కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వేధించినందుకు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..దాదాపు పదేళ్ల తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు వేయాలని, ఆయనను నిరాశ్రయులను చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని నానో పటోలే అన్నారు. గత మార్చి నెలలో గుజరాత్ సూరత్ కోర్టు పరవు నష్టం కేసులో దోషిగా తేలుస్తూ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో అనర్హత వేటు, ఆ తర్వాత వెంటనే అధికార నివాసాన్ని ఖాళీ చేయించడం తదితర చర్యలతో రాహుల్‌ని అవమానపరిచారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రజలే తమ ఓట్లతో భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పటానికి కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని నానా పటోలే అన్నారు.
ఈ క్రమంలో శివసేనలో చీలికకు సంబంధించిన వివిధ అంశాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 16 మంది సేన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత నోటీసులపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మాహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేసిన పటోలే రాహుల్ నార్వేకర్ తాను నిర్వహిస్తున్న పదవిని కించపరిచేలా చేయకూడదని హితవు పలికారు.
(చదవండి: ఆ నేత ఎంగేజ్‌మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు)
Comments
Please login to add a commentAdd a comment