న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన సీనియర్ నాయకులను, ప్రముఖ ముఖ్యమంత్రులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లు ఇంటిలిజెన్స్ రిపోర్టులు వస్తున్నాయి. జైషే ఈ మహ్మద్(జేఈఎమ్) చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం జేఈఎమ్, లష్కర్ ఈ తోయిబా(ఎల్‌ఈటీ)లు కలసి బంగ్లాదేశ్ నుంచి కుట్రను అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు తమ టాస్క్‌ను పూర్తి చేసేందుకు భారత్‌లోకి ప్రవేశించినట్లు కూడా సమాచారం. తక్కువ భద్రతతో తిరుగుతున్న ఓ ప్రముఖ బీజేపీ ముఖ్యమంత్రిని తొలి లక్ష్యంగా ఉగ్ర సంస్థలు నిర్దేశించుకున్నట్లు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన భారత ఇంటిలిజెన్స్ బృందం బంగ్లాదేశ్‌కు చెందిన అధికారుల సాయంతో ఢాకాలోని అనుమానిత ప్రదేశంపై రైడింగ్ జరిపించింది.
అయితే, రైడింగ్‌లో ఎలాంటి సమాచారం దొరకలేదని పేరు తెలుపడానికి ఇష్టపడని ఓ ఇంటిలిజెన్స్ అధికారి వెల్లడించారు. మసూద్ అజర్ మేనల్లుడు(తహ్లా రషీద్)ని కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ కుట్ర జరుగుతోందనే సమాచారం కూడా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment