ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌.. ఇండిగో స్థానం ఇది! | The Best And Worst Airlines In The World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌.. ఇండిగో స్థానం ఇది!

Published Wed, Dec 4 2024 4:39 PM | Last Updated on Wed, Dec 4 2024 5:05 PM

The Best And Worst Airlines In The World

విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్‌ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. 

ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్‌ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్‌, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్‌లకు ర్యాంకుల ఇచ్చింది.

ఇందులో జనవరి నుంచి అక్టోబర్‌ వరకు గల డేటాను బేస్‌ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్‌ హెల్ప్‌ సీఈవో టామ్జ్‌ పౌల్జిన్‌ చెబుతున్నారు.

2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..

100. స్కై ఎక్స్‌ప్రెస్

101.ఎయిర్ మారిషస్

102. తారోమ్

103. ఇండిగో

104. పెగాసస్ ఎయిర్‌లైన్స్

105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్

106. బల్గేరియా ఎయిర్

107. నౌవెలైర్

108. బజ్

109. తునిసైర్

2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానాయన సంస్థలు..

10. ఎయిర్ సెర్బియా

9. వైడెరో

8. ఎయిర్ అరేబియా

7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్

6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్

5. ప్లే (ఐస్లాండ్)

4. అమెరికన్ ఎయిర్‌లైన్స్

3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్

2. ఖతార్ ఎయిర్‌వేస్

1. బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్

ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్‌వేస్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. 

ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.

(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement