at this shameless #SonuNigam Riduculing a fan for requesting him to sing a Kannada song in Bengaluru and Blaming Languages for the Terrorist attack.., off-late its become fashion to blame Kannada for these Hindi jihadis for everything.When u have no seed to question the… pic.twitter.com/pw2w9vjj8h— Prathap ಕಣಗಾಲ್💛❤️ (@Kanagalogy) May 1, 2025 సింగర్‌పై కన్నడ ప్రజలు అసహనంసోనూ నిగమ్ భాషను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కొంతమంది తమ మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికతో పాటు మరికొంత మంది కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే కాన్సర్ట్‌లో సోనూ నిగమ్ కన్నడ ప్రేక్షకులపై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. నేను అన్నిభాషల్లో పాటలు పాడాను కానీ.. ఎక్కువగా కన్నడలోనే మంచి పాటలు పాడాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది. నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా అనుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను ఎక్కడ కాన్సర్ట్ నిర్వహించిన అక్కడకి కన్నడ ప్రజలు వస్తారు. వారి కోసం ఆ భాషలో పాటలు పాడుతాను. కానీ ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడాలని బెదిరించడం నా మనసుని నొప్పించింది’ అని సోనూ నిగమ్ అన్నారు. ಸೊನು ನಿಗಮ್ ವಿರುದ್ದBNS 352(1)BNS 352(2)BNS 353 ಅಡಿಯಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದ ವ್ಯಾಪ್ತಿಯ ಆವಲಹಳ್ಲಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ದಾಖಲಿಸಲಾಗಿದೆ. 24 ಗಂಟೆಯ ಒಳಗೆ FIR ದಾಖಲಿಸುವುದಾಗಿ ಪೊಲೀಸರು ಹೇಳಿದ್ದಾರೆ.ನಾಳೆ ಘಟನೆ ನಡೆದ ಈಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಕಾಲೇಜಿನ ವಿರುದ್ದ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆComplaint Filed Against Sonu NigamA… pic.twitter.com/Nx6gb6hqxo— ಅರುಣ್ ಜಾವಗಲ್ | Arun Javgal (@ajavgal) May 2, 2025 -
భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడిలో కారణంగా ఈ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ సైనికులు ఈ ఘటనలో భాగం కావడంతో దాయాదిపై దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు చెక్ పెడుతూ.. ఎప్పటికప్పడు భారత్ బలగాలు యుద్దానికి సిద్ధమవుతున్నాయి. దీంతో, భారత్ చర్యలపై భయంతో వణికిపోతున్న పాక్.. రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో పాక్ ప్రధాని మంతనాలు జరుపుతున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులు కలిపింది. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ సర్కార్.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. సాయం చేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మంతనాలు జరుపుతున్నారు.నేతలతో పాక్ ప్రధాని చర్చలు..తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.Chinese Ambassador in Pakistan, H.E Jiang Zaidong calls on Prime Minister Muhammad Shehbaz Sharif in Islamabad.May 1, 2025. pic.twitter.com/wmJlR2b0gk— Prime Minister's Office (@PakPMO) May 2, 2025ఈ మేరకు పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో.. పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో షహబాబ్ సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సందర్బంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారని తెలిపింది. ఇదిలా ఉండగా.. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాక్ చెప్పుకొచ్చింది.Ambassador of UAE to Pakistan H.E. Hamad Obaid Ibrahim Salem Al-Zaabi called on Prime Minister Muhammad Shehbaz Sharif.May 2, 2025. pic.twitter.com/c2KGCrKvbB— Prime Minister's Office (@PakPMO) May 2, 2025పాక్‌కు మద్దతిచ్చే దేశాలు ఇవే..ఇక, పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేస్తే.. దాయాది కొన్ని దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. చైనా, టర్కీ, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం లీగ్ దేశాలు పాక్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు టర్కీ నిలిచింది. భారత్‌తో వైరం కారణంగా చైనా.. పాక్‌కు అండగా ఉండనుంది. ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుంది. -
మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి
బెంగళూరు: పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Karnataka Minister BZ Zameer Ahmed Khan says, "...We are Indians, we are Hindustanis. Pakistan never had any relations with us. Pakistan has always been our enemy...If Modi, Amit Shah and the Central government let me, I am ready to go to battle. (02.05.2025) pic.twitter.com/HdYiZcYBIC— ANI (@ANI) May 3, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.📍Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh — even at night #GangaExpressway #aircraft #AirForce #IndiaPakistan #ind pic.twitter.com/nN8EyzpNQl— Geopolitics news (@rat92553) May 3, 2025పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.उत्तर प्रदेश: शाहजहांपुर (Indian Air Force)शाहजहांपुर Ganga Expressway पर भारत वायु सेना की Exercise जारी है।यहाँ राफेल जैसे युद्धक विमानों की भीड़ है। pic.twitter.com/khEHUDrCzD— Shubhangi Pandit (@Babymishra_) May 3, 2025 -
వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో
-
వణుకుతున్న దాయాది
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది. -
పాక్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. -
ఇప్పుడు మనం ఏం చేయాలి?
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ (pahalgam) ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి.కశ్మీర్ (Kashmir) విషయంలో భారత్–పాకిస్తాన్ల మధ్య చాలా కాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందించినవారు, స్పాన్సర్లు.. పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషించినవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి.మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్ లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూరహ్ కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది.ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి.చదవండి: ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశంభారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.- జహారా బేగం సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాదిపై అనేక ఆంక్షలు విధించింది. అదే విధంగా పాకిస్తాన్‌కు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాక్ యూట్యూబ్ చానెళ్లు, ట్విటర్‌ను నిషేధించిన భారత్.. క్రీడాకారుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్-2024 స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఖాతాను దేశంలో నిలిపివేసింది.బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లకు కూడా తాజాగా షాక్ తగిలింది. వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు. వీరి అకౌంట్లను ఓపెన్ చేయాలని చూస్తే.. ‘‘ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదు. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో దీనిపై ఆంక్షలు ఉన్నాయి’’ అనే సందేశం కనిపిస్తోంది.కాగా పహల్గామ్ దాడి తర్వాత షోయబ్ అక్తర్, షాహిన్ షా ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రం, వకార్ యూనిస్, బసిత్ అలీ తదితర క్రికెటర్ల అకౌంట్లను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. అదే విధంగా ఇతర సెలబ్రిటీలు మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, అలీ జాఫర్, హనియా ఆమిర్ ఖాతాలను కూడా నిలిపివేశారు.భారత్‌లో నిషేధంఇక పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్-2025తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు.. పహల్గామ్ దాడి తర్వాత మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అంతంత మాత్రమైన వ్యూయర్షిప్ ఉన్న ఈ లీగ్ ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఇటీవల పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే. బైసరన్ అందాలు చూసేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. దీంతో... అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా దాయాదికి బుద్ధిచెప్తోంది.చదవండి: ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..? -
Pahalgam : ఒక్కడి కుట్ర సంక్షోభంలోకి పాకిస్తాన్
-
పాక్ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ బట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది. -
ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్) జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.🚨 LIKELY NO ASIA CUP 2025 🚨- Asia Cup 2025 remains under a cloud because of the terror attack in Pahalgam. (Sahil Malhotra/TOI). pic.twitter.com/dji5zdwc5T— Tanuj (@ImTanujSingh) May 2, 2025కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాక్ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్‌కాంగ్, ఒమన్, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.🚨 NO INDIA-BANGLADESH SERIES 🚨- Team India Unlikely to tour Bangladesh for the White ball series in August due to cross border tension. (Sahil Malhotra/TOI). pic.twitter.com/qsBdZO7ccE— Tanuj (@ImTanujSingh) May 2, 2025బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దు..?అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకోనుందని సమాచారం. ఎఫ్టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్‌లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్ 29, 31 తేదీలోల ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్ పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను బ్యాన్ చేసింది. పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్‌కు సూచించింది. -
పాకిస్తాన్ అండతోనే ఉగ్రదాడి నిజం ఒప్పుకున్న సానుభూతిపరుడు
-
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్
-
పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!
-
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్. -
పహల్గాం ఉగ్రదాడి కేసు.. NIA విచారణలో సంచలన నిజాలు
-
భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్ నిరోధక చర్యలను పాకిస్థాన్ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్ నెలలో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు. -
పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు
ఢిల్లీ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఆఫీస్‌లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్ మూసా అలియాస్ అస్మీన్ మూసా,అలీబాయ్ అలియాస్ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఎన్ఐఏ దర్యాప్తు.. శాటిలైట్ ఫోన్ల వినియోగంపాకిస్తాన్ పౌరులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు భారత్ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) సహాయం చేసినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తుపాకుల బాలిస్టిక్, కెమికల్ టెస్టులు జరిపేందుకు ల్యాబ్‌కు పంపింది. 3డీ మ్యాపింగ్ సాయంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్ స్కానర్ల సాయంతో త్రీడీ మ్యాపింగ్ చేసింది. ఈ 3డీ మ్యాపింగ్ సాయంతో కాల్పుల జరిగే సమయంలో ఉగ్రవాదులు పొజీషన్‌తో పాటు టూరిస్టులు ఎలా కుప్పకూలారు. బ్లడ్ శాంపిల్స్, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ల నుంచి వెలువడ్డ రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి డంప్ డేటాను కలెక్ట్ చేశారు. ఈ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగ బడ్డ ప్రదేశం నుంచి శాటిలైట్ ఫోన్లను వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్, దాని చుట్టు పక్కల ప్రదేశాల్లో కనీసం మూడు శాటిలైట్ ఫోన్లను నిందితులు వినియోగించగా.. రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్‌ను గుర్తించారు. 2,800 మందిని విచారించి ఉగ్రదాడిపై మొత్తం 2,800 మందికి పైగా ఎన్ఐఏ, భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. మే2 నాటికి మరో 150 మందిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నాయి. వీరిలో అనుమానిత ఓజీడబ్ల్యూ, జమాత్-ఇ-ఇస్లామి వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్‌లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక సమాచార సహాయాన్ని అందించే వ్యక్తులను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు) అంటారు.కార్ట్రిడ్జ్ అంటేకాల్పులు జరిపిన తరువాత మిగిలి ఉన్న మందుగుండు సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్లు,మందుగుండు సామగ్రిలో చేర్చే షెల్, గన్ పౌడర్, గన్‌లో ఉండే బులెట్లను మండించే ప్రైమర్ల అనే భాగాలున్నాయి. -
మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు విష్ణు
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను మా అధ్యక్షులు, సినీ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వారి ఇంటికి చేరుకున్న విష్ణు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం.. దాడి జరిగిన తీరును మధుసూధన్ సతీమణి కామాక్షి, పిల్లలను అడిగి విష్ణు తెలుసుకున్నారు. కావలి తమ అమ్మగారి ఊరు కావడంతో ఆ ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.తాను మాట్లాడాలనుకున్నది వారితో మాట్లాడానని విష్ణు అన్నారు. మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇచ్చాను అనేది తమ పర్సనల్ అని అన్నారు. ప్రస్తుతం తాను మీడియాతో పెద్దగా మాట్లాడలేనని చెప్పి.. ఈ విషయంలో తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఉన్నారు. -
భారత్, పాక్ మధ్య యుద్ధమే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
Pahalgam tragedy ఐక్యంగా నిలబడటం మనకు తెలుసు
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి. కశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్లల మధ్య చాలాకాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందింనవారు, స్పాన్సర్లు... పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషింనవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్‌లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూర కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి. ఇదీ చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్భారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవులు మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు.-జహారా బేగంవ్యాసకర్త సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్బైజాన్లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా. -
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
పహల్గామ్ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్ పోస్టు మూసేశారు. పాక్ హైకమిషన్ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. ‘‘భారత రిపబ్లిక్‌తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.యుద్ధం వస్తే సిద్ధమే!రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా? పహల్గామ్లో పాక్ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.‘ఒక్క దేశం’గా నిలబడదాం!ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్ నేషన్’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్ నేషన్’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్ భారత్’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’1948 జనవరి 30న ‘తీస్ జనవరి మార్గ్’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్ 22న పహల్గామ్ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్‌లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. పహల్గామ్ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. గొప్ప భారతీయుడైన లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై ఇన్సాన్’ (ఇన్సాన్ అంటే మానవ్) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్గామ్ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఎవరినీ వదిలిపెట్టం!
న్యూఢిల్లీ: ప్రతి ఉగ్రవాద చర్యకూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ తగిన సమాధానం ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పిరికిపందల్లా దాడులకు పాల్పడి అదే గొప్ప విజయంగా భావిస్తూ పొంగిపోవద్దని ఉగ్రవాదులకు హితవు పలికారు. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరిపై వరుసగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులను ఘాటుగా హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రతి మూల నుంచీ అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. ఒక్క అంగుళం భూభాగంలోనూ ఉగ్రవాదం అనేది లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.అనుకున్నది సాధించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై తాము ప్రారంభించిన పోరాటానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయుల మద్దతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి మద్దతు కావాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మనమంతా చేతులు కలిపి పనిచేస్తే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయొచ్చని తెలిపారు.ఇండియాలో దాడులకు పాల్పడి, ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులకు తగిన శిక్ష విధించడం తథ్యమని అన్నారు. ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని వెల్లడించారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఒక్క ముష్కరుడినీ వేటాడుతామని అమిత్ షా స్పష్టంచేశారు. వారు శిక్ష నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోదని చెప్పారు. 26 మందిని హత్య చేసి, గెలిచామనుకుంటే అది పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల అరాచకాలను సహించే ప్రసక్తే లేదన్నారు. -
మీకు అండగా ఉంటాం: అమెరికా
ఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఈ రోజు(గురువారం) హెగ్సే కు ఫోన్ చేసి మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్ .ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే చరిత్ర ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్. ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సే కు తెలిపారు రాజ్ నాథ్. దీనిలో భాగంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలను తాము మద్దతిస్తామన్నారు హెగ్సే. ఉగ్రవాదంపై భారత్ కు రక్షణ చర్యలు తీసుకునే హక్కు ఉందని హెగ్సే పేర్కొన్నారు. భారత్ కు అమెరికా అండగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. The U.S. Secretary of Defence @PeteHegseth spoke to Raksha Mantri Shri @rajnathsingh earlier today and expressed his deepest sympathies for the tragic loss of innocent civilians in the dastardly terror attack in Pahalgam, Jammu & Kashmir.Secretary Hegseth said that the U.S.…— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 1, 2025 పాకిస్తాన్ కవ్వింపు చర్యలు..కాగా, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. దీన్ని భారత్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. -
ఇది మోదీ సర్కార్.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్ షా
న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని అన్నారాయన. గురువారం న్యూఢిల్లీలో బోడో సామాజిక వేత్త ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగిస్తూ.. కొందరు దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మా ప్రభుత్వ సంకల్పమని, దానిని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారాయన. -
జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలన్న పిటిషనర్ తీరుపై సుప్రీం ఆగ్రహం
-
పహల్గాం ఉగ్రదాడిపై విచారణ.. పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి నడవాల్సిన తరుణమిది’ అంటూ పిటీషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది.SC refuses to hear PIL for judicial probe into #Pahalgam terror attack in which 26 people were killed.SC pulls up petitioners for filing PIL on Pahalgam attack, says judges not experts in probe of terror cases. PIL over Pahalgam attack: In this crucial time, each and every… pic.twitter.com/V262RKO5KE— Press Trust of India (@PTI_News) May 1, 2025అదే సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం పిటిషనర్‌ను హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోరారు. అనంతరం, సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దేశం పట్ల మీకు బాధ్యత లేదా?సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతతో వ్యవహరించండి. మీకు దేశం పట్ల బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. అందుకు పిటిషనర్ మాట్లాడుతూ.. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళనతో ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత కాశ్మీరీ విద్యార్థులపై దాడులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.కాశ్మీరీ విద్యార్థుల కోసంఅదే సమయంలో విద్యార్థులకు అండగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రస్తావించారు. పహల్గాం దాడి తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల రక్షణ దిశగా చర్యలు తీసుకున్నారని, జమ్మూ కశ్మీర్ మంత్రులను ఇతర రాష్ట్రాల మంత్రులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారనే విషయాన్ని గుర్తు చేశారు.అయితే ఆ పిల్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇది సరైన సమయం కాదు. ప్రతి పౌరుడు దేశానికి అండగా నిలుస్తున్న వేళలో ఇలాంటి పిల్లు దాఖలు చేయడం సరైన చర్య కాదు’ అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. -
బంగ్లాదేశ్ సాయంతో.. భారత్‌లో కుట్రకు పాకిస్తాన్ తెర
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాం దాడిపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. పాక్ బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు,భద్రతా బలగాలు హైఅలెర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అందుకు పాక్ కుట్రలే కారణమని భద్రతా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.గూఢాచార సంస్థలు (Intelligence agencies) సమాచారం మేరకు..ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైనికులు మొహరించినట్లు గుర్తించాయి. కాబట్టే బంగ్లాదేశ్ సరిహద్దులో మరింత అప్రమత్త అవసరమని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.సైనిక చర్యతో పాటు బంగ్లాదేశ్‌తో పాటు ఆ దేశ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్‌లతో పాక్ సన్నిహిత సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా భారత్‌లో అల్లర్లు సృష్టించే దిశగా కుట్రకు తెరతీసినట్లు సమాచారం. అలా భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలకు సిద్ధమైనట్లు పలు ఆధారాల్ని సేకరించాయి. ఇటీవల బంగ్లాదేశ్‌కు సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లాల్లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ అల్లర్లలో ముగ్గురు పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ విధించాయి. గూఢచార సంస్థలు అందుకు తగ్గ ఆధారాల్ని కేంద్రానికి సమర్పించాయి. ఈ భారత్‌లో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దులుగా ఉన్న భారత్ భూభాగంగా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
-
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిలో కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఉగ్రదాడి జరిగిన బైసరన్ వ్యాలీకి ఎన్ఐఏ డీజీ చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో మూడు పర్యాటక ప్రాంతాలను ఉగ్రవాదులు రెక్కీ చేసినట్లు తేలింది. ఏప్రిల్ 15న జమ్మూ కశ్మీర్ అమ్యూజ్మెంట్ పార్క్ వద్ద ఉగ్ర వాదులు రెక్కీ నిర్వహించారు.మరో వైపు, బైసారన్ గడ్డి మైదానంలో సుందర కశ్మీర్ అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారని నిర్ధారించుకున్నాకే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారన్న వాదనకు బలం చేకూరుతోంది. పహల్గాంలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేయగా మహారాష్ట్రలోని జల్నా జిల్లా వాసి ఆ ఊహాచిత్రాల్లోని ఒక ఉగ్రవాదిని గుర్తుపడ్డారు.ఆ ఉగ్రవాది తనతో పాశవిక దాడికి ఒక రోజు ముందు అదే ప్రాంతంలో మాట్లాడానని ఆదర్శ్ రౌత్ అనే యువకుడు వెల్లడించారు. నాటి ఘటన వివరాలను రౌత్ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఏప్రిల్ 22వ తేదీ మధ్యహ్నం ఉగ్రవాదులు దాడిచేశారు. అయితే అంతకు ఒకరోజు ముందు అంటే 21వ తేదీన అదే బైసారన్‌లో నేను పర్యటించా. గుర్రపు స్వారీ చేశా. ఆకలేసి అక్కడి మ్యాగీ స్టాల్ వద్ద ఆగా. అదే సమయంలో ఈ అనుమానిత ఉగ్ర వాది నా దగ్గరకు వచ్చాడు.‘నువ్వు హిందువు కదా. కశ్మీర్ వాడిలా లేవు’ అని నాతో అనేసి కాస్తంత దూరం నిల్చున్నాడు. అక్కడ ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ ‘ఈరోజు జనం తక్కువగా వచ్చినట్లున్నారుగా’ అని అనేసి ఇద్దరూ వెళ్లిపో యారు. అతను ఎందుకు మతం గురించి అడిగా డో అర్థంకాలేదు. జనం తక్కువగా వచ్చిన విష యం గురించి ఎందుకు చర్చించుకున్నారో అస్స లు బోధపడలేదు. కానీ కాల్పుల ఘటన, ఊహా చిత్రాల్లో ఇతని ఫొటో చూశాక విషయం పూర్తిగా అర్థమైంది’’ అని ఆదర్శ్ రౌత్ చెప్పారు. విషయాలన్నీ పూసగుచ్చినట్లు ఎన్ఐఏకు ఈ–మెయిల్లో వివరంగా రాశానన్నారు. -
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.Today, Secretary Marco Rubio spoke with Pakistan's Prime Minister Muhammad Shehbaz Sharif and encouraged Pakistan to work with India to de-escalate tensions, re-establish direct communications, and maintain peace and security in South Asia: US State Department spokesperson Tammy…— ANI (@ANI) April 30, 2025Secretary of State Marco Rubio spoke with Indian External Affairs Minister Dr S Jaishankar today. The Secretary expressed his sorrow for the lives lost in the horrific terrorist attack in Pahalgam, and reaffirmed the United States' commitment to cooperation with India against…— ANI (@ANI) April 30, 2025 జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. Discussed the Pahalgam terrorist attack with US @SecRubio yesterday. Its perpetrators, backers and planners must be brought to justice.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 1, 2025అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్ జరిగేది ఇదేనా?
ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్ నుంచి భారత్ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్ గగనం తలంపై పాక్ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్ రిజిస్టర్డ్ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొంది. మరోవైపు భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది. -
భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా నియమిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాక్ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ గల్లంతైంది. భారత్ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు, పాక్ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్ మాలిక్‌కు పాక్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. -
టిక్.. టిక్... టిక్
న్యూఢిల్లీ: ఓవైపు పాశవిక దాడి పట్ల దేశ ప్రజల ఆక్రోశం. నానాటికీ పెరిగిపోతున్న ఆగ్రహావేశాలు. అంతకంతా బదులు తీర్చుకోవాల్సిందేనంటూ నానాటికీ పెరుగుతున్న డిమాండ్లు. మరోవైపు ఒక్కో రోజూ గడుస్తున్న కొద్దీ భయంతో వణికిపోతున్న దాయాది. కసితో రగిలిపోతున్న భారత్ ఈసారి ఎలాంటి దెబ్బ కొట్టనుందో పాలుపోక బెంబేలు. ఏ క్షణమైనా తమపై యుద్ధానికి దిగడం ఖాయమని పాక్ మంత్రుల ముచ్చెమట వ్యాఖ్యలు. వ్యూహాత్మక మౌనంతో పాక్‌ను చెప్పలేనంతగా భయపెడుతున్న మోదీ సర్కారు పూర్తి యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా బుధవారం మరిన్ని నిర్ణయాత్మక అడుగులు వేసింది. ఆ దిశగా రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని సారథ్యంలో వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఉదయం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో మంత్రివర్గ సహచరులతో మోదీ సమీక్షించారు. అనంతరం సూపర్ కేబినెట్‌గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపింది. తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. అనంతరం సాయంత్రం మోదీ సారథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం జరిగింది. ఉగ్రవాదులకు, దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించడమే గాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బుధవారం రాత్రి ప్రధాని తన అధికార నివాసంలో అతి కీలకమైన ‘సైనిక సమీక్ష’ జరపడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ తదితరులతో రాత్రి పొద్దుపోయేదాకా భేటీ కొనసాగింది. ప్రతీకార చర్యల వ్యూహానికి ఈ సందర్భంగా స్పష్టమైన తుదిరూపు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మోదీ రష్యా పర్యటన రద్దు మే 8న రష్యా పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా ‘విక్టరీ డే’ పరేడ్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వాటిలో పాల్గొంటారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాల పూర్తి మద్దతు: రాహుల్ పహల్గాం ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వారికి, దాయాదికి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా విపక్షాల పూర్తి మద్దతుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మోదీ స్పష్టంగా, సమర్థంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.మన గగనతలం మూత పాక్ పౌర, సైనిక విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా మూసేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫై చేసింది. ఇది మే 23 దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావం పాక్ విమానయాన సంస్థలపై తీవ్రంగా ఉండనుంది. భారత్‌కు పాక్ ఇప్పటికే తన గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.సూపర్ కేబినెట్ భేటీయే కీలకం!ప్రధాని అధికార నివాసంలో బుధవారం ఉదయం తొలుత సీసీఎస్ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ అందులో పాల్గొన్నట్టు సమాచారం. భేటీ ఎజెండా, చర్చల వివరాలు తదితరాలను గోప్యంగా ఉంచారు. పహల్గాం దాడి అనంతరం ఈ వారం రోజుల్లోనే సీసీఎస్ సమావేశమవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన సీసీపీఏ సమావేశమే బుధవారం నాటి భేటీల్లో అతి కీలకమని భావిస్తున్నారు. ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య, ఉపరితల రవాణా మంత్రులతో కూడిన ఈ కమిటీ అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సీసీపీఏ సమావేశమవడం దాదాపు ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి! చివరిసారి 2019లో ఈ కమిటీ భేటీ అయింది. అప్పుడు కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల పాశవిక ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనే కావడం గమనార్హం. ఆ వెంటనే పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేయడమే గాక కనీసం 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ప్రతీకారం చేపట్టాల్సిన చర్యలపై సీసీపీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాటి రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మంత్రివర్గ సహచరులతో మోదీ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. -
పదునైన వ్యూహంతో...
ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్ఎస్ఏబీ)ను బుధవారం పునర్వ్యవస్థీకరించటం కూడా కీలక పరిణామం. ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుందంటు న్నారు. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించటం వగైరాలన్నీ ఇలాంటి సమయాల్లో అత్యంత అవసరం. ఇప్పటికే పహల్గాం మారణకాండను తక్కువ చేసి చూపటానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 యేళ్లుగా దాని వ్యూహం ఇదే. ఒకపక్క ఎల్ఓసీలో వరసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో నిఘా రాడార్లు, యుద్ధ సామగ్రి తరలిస్తూ మరోపక్క అమెరికా తదితర దేశాలముందు తన అమాయ కత్వాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. మారణకాండ గురించి ‘నమ్మదగ్గ సమాచారం’ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పటం ఇప్పటి షెహబాజ్ సర్కార్‌కి మాత్రమే కాదు... కుట్రపూరితంగానో, ఎన్నికల మాటున సైన్యం ప్రాపకంతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న పాక్ అధినేతలందరికీ అలవాటైన విద్య. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడటం తప్పనిసరి. అందుకే ప్రభుత్వ తాజా నిర్ణయం అన్నివిధాలా ఆహ్వానించదగ్గది. మన సహనాన్ని చేతగానితనంగా, మన సుహృద్భావాన్ని అశక్తతగా భావించటం పాకిస్తాన్‌కు అలవాటైంది. మొన్న జరిగిన మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. కేవలం దాన్ని సంతృప్తిపరచటమే అంతిమ లక్ష్యం కారాదు. తాజా దాడిలో పాకి స్తాన్ సైన్యంలో పారా కమాండోగా పనిచేసిన హషీం మూసా అనే ఉగ్రవాది పాల్గొనటాన్నిబట్టి చూస్తే ఐఎస్ఐ పాత్రవుందని అర్థమవుతోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైన నిఘావుండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగిన దాడుల స్వభావాన్ని అధ్యయనం చేయాలి. నిరుడు అక్టోబర్‌లో మధ్య కశ్మీర్లో ఏడుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నది మొదలు మొన్నటి పహల్గాం మారణకాండ వరకూ జరిగిన నాలుగు ఉదంతాల్లో కీలకపాత్ర పోషించింది మూసాయే అంటున్నారు. అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించాలి. మొన్న విపక్షాలతో జరిగిన సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. కనుక పాకిస్తాన్ ప్రాపకంతో చెలరేగుతున్న ఉగ్రవాదులను గురిచూసి కొట్టటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి. జవాబుదారీ తనాన్ని నిర్ధారించాలి. ఉగ్రవాదులు మన లోటుపాట్లేమున్నాయో చూసుకునే దాడులకు దిగుతారు. ఆ పని మన నిఘా వర్గాలు చేయగలిగితే ఉగ్రవాదుల్ని నిరోధించటంతోపాటు వారిని చాకచక్యంగా పట్టి బంధించటానికి కూడా వీలవుతుంది. అప్రమత్తత లోపించటంవల్ల నిరాయుధ పౌరుల ప్రాణాలు మాత్రమేకాదు... స్థానికుల జీవిక కూడా దెబ్బతింటుంది. తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కశ్మీర్‌లోని 50కి పైగా పర్యాటక స్థలాలను మూసివేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. మున్ముందు తెరిచినా అటువైపు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతారు గనుక ఆ రంగం కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అన్నిటికన్నా మన నేతలు మాటలూ, చేతలూ అదుపులో పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువన్న దాన్నిబట్టి ఫలితం ఆధారపడి వుండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైన వ్యూహం పన్ను తున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. జరిగిన భద్రతాలోపాలకు బాధ్యులెవరో నిర్ణయించాలని అనటం, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాణాత్మకమైన విమర్శలూ ఆహ్వానించదగ్గవే. కానీ ప్రధాని చిత్రాన్ని ఒక పార్టీ తప్పుడుగా చిత్రిస్తే, మరొకరు దానికి జవాబుగా విపక్షనేత వెన్నుపోటుకు సిద్ధంగా వున్నట్టు మరో చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతల్ని పాకిస్తాన్ పొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చారు. 26 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదులను ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై వుంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా వుండాల్సిన నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా దేశభక్తి అనే భ్రమలో వీరు కాలక్షేపం చేస్తున్నారు. వీరిని చూసి అనుచరగణాలు మరింత రెచ్చిపోతున్నాయి. మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వేర్వేరు ప్రాంతాల్లోని కశ్మీరీ చిరువ్యాపారుల పైనా, విద్యార్థుల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవటం. శత్రువుపై సమష్టిగా పోరాడాల్సిన సమయంలో బాధ్యత మరిచి అంతర్గత కలహాలకు దారితీసేలా ప్రవర్తించటం, పైస్థాయి నేతల ప్రాపకానికి వెంపర్లాడటం అత్యంత హీనం. పాపం. సక్రమంగా మాట్లాడటంరాని నేతలు కొన్నాళ్లయినా నోరుమూసుకోవటం ఉత్తమం. -
పహల్గామ్ దాడి ఘటన: సుప్రీంలో రేపు విచారణ
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలు(పిల్)పై రేపు(గురువారం) విచారణ జరగనుంది. దాంతో పాటు కశ్మీర్ కు వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలకు ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలైంది.కశ్మీర్ కు చెందిన మహ్మద్ జునైద్, ఫతేష్ సాహు, విక్కీ కుమార్ లు దాఖలు చేసిన ప్రయోజన ప్రయోజన వాజ్యాలు దాఖలు చేయగా రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ మూడు పిల్ లను కలిపి విచారించనుంది.జమ్మూ కశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో అక్కడకు వెళ్లిన టూరిస్టులు 26 మంది మృత్యువాత పడగా. కొంతమంది తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. -
ఇండియాలో ఐస్‌క్రీం అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ!
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గావ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మన దేశంలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వారిని తమ దేశానికి పంపించేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దాయాది దేశంలో న్యాయం దొరక్కపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మనదేశానికి వలస వచ్చి బతుకుబండిని లాగిస్తున్న పాకిస్తాన్ మాజీ ఎంపీ ఒకరు వెలుగులోకి వచ్చారు.పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎంపీ దబయా రామ్.. బండిపై ఐస్‌క్రీములు అమ్ముతూ హరియాణాలో జీవిస్తున్నారు. ఫతేహాబాద్ జిల్లాలోని రతియా తహసీల్ పరిధిలోని రతన్‌గఢ్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఇటీవల ఆయనను విచారించినట్టు న్యూస్ 18 వెల్లడించింది. విచారణ ముగిసిన తర్వాత రత్తన్గఢ్ గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ఆయనను పోలీసులు అనుమతించారని తెలిపింది. దబయా రామ్ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు భారత పౌరసత్వం (Indian citizenship) పొందారు. మిగిలిన 28 మంది ఇప్పటికీ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్నారు.రక్షణ కోసం ఇండియాకు వలస దేశ విభజనకు రెండేళ్ల ముందు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో దబయ రామ్ (Dabaya Ram) జన్మించాడు. 1947 తర్వాత కూడా ఆయన అక్కడే నివసించాడు. మతం మారాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా దబయ రామ్, ఆయన కుటుంబం తలొగ్గలేదు. 1988లో లోహియా, బఖర్ జిల్లాల నుంచి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన పదవీకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తమ బంధువుల్లో ఓ మహిళను మతోన్మాదులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిచేసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన దబయ రామ్‌కు చుక్కెదురైంది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. అక్కడవుంటే తమకు రక్షణ లేదని భావించిన దబయ రామ్ కుటుంబంతో సహా 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌ను విడిచిపెట్టాడు.ఆరుగురికి భారత పౌరసత్వంబంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి ఒక నెల వీసాపై హరియాణాలోని రోహ్తక్కు వచ్చారు. తర్వాత రతన్‌గఢ్ గ్రామంలో (Rattangarh village) స్థిరపడ్డారు. తన పెద్ద కుటుంబాన్ని పోషించడానికి దబయ రామ్ ఐస్‌క్రీమ్ వాలాగా మారారు. సైకిల్ రిక్షాపై కుల్ఫీలు, ఐస్‌క్రీమ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఏడుగురు పిల్లలు వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. మొత్తం 34 మంది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురికి భారత పౌరసత్వం దక్కింది. మిగిలిన 28 మంది దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. దబయ రామ్ మొదట్లో ఒక నెల వీసాపై తన కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చాడు. 2018 వరకు ఏటా వీసా గడువును పొడిగించుకుంటూ నెట్టుకొచ్చాడు. మొదట్లో సంవత్సరం పాటు వీసా గడువు పొడిగింపు దక్కింది. తర్వాత ఐదేళ్ల పాటు అనుమతులు లభించాయి.చదవండి: పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక యుద్ధంవారికి మినహాయింపుపెహల్గావ్ దాడి తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు 537 మంది పాకిస్తాన్ పౌరులు ఇండియా నుంచి తిరిగివెళ్లారు. అలాగే పాకిస్తాన్ నుంచి 240 మంది భారతదేశంలోకి ప్రవేశించారు. వారిలో 50 మంది NORI (నో అబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా) వీసాదారులు ఉన్నారు. పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోపు దేశం విడిచి వెళ్లాలని భారత్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొంత మందికి మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మినహాయింపు ఇచ్చింది. దీర్ఘకాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్తానీ హిందువులను బహిష్కరణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీర్ఘకాలిక వీసాకు అర్హత ఉండి, దరఖాస్తు చేసుకోని హిందూ వలసదారులకు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనే షరతు విధించింది. -
పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్ర సినీతారలంతా పెద్దఎత్తున స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ మెగాస్టార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా పెద్దఎత్తను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అంటించి తొక్కుకుంటూ వెళ్లారు.అలా హిమాచల్ ప్రదేశ్‌లోనూ రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అతికించారు. అందరూ వాటిపై నడుచుకుంటూ వెళ్తంటే ఓ యువతి మాత్రం పాక్ జెండాలను తీసేందుకు యత్నించింది. ఇది చూసిన కొందరు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాస్తా ఘాటుగా స్పందించింది.మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే.. కొందరు మాత్రం మనదేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఇలాంటి సమయంలో శత్రుదేశంపై దాడి చేయడం మాత్రమే కాదు.. మనదేశం లోపల నుంచి కూడా శుద్ధి చేయాల్సిన సమయం కూడా వచ్చిందని లావణ్య ట్విటర్లో పోస్ట్ చేసింది. While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025 -
Pahalgam Incident: జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ
-
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
ఆ పహల్గాం దారుణ ఘటన ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులెవ్వరికీ కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టి..బతికే ఉన్నామా..! అనే ఆందోళనలకు లోనవ్వుతున్నారు. ఆ ఘటనలో తమవాళ్లను తమ కళ్ల ముందే చంపేస్తున్న హృదయవిదారక దృశ్యాలు కనులముందు మెదులుతూనే ఉన్నాయంటున్నారు కొందరు బాధితులు. వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే..ఇక ఆ బాధితులకు బాధ వర్ణనాతీతమే. ఇప్పట్లో దాన్నుంచి బయటపడటం కూడా కష్టమే. అయితే ఇదే దుర్ఘటనలో వెంట్రుకవాసిలో ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. వాళ్ల భయానక అనుభవం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చకచక తెలుసుకుందామా..!కర్ణాటక చెందిన ప్రదీప్ హెగ్డే,అతని భార్య శుభ హెగ్డే, వారి కుమారుడు సిద్ధాంత్ ఏప్రిల్ 21న శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు పహల్గామ్కు బయలుదేరారు. ఆ కుటుంబం టూర్లో 'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి చెందిన బైసరన్ ఉంది. అందుకోసం మూడు గుర్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రోడ్డంతా భయానకంగా, బురదగా జారేలా ఉండటంతో. పైకి చేరుకోవడానికి ఒక గంట 15 నిమిషాలు పట్టేసిందట వారికి. అయితే అప్పటికే కొంతమంది పర్యాటకుల గుంపు ఉంది. ఇక ప్రదీప్ హెగ్డే కుటుంబం కూడా వారితో జాయిన్ అవ్వాలనుకున్నారు. అయితే రైట్‌సైడ్ జిప్‌లైన్ ప్రారంభమయ్యే చోట ఖాళీ ప్రాంతం ఉండటంతో అక్కడే పోటోలు తీస్తూ.. గడిపిందట ఆ కుటుంబం. ఆ తర్వాత కొంతసేపటికి లోయలోని సాహస కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం వైపు ఉన్న స్టాళ్లువై పుగా సాగారు. సరిగ్గా అప్పటికే మధ్యాహ్నం 1.45 అయ్యింది. వాళ్ల కుమారుడు సిద్ధాంత్ ఆకలిగా ఉందని గొడవ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు ప్రదీప్. నచ్చచెబుతున్నా.. వినకపోవడంతో చేసేదేమి లేక ఇక అక్కడ ఓ స్టాల్ వద్ద మ్యాగీ ఆర్డర్ చేశామని అన్నారు. ఇక తన భార్య ఈలోగా వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిందన్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఒక రౌండ్ కాల్పులు వినిపించాయి. అప్పుడే టీ కూడా ఆర్డర్ చేసినట్లు తెలిపారు ప్రదీప్. అయితే అవి క్రాకర్ల శబ్దాలు కావచ్చని దుకాణ యజమాని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నామని చెప్పారు ప్రదీప్. పైగా అవి బుల్లెట్ శబ్దాలని మాకస్సలు తెలియదని అన్నారు. ఇక సుమారు 15-20 సెకన్ల తర్వాత, పెద్ద తుపాకులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులను చూశామన్నారు. అందులో ఒక ఉగ్రవాది లోయ దిగువ భాగం వైపు వెళ్తుండగా, మరొక ఉగ్రవాది తమ వైపుకి దూసుకు వస్తున్నాడంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రదీప్. వెంటనే తమ కుటుంబం అంతా నేలపై పడుకుని ఉన్నాం. ఇంతలో తన భార్య టేబుల్‌పై తమ ఐడెంటిలన్నీ ఉన్న బ్యాగ్‌ని తీసుకునేందుకు పైకి లేచింది. అంతే ఒక తూటా ఆమె కుడి చెవి నుంచి దూసుకుపోయింది. అయితే ఆమె వంగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక ప్రదీప్ భార్య శుభ హెగ్డే కూడా మాట్లాడుతూ..తన వెంట్రుకలను రాసుకుంటూ ఏదో వెళ్తున్నట్లు అనిపించిందన్నారు. ఏంటా అని పక్కకు చూసేంతవరకు తెలియలేదు అది బుల్లెట్ అని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఒక్క క్షణం అసలేం జరగుతుందో అర్థంకానీ భయాందోళన ఎదురైంది. ఇంతలో ఎవరో గట్టిగా అరిచి గేటువైపుకి పరిగెత్తమని చెప్పారు. నూరుశాతం చనిపోతామనే అనుకున్నాం..అదంతా చూశాక కచ్చితంగా తన కుటుంబం అంతా చనిపోతుందనే అనుకున్నానని అన్నారు ప్రదీప్. అయితే తన భార్య మాత్రం ఏం జరగదు అని ధైర్యం చెబుతూనే ఉంది. నిజానికి ఆమె నమ్మకమే మమ్మల్ని కాపాడింది. అక్కడున్న పర్యాటకులంతా ఒకేసారిగా గేటు వద్దకు వచ్చేయడంతో తమ కొడుకు కింద పడిపోయాడన్నారు. అలా బయటకు వచ్చాక ఎటు వెళ్లాలి అనేది తెలియని గందరగోళానికి గురయ్యాం. గుర్రపుస్వారీ సైనికులు కనిపంచడంతో వాళ్లని రక్షించమని ప్రాధేయపడినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు మాకు రెండు గుర్రాలని అందించి కిందకు వచ్చేందుకు సహాయం చేశారంటూ ఆ బాధకరమైన అనుభవాన్ని వివరించారు ప్రదీప్ హెగ్డే. ఆ పర్యాటకుడి అనునభవం విపత్కర పరిస్థితుల్లో మసులుకోవాల్సిన విధానం తోపాటు..ఒకరు భయపడుతుంటే మరొకరు ఎలా సానుకూలంగా వ్యవహరించాలో చెబుతోంది. ఆ పరిస్థితుల్లో శుభా హెగ్డేలా ఏదో రకంగా ధైర్యం చెప్పాలే కానీ బ్యాలెన్స్ తప్పకూడదు. ఆ దృక్పథమే మనల్ని ఆపద నుంచి గట్టేక్కేలా చేస్తుందనడానికి ఆ పర్యాటకుడి కుటుంబమే ఓ ఉదహరణ. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది. -
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025 -
Magazine Story: డెవిల్స్ డెన్ మేడ్ ఇన్ పాకిస్తాన్
-
పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి
హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తన సంస్థ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, "దేశంలోని ఎక్కడ జరిగిన ఘటన అయినా, అది మొత్తం దేశానికే సంబంధించినదే.అమాయకులు అయిన ప్రజలు విహార యాత్రకు వెళ్లి మరణించడం బాధాకరమన్నారు. సరిహద్దు భద్రత పటిష్టంగా లేకపోతే ఇలాంటి దాడులు జరుగుతాయి. సరిహద్దులను కాపాడడం అత్యంత క్లిష్టమైన పని. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయం కాకుండా దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి" అన్నారు. ఇకపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై దేశ ప్రజలంతా నిలబడాలని, బాధిత కుటుంబాలకు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువశక్తి సభ్యులు పాల్గొన్నారు. -
చుట్టుముట్టి చంపేశారు
శ్రీనగర్: తాజాగా మరికొంత మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కిరాతకకాండపై జాతీయ దర్యాప్తు సంస్థకు మరింత స్పష్టత వస్తోంది. అమాయకులను ముష్కరులు చుట్టుముట్టి చంపేశారని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. బైసారన్ గడ్డి మైదానం లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒక ఎంట్రీ మార్గంతోపాటు ఒక ఎగ్జిట్ దారి ఉంది. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు నిలబడి మైదాన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుదూరంగా ఉన్న వాళ్లు కళ్లుగప్పి, ఫెన్సింగ్ దాటి ఎలాగోలా తప్పించుకున్నా మిగతా వాళ్లు మధ్యలోనే చిక్కుకుపోయి ఉగ్రతూటాలకు బలయ్యారని తెలుస్తోంది. ఎగ్జిట్ గేట్ వద్ద ఒక ఉగ్రవాది నిలబడి కాల్పులు మొదలెట్టాడు.దీంతో జనం భయపడి ఎంట్రీ గేట్ వైపు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ఎంట్రీ గేట్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఉగ్రవాది చెట్లలో దాక్కున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఏమైనా జరిగితే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది. ఈ ముగ్గురు మాత్రమే పర్యాటకుల ప్రాణాలుతీశారు. వీరిలో ఇద్దరు భారత సైనిక యూనిఫామ్‌లో, ఒకడు కశ్మీరీ స్థానిక దుస్తుల్లో ఉన్నాడు. ఎగ్జిట్ గేట్ వద్ద తుపాకీ మోతతో ఎంట్రీ గేట్ వైపు పరుగెత్తుకొచ్చిన వాళ్లందర్నీ అక్కడి ఇద్దరు ఉగ్రవాదులు నిలువరించి మహిళలు వేరుగా నిలబడాలని ఆదేశించారు.భయపడుతున్నా ఎవ్వరూ వేరు వేరుగా నిలబడలేదు. దీంతో హిందూ, ముస్లింలుగా వేర్వేరుగా నిలబడాలని మరోసారి ఆదేశించారు. దీంతో ఇస్లామ్‌పై విశ్వాసం ఉందని ప్రకటించే ‘కల్మా’ను పఠించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంట్రీ గేట్ నుంచి వచి్చన యువ నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉగ్రతూటాలకు బలయ్యారని సాక్షులు తెలిపారు. రెండు వారాల ముందే రెక్కీ? ఉగ్రవాదులు సమీప హోటళ్లలో పర్యాటకులతో నిండిపోయాయా లేదా? అనే వివరాలను తెల్సుకున్నారని, ఇందుకోసం రెండు వారాల ముందే రెక్కీ నిర్వహించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు సమీప హోటళ్లు, రహదారి వెంట అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. జిప్‌లైన్ ఆపరేటర్‌కు ఎన్ఐఏ సమన్లు రిషీ భట్ అనే పర్యాటకుడు జిప్‌లైన్ ఎక్కి బైసారన్ ఏరియల్ వ్యూను తన కెమెరాలో బంధించిన సందర్భంగా జిప్‌లైన్ ఆపరేటర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం ఆ వీడియోలో రికార్డయింది. అల్లా హు అక్బర్ అని పదేపదే అతను పలకడం అందులో రికార్డయింది. పర్యాటకుడిని జిప్‌లైన్‌లో ముందుకు తోస్తూ అలా పలకాల్సిన అవసరం ఏమొచి్చందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాడి విషయం ముందే తెలుసా? అనే కోణంలో వివరణ కోరుతూ ఎన్ఐఏ ఇతనికి సమన్లు జారీచేసింది. రెండ్రోజుల క్రితమే హతమార్చేవారా? ఏప్రిల్ 22వ తేదీన ఈ దాడి జరిగింది. వాస్తవానికి రెండు రోజుల ముందే ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచారని తెలుస్తోంది. అయితే ఆ ముందు రెండు రోజులు అంటే 20, 21వ తేదీల్లో అక్కడ వర్షం పడటంతో బైసారన్ గడ్డిమైదానం అంతా బురదమయంగా ఉండటంతో పర్యాటకులు హోటళ్లను వదిలి బయటకు రాలేదని, సందడి లేకపోవడంతో ఉగ్రవాదులు తమ ప్రయత్నాన్ని వాయిదావేసుకున్నారని తెలుస్తోంది. 22వ తేదీన చక్కటి ఎండ కాయడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. ఘటన జరిగిన రోజున బైసారన్, సమీప ప్రాంతాల్లో ఏకంగా 5,000 మంది స్థానిక, స్థానికేతరులు ఉన్నారని ‘పోనీ ఆపరేటర్’రౌఫ్ వానీ చెప్పారు. ఆ విషయం ఉగ్రవాదులు తెల్సుకుని తెగబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అక్కడి ఫుడ్‌స్టాళ్ల వెనక వైపు చాలా సేపు ఇద్దరు ఉగ్రవాదులు ఊరకనే కూర్చుని మధ్యాహ్నం 2.30 గంటలకు జనం ఎక్కువైన తర్వాతే ముందువైపుకొచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు నలుగురిని తలపై గురిచూసి చంపేశాకే అక్కడి జిప్‌లైన్ వెనుక నుంచి మరో ఇద్దరు వచ్చారని ఇంకొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
పాక్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్!
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్‌ను ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా నిషేధం విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్(డీఓపీ) కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన ఎగుమతుల సంస్థ ‘ఫార్మెక్సిల్’ను ఆదేశించింది.ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఔషధాలు, ఫార్మా స్యూటికల్స్ జాబితా రూపొందించాలని పేర్కొంది. ఈ వివరాలు చాలా అత్యవసరమని స్పష్టంచేసింది. ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలు ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో పాకిస్తాన్ 38వ స్థానంలో ఉంది. ప్రధానంగా ఇండియా నుంచి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ) పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. భారత్‌నుంచి దిగుమతులు ఆగిపోతే ఔషధాల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. -
పార్లమెంట్‌ను సమావేశపర్చండి
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఈ పాశవిక చర్యపై చర్చించడంతోపాటు దేశమంతా ఐక్యంగా ఉందనే విషయాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందన్నారు. గత వారం చోటుచేసుకున్న దారుణ ఘటనలో 26 మంది పర్యాటకులు అసువులు బాయడం తెల్సిందే.ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరారు. ‘ఈ సమయంలో ఐక్యత, సంఘీభావం ప్రకటించాల్సిన అవసరముంది. వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమని ప్రతిపక్షం విశ్వసిస్తోంది.అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి మనందరి సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది’అని ఆయన తెలిపారు. ప్రధానికి రాసిన లేఖలో రాహుల్ గాంధీ సైతం ఇదే విషయం తెలిపారు. -
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకుముందు ఆయన నేతృత్వంలో రోజంతా అతి కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్), తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ), ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలు ఉంటాయి. జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీసీఎస్ సమావేశం వారం వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం విశేషం.పహల్గాం దాడి జరిగిన మర్నాడే ఏప్రిల్ 23న జరిగిన సీసీఎస్ భేటీలో పాక్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఈ సమావేశాలన్నింటికీ పహల్గాం దాడే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సీసీఎస్ తదితర భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గం భేటీలో వాటికి ఆమోదముద్ర వేస్తారు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడం ఇదే తొలిసారి. -
సైన్యానికి పూర్తి స్వేచ్ఛ; ప్రధాని మోదీ
‘పహల్గాం’కు త్వరలో దీటైన జవాబు... ఎప్పుడు, ఎక్కడ, ఎలాగన్నది వారిష్టం బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాల్సిందే దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో భేటీ పాల్గొన్న రాజ్‌నాథ్, ఎన్ఎస్ఏ దోవల్ ఎన్ఎస్జీ చీఫ్‌తో హోం కార్యదర్శి భేటీ పాల్గొన్న బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ చీఫ్‌లు సరిహద్దుల్లో కొనసాగిన పాక్ కాల్పులుఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలి.ప్రతీకారానికి వేళైంది. ఉగ్ర వేటకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా మంగళవారం రోజంతా కీల క పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘పహల్గాం’ కు దీటుగా బదులిచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసముంది. ‘పహల్గాం’ ముష్కరులకు, వారి సూత్రధారుల కు ఎప్పుడు, ఎక్కడ, ఎలా బదులిస్తారో మీ ఇష్టం’’ అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్ఎస్జీ చీఫ్‌తో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్ తదితర కీలక దళాల చీఫ్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మరిన్ని కీలక పరిణామాలు బుధవారం చోటు చేసుకోనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా భద్రత, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలతో మోదీ వరుస భేటీలు, ఆపై కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్నాయి. దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగాలవారీగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించి ఆమోదముద్ర వేస్తారని తెలుస్తోంది.న్యూఢిల్లీ: ‘పహల్గాం’ ముష్కరులకు, వెనకుండి వారిని నడిపిస్తున్న దాయాది దేశానికి మర్చిపోలేని గుణపాఠం చెప్పేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమవుతోంది. ఆ పాశవిక ఉగ్ర దాడికి పాల్పడ్డ, ప్రేరేపించిన వారు కలలో కూడా ఊహించని రీతిలో శిక్షించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన ప్రధాని మోదీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అంతం చేసి తీరాల్సిందే. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఖతం చేయాలన్నది దేశ సమష్టి సంకల్పం.పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇవ్వక తప్పదు. ఉగ్ర ముష్కరులపై మన ప్రతిస్పందన ఎలా ఉండాలో నిర్ణయించే స్వేచ్ఛను సైన్యానికే ఇస్తున్నాం. శత్రువుపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయమైనా సైన్యం తనంత తానుగా తీసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాల అధిపతులు జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గంటన్నరపాటు జరిగిన ఈ కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనీల్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.పహల్గాం దాడి, తదనంతర పరిణామాలపై లోతుగా చర్చించారు. తగిన ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనని ప్రధాని పునరుద్ఘాటించారు. సైనిక దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసముందన్నారు. ‘‘ఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరుపై ప్రధాని ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డట్టు సమాచారం. ఉగ్ర ముష్కరులకు, వారి సూత్రధారులకు చెప్పబోయే గుణపాఠం దాయాది జన్మలో మర్చిపోలేని రీతిలో ఉండాలని ఆయన నిర్దేశించారు.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లో పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ముసుగు సంస్థకు చెందిన ముష్కరులు కాల్పులకు తెగబడి 26 మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనిపై 140 కోట్ల పై చిలుకు భారతీయుల రక్తం మరిగిపోతోందని, ముష్కరులతో పాటు వారిని ప్రేరేపించిన వారిని కూడా కఠినాతి కఠినంగా శిక్షించి తీరతామని ఆదివారం మన్ కీ బాత్‌లో కూడా మోదీ పునరుద్ఘాటించారు. హోం శాఖ ఉన్నత స్థాయి భేటీ త్రవిధ దళాధిపతులతో మోదీ సమావేశానికి ముందే మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) డీజీ బ్రిఘూ శ్రీనివాసన్, అస్సాం రైఫిల్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా, సశస్త్ర సీమాబల్ అదనపు డీజీ అనుపమ నీలేకర్ చంద్రతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ కీలక భేటీలో పాల్గొన్నారు.పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల అణచివేతతోపాటు దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నా అసలు అజెండా వేరేనంటున్నారు. భేటీలో చర్చించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచారు. పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల రక్షణ బీఎస్ఎఫ్ బాధ్యత. మయన్మార్ సరిహద్దులను అస్సాం రైఫిల్స్ గస్తీ కాస్తుంది. ఇక ఎన్ఎన్జీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషలైజ్డ్ కమెండో విభాగం.2016లో సర్జికల్ స్ట్రైక్స్ 2019లో ‘బాలాకోట్’ ఇప్పుడెలా ఉంటుందో!ప్రతీకార చర్యలపై ఉత్కంఠసైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముష్కర మూకపై, వారికి అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న దాయాదిపై ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఉగ్ర దాడులకు ప్రతిస్పందనగా మోదీ సర్కారు పాక్ భూభాగంపై 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో చేసిన బాలాకోట్ వైమానిక దాడులు ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. భారత్ నుంచి ఈ స్థాయి దాడులను ఊహించని పాక్ ఒక్కసారిగా బిత్తరపోయింది. 2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టర్లో సైనిక క్యాంప్‌పై జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా సైన్యానికి చెందిన స్పెషల్ ఫోర్సెస్ కమెండోలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. కనీసం 200 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశారు. 2019లో జమ్మూలోని పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో వైమానిక దాడులు జరిపి వందలాది మంది ముష్కరులను మట్టుబెట్టింది.12 మిరాజ్ ఫైటర్ జెట్లు పాక్ కన్నుగప్పి, వారి రాడార్ వ్యవస్థలను ఏమార్చి లక్ష్యాలపై నిప్పుల వర్షం కురిపించాయి. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిక్షణ స్థావరాలను నామరూపాల్లేకుండా చేసింది. గత అనుభవాల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కనుక ఈసారి కూడా భారత ప్రతి చర్య దాయాది ఊహించని విధంగా ఉంటుందని రక్షణ నిపుణులు అంటున్నారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్షిపణి దాడుల వంటివి ఒక ఆప్షన్. కానీ ఆ క్రమంలో పాక్ ఆర్మీ యూనిట్లకు నష్టం వాటిల్లితే పరిస్థితి అదుపు తప్పి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. కనుక ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే’’ అని చెబుతున్నారు. -
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
పహల్గామ్లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్‌తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు. తీవ్రవాదుల కోసం కశ్మీర్లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట. యుద్ధంతో మనకూ నష్టమే!కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, సబ్ మెషీన్ గన్స్. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు. సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు! త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్‌లోని బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్‌తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.నీటిని ఆపగలమా?ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్‌కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. పాకిస్తాన్‌కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్’ (ఐబీఆర్డీ) సంతకం చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు. ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.వాస్తవాధీన రేఖే పరిష్కారమా?మనం విస్మరించేదేమంటే కశ్మీర్ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.కశ్మీర్‌కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ, లేదా లైనా ఆఫ్ కంట్రోల్)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?ఇది భారత–పాకిస్తాన్ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది. 1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
జమ్మూ: ఎన్ఐఏ విచారణలో జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ తీరుపై పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి సమయంలో జిప్‌లైన్‌పై ప్రయాణిస్తున్న ఓ టూరిస్ట్ తీసిన వీడియోలో ఉగ్రదాడి ఘటన రికార్డైంది. అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైనా తనను హెచ్చరించకుండా ఆపరేటర్ అల్లహో అక్బర్ అని అరుస్తూ తనను ముందుకు తోశాడని గుజరాత్‌కు చెందిన టూరిస్ట్ రిషి భట్ చెప్పాడు. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.ఎన్ఐఏ విచారణలో ముజమ్మిల్ అల్లాహు అక్బర్ అని అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఎన్ఐఏ వర్గాల సమాచారం. ఆపత్కాలంలో హిందువులు రామా అని ఎలా స్మరిస్తారో.. ముజమ్మిల్ సైతం తాను కూడా అల్లాహో అక్బర్ అని పలికినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా.. ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో ముజమ్మిల్‌కి ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా, అతని తీరుపై పలు అనుమానాలు ప్రస్పుటమవుతున్నాయి. #PahalgamTerrorAttackA zipline operator when hears the first shot, said “Allah-hu-Akbar.” He’s at a vantage point—he sees everything unfolding belowInstead of stopping the ride, he waves next tourist in. He wasn’t scared. He seems complicit & aware!@smitaprakash@AartiTikoo pic.twitter.com/Fam4sYYOjg— Fatima Dar (@FatimaDar_jk) April 28, 2025ఘటనా స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్.. టూరిస్ట్ రిషి భట్ని అల్లహో అక్బర్ అని అరుస్తూ ముందుకు తోశాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్ఐఏ అధికారులు జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ ప్రశ్నిస్తే.. ఆయన వ్యవహార శైలీ అనుమానాస్పదంగా మారింది. దీంతో ఎన్ఐఏ అధికారుల తమ దర్యాప్తును మరింత లోతుగా ముమ్మరం చేశారు. -
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
జమ్మూ: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం పాక్ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్ చేశారు. వాటి ఆధారంగా ఎగ్జిట్, ఎంట్రన్స్ గేటులో ఉగ్రవాదులు కాపలాప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు. Grief beyond words. Can’t forget, can’t forgive. Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/GJXjG368i7— Anjana Om Kashyap (@anjanaomkashyap) April 23, 2025 ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నేఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. -
'కశ్మీర్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు'.. ట్రైలర్ ఈవెంట్లో సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన రాజ్‌పుత్ యోధుడు హమీర్జి గోహిల్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.కశ్మీర్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్ కోసం కశ్మీర్లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్‌గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది. -
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనీల్ చౌహాన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రలో పాక్ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025 -
పహల్గాం ఘటన.. ఆ రోజులన్నీ కళ్లముందు తిరిగాయి: నభా నటేష్
పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.నభా నటేష్ స్పందిస్తూ - పహాల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన డార్లింగ్ మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహాల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి దాడులు జరిగాక ఫిలింమేకర్స్ పహాల్గాం వెళ్లాలంటే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు, మా టీమ్ కు స్నేహితులుగా మారిపోయారు. పహాల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి. అని చెప్పింది. -
పహల్గామ్ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025 -
పాక్ నడ్డి విరిగేలా..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో భద్రతా క్యాబినెట్ కమిటీ(CCS) పాకిస్తాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే సీసీఎస్ భేటీ జరుగుతుండడం గమనార్హం.సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా బలగల సన్నద్ధత, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్, పాకిస్తాన్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కేబినెట్ చర్చించనుంది. ఆ వెంటనే ఆర్థిక భద్రతా కమిటీ జరుగుతుండడంతో పాక్ నడ్డి విరిగేలా ఈ నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉంటే.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేకపోయారు. -
ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్‌లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. కార్గిల్‌లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కి జై. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు. Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోకర్, పనికిరాని వాడంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. -
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి -
ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్ NIA చేతిలో కీలక వీడియో
-
కశ్మీర్లో 48 టూరిస్ట్ 4 ప్రాంతాల మూసివేత
-
కశ్మీర్లో స్లీపర్‌సెల్స్ యాక్టివ్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్‌లో ఉంది. మరోవైపు.. కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది.వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్‌సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అనంతరం, కశ్మీర్లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.దానికి ముందు సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
ఐక్యత చాటాల్సిన తరుణమిది.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: పహల్గాం దాడి నేపథ్యంతో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ఇటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వేర్వేరు ఈ ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)కి లేఖలు రాశారు.2025 ఏప్రిల్ 22న పహల్గాం ఘటన(Pahalgam Incident)లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే(Kharge) తన లేఖలో ప్రస్తావించారు.Congress President and Leader of the Opposition in the Rajya Sabha Shri Mallikarjun Kharge has written to the PM last night requesting that a special session of both Houses of Parliament be convened at the earliest to demonstrate a collective will to deal with the situation… pic.twitter.com/v3F5unn6I8— Jairam Ramesh (@Jairam_Ramesh) April 29, 2025ఇక తన లేఖలో రాహుల్ గాంధీ.. ప్రియమైన ప్రధానిగారూ.. పహల్గాం ఉగ్రదాడితో ప్రతీ భారతీయుడు రగిలిపోతున్నాడు. ఇలాంటి క్లిష్టతరుణంలో ఉగ్రవాదానికి మనమెంత వ్యతిరేకమో చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ఐక్యత ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. అది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మాత్రమే సాధ్యపడుతుందని ప్రతిపక్షంగా మేం భావిస్తున్నాం. ఇక్కడే ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలరు. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అని రాహుల్ గాంధీ(Rahul gandhi) రాశారు. My letter to PM Modi requesting a special session of both houses of Parliament to be convened at the earliest. At this critical time, India must show that we always stand together against terrorism. pic.twitter.com/7AIXGqBqTl— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2025ఇదిలా ఉంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారు?
-
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
న్యూయార్క్: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది.తాజాగా ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్ లేవనెత్తింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల’ కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇటీవల అంగీకరించడాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ను ఎందుకు క్షమించాలి. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.VIDEO | Speaking at launch of Victims of Terrorism Associations Network, Deputy Permanent Representative of India in UN, Yojna Patel, said: "It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless… pic.twitter.com/I0tMhjjcmW— Press Trust of India (@PTI_News) April 29, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సోవియట్ యూనియన్ యుద్ధం, భారత్‌లో జరిగిన 9/11 దాడుల్లో పాల్గొనకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేది. భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు. -
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
లాహోర్: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్ సలహా ఇచ్చారు.పాకిస్తాన్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్ షరీఫ్‌తో షహబాజ్ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. -
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
పహల్గాం ఉగ్రవాదుల దాడి ప్రత్యక్ష సాక్షులను ఇంకా వెంటాడుతోంది. ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న మైసూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అనుభవాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన కుటుంబంతో పాటు మరో 35–40 మంది ఎలా ప్రాణాలతో బయటపడ్డారో వివరిస్తూ ఆయన రాసిన పోస్టు అందరినీ కదిలిస్తోంది. ‘అదో రాక్షస చర్య. స్వర్గ సౌందర్యాన్ని రక్తపు మరకలతో ఎరుపెక్కించిన ఓ భయా నక అనుభవం. దాన్నుంచి మేం బయటపడ్డాం. ప్రతికూల వాతావరణం కారణంగా మా పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 22 మధ్యాహ్నం భార్య, తమ్ముడు, మరదలితో కలిసి కశ్మీర్ వెళ్లాం. నా సోదరుడు ఇండియన్ ఆర్మీలో సీనియర్ అధికారి. మాతో పాటు ట్రిప్‌లో ఉన్నాడు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు పహల్గాం పట్టణానికి చేరుకుని.. పోనీ రైడ్‌లో బైసారన్ లోయకు 1:35 గంటలకు చేరుకున్నాము. ఆ గంభీరమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఓ కప్పు టీ తాగాం. 2:00 గంటలకు ఫోటోలు తీసుకోవడానికి లేచాం. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న దిశలో కదలడం మా అదృష్టం. పిల్లలు, తల్లిదండ్రుల గురించే ఆందోళన అలా మేం నలుగురం సంఘటనా స్థలానికి కొన్ని వందల మీటర్ల దూరంలో చెట్ల కింద ఉన్న ఇరుకైన గుంతలోకి వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటల వరకు తుపాకీ కాల్పుల శబ్దం లోయలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అక్కడే ఉండాలా? మరోవైపు పరుగెత్తాలా? తెలియడం లేదు. అక్కడ ఉన్నంత సేపు ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులు, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాం. మధ్యాహ్నం 3.40 గంటలకు హెలికాప్టర్ శబ్దం వినిపించింది. భద్రతా దళాలు వచ్చాయని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చాం. ఆ తుపాకీ కాల్పులు ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలాంటి భయానక అనుభవాలు ఎవ్వరికీ రాకూడదని ప్రారి్థస్తున్నా. వారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా’అని భట్ పేర్కొన్నారు. క్షణాల్లో రెండు మృతదేహాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటుండగా మధ్యాహ్నం 2.25 గంటల సమయంలో మొదటి రెండు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు నిశ్శబ్దం. ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. క్షణాల్లోనే రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని చూశాం. ఇది ఉగ్రదాడి అని నా సోదరుడికి తెలిసిపోయింది. తుపాకీ శబ్దాలు పేలాయి. గందరగోళం ఏర్పడింది. జనం బిగ్గరగా అరుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తుతున్నారు. మా దిశలో ఒక ఉగ్రవాది రావడాన్ని మేము గమనించాం. పరిస్థితిని అంచనా వేసిన మా తమ్ముడు 35–40 మంది పర్యాటకులతో మమ్మల్ని వ్యతిరేక దిశలో నడిపించాడు. అదృష్టవశాత్తూ ఫెన్సింగ్ కింద ఇరుకైన మార్గం కనబడింది. మాతోపాటు చాలా మంది ప్రజలు కంచె గుండా జారి వేరే మార్గంలో పరిగెత్తడం ప్రారంభించారు. అది కొంచెం లోయలా ఉండటంతో మేం ఎవరికీ కనిపించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీబీసీది పక్షపాత రిపోర్టింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై బీబీసీ కవరేజ్ పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీది పక్షపాత రిపోర్టింగ్ అని విమర్శించింది. పాక్ జాతీయుల వీసాల రద్దుపై బీబీసీ రాసిన కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్‌గా పేర్కొనడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది దేశం మనోభావాలను దెబ్బతీస్తుందని బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు విదేశాంగశాఖ లేఖ రాసింది. బీబీసీ రిపోర్టింగ్‌ను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంబడి తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను నిరోధించడానికి 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లను భారత్ నిషేధించింది. నిషేధానికి గురైన చానళ్లలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఉండటం గమనార్హం. -
ముష్కర మూకలకు ముచ్చెమటలు
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసకాండ తర్వాత కోపంతో రగిలిపోతున్న భారతసైన్యం ఏక్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయా నుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను పాక్ సైన్యం వెంటనే ఆయా ‘లాంచ్‌ప్యాడ్’ల నుంచి సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముందస్తుగా ఆ ముష్కరులను తమ సైనిక శిబిరాలు, బంకర్లలోకి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సరిహద్దు వెంట ఉన్న లాంచ్ప్యాడ్లను ఖాళీచేయిస్తోంది. ఈ లాంచ్ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో ముందుజాగ్రత్తగా పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపేస్తోంది.ఇవన్నీ కీలక స్థావరాలుపాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కేల్, సర్దీ, దుధ్నియాల్, అథ్ముఖాన్, జురా, లిపా, పచ్ఛిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, ఛమన్కోట్, జాన్కోటేలలో ఈ ఉగ్రస్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటి నుంచీ ఉగ్రవాదులు తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఉగ్రవాదులకు కీలక స్థావరాలు(లాంచ్‌ప్యాడ్). వాస్తవాధీన రేఖ గుండా భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయల్దేరతారు. ఇక్కడే వీళ్లకు నెలల తరబడి ఉగ్రశిక్షణ ఇస్తారని తెలుస్తోంది. పీఓకేలో క్రియాశీలంకంగా ఉన్న 42 లాంచ్ప్యాడ్లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. పహల్గాం దాడి ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న భారతసైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన ఇతర ప్రదేశాలకు పంపేస్తోంది. ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ మొజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతంచేసింది. -
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
పహల్గామ్లో 26 మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజురోజుకూ దేశంలో బలపడుతుండగా పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. మొదటి నాలుగు రోజులూ ఉలకని, పలకని ఆ దేశం అటుతర్వాత ‘తటస్థ దర్యాప్తు’ రాగం అందుకుంది. ఆ మర్నాడే అణు బెదిరింపులకు దిగింది. మరోపక్క భద్రతా మండలిలో చడీచప్పుడూ లేకుండా లాబీయింగ్ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది. ఇక్కడే మన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ‘తీవ్రంగా’ ఖండిస్తు న్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి కారణమైన ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) సంస్థ పేరు ప్రస్తావనే లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా ఎప్పటిలాగే పాకిస్తాన్ వాదనతో శ్రుతి కలిపింది. కానీ మన కు చాలా సన్నిహితుడనుకున్న డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి అమెరికాలో మొదలైనా పాక్‌తో ఆ దేశం అంటకాగుతున్న వైనం దిగ్భ్రాంతికరం కాదా? ఈమధ్యకాలంలో బలూచిస్తాన్‌లో రైలును దారిమళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతామండలి అందుకు కారణమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పేరు ప్రస్తావించింది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్ (జేఈఎం) ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడికొచ్చేసరికి ఈ నీళ్ల నములుడు దేనికి? అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకొచ్చిన టీఆర్ఎఫ్ పేరు ఎందుకు ఎగిరిపోయింది? ఏ సంస్థనూ మాటమాత్రంగానైనా ఖండించటానికి ముందుకురాని తీర్మానం ‘అంతర్జాతీయ శాంతికీ, భద్రతకూ విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్నివిధాలుగా పోరాడతాం’ అని బడాయి పోవటం చిత్రం కాదా! ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవీగిన సంస్థ పేరెత్తటానికి మండలికున్న అభ్యంతర మేమిటి? అఫ్గాన్‌లో సోవియెట్ సైన్యాన్ని ఎదుర్కొనటానికి అమెరికా ఆశీస్సులతో ఉగ్రవాద శిబిరాలు నడిపిన పాపిష్టి చరిత్ర తమకుందని ఈమధ్యే పాక్ రక్షణమంత్రి అంగీకరించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచీ ఇంకా కొన సాగుతున్నదనుకోవాలా? ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బిహార్‌లో కావొచ్చు... తాజాగా ‘మన్ కీ బాత్’లో కావొచ్చు, పహల్గామ్ ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. పాత్ర ధారుల్ని, సూత్రధారుల్ని తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంచిదే. అయితే ఈ కృషి బహుముఖాలుగా వుండాలి. ఉగ్రవాదుల్ని పట్టి బంధించటానికి ప్రయత్నించటంతో పాటు అంతర్జా తీయంగా పాక్‌ను ఏకాకిని చేయటానికి కృషి చేయాలి. ఉగ్రసంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్న దాని నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి. పాకిస్తాన్ తెరవెనకుండి భద్రతామండలి తీర్మానంలో చేయించిన మార్పులు చిన్నవేమీ కాదు. ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్తో పాక్ సర్కారు ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నదో మండలిలో జరిగిన పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. తీర్మానంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన పాత ప్రకటన ‘అధికారికమైనది’ కాదంటూ స్వరం మార్చటం గమనించదగ్గది. దాడి జరిగిన వెంటనే తామే అందుకు కారకులమని చెప్పిన ఆ సంస్థ మండలిలో పాక్ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదనటమే కాదు... నింద మోపటం కోసం భారత సైన్యం కావాలని చేసిన పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. లష్కరే తోయిబా విషపుత్రిక అయిన టీఆర్ఎఫ్ 2020 నుంచీ జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. ఆ సంస్థను మన దేశం నిషేధించింది కూడా! ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందులపాలు చేయటం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించిన ఉగ్రవాద సాలెగూటిలో తానే చిక్కుకుని పాకిస్తాన్ తరచు విలవిలలాడుతోంది. 2015లో పెషా వర్ కంటోన్మెంట్ ప్రాంతంలోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి 140 మంది బాలబాలికల్ని కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది క్వెట్టాలో పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి 60 మందిని హతమార్చారు. ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్‌తోపాటు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో. అయినా పాకిస్తాన్ వైఖరిలో ఆవగింజంతైనా మార్పు లేదు. పశ్చాత్తాపం అసలే లేదు. పహల్గామ్ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.పాకిస్తాన్ తీరు మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దబాయింపు చూస్తే తెలుస్తుంది. ఉగ్రదాడిపై ఆయనగారికి ‘తటస్థ, పారదర్శక, విశ్వసనీయ’ దర్యాప్తు కావాలట! అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది. పాక్ సైన్యం అండదండలతో అందలమెక్కిన చరిత్ర షెహబాజ్‌ది. 2016నాటి పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును నీరు గార్చిందెవరు? పాక్ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా, మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్ గడ్డపైకి అనుమతించని వైనం, తాము సేకరించిన సాక్ష్యాలను భారత్‌తో పంచుకోని తీరు షెహబాజ్ మరిచారా? 2008 నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలకు ఏ గతి పట్టించారో గుర్తులేదా? అణ్వాయుధ దాడికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాక్ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి. దాంతోపాటు అన్నివిధాలా సంసిద్ధతలు పెంపొందించుకోవాలి. సామాజిక మీడియాలో కశ్మీరీలపై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ శక్తుల ఆటకట్టించాలి. ఇది కలసికట్టుగా నిలబడాల్సిన కాలమని చాటాలి. -
Pahalgam Incident: పాకిస్థాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్
-
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
న్యూఢిల్లీ: సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వారిలో బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ తాత, తల్లిని చంపిందెవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ప్రశ్న సంధించారాయన.‘‘ఇవన్నీ పిల్ల మాటలు. అతని తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? అతని తల్లిని ఉగ్రవాదులేగా చంపేశారు. కనీసం అది గుర్తున్నా? అతను అలా మాట్లాడి ఉండడు. అమెరికా సాయం చేస్తేనేగానీ ముందుకు నడవలేని దేశం పాకిస్తాన్. అలాంటిది మీరా మనల్ని చిన్నచూపు చూస్తోంది? అంటూ బిలావల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అతని తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాదం.. అదే మన అమ్మలను, బిడ్డలను చంపినప్పుడు అది ఉగ్రవాదం కాదా?. ఇది కూడా అర్థం చేసుకోలేనివాడికి మనం ఏం చెప్పినా వ్యర్థమే’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.పనిలో పనిగా పాక్ నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ పాక్‌లో కూర్చుని అడ్డగోలుగా మాట్లాడొద్దు. పాక్ దేశ మొత్తం బడ్జెట్.. మా దేశ రక్షణ బడ్జెట్ కంటే తక్కువే.మీరు ఏ దేశంలోకి చొరబడి అమాయకుల ప్రాణాలు తీస్తుంటే ఎవరూ మౌనంగా ఉండరు. మతం అడిగి మరీ చంపడం.. వికృతమైన పని. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే సాహసం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఒవైసీ అన్నారు. 2007 డిసెంబర్ 30వ తేదీన రావల్పిండిలో జరిగిన ర్యాలీలో.. ఆత్మాహుతి దాడి జరిగి బెనజీర్ భుట్టోతో పాటు మరో 20 మంది బలయ్యారు. ఇక..పాక్ మాజీ అధ్యక్షుడు, ప్రధాని అయిన ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను ఓ హత్య కేసుకుగానూ 1979 ఏప్రిల్ 4వ తేదీన ఉరి తీశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత కేసు అనే అభియోగాలు ఉన్నాయి. 2023 దాకా విదేశాంగ మంత్రిగా పని చేసిన పీపీపీ నేత బిలావల్ భుట్టో.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ‘‘సింధూ నది మాదే. ఎప్పటికీ మాదే. నదిలో నీరైనా పారుతుంది లేదా వారి రక్తమైనా పారుతుంది. పాకిస్థాన్ గానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈ యుద్ధ కాంక్షను అస్సలు సహించదు. వేల ఏళ్ల నాటి సింధూ నాగరికతకు తాము వారసులమని మోదీ అంటుంటారు. కానీ ఈ సంస్కృతికి పరిరక్షకులము మేమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాము’’ అంటూ ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సహా భారత్‌లోని పలువురు నేతలు ఇప్పటికే ఖండించారు కూడా. -
పార్టీ లైన్ దాటొద్దు.. కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం దాడులపై పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలు దాడులపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవి ఉన్నాయని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2.30గం. ప్రాంతంలో సైన్యం దుస్తుల్లో వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు.. పహల్గాం బైసరన్లోయ పిక్నిక్ స్పాట్లో పర్యాటకుల్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక స్థానికుడితో సహా 25 మంది టూరిస్టులు కన్నుమూశారు. అయితే ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదమే చోటు చేసుకుంది. పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..ఈ పరిణామాలను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇతర నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఇద్దరు నేతలను మందలించినట్లు కూడా ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఉద్వేగభరిత ప్రసంగం
-
ఢిల్లీ: ప్రధాని మోదీతో ముగిసిన రాజ్‌నాథ్ సింగ్ భేటీ
-
అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! -
భారత్ ఆర్మీ అండతో పహల్గమ్ కు క్యూ కట్టిన టూరిస్టులు
-
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.బైసరన్ లోయలోభారత్లో చిన్న టపాసు పేలినా పాక్‌నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థంఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు. ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముక్తకంఠంతో ఖండించారుఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు
లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్ సింగర్‌పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్ రాథోడ్ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్ విషాదంపై కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై చర్యలకు సిద్దమైంది. -
Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘మినీ స్విట్జర్లాండ్’ లాంటి పహల్గామ్లో ఏప్రిల్ 22న 26 మందిని దారుణంగా కాల్చి చంపిన ఘటన తరువాత కేంద్రం చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. ముఖ్యంగా అట్టారి-వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తానీల వీసాల రద్దుతో సహా అనేక ఆంక్షలను భారత ప్రభుత్వం విధించింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు దేశాన్ని వీడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసి, విచారణకు ఆదేశించవచ్చు ,మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (SAARC) వీసాలు కలిగి ఉన్నవారు భారతదేశం విడిచి వెళ్లడానికి చివరి తేదీ ఏప్రిల్ 26. వైద్య వీసాలు కలిగి ఉన్నవారికి, చివరి తేదీ ఏప్రిల్ 29.ఆదివారం నాటికి భారతదేశం విడిచి వెళ్లాల్సిన 12 కేటగిరీల వీసాలు- వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు. ఏప్రిల్ 27 నాటికి భారతదేశం నుండి వెళ్లిపోవాల్సిన 12 రకాల వీసాదారులు : వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు.పహల్గామ్ దాడి తర్వాత ఏప్రిల్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన క్యాబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశంలో కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు, పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వంనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కాగా తాజా ఆంక్షల నేపథ్యంలో అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా 272 మంది పాకిస్తానీ జాతీయులు భారతదేశం నుండి బయలుదేరారు .మరికొన్ని వందల మంది ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు పొరుగు దేశానికి చెందిన 12 కేటగిరీల స్వల్పకాలిక వీసాదారుల గడువు ముగిసే సమయానికి నిష్క్రమించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రారంభంలో పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. ఆ తరువాత ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. -
ఉగ్రదాడిలో బిగ్ ట్విస్ట్.. సీన్ లోకి చైనా
-
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు. -
భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి భారత్-పాక్‌ల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో సహా కఠిన చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు భారత్ ఇప్పటికే కొన్ని చర్యలు అమలు చేసింది.అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ మూసివేతచారిత్రాత్మకంగా భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యం సవాళ్లతో కూడుకున్నది. 2019లో పుల్వామా దాడి తరువాత పాక్ వస్తువులపై భారతదేశం 200% సుంకాన్ని విధించింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయం దెబ్బతినేందుకు దారితీసింది. ఇటీవల జరిగిన పహల్గాం దాడి ఈ వాణజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలకు కీలకంగా ఉన్న అట్టారి వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేసేందుకు కారణమైంది. ఈ మూసివేతతో సుమారు రూ.3,800 కోట్ల విలువైన సీమాంతర వాణిజ్యం నిలిచిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే భారత్ శత్రదేశంతో ఎలాగో విభేదాలు తలెత్తుతాయనే ఉద్దేశంలో కొన్నేళ్లుగా క్రమంగా వాణిజ్యాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవడం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరోక్ష వాణిజ్యంఅధికారిక ఆంక్షలు ఉన్నప్పటికీ భారత వస్తువులు దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీ మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుకుంటూనే ఉన్నాయి. ఇది వాణిజ్య నెట్‌వర్క్‌ల భద్రతను హైలైట్ చేస్తుంది. ఏదేమైనా అటువంటి పరోక్ష వాణిజ్యం నైతిక, రాజకీయ చిక్కులకు కారణమవుతుందనే వాదనలున్నాయి. పహల్గాం దాడి దౌత్యపరమైన విభేదాలకు కూడా దారితీసింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ సంకల్సిస్తోంది.ఇదీ చదవండి: వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!భారత్ నుంచి పాకిస్థాన్‌కు జరిగే ఎగుమతులు ప్రధానంగా..సేంద్రీయ రసాయనాలుఫార్మాస్యూటికల్ ఉత్పత్తులుచక్కెర, మిఠాయిలుయంత్రాలు, వస్త్రాలుకాఫీ, టీ, మసాలా దినుసులు2023లో పాకిస్థాన్‌కు భారతదేశ ఎగుమతుల విలువ సుమారు 523.22 మిలియన్ డాలర్లు.సేంద్రీయ రసాయనాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఇందులో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి.పాకిస్థాన్ నుంచి భారత్‌కు దిగుమతులుఉప్పు, సల్ఫర్, సున్నంసిమెంట్జౌళి ఉత్పత్తులు2023లో పాకిస్థాన్ నుంచి దిగుమతుల విలువ 2.27 మిలియన్ డాలర్లు. -
పహల్గాం ఉగ్రదాడిపై విచారణను ప్రారంభించిన NIA బృందాలు
-
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ విషయంలో భారత్ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్, భారత్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు. -
LoC వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది. మరోవైపు, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్ ఫైర్ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్ జిల్లాలో ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది. -
ఫలితాలు, విదేశీ అంశాలపై కన్ను
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఫలితంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,800కు ఎగువన నిలవగలిగితేనే సాంకేతికంగా బుల్లిష్ ధోరణి కొనసాగే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు. ఇంధన, సిమెంట్ కంపెనీలు ఇప్పటికే గత ఆర్థిక సంవత్సర(2024–25) ఫలితాల సీజన్ ప్రారంభమై జోరందుకుంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని దిగ్గజాలు క్యూ4(జనవరి–మార్చి) పనితీరుతోపాటు పూర్తి ఏడాది ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఇంధన రంగ పీఎస్‌యూలు ఇండిఆయన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)సహా.. సిమెంట్ దిగ్గజాలు అంబుజా, అల్ట్రాటెక్, టాటా గ్రూప్ దిగ్గజం ట్రెంట్, ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్, బజాజ్ ఫైనాన్స్ తదిరాలున్నాయి. గత వారం చివర్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4, పూర్తి ఏడాది ఫలితాలు వెలువరించింది. ఈ ప్రభావం నేటి(సోమవారం) ట్రేడింగ్‌లో రిలయన్స్ కౌంటర్‌పై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర అంశాలు గత వారం ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ వెనకడుగు వేసింది. మరోవైపు దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు భారీగా ఇన్వెస్ట్ చేశారు. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలపడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభం కారణంగా పసిడి ధరలు మండుతున్నప్పటికీ ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్రెంట్ చమురు 65 డాలర్ల సమీపంలో కదులుతోంది. రూపాయి పుంజుకోవడం, చమురు చల్లబడటం దేశీ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, అంతర్జాతీయ టారిఫ్‌ల సంక్షోభం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇవికాకుండా దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. మరోవైపు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల అంశమని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. సానుకూలం2024 అక్టోబర్ మొదలు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! దీంతో గత 7 ట్రేడింగ్ రోజుల్లో ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 27649 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత వారం రూ. 17,425 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ చివరి రెండు రోజుల్లో మార్కెట్లు నీరసించినప్పటికీ నికరంగా గత వారం లాభపడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 659 పాయింట్లు(0.84 శాతం) పుంజుకుని 79,213 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,039 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్ మరింత అధికంగా 1.3 శాతం బలపడగా, స్మాల్‌క్యాప్ 0.12 శాతమే లాభపడింది.ఐఐపీవైపు చూపుమార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి గత 6 నెలల్లోనే కనిష్టంగా 2.9 శాతానికి పరిమితమైంది. జనవరిలో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇక ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ వారాంతాన(మే 2న) విడుదలకానుంది. అంతర్జాతీయ అంశాల విషయానికివస్తే మార్చి నెలకు 29న యూఎస్ ఉపాధి గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌కు చైనా తయారీ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్‌కు యూఎస్ పీసీఈ ధరల ఇండెక్స్ 30న వెలువడనున్నాయి. మే 1న బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, రిటైల్ ధరలు ప్రకటితంకానున్నాయి. ఈ బాటలో యూఎస్ తయారీ పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు 2న వెల్లడికానున్నాయి. -
బంగ్లాదేశ్‌కూ నీళ్లు నిలిపివేయాలి: బీజేపీ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలగాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో సైతం ఇలాంటి చర్యనే తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కోరారు. 1996లో కాంగ్రెస్ హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన గంగ జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ‘ఆ ఒప్పందం చాలా తప్పు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేసింది’అని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో సంబంధాలున్న దేశాలతో నదీ జలాల పంపకం ఒప్పందాలను యథా ప్రకారం కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ‘పాములకు ఎంతకాలం నీళ్లు అందించాలి? వాటిని నలిపేయాలి’అంటూ దూబే వ్యాఖ్యానించారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలన్నారు. -
పాక్ వెళ్లేందుకు ముగిసిన గడువు
చండీగఢ్/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది. -
పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్ దిగిన గ్రూప్ ఫొటో అంటూ పాక్ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు. -
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
పహల్గామ్లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్లెట్లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) 'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Atul Kulkarni (@atulkulkarni_official) -
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప. -
ఎనీటైమ్.. ఎనీవేర్..: ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: ఎనీటైమ్(ఎప్పుడైనా).. ఎనీవేర్(ఎక్కడైనా).. ఎనీహౌ(ఏమైనా సరే) సందేశం పంపింది ఇండియన్ నేవీ. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలకు సిద్ధమైన భారత్.. ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత ఆర్మీని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఎల్ఓసీ(నియంత్రణ రేఖ) వెంబడి పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వడానికి భారత్ సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలను ఆరంభించాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న క్రమంలో నేవీ సిద్ధమైంది. లాంగ్ రేంజ్ కచ్చితమైన దాడులకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నేవీ స్నష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడటానికి తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ.. పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ఎనీటైమ్.. ఎనీవేర్.. ఎనీహౌ అంటూ నేవీ తన ‘ ఎక్స్’ ద్వారా ఒక మెస్సేజ్ ను పంపింది.గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో టూరిస్టులు 26మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ సహకారంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పసిగట్టిన భారత్.. అందుకు అనుగుణంగా స్ట్రాంగ్ మెస్సేజ్ పంపింది. సింధూ జలాలను నిలిపివేతతో పాటు పాకిస్తాన్ జాతీయులు దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించింది. #IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025 -
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
పహల్గాం/న్యూఢిల్లీ: ఒక ఫొటోగ్రాఫర్ చెట్టు మీది నుంచి తీసిన వీడియో పహల్గాం ఉగ్ర ఘటన దర్యాప్తులో కీలకంగా మారింది. అలాగే ఘటన సమయంలో కుటుంబంతో కలిసి అక్కడికి విహారయాత్రకు వచ్చిన ఒక సైనికాధికారి ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తు అధికారులకు ఎంతో సాయపడుతోంది. నాటి ఘటన క్రమాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పహల్గాం ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. ఆదివారం జమ్మూలో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐజీ, డీఐజీ, ఎస్పీలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజు నుంచే స్థానిక పోలీసులకు దర్యాప్తులో ఎన్ఐఏ బృందం సాయపడటం తెల్సిందే. దాడి నుంచి బయటపడి స్వస్థలాలకు వెళ్లిన పర్యాటకుల నుంచి వేర్వేరు బృందాలు వాంగ్మూలాలను సేకరిస్తున్నాయి. సైన్యాధికారి ఏం చెప్పారంటే... లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న సైనికాధికారి కాల్పుల వేళ తన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో దాచేశారు. ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, తొలుత ఎవరిని చంపారు, తర్వాత ఎటు వెళ్లారు వంటి వివరాలను వాంగ్మూలంలో చెప్పారు. ‘‘తొలుత ఇద్దరు ఉగ్రవాదులు చిన్నపాటి దుకాణాల వెనుక నుంచి హఠాత్తుగా వచ్చి పర్యాటకులను ‘కల్మా’ చదవాలని ఆదేశించారు. చదవని నలుగురిని తలపై కాల్చిచంపారు. దాంతో అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఉగ్రవాదులు వారి తల, గుండెకు గురి చూసి కాల్చడంతో మరికొందరు చనిపోయారు. కాసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవి నుంచి బయటికొచ్చి పర్యాటకులపైకి కాల్పులకు దిగారు’’ అని ఆయన వివరించినట్టు సమాచారం. కాల్పుల ఘటనను ఉగ్రవాదులు తమ బాడీ క్యామ్‌లలో రికార్డ్ చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యువ నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ పెళ్లయిన ఆరు రోజులకే దాడిలో చనిపోవడం తెలిసిందే. దాంతో ఆయన భార్య హిమాన్షీ గుండెలవిసేలా రోదిస్తూనే ఫోన్ చేసి పోలీసులకు వెంటనే సమాచారమిచ్చారు. దాడిపై వారికి వచ్చిన తొలి కాల్ అదే. దాంతో పహల్గాం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. 22 గంటలు ట్రెక్కింగ్ చేసొచ్చి చంపారు భద్రతా బలగాల కంటబడకుండా ఉండేందుకు ఉగ్రవాదులు రోడ్డు మార్గంలోకాకుండా అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకర పర్వత సానువుల గుండా వచ్చినట్టు వెల్లడైంది. కోకెర్నాగ్ అటవీ ప్రాంతం గుండా 22 గంటలు ట్రెక్కింగ్ చేసి మరీ బైసారన్ చేరుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పర్యాటకులను కాల్చే క్రమంలో ఒక స్థానికుడు, మరో పర్యాటకుడి నుంచి వాళ్లు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. తిరిగి వెళ్తూ వాటిని మార్గమధ్యంలో ధ్వంసం చేశారని తెలుస్తోంది. దాడిలో ఏకే 47, ఎం4 మెషీన్గన్లు వాడినట్టు జాగా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ప్రాణభయంతో చెట్టెక్కి, వీడియో తీసి...ఉగ్రవాదులు దాడికి దిగిగినప్పుడు అక్కడే ఉన్న స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు ప్రాణభయంతో చెట్టెక్కి కొమ్మల్లో నక్కారు. అలా వారి కంట పడకుండా తప్పించుకున్నారు. కళ్లెదుటే అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించిన తీరును కెమెరాలో బంధించారు. దాడి క్రమాన్ని స్పష్టంగా పట్టిచ్చిన ఆ వీడియో ఎన్ఐఏ దర్యాప్తులో కీలకంగా మారింది. -
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. -
భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు. -
పహల్గామ్ బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు. -
పాకిస్తాన్ కొడుకుల్ని.. రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ
-
పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి సానుభూతి పరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా,పహల్గాం ఉగ్రదాడిపై నోరుపారేసుకున్న సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 19మంది అస్సాం,మేఘాలయా,త్రిపురకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం ఉగ్రదాడికి మద్దుతు పలికేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.ఈ తరుణంలో పహల్గాం దాడికి మద్దతు పలికేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్‌ను వినిపించిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన మొత్తం 19మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. Assam | A woman named Dadhichi Dimple alias Dimple Baruah from Golaghat district of Assam was detained by the Crime Branch from Guwahati for making controversial and anti-national comments on the #PahalgamTerrorAttack.At least 19 people have been arrested in Assam, Meghalaya,… pic.twitter.com/MgJp6TehmC— OTV (@otvnews) April 27, 2025వారిపై కఠిన చర్యలు తప్పవ్అయితే, ఈ అరెస్టులు,సోషల్ మీడియా పోస్టులపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి లేదంటే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే, వారిపై జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనలను విధిస్తామన్నారు. భారత్,పాకిస్తాన్ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు. మనం అలాగే ఉండాలి’ అని సీఎం హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ
కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. -
మరో ఉగ్రవాది ఇంటిని బాంబు పెట్టి లేపేశారు
జమ్మూ: పహల్గాం ఉగ్ర దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదల ఏరివేతే లక్ష్యంగా కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా అనుమానిత ఉగ్రవాదుల స్థావరాల్ని గుర్తించి, బాంబులతో నేలమట్టం చేస్తోంది. శనివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో ధ్వంసం చేశాయి. గత మంగళవారం (ఏప్రిల్22న) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులు, వారి మద్దతు దారుల్ని గుర్తించే పనిలో పడ్డాయి భారత భద్రతా బలగాలు. పనిలో పనిగా ఉగ్రవాదుల ఇళ్లను, స్థావరాల్ని గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో 48 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న కీలక ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన వారి స్థావరాల్ని గుర్తించాయి. #BREAKING: House of Lashkar-e-Taiba terrorist Farooq Ahmed Tadwa destroyed. Tadwa a resident of Narikoot Kalaroos, Kupwara (North Kashmir) is, now in Pakistan and works with the Pakistan Army to target innocent civilians in Kashmir. pic.twitter.com/O5v4Xnrio5— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 26, 2025 పీవోకేలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వాశనివారం సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమైన కుప్వారా జిల్లా కలరూస్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని గుర్తించాయి. బాంబులతో ధ్వంసం చేశాయి. 60 ప్రాంతాల్లో దాడులు అటూ శ్రీనగర్‌లోనూ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో ఏకకాలంలో 60కి పైగా ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాము జరిపిన దాడుల్లో వెపన్స్ సీజ్ చేయడం,కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, డిజిటల్ డివైజ్‌ల గుర్తింపు, దేశ భద్రతకు విఘూతం కలిగించేందుకు వినియోగించే వస్తువుల్ని, వాటి ఆధారాల్ని సేకరించినట్లు చెప్పారు. అలాంటి వారిని ఉపేక్షించబోంఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదానికి మద్దతిచ్చే అన్నీ వ్యవస్థల్ని గుర్తించి వాటిని నిర్విర్యం చేస్తున్నాం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారికి, దేశ భద్రతకు విఘూతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్‌పై పాకిస్తాన్ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్‌కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్‌కు లేదంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్‌ను భారత్ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్‌కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని కౌల్ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్ వల్ల సింధూ బేసిన్ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్ ఇకపై పాక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్ అధికారులకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్‌లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్‌లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాక్ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు. నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ నుంచి వచ్చాడు. గవర్నమెంట్ డబ్బులిచ్చి నడిపిస్తున్న లీగల్ అథారిటీ నుంచి, గవర్నమెంటే ఏర్పాటు చేస్తే నా కోసం వచ్చిన లాయర్‌ను నేను అడిగేది ఏముంటుంది? అతని పేరేమో పీయూష్ సచ్దేవ!‘ఏమైనా తిన్నావా?’ అంటాడు!‘ఏమైనా అన్నారా?’ అంటాడు! ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటాడు. ‘ఇక ఉండేదా మరి?!’ అంటాడు.ఈ నాలుగే... రోజు మార్చి రోజు అతడు నన్ను అడిగే ప్రశ్నలు. ఊరికే వస్తుంటాడు, పోతుంటాడు. ‘ధైర్యంగా ఉండు, న్యాయం గెలుస్తుంది..’ అంటాడు! నేనడిగానా ‘నాక్కాస్త ధైర్యమివ్వు’ అని, నేనడిగానా ‘న్యాయాన్ని గెలిపించు’ అని!!ఒకరోజు వచ్చాడు. ‘‘నువ్వు మందులేమీ వేసుకోవటం లేదనీ, కనుక నువ్వు చెప్పుకుం టున్నట్లుగా నీకు 33 అనారోగ్యాలేమీ లేవనీ, అందుచేత నీ ఇంటరాగేషన్ టైమ్‌ను తగ్గించే అవసరం లేదనీ వాళ్లు వాదించబోతున్నట్లు తెలిసింది...’’ అన్నాడు! ‘‘నువ్వూ, వాళ్లూ నా గురించి ఏదైనా వాదించుకోండి. అది నాకు సంబంధం లేని విషయం. నాకైతే ఒక ఖురాన్, ఒక పెన్ను, కొన్ని తెల్ల కాగితాలు తెప్పించు...’’ అన్నాను. తెప్పించాక, ‘‘ఇవన్నీ ఎందుకు?!’’ అని అడిగాడు.‘‘పవిత్ర ఖురాన్ గ్రంథం నా డాక్టర్. ఆ డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ రాయటానికి ఈ పెన్ను, ఈ తెల్ల కాగితాలు. ప్రవక్త సూక్తులే నేను వేసుకునే మందులు...’’ అని చెప్పాను.తర్వాతి విజిట్‌లో ... ‘‘నా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించగలవా?!’’ అని అడిగాను.‘‘కష్టం కావచ్చు’’ అన్నాడు. ‘‘ఎందుకు కష్టం కావచ్చు?!’ అన్నాను. ‘‘మీ ‘కుటుంబ సభ్యులు’ ఒకరు పాకిస్తాన్ లో 78 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకరు లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వారు జైల్లో ఉన్నారని పాకిస్తాన్ అంటోంది కనుక జైల్లోంచి మాట్లాడటం కుదరదు. మీ మిగతా కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పట్ జైల్లో వెంటిలేటర్ మీద ఒకరు, అమెరికా జైల్లో ఒకరు, ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఒకరు ఉన్నారు. కాబట్టి వారందరితో ఫోన్లో మాట్లాడించటం కష్టం’’ అన్నాడు నా లాయర్! నా చేతిలో కనుక ఒక గన్ ఉండి ఉంటే అక్కడికక్కడ... అది ఎన్.ఐ.ఎ జైలు అని, నేను పోలీస్ రిమాండ్‌లో ఉన్నానని కూడా చూడ కుండా రూఫ్ టాప్ మీదకు బులెట్‌ని పేల్చి అతడి భయాన్ని కళ్లజూసేవాడిని!‘‘నేను మాట్లాడతానంటున్నది నా కుటుంబ సభ్యులతో మిలార్డ్...’’ అన్నాను నా లాయర్‌తో, కోపంగా. ‘‘కానీ అవతలి వైపు వాళ్లు ఇలాగే వాదిస్తారు మిస్టర్ తహవ్వూర్. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం...’’ అన్నాడు. రెండు రోజుల తర్వాత వచ్చి – ‘‘మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి జడ్జి గారు ‘నాట్ అలౌడ్’ అనేశారు...’’ అని చెప్పాడు.అతడు అటు వెళ్లగానే, ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. ‘‘నువ్వు 26ని వదిలి పెట్టటం లేదా? లేక 26 నిన్ను వదిలిపెట్టటం లేదా?’’ లేక... నువ్వూ, 26 కలిపి ఈ దేశాన్ని వదిలిపెట్టటం లేదా?’’ అన్నాడు!నాకర్థమైంది! నా రిమాండ్ రేపే ముగిసి, మళ్లీ రేపే మొదలు కాబోతోంది. ‘‘చెప్పు... మొన్న పహల్గామ్లో 26 మందిని చంపిన టెర్రర్ ఎటాక్ వెనుక నీతో పాటు ఎవరెవరు ఉన్నారు?’’ అని ఫ్రెష్‌గా ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎన్.ఐ.ఎ. ఆఫీసర్!! -
ఇండియా, దట్ ఈజ్ భారత్!
ఎట్టకేలకు పాకిస్తాన్ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్ మునీర్ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్గామ్ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్ ప్రస్థానానికి భిన్నంగా భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్ భారత్’ అనే అంబేడ్కర్ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్.వి. కామత్ ఒక్కరే తొలుత ‘హింద్’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్ సైన్యాలు కశ్మీర్ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్ హుస్సేన్ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్ ఆర్మీ చీఫ్. సిసలైన పాక్ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్ భూభాగం, పాక్ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్ నది, గిల్గిట్ నది, హూంజా నది, స్వాట్ నది ముఖ్యమైనవి. కానీ భారత్ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్), 6 శతుద్రి (సట్లెజ్), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
లీవ్ ఇండియా పేరుతో నోటీసులు: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ తో మాట్లాడిన డీజీపీ జితేందర్.. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నాము.లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చాము. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తాము. కర్రెగుట్టలో తెలంగాణా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఆపరేషన్ లేదు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల వద్ద ఎలాంటి బలగాలు మోహరించలేదు. ములుగులో కూంబింగ్ కి తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు’ అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
పెహల్గావ్లో మూష్కరమూకల మారణహోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధూ నది ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహల్గావ్ (pahalgam) దాడితో భారత దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తన పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు.రాత్రి 9 తర్వాత వార్ వద్దుభారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీయులు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సివస్తే రాత్రి 9 గంటలకు ముగించాలని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మరో యూజర్ తమ దేశార్థిక దారుణావస్థను బయటపెట్టారు.ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒకరు ప్రశ్నించగా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మరొకరు సమాధానం ఇచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా.. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చారు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చదవండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజర్లు స్పందిస్తూ.. ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
భారత్-పాక్ సరిహద్దులో గందరగోళం రాజ్యమేలుతోంది. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో అమల్లోకొచ్చిన భారత ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో ఇరు దేశాలకు చెందిన కొందరు దంపతులు చిక్కుల్లో పడ్డారు. కొందరు భారతీయ భర్తలు, పాకిస్థానీ భార్యలు, అలాగే మరికొందరు పాక్ భర్తలు, భారతీయ భార్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం పాక్ జాతీయులందరూ ఇండియాను వదిలి ఈ నెల 27లోగా తమ స్వదేశం వెళ్లిపోవాల్సివుంది. దీంతో పాక్ నుంచి కోడళ్లుగా వచ్చి మెట్టినిల్లు ఇండియాలో ‘అక్రమంగా’ స్థిరపడిన కొందరిలో భయం మొదలైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో మరికొందరు రకరకాల కారణాలతో ఆందోళనలు చేపడుతున్నారు. భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాను వివాహమాడటానికి 2023లో పాక్ నుంచి నేపాల్ గుండా తన నలుగురు పిల్లలతో కలసి (అంతక్రితమే సింధ్ ప్రావిన్సులో ఈమెకు పెళ్లయింది) అక్రమంగా భారత్ వచ్చిన తన గతేమిటని సీమా హైదర్ నేడు ప్రశ్నిస్తోంది. లెక్కయితే ఇప్పుడు ఆమె కూడా స్వదేశానికి తరలిపోవాలి. ఆమె, సచిన్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లో నివసిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ‘నేను అప్పుడు పాక్ కూతురిని. ఇప్పుడు భారత్ కోడలిని. మీనాతో పెళ్లి అనంతరం నేను హిందూ మతం స్వీకరించాను. నాకు పాక్ వెళ్లాలని లేదు’ అని సీమా అంటోంది. సచిన్ మీనాతో కాపురం చేసి ఆమె ఓ కుమార్తె (పేరు భారతీ మీనా)కు జన్మనిచ్చింది. సీమా ఇక ఎంతమాత్రమూ పాక్ జాతీయురాలు కాదని, సీమా పౌరసత్వం భర్తతో ముడిపడివుంది కనుక భారత ప్రభుత్వ తాజా ఆదేశం ఆమెకు వర్తించదని ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నారు. సీమా మాదిరిగా అక్రమ దారుల్లో ఇండియాలో ప్రవేశించిన పాకిస్థానీలు ప్రస్తుతం దేశ బహిష్కరణ (డిపోర్టేషన్) ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇక రాజస్థానీ మహిళ బాజిదా ఖాన్ గోడు చూద్దాం. ఆమెకు పాక్ జాతీయుడితో పెళ్లయింది. కొంత సమయం పుట్టినింటి వారితో గడుపుదామని తన ఇద్దరు మైనర్ కుమారులను వెంటబెట్టుకుని ఆమె ఇండియాకు వచ్చింది. పిల్లలిద్దరికి పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఇంకొన్నాళ్లు ఇండియాలోనే ఉందామని బాజిదా ఖాన్ భావించినా ఇక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 27లోగా ఆమె ఇండియా వీడి పాక్ వెళ్లక తప్పని పరిస్థితి. దీంతో ఆమె పాక్ వెళ్లడానికి శుక్రవారం వాఘా-అటారీ సరిహద్దును చేరుకుంది. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పాక్ పాస్‌పోర్టులున్నాయి కనుక ఆమె ఇద్దరు కుమారులు పాక్ భూభాగంలో ప్రవేశించవచ్చని, భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నందున బాజిదాకు ఆ అవకాశం లేదని తేలింది. దీంతో ఆమె హతాశురాలైంది. ఐదేళ్ల కొడుకును చంకనెత్తుకుని పాకిస్థాన్‌లోని అత్తారింటికి బయల్దేరి సరిహద్దుకు చేరుకున్న రషీదా ఖాన్ కూడా అదే అనుభవాన్ని చవిచూసింది. ఆమెకు పాక్ జాతీయుడితో వివాహమైంది. పంజాబ్ (ఇండియా)లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు ఆమె ఇక్కడికొచ్చింది. తిరిగి పాక్ వెళ్లిపోదామని సరిహద్దుకు చేరుకుంటే భారతీయ పాస్‌పోర్ట్ ఉందన్న కారణంతో ఆమెను నిలిపివేశారు. ఆమె కుమారుడికి మాత్రం పాక్ పాస్‌పోర్టు ఉంది. ఓ వితంతువు మరో దీనగాథ చెప్పుకుంది. తాను 20 ఏళ్లుగా పాక్ లో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ పౌరసత్వం లేదని, తన ఇద్దరు టీనేజి కుమార్తెలతో కలసి ఇప్పుడు పాక్ వెళ్లడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థిస్తోంది. తన వివాహ పత్రాలు, భర్త మరణ ధృవీకరణ పత్రం, పాక్ పౌరసత్వం కోసం సమర్పించిన దరఖాస్తు తాలూకు ఆధారాలు సైతం ఉన్నాయంటూ ఆమె బావురుమంటోంది. పాక్ వెళ్ళేందుకు అనుమతించాలని ఆమె భారత సర్కారును అభ్యర్థిస్తోంది. మరోవైపు బులంద్ షహర్ (ఉత్తరప్రదేశ్)లో కుటుంబాలను కలిగిన నలుగురు మహిళలను భారత ప్రభుత్వం పాక్ కు తిప్పి పంపింది. “మా పిల్లలు, కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి. మేం అక్కడికి ఎలా వెళ్లి జీవిస్తాం?” అని వారిలో ఓ మహిళ లబోదిబోమంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పాక్ జాతీయులకు సంబంధించి మెడికల్ వీసాలు ఈ నెల 29 వరకు చెల్లుబాటవుతాయని, ఇతర అన్ని వీసాలు నెల 27 నుంచి రద్దవుతాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
పహల్గామ్ హీరో.. మానవత్వంలో ‘ధీరత్వం’
ఏ మనిషికైనా కష్టం వస్తే సాయం చేసే వాళ్లని మానవత్వం ఉన్నవాళ్లుగా పరిగణిస్తాం. పక్కోడికి ఏమైతే మనకేంటి.. అనుకుంటే వారిని స్వార్ధపరులే అనుకుంటాం. మరి మానవత్వంలో ధీరత్వం అంటే ఏమిటి? మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వారి ప్రాణాలను కూడా తన ప్రాణాలుగానే భావించి తెగువ చూపించి కాపాడితే అది మానవత్వంలో ధీరత్వమే అవుతుంది. ఇక్కడ తనకెందులే అనుకోకుండా ధీరత్వంతో కొంతమంది ప్రాణాల్ని కాపాడాడు ఓ వ్యక్తి. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి కొంతమందిని కాపాడి హీరో అయ్యాడు. ఓ వైపు టెర్రరిస్టులు దాడులకు తెగబడిన తరుణంలో ఆ యువకుడు తన ప్రాణాలు తెగించి మరీ వారిని కాపాడాడు.విషయంలోకి వెళితే.. మంగళవారం( ఏప్రిల్ 22వ తేదీ) కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడితో రక్తసిక్తమైంది. కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులు ధరించి వచ్చి అమాయక టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో 26 మంది అసువులు బాసారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇలా సాయం చేయడంలో స్థానికంగా ఉన్న కొందరు సహకరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ టూరిస్టులను కాపాడారు. ఇలా టూరిస్టులను కాపాడిన వారిలో పహల్గాగ్ కు చెందిన రాయిస్ అహ్మద్ భట్ ఒకరు. పహల్గామ్ లో పోనీ ఓనర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న అహ్మద్ భట్.. ఆ క్షణాలను మళ్లీ తలుచుకుంటేనే భయమేస్తుందన్నాడు. ఈ రోజు దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లిన రాయీస్ అహ్మద్ భట్.. ఏఎన్ఐ పలకరించగా అక్కడ జరిగిన దాడి ఉదంతాన్ని చెప్పుకొచ్చాడు.ఆఫీస్ నుంచి అనుకోకుండా బయటకొచ్చి..ఈ టెర్రర్ అటాక్ అనేది మధ్యాహ్నం గం. 2.45ని. ప్రాంతంలో జరిగిందన్నాడు అహ్మద్ భట్. తనకు ఒక ఫోన్ వస్తే కవరేజ్ లేదని బయటకొచ్చిన క్రమంలో కొంతమంది టూరిస్టుల ఆర్తనాదాలు వినిపించాయన్నాడు. తమను రక్షించాలంటూ వారు చేస్తున్న రోదనతో తాను అప్రమత్తమైనట్లు పేర్కొన్నాడు.‘ నేను ఆఫీస్ లో ఉన్నా. నాకు ఒక మెస్సేజ్ వచ్చింది. అది మా జనరల్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన మెస్సేజ్. ఆ మెస్సేజ్ చూసిన తర్వాత నేను తిరిగా కాల్ చేశాను. కానీ మొబైల్ కవరేజ్ సరిగా లేకపోవడంతో నేను ఫోన్ మాట్లాడుకుంటూ బయటకొచ్చా. అప్పుడు ఉగ్రదాడి జరుగుతుందనే విషయం పసిగట్టా. నేను ఆరుగుర్ని నాతో తీసుకుని అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల వరకూ ఎత్తుపైకి వెళ్లాం.అక్కడ నుంచి చూస్తుంటే కింద భయానక వాతావరణం కనిపించింది. భయభ్రాంతులతో పరుగెడుతున్న పలువురు కనిపించారు. కేవలం వారి నుంచి రక్షించండి అనే ఆర్తనాదమే వస్తుంది. నీరు.. నీరు అంటూ కేకలు వేస్తూ ప్రాణం కోసం పరుగుపెట్టారు. నేను వారికి సాయం చేయడానికి మేము యత్నించాం. అడవిలో ఉన్న ఒక వాటర్ పైప్ వారికి వాటర్ అందించాం. ఆ తర్వాత వారికి ఒకటే చెప్పా. మీకు సురక్షితమైన జోన్ లో ఉన్నారనే విషయం చెప్పా. వారిని మా టీమ్ సభ్యులకు అప్పగించా. భయపడిన వారిని సురక్షితంగా తీసుకురావడమే మా మొదటి ప్రయత్నంగా భావించాం’ అని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత కూడా పది నుంచి పదిహేనుమంది వరకూ తాను కాపాడినట్లు రాయీస్ భట్ తెలిపాడు. తమ టీమ్ సభ్యులంతా కలిసి చాలా మందిని ప్రాణాలతో కాపాడమన్నాడు. నేను బురదలో చిక్కుకుపోయిన కొంతమందిని తనతో పాటు తీసుకొచ్చానన్నాడు. ఆ తర్వాత వారిని గుర్రాలు ఎక్కించి వెనక్కి పంపించినట్లు పేర్కొన్నాడు.ఎక్కడ చూసినా ఆర్తనాదాలే..తాను తొలిసారి చూసినప్పుడు టూరిస్టులు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక మృతదేహాన్ని చూశా. ఆ తర్వాత నాలుగైదు మృతదేహాలు కనిపించాయి. అక్కడ ఉన్న కొంతమంది గాయపడ్డ మహిళలు.. తమ భర్తలను రక్షించాలని వేడుకున్నారు. ఏదైతే అది అయ్యిందని మా టీమ్ సభ్యులమంతా గేట్ లోపలికి వెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేశామన్నాడు. ఇలా కొంతమందిని రక్షించామని రాయీస్ అహ్మద్ మీడియాకు తెలిపాడు. -
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
న్యూఢిల్లీ: సింధు జలాలను ఆపితే అందులో పారిదే రక్తమే అంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావాల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ భుట్టో స్టేట్ మెంట్ విన్నాను. ఒకసారి సింధు జలాల్లో దూకి చూడు. నీళ్లు ఉన్నాయో లేవో తెలుస్తుంది’’ అంటూ హర్ దీప్ సింగ్ బదులిచ్చారు. ఒక విషయం పబ్లిక్ లో మాట్లాడేముందు ముందు వెనుక చూసుకుని మాట్లాడితే మంచిదని చురకలంటించారు. భుట్టో వ్యాఖ్యల్లో ఎటువంటి గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే జరిగింది. మన పొరుగు దేశంగా ఉన్న పాకిస్తాన్ సహకారంతో అది జరిగింది. దానికి ఆ దేశం పూర్తి బాధ్యత వహించాలి. అంతేగానీ దీన్ని ఇంకా పెద్దది చేసుకుని ఏవో ప్రయోజనం వస్తుందని భావించకండి. పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలనే చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అంతకుముందు పాకిస్తాన్ కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రదాడులతో మానవ హక్కుల్ని కాల రాస్తారా?, దీనికి యావత్ ప్రపంచం ఎంతమాత్రం ఒప్పుకోదు. ;పాకిస్తాన్ అనేది ఒక చెత్త దేశమే కాదు.. క్షీణదశకు వచ్చేసిన దేశం’ అంటూ కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ తెలిపారు.సుక్కర్ సింధ్ ప్రొవిన్స్ లో భుట్టో జర్దారీ బహిరంగం ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ సింధు జలాలు మావి. అవి ఎప్పటికైనా మావే. ఒకవేళ అందులో నీళ్లు పారకపోతే.. వారి రక్తం పారుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహెల్గామ్ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ -
30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్‌బాస్ విన్నర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ ఒకరు. ఏప్రిల్ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్ కోసం ఏప్రిల్ 21న కశ్మీర్ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ నేలకొరిగారు.పెళ్లయిన ఆరు రోజులకే..కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్‌కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్మేట్ అని గుర్తు చేసుకున్నాడు. ఇంకా షాక్‌లోనే ఉన్నా..ఎల్విష్ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్‌కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్‌లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!31వ సారి ఫోన్ ఎత్తిందిఅందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ ఒకరు తనకు 30 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 31వ సారి ఫోన్ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్ యాదవ్.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ విజేతగా నిలిచాడు.చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే: నాని -
అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025 -
జోక్ కాదు.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్‌తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
ఇండియన్ ఆర్మీ ఆన్ ఫైర్.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం
శ్రీనగర్: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్ఈటీ ఆపరేటివ్స్‌పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.పుల్వామాలో ఎసాన్ ఉల్ హక్, షోపియాన్‌లోని చోటీపోరాలోని షాహిద్ అహ్మద్ , కుల్గాంలో జకీర్ గని ఇళ్లు బుల్డోజర్, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్‌లో చోటిపోరా గ్రామంలో ఎల్టీ కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టే నివాసానికి బుల్డోజర్ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్ అహ్మద్ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్ అహ్మద్(జకీర్ గని) నివాసాన్ని కూల్చేశారు. #BreakingNews : The house of LeT militant Shahid Ahmad, Kuty resident of #Chotipora #Shopian active since 2022 , was destroyed in a blast in Chotipora area of Shopian. pic.twitter.com/DT79ZJ7vxb— The Lal Chowk Journal (@LalChowkJournal) April 26, 2025పుల్వామా ముర్రాన్ ప్రాంతంలో ఎషన్ ఉల్ హక్ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్‌లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. ఎల్ఈటీ ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్‌కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్ లోకల్ టెర్రరిస్టులు ఆసిఫ్ షేక్, అదిల్ మహమ్మద్ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్‌గా భారత బలగాలు భావిస్తున్నాయి.ఇక.. అసిఫ్ షేక్ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్ సోదరితమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె.