terro attack
-
ఉగ్రవాదుల దాడి : బస్సు డ్రైవర్, కండక్టర్లను అమరవీరులుగా గుర్తించాలి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పల్లో మరణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను అమరవీరులుగా ప్రకటించాలని బస్సు యజమాని సుజన్ సింగ్ విజ్ఞప్తి చేశారు.ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తోన్న బస్సుపై పాకిస్థాన్ లక్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.డ్రైవర్‌కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ విజయ్ కుమార్ (40), అతని 19 ఏళ్ల కండక్టర్ అరుణ్ కుమార్ మరణించారు. ఆ ఇద్దరి మరణంపై బస్సు యజమాని స్పందించారు. విజయ్ కుమార్, అరుణ్ కుమార్‌లను అమరవీరులుగా గుర్తించాలని కోరుతున్నారు. ‘విజయ్ నాకు ఒక కుటుంబం లాంటివాడు. నాతో సుమారు ఆరేళ్లుగా పని చేశాడు. బస్సులో ప్రయాణికులందరిని చంపకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగానే వాహనాన్ని రోడ్డుపై ఆపకుండా లోయలో పడేసి ఉంటారని నేను నమ్ముతున్నాను’ అని బస్సు యజమాని సుజన్ సింగ్ అన్నారు. విజయ్ తండ్రి రతన్ లాల్ ఆరు నెలల క్రితం చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు. వారి పెంపకం చూసేందుకు కుటుంబంలో మరెవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ బాధితుల తదుపరి బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. -
ఫైవ్ స్టార్ హోటల్‌పై ఉగ్రదాడి : భీకర కాల్పులు
పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రాంతం గ్వాదర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని ప్రాధమిక సమాచారం. హోటల్ నుంచి భారీగా బాంబు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడి వుంటుందని అనుమానిస్తున్నారు. ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికి పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఫైవ్ స్టార్ హోటల్ మీద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే ఏటీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. భారీ ఎత్తున భద్రతా దళాలను హోటల్ బయట మోహరించాయి. టెర్రరిస్టులు రాకెట్ లాంచర్లు పట్టుకుని ఉన్నారని, ఆత్మాహుతి కోసం జాకెట్స్ కూడా ధరించారని సమాచారం. హోటల్లోని అందరు అతిథులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేసినట్టు బలోచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బిలాడీ చెప్పిట్టు దునియా న్యూస్ వెబ్సైట్ పేర్కొంది. అలాగే విదేశీ అతిధులు కూడా ఎవరూ లేరని తెలిపింది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు మంత్రి జహూర్ బిలాడీ తెలిపారు. కాగా దాదాపు 12 ఉగ్రవాసద సంస్థల నిషేధిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే టెర్రర్ దాడి జరిగింది. మమసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న 12 సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. అందులో జైషే మహ్మద్ కూడా ఉంది. -
బీజేపీ అగ్రనాయకుల హత్యకు కుట్ర ?
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన సీనియర్ నాయకులను, ప్రముఖ ముఖ్యమంత్రులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్టులు వస్తున్నాయి. జైషే ఈ మహ్మద్(జేఈఎమ్) చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం జేఈఎమ్, లష్కర్ ఈ తోయిబా(ఎల్ఈటీ)లు కలసి బంగ్లాదేశ్ నుంచి కుట్రను అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు తమ టాస్క్‌ను పూర్తి చేసేందుకు భారత్‌లోకి ప్రవేశించినట్లు కూడా సమాచారం. తక్కువ భద్రతతో తిరుగుతున్న ఓ ప్రముఖ బీజేపీ ముఖ్యమంత్రిని తొలి లక్ష్యంగా ఉగ్ర సంస్థలు నిర్దేశించుకున్నట్లు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన భారత ఇంటిలిజెన్స్ బృందం బంగ్లాదేశ్‌కు చెందిన అధికారుల సాయంతో ఢాకాలోని అనుమానిత ప్రదేశంపై రైడింగ్ జరిపించింది. అయితే, రైడింగ్‌లో ఎలాంటి సమాచారం దొరకలేదని పేరు తెలుపడానికి ఇష్టపడని ఓ ఇంటిలిజెన్స్ అధికారి వెల్లడించారు. మసూద్ అజర్ మేనల్లుడు(తహ్లా రషీద్)ని కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ కుట్ర జరుగుతోందనే సమాచారం కూడా ఉందని చెప్పారు. -
భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై గురి!
న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై ఉగ్ర దాడులకు పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నాగం పన్నినట్టు బట్టబయలైంది. చెన్నైలో పట్టుపడిన ఓ శ్రీలంక దేశీయుడిని విచారించగా ఈ విషయం వెల్లడైంది. ఓ ఆగ్నేయాసియా దేశంలో జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సకీర్ హుస్సేన్ అనే శ్రీలంక దేశీయుడి పేరు బయటికొచ్చింది. వెంటనే ఆ దేశం భారత్‌లోని కేంద్ర భద్రతా సంస్థను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో సకీర్‌ను గత నెల 29న చెన్నైలో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. భారత్‌లోని రెండు విదేశీ కాన్సులేట్లపై ఉగ్ర దాడులకు పాల్పడేందుకు ఐఎస్ఐ పన్నాగం పన్నిన విషయం వెల్లడైంది. ఈ కుట్రలో కొలంబోలోని పాక్ హైకమిషన్ అధికారి ఒకరు కీలకపాత్ర పోషించినట్టు తేలింది. ఆ మేరకు చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించేందుకు మాల్దీవులకు చెందిన ఇద్దరిని చెన్నై పంపించేందుకు ఐఎస్ఐ పన్నాగం పన్నిందని, వారికి అవసరమైన ప్రయాణ పత్రాలతోపాటు బస ఏర్పాట్లు చేసేందుకు తనను పురమాయించినట్టు సకీర్ హుస్సేన్ వెల్లడించాడని కేంద్ర భద్రతా సంస్థలు తెలిపాయి. -
లియోపోల్డ్ నెత్తుటి గాయాలకు ఐదేళ్లు
ముంబై: జూలు విదిల్చిన ఉగ్రవాద రాక్షసత్వం కొలాబాలోని లీయోపోల్డ్ కేఫ్‌ను నెత్తుటి చిత్తడి చేసింది. తరచూ విదేశీ యాత్రికులు వచ్చి సేదతీరే ఈ కేఫ్‌లో సముద్రం మార్గాన నగరంలో చొరబడిన పది మంది ఉగ్రవాదుల మూకలో ముగ్గురు కొలాబాలోని లీయోపోల్డ్ కేఫ్‌ను లక్ష్యం చేసుకున్నారు. విచక్షణారహితంగా గుప్పించిన తూటాల జడికి వెచ్చటి నెత్తురు వరద కట్టింది. ప్రాతః సంధ్య కిరణాల వెచ్చదనాన్ని ఆహ్వానిస్తూ కేఫ్‌లో సేద తీరుతున్న పది మంది ప్రాణాలు విడిచారు. ఇదే ఉగ్రవాద ముఠా నగరంలో ఇతర చోట్ల చేసిన దాడుల్లో రక్తం పారి ఏరులయ్యింది. రాక్షసత్వపు హంతక క్రీడలో మొత్తం 166 మంది హతులయ్యారు. మరో 300 గాయపడ్డారు. ఐదేళ్లనాడు తూటాలతో గోడలను జల్లెడ తూట్లుగా మార్చిననాటి పీడ కలను కనపడకుండా పటం కట్టిన పోస్టర్ల వెనుక దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం కేఫ్‌లో న్యూయార్క్‌కు చెందిన సమంతా ఫిలిప్స్ మాట్లాడుతూ‘‘ఐదేళ్ల కింద ఈ కేఫ్ మీద ఉగ్రవాదులు దాడులు చేసినట్లు విన్నాను. ఆనాటి సంఘటన ప్రపంచాన్నే ఒక కుదుపుకుదింపింది. చల్లని సాయం సంధ్యలో స్నేహితులతో సేదతీరాలని వచ్చిన వారు మృత్యువాత పడడం అనేది ఉహించలేని సంఘటన. అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సమయంలో ఇక్కడ అలాంటి ఓ ఘోరం జరిగిన ఆనవాళ్లు అసలు కనిపించడం లేదు’’ అన్నారు. వ్యాపార పర్యటనకు వచ్చిన ఫిలిప్స్ తను ముంబైకి వచ్చిన ప్రతిసారి లీయో కేఫ్‌కు తప్పకుండా వస్తానన్నారు. ప్రేగ్ నుంచి పర్యటకుడిగా వచ్చిన బెంజిమిన్ కోక్స్ తన ముందున్న ప్లేట్లో సెగలు కక్కే కీమా పావ్ తినడానికి ఉపక్రమిస్తూ ‘‘ఈ నగర స్ఫూర్తిని గురించి విన్నాను. అనేక మార్లు ఉగ్రవాదుల దాడులకు లక్ష్యంగా మారిందని తెలుసుకున్నాను. అయితే నెత్తుటి గాయాలెన్ని అయినా తడబాటును వదిలి తలెత్తుకు నిలబడడం తన నైజం అని నిరూపించుకుంది. లీయోపోల్డ్ ఈ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచింది. 2008లో ఇక్కడ మారణకాండ సాగిన ఆనవాళ్లు కూడా కనిపించకుండా తన దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది’’ అంటూ ముగించాడు కోక్స్. ఓ భారతీయ యువ వృతి నిపుణులు బృందం నవ్వుతూ తుళ్లుతూ కేఫ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకూ నవ్వుతూ వచ్చిన ఆ బృందం హఠాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయింది. ముంబై మీద ఉగ్రవాద దాడి జరిగి నేటికి ఐదేళ్లు గడిచిన విషయం స్ఫురణకు వచ్చినట్లుంది. నెమ్మదిగా ఓ చోట కూర్చున్న వీరిలో శాలిని జైన్ మెల్లగా నోరు విప్పింది. నవంబర్ 26 దాడులు ఈ లీయోపోల్డ్కే కాదు మొత్తం ముంబై నగరం మొఖం మీదే ఓ నెత్తుటి గాయంగా నిలిచిపోయింది. నాటి విషాదం విస్మరణీయమే అయినా ప్రజా జీవితం లీయోపోల్డ్లోనూ సాధారణంగా మారినందుకు సంతోషం. ప్రజా జీవితాన్ని కకావికలు చేయడానికి ప్రయత్నించిన ఉగ్రవాదులకు ముఖం మీద గుద్దినట్లు జవాబు చెప్పింది ఈ నగరం’’ నాటి సంఘటనను నేటి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ పలికింది. నాటికీ నేటికి కేవలం ఒకే ఒక మార్పు ప్రఖ్యాత ఇండియాగేట్ నుంచి తాజ్ ప్యాలెస్‌కు సాగే మార్గంలో ఓ పర్మనెంట్ కమెండోలతో కూడిన శాశ్వత పికెట్ ఒకటి ఏర్పాటయింది అని శాలిని ఎత్తి చూపింది. ఎప్పుడూ ప్రయాణికుల కోసం లీయోపోల్డ్ వద్ద ఎదురు చూసే రాంకుశ్వాను పలకరిస్తే ‘‘అదొక భయానక సంఘటన. ఆ రోజు నేను ట్యాక్సీలో కూర్చొని ఉన్నాను. హఠాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. మొదట టపాకాయలు కాలుస్తున్నారనుకున్నా.మరుక్షణం కేఫ్ వైపు చూస్తే ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా కాల్పులు చేస్తుండడం కనిపించింది. అంతటా నెత్తురు చిందింది. నేను నా ట్యాక్సీలోనే నక్కిదాక్కున్నాను. బహుశ అందుకే బతికి బయటపడి ఈ రోజు తిరిగి అదే స్థానంలో నిల్చున్నాను’’ అన్నాడు.