ఎకో టూరిజం : ప్రకృతిని గౌరవించాలి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది.
ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం,
పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్‌లను తీసుకెళ్లరాదు.
పిల్లలు, డయాబెటిస్ పేషెంట్‌లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్‌ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్‌బిన్‌లలో వేయాలి.
పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.
నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు.
మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్‌బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.
పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.
చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.
నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.
నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.
అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం.
స్థానికులకు చాక్లెట్‌లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు.
Comments
Please login to add a commentAdd a comment