
మూడేళ్ల జైలు, రూ.3 లక్షల జరిమానా
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘మినీ స్విట్జర్లాండ్’ లాంటి పహల్గామ్‌లో ఏప్రిల్ 22న 26 మందిని దారుణంగా కాల్చి చంపిన ఘటన తరువాత కేంద్రం చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. ముఖ్యంగా అట్టారి-వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తానీల వీసాల రద్దుతో సహా అనేక ఆంక్షలను భారత ప్రభుత్వం విధించింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు దేశాన్ని వీడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసి, విచారణకు ఆదేశించవచ్చు ,మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (SAARC) వీసాలు కలిగి ఉన్నవారు భారతదేశం విడిచి వెళ్లడానికి చివరి తేదీ ఏప్రిల్ 26. వైద్య వీసాలు కలిగి ఉన్నవారికి, చివరి తేదీ ఏప్రిల్ 29.
ఆదివారం నాటికి భారతదేశం విడిచి వెళ్లాల్సిన 12 కేటగిరీల వీసాలు- వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు.
ఏప్రిల్ 27 నాటికి భారతదేశం నుండి వెళ్లిపోవాల్సిన 12 రకాల వీసాదారులు : వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు.
పహల్గామ్ దాడి తర్వాత ఏప్రిల్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన క్యాబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశంలో కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు, పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వంనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా తాజా ఆంక్షల నేపథ్యంలో అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా 272 మంది పాకిస్తానీ జాతీయులు భారతదేశం నుండి బయలుదేరారు .మరికొన్ని వందల మంది ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు పొరుగు దేశానికి చెందిన 12 కేటగిరీల స్వల్పకాలిక వీసాదారుల గడువు ముగిసే సమయానికి నిష్క్రమించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రారంభంలో పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. ఆ తరువాత ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది.