nana patole
-
ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 288 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్, శివసేన(ఉద్దవ్)చెందిన కూటమి కేవలం 49 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తీవ్ర ఓటమితో ఇప్పటికే ఖంగుతున్న ఎంవీఏ కూటమిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే సోమవారం రాజీనామా చేశారు. మొత్తం 103 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలిచి 12.42 శాతం ఓట్లు సాధించింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది. ఇక సకోలీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఈ క్రమంలోనే పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా కొట్టింది. మొత్తం మీద 49 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) 10 సీట్లు, కాంగ్రెస్ 16, శివసేన (ఉద్దవ్) 20 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. -
‘మహా’ ఎన్నికలు: బీజేపీపై నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఓబీసీ కమ్యూనిటీ విషయంలో బీజేపీ పార్టీ నేతలు కుక్కలా వ్యవహరిస్తారని మండిమండ్డారు. ఓబీసీలంతా తామేంటో బీజేపీకి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆయన అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘బీజేపీ నేతుతు తమను తాము ‘దేవుళ్లుగా’గా భావిస్తున్నారు. మిమ్మల్నీ కుక్కలుగా భావించే.. బీజేపీకి అకోలా జిల్లా ఓబీసీ ప్రజలు ఓటేస్తారా?. ఇప్పుడు బీజేపీని మీరు(ప్రజులు) కుక్కలా చేసే సమయం వచ్చింది. మహారాష్ట్ర నుంచి బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. బీజేపీ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా విశ్వగురువుగా భావించుకుంటారు. బీజేపీ నేత ఫడ్నవీస్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారు’’ అని మండిపడ్డారు. -
మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు
ముఖ్యమంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం అంశాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో విభేదాలు కనిపిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వీటి మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, మొత్తం 288 స్థానాలకు గానూ తలా 95 స్థానాల్లో పోటీ చేయాలనేది! కానీ ఉద్ధవ్ పార్టీ 150 సీట్లలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఎంవీఏ ముఖ్యమంత్రి ముఖం ఉద్ధవ్ అని ఆయన గ్రూపు ప్రతినిధి వ్యాఖ్యానించడమూ, అలాంటి ముఖం ఏదీ లేదని శరద్ పవార్ అనడమూ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేను ముఖ్యమంత్రి ముఖంగా చెబుతూ పోస్టర్లు వెలియడమూ కూటమి మధ్య జరగనున్న ఘర్షణను సంకేతిస్తున్నాయి.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు సాధించిన అధిక ఓట్ల శాతం, మహారాష్ట్రలో ప్రతిపక్షాల చేతిలో తుపాకి గుండులా పనిచేసింది. అది వారికి ఎంత విశ్వాసాన్ని కలిగించిందంటే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం గురించి, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ గురించి అనేక అంశాలపై పరస్పరం వివాదాలకు దిగుతూ కనిపిస్తున్నారు. ఎంఏవీ భాగస్వాములు ఇటీవల ముంబైలో మీడియా ముందు ఐక్యతా ముఖాన్ని ప్రదర్శించి ఉండవచ్చు; కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు ముంబై వంటి ముఖ్య నగరాల్లోని కీలక నియోజకవర్గాలపై కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు.‘ముఖ్యమంత్రి ముఖం’ ఎవరు?విధాన్ భవన్లో ఈ మంగళవారం కూటమిలో పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన పార్టీ, ఆకస్మికంగా పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్‌ను జూలై 12 నాటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయమని కోరింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం చూస్తే మహా వికాస్ అఘాడీకి కేవలం రెండు సీట్ల కోటా మాత్రమే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ కోటాలో ఒక సీటును ‘పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ)కి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఉద్ధవ్ 12వ తేదీన పోటీని అనివార్యం చేస్తూ తన సొంత అభ్యర్థి ఎంపికతో ముందుకు సాగారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజక వర్గంలో ఉద్ధవ్ తన పార్టీ పోటీ చేస్తుందని పట్టుబట్టారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మల్లయోధుడు చంద్రహర్ పాటిల్‌కు ఉద్ధవ్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ మంచి ఆధిక్యతతో గెలుపొందారు.రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఉద్ధవ్ కోరినట్లు శివసేన–ఉద్ధవ్ గ్రూపు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన కూటమి సమావేశంలో మహావికాస్ అఘాడిలోని ముూడు భాగస్వాములు ఒక్కొక్కటీ 95 స్థానాల్లో పోటీ చేస్తాయని విస్తృత అవగాహన ఉన్నప్పటికీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు 150 నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గత వారం శివసేన ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి పదవికి కూటమి తరపు అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వెంటనే, తమ కూటమిలో సీఎం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించబోమని స్పష్టతనిచ్చారు. ‘‘మేము కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బలంతో ఎన్నికల్లో పోరాడతాం. మా అందరికీ ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రస్తుతానికి సీఎం ముఖం అంటూ ఏమీ లేదు’’ అని శరద్ పవార్ పుణెలో మీడియాతో అన్నారు. ఈ ‘సీఎం ఫేస్’ విషయంపై భిన్నాభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే శరద్ పవార్ కూటమిలో విభేదాలు లేవని చెప్పడమే కాకుండా, ప్రతి విషయంపైనా కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం ఉందని అన్నారు.ఎవరు ఎక్కడ?అలాగే కాంగ్రెస్ పార్టీ, శివసేన– ఉద్ధవ్ ఠాకరే గ్రూపు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లేదా ఎంఎంఆర్ లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలో తమ ఉనికిని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, ఉద్ధవ్ ఇప్పుడు తనకు గరిష్ఠంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సీట్లు కావాలని పట్టుబట్టారు. ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌లలో తమ స్థావరాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, శివసేన–ఉద్ధవ్ గ్రూప్ కొంకణ్, థానే, మరాఠ్వాడా ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; కాంగ్రెస్ పార్టీ విదర్భ ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; ఇకపోతే, శరద్ పవార్ ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేకు చెందిన విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణను మొదలుపెట్టింది.లోక్‌సభ ఎన్నికల సమయంలో సాంగ్లీలో ఏమి జరిగిందో పునరావృతం కాకుండా పశ్చిమ మహారాష్ట్రలో కచ్చితమైన సీట్ల పంపకం గురించి తమ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూపుతో తెర వెనుక కమ్యూనికేషన్ ను ప్రారంభించిందని శరద్ పవార్–ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలూ కెమెరా ముందు పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ, సీట్ల పంపకాల చర్చల కోసం కూర్చున్నప్పుడు కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉందని లోపలి వ్యక్తులు అంటున్నారు. కూటమి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రం ఏమిటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజారిటీని పొందినట్లయితే, అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. విదర్భలో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. కాబట్టి, ‘కాబోయే ముఖ్యమంత్రి ముఖం’ అనే సమస్య కూటమి భాగస్వాములలో కొన్ని చీలికలను, ఒత్తిడిని కలిగిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ చందావర్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఇదే కాంగ్రెస్ సంస్కృతి : కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..ఆపై..
ముంబై: మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో కాళ్లు కడిగించుకోవడమే అందుకు కారణమైంది.నానా పటోలే మహరాష్ట్ర అకోలా జిల్లాలోని వాడేగావ్ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటన ముగించుకుని తిరిగి తన కార్లో కూర్చున్నారు. అయితే ఇటీవలే కురిసిన వర్షాల కారణంగా పటోలే పర్యటించిన ప్రాంతం బురదమయమైంది. బురద కాళ్లను శుభ్రం చేసుకునేందుకు నీళ్లు తేవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తను పురమాయించారు. సదరు కార్యకర్త నీళ్లు తెచ్చి పటోలే పాదాల్ని శుభ్రం చేశారు.ఇదే కాంగ్రెస్ సంస్కృతిపార్టీ కార్యకర్త తన బురద పాదాలను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో నానా పటోలేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అంటూ ముంబై బీజేపీ ట్వీట్లను షేర్ చేసింది. ‘దురదృష్టకరం ఏమిటంటే, పార్టీ కోసం ప్రాణాలను అర్పించే కార్యకర్తలను పదేపదే అవమానిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కార్యకర్తతో తన బురదకాళ్లను కడిగించుకోవడం సిగ్గుచేటు ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? అని ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ చర్యను షేర్ చేస్తూ కాంగ్రెస్ నాయకులది నవాబీ, ఫ్యూడల్ మనస్తత్వం అని దుయ్యబట్టారు.Congress has a Nawabi Feudal Shehzada mindset Maharashtra Congress president Nana Patole's gets his leg and feet washed by a party worker in Akola...They treat Janta and workers like Ghulam & themselves like Kings & QueensImagine how they treat people without coming to… pic.twitter.com/dmzeSUNZxB— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) June 18, 2024 కాంగ్రెస్‌ది ఫ్యూడల్ మనస్తత్వంకాంగ్రెస్ది ఫ్యూడల్ మనస్తత్వం. వారు ఓటర్లను, కార్యకర్తలను బానిసల్లాగా చూస్తారు. తాము రాజులమనుకుంటారు. అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తిస్తే ఒక వేళ అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటారో ఆలోచించండి. అందుకే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి’ అని పూనావాలా అన్నారు.నేను రైతు బిడ్డని కార్యకర్తతో కాళ్లు కడిగించుకున్న ఘటన వివాదం కావడంతో నానా పటోలే స్పందించారు. నేను రైతు బిడ్డను. బురద నాకు కొత్తేం కాదు. కాళ్లకు అంటిన బురద కడుక్కునేందుకు నీళ్లు కావాలని అడిగా.మా కార్యకర్త నీళ్లు తెచ్చారు. ఆయన నీళ్లు పోస్తే నేనే నాకాళ్లను కడుక్కున్నాను’ అని మీడియా సమావేశంలో వెళ్లడించారు. -
పూణె పోర్షే కేసు: ఆస్పత్రి డీన్ ఎక్కడ?
ముంబై: పుణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి సంబంధించి బ్లడ్ శాంపిళ్ల తారుమారు విషయంలో ఓ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్మే డాక్టర్లపై ఒత్తిడి చేశారని సాసూన్ హాస్పిటల్ డీన్ తెలిపారు. బుధవారం హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడారు.‘‘మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి హసన్ ముష్రిఫ్, ఎమ్మెల్యే సునీల్ తింగ్రే.. మెడికల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ అజయ్ తవాడేను నియమించారు. వీరు అధికారపార్టీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు. వారు బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించటం కోసం సోరెన్సిక్ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు’’ అని డీన్ తెలిపారు. శాంపిళ్ల తారుమారుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన మంగళవారం ఈ వ్యవహారంపై రోజంతా విచారణ జరిపించామని హాస్పిటల్ డీన్ వినాయక్ కాలే తెలిపారు. తను కూడా ఈ విషయంపై పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.హాస్పిటల్ డీన్ మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపటం గమనార్హం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు, సరైన నిర్ణయం తీసుకోనందుకే ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.ఇక.. మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయటం కోసం ఇద్దరు డాక్టర్లు అజయ్ తవాడే, శ్రీహరి హర్నర్.. మధ్యవర్తి హాస్పిటల్ ప్యూన్ ద్వారా నిందితుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.3 లక్షల లంచం తీసున్నారని తెలియటంతో వారిని పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక.. బ్లడ్ శాంపిళ్ల తారుమారుపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దర్యాప్తుకు డాక్టర్ పల్లవి సపాలే నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో గ్రాంట్ మెడికల్ కాలేజీ, జేజే గ్రూప్ హాస్పిటల్ డీన్లు సభ్యులుగా ఉన్నారు.ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోల్ ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమ్మెల్యే.. పోలీసులతో టచ్‌లోకి వెళ్లారు. బ్లడ్ శాంపిళ్లను మార్చటం కోసం డాక్టర్లు కూడా ఫోన్ చేశారని పటోల్ ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక.. ప్రముఖ బిల్డర్ అయన మైనర్ తండ్రి కూడా బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయించాలని డాక్టర్ తవాడేకు 14 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం స్పందించారు. ‘ప్రమాదం జరిగినప్పటి నుంచి పుణే పోలీసు కమిషనర్‌తో నేను టచ్‌లో ఉన్నా. ఈ కేసులో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఇప్పటికే ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాను’ అని తెలిపారు. -
పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడు
పూణే: పూణే పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు సంచనాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఈ కారు ప్రమాదంలో నిందితులను తప్పించే అంశంలో ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పూణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉంది. ఆయనే తెర వెనుక చక్రం తిప్పారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఇదంతా సదరు ఎమ్మెల్యే ద్వారానే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఇక, పబ్‌లో నిందితుడు మద్యం సేవిస్తున్నప్పుడు అతడిలో మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను కూడా బయటకు వెల్లడించాలన్నారు. వారికి ఏదైనా పొలిటికల్ సపోర్టు ఉందా? అని ప్రశ్నించారు. ఇక, ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్ర తప్పుబడుతూ సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కూడా కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పుణెలో కారు ప్రమాదంలో మరో విషయం బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో అంశాన్ని గుర్తించారు. ఈ కేసులో భాగంగా రూ.3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని గుర్తించారు. ఈ మొత్తాన్ని తెచ్చిన ఆసుపత్రి ప్యూన్‌ను అరెస్టు చేశారు.అయితే, ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్రే, నిందితుడి తండ్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే నమూనాలను ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారి డీల్ కుదిరింది. కాగా, వైద్య పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడకూడదనే ఇలా చేశారని పోలీసులు తెలిపారు.ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది..కాగా, పటోలే వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆసిఫ్ భామ్లా స్పందించారు. ఈ సందర్భంగా భామ్లా మాట్లాడుతూ.. ఈ కేసులో వైద్యులు ఏదైనా అవకతవకలకు పాల్పడినా లేక ఏదైనా తప్పు జరిగినా ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఒక ఎమ్యేల్యే పోలీసు స్టేషన్‌కు వెళ్లినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని ప్రతిపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయి. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఎవరూ ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
యూటీగా ముంబై.. కాంగ్రెస్ చీఫ్ సంచలన కామెంట్స్
ముంబై: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలో జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే, ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సమావేశాల వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఆయన తెలిపారు. యూటీగా ముంబై! కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని విభజించడంతో పాటు ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలనే ఎజెండాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీతో సహా ఏ పక్షంతో కూడా సంప్రదింపులు చేయకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. అప్పుడెందుకు ప్రత్యేక సమావేశాల్లేవ్.. ఇదే సమయంలో కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కోవిడ్-19 సంక్షోభం, మణిపూర్ హింసాకాండ వంటి అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందన్నారు. అటువంటి నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టి, ఇక్కడి సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిస్తోందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కుట్రలో భాగంగా బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీని తరలించాలనే ప్లాన్‌లో మోదీ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి! -
ముంబైలో జరిగే ‘ఇండియా’ భేటీకి సోనియా
ముంబై: త్వరలో ముంబైలో జరిగే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతల మూడో సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం ఈ విషయం వెల్లడించారు. ఆగస్ట్ 31, సెప్టెంబర్ ఒకటో తేదీల్లో ముంబై శివారులోని ఓ లగ్జరీ హోటల్లో నేతలు భేటీ కానున్నారు. డజనుకుపైగా పార్టీల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఎజెండాపై చర్చించడంతోపాటు ఇండియా కూటమి అధికారిక లోగోను ఖరారు చేయనున్నారు. -
అలా కుట్ర పన్నినందుకే ఓటర్లు బీజేపీకి తగిన పాఠం చెప్పారు!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వేధించినందుకు ఓటర్లు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..దాదాపు పదేళ్ల తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు వేయాలని, ఆయనను నిరాశ్రయులను చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని నానో పటోలే అన్నారు. గత మార్చి నెలలో గుజరాత్ సూరత్ కోర్టు పరవు నష్టం కేసులో దోషిగా తేలుస్తూ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో అనర్హత వేటు, ఆ తర్వాత వెంటనే అధికార నివాసాన్ని ఖాళీ చేయించడం తదితర చర్యలతో రాహుల్‌ని అవమానపరిచారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రజలే తమ ఓట్లతో భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పటానికి కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని నానా పటోలే అన్నారు. ఈ క్రమంలో శివసేనలో చీలికకు సంబంధించిన వివిధ అంశాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 16 మంది సేన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత నోటీసులపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మాహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పనిచేసిన పటోలే రాహుల్ నార్వేకర్ తాను నిర్వహిస్తున్న పదవిని కించపరిచేలా చేయకూడదని హితవు పలికారు. (చదవండి: ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు) -
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. సీఎల్పీ నేత థోరట్ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తీరును నిరసిస్తూ సీఎల్పీ నేత బాలా సాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ పంపారు. నానా పటోలే తనను అవమానాలకు గురి చేస్తున్నారని, తాను బీజేపీలో చేరుబోతున్నాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని థోరట్ ఆరోపించారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ సమావేశాలకు ముందు తనను సంప్రదించడం లేదని తెలిపారు. మహారాష్ట్రలో ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా నానా పటోలే, థోరట్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. థోరట్ బంధువు సత్యజీత్ తాంబేకు టికెట్ కేటాయించకుండా అతని తండ్రి సుధీర్ తాంబేకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో సత్యజీత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తన కొడుకు పోటీలో ఉండటంతో చివరి నిమిషంలో సుధీర్ తాంబే నామినేషన్ సమర్పించలేదు. దీంతో తండ్రీకొడుకులను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వీరిద్దరికీ థోరట్ మద్దతుగా నిలిచారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నానా పటోలే ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి థోరట్ను లక్ష్యంగా చేసుకున్నారని సత్యజీత్ తాంబే ఆరోపించారు. వారంతా పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పారు. చదవండి: అదానీ వ్యవహారం: బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్ -
చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ
ముంబై: దేశంలోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ డిసీజ్‌కు, గత నెలలో కేంద్రం విదేశం నుంచి తీసుకొచ్చిన చీతాలతో ముడిపెడ్డారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. నైజీరియా నుంచి వచ్చిన చీతాల కరాణంగానే లంపీ డిసీజ్ దేశంలో వ్యాపించి వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆరోపించారు. దేశంలోని రైతులకు నష్టం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ చీతాలను తీసుకొచ్చిందని అన్నారు. 'వేరే దేశం నుంచి చీతాలను తీసుకొస్తే దేశంలోని రైతులు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలు పరిష్కారం కావు. ఇవి చాలవన్నట్లు చీతాలు దేశంలోకి వచ్చాక లంపీ డిసీజ్ ప్రబలింది. గతేడాది నష్టానికి పరిహారంగా రైతులకు కేంద్రం రూ.700 చెల్లించాలి. ఈ ఏడాది బోనస్‌గా మరో రూ.1000 ఇవ్వాలి అని పటోలే డిమాండ్ చేశారు. బీజేపీ గట్టి కౌంటర్.. అయితే పటోలే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయనకు కనీసం నైజీరియాకు నమీబియాకు తేడా తెలియదని ఎద్దేవా చేసింది. నానా పటోలే మహారాష్ట్ర రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు వార్తలు, అబద్దాల ప్రచారం కాంగ్రెస్‌కు అలవాటే అని ఏకిపారేసింది. ఈమేరకు బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. Nana Patole who is Rahul Gandhi of Maharashtra says Lumpy Virus originated in Nigeria & it came because Modi ji brought Cheetahs! Cheetahs came from Namibia Does he know Nigeria & Namibia are different nations? Congress has always spread such lies & rumours 1/n — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 3, 2022 కరోనా సమయంలోనూ వ్యాక్సిన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందనని షహ్జాద్ విమర్శించారు. ఫేక్ వార్తలను సృష్టిస్తున్న పటోలేపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. అయితే పటోలే నైజీరియా నుంచి చీతాలను తీసుకొచ్చారని చెప్పడంతో బీజేపీకి మంచి అవకాశం దక్కినట్లయింది. దీన్నే అదనుగా తీసుకుని విమర్శలు గుప్పించింది. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
'మహా' కాంగ్రెస్‌పై రాహుల్ అసంతృప్తి! అసలేం జరుగుతోంది?
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఓ పరిశీలకుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోనియా గాంధీతో సమావేశమైన రోజే పార్టీ అదిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత పటోలే సోనియాను కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. గురువారం జరిగిన ఈ సమావేశం అనంతరం నానా పటోలే ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి, దళిత నేత చంద్రకాంత్ హండోరే ఓడిపోవడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఓటమికి కారణమైన నేతలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. క్రాస్ ఓటింగ్ అనుమానాలు చంద్రకాంత్ పాటిల్ ఓటమిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ హెచ్‌కే పాటిల్‌ను మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ బుధవారం అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. ఈ వ్యవహరంపై మాజీ మంత్రి అసీం ఖాన్.. రాహుల్ గాంధీని కలిసి వివరించారు. పార్టీలో ఈ పరిణామాలపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల డుమ్మాపై ఆగ్రహం సీఎం ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న సోమవారం రోజు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరు కావడంపై ఏఐసీసీ షాక్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ విప్ జారీ చేసినా వీరంతా రాకపోవడంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు సభకు హాజరుకాని వారిలో మాజీ సీఎం అశోక్ చవాన్, మాజీ మంత్రి విజయ్ వడెట్టీవార్ వంటి ముఖ్య నేతలు ఉన్నారు. ముంబైలో ఉండి కూడా విశ్వాస పరీక్ష జరిగే కీలక సమయంలో వీరు సభకు రాకపోవడం తీవ్రమైన విషయమని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. అంతేకాదు ఉద్ధవ్ థాక్రే చివరి క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్, ఒస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాంగ్రెస్ మంత్రులు అభ్యంతరం చెప్పకపోవడంపైనా పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీతోనే మహావికాస్ అఘాడీ(శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నానా పటోలే సోనియాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం షిండే తిరుగుబాటుతో శివసేనలో చీలిక ఏర్పడి ఉద్ధవ్ థాక్రే వర్గం బలహీనపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2014 ముందు నుంచి మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీతోనే ముందుకు సాగాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు -
మార్చి 10 తరువాత ప్రభుత్వంలో పెనుమార్పులు
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో త్వరలో ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే సంకేతాలిచ్చారు. ఆకస్మాత్తుగా పటోలే చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృíష్టించాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో దశలవారీగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు వెలువడగానే మార్చి పదో తేదీ తరువాత పెనుమార్పులు జరుగుతాయని భండార జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో నానా పటోలే వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీలతో చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులను బట్టి పార్టీకి మరమ్మతులు (ప్రక్షాళన) చేయాల్సిన సమయం వచ్చిందని వారు వ్యాఖ్యానించినట్లు పటోలే వివరించారు. దీంతో మార్చి పదో తేదీ తరువాత ఏం మార్పులు జరుగుతాయనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా మార్చి పదో తేదీన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతాయి. ఆ తరువాత బీఎంసీతోపాటు రాష్ట్రంలోని సుమారు 13 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూలు ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. అంతకు ముందే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారుచేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఇటువైపు ఉంది. చదవండి: (వివాహ వేడుకల్లో విషాదం: 11 మంది మృతి.. మోదీ సంతాపం) -
‘మహా’లో కీలక మార్పు.. స్పీకర్ రాజీనామా
ముంబై: మహారాష్ట్రలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడంతోపాటు త్వరలోనే మంత్రి కాబోతున్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తన పదవికి రాజీనామా చేశారు. సంప్రదాయం ప్రకారం స్పీకర్ అనే వ్యక్తి ఏ పార్టీ పదవి అధిరోహించవద్దు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతుండడంతో స్పీకర్ పదవికి రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి మిగతా మిత్రపక్షాలు కూడా అంగీకారం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన కుంబీ సామాజిక వర్గ నేత నానా పటోలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో పార్టీ బలోపేతం కోసం.. తిరిగి పుంజుకోవడానికి బలమైన నాయకుడిగా ఉన్న నానా పటోలేను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక చేయనుంది. దీంతో పాటు రాష్ట్ర మంత్రిగా కూడా ఎన్నికవ్వనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి పటోలే రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీలో అధిష్టానంతో నాయకులు చర్చించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. స్పీకర్‌ను మార్చాలంటే మిగతా రెండు పార్టీలను అంగీకారం ఉండాల్సిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఈ విషయమై శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సంప్రదించగా వారు అంగీకరించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. స్పీకర్ పదవికి పటోలే రాజీనామా లేఖ సమర్పించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే నానా పటోలే రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌తోనే. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి 2014లో భండయా-గోండియా లోక్‌సభ సభ్యుడిగా పటోలే ఎన్నికయ్యారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడంతో బీజేపీ అతడిని బహిష్కరించింది. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికై మహా వికాస్ అఘాడి (శివసేన+ఎన్సీపీ+కాంగ్రెస్) ప్రభుత్వం ఏర్పడగా నానా పటోలే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. -
హిందుత్వని విడిచిపెట్టను
ముంబై: హిందుత్వ ఎజెండాను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు. ‘‘హిందుత్వ భావజాలాన్ని నేను విడిచిపెట్టలేను. నా నుంచి ఎవరూ దానిని దూరం చేయలేరు‘‘అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రెండు, మూడు రోజుల్లోనే ఠాక్రే అసెంబ్లీ సాక్షిగా హిందూత్వపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘హిందు త్వని నిన్న అనుసరించాను. ఇవాళ అనుసరిస్తున్నాను. రేపు కూడా అనుసరిస్తాను’అని చెప్పారు. అర్ధరాత్రి ఏమీ చెయ్యను ఫడ్నవీస్‌పై కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఠాక్రే ప్రసంగం సాగింది. ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ మళ్లీ నేనే వస్తా అన్న నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ‘నేను ఎప్పుడూ మళ్లీ వస్తానని చెప్పలేదు. కానీ ఈ సభకు వచ్చాను. మహారాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను ఒక హామీ ఇస్తున్నాను. రాత్రికి రాత్రి ఏమీ చెయ్యను’ అంటూ ఫడ్నవీస్‌పై సెటైర్లు వేశారు. బీజేపీ–శివసేన మధ్య చీలికలు తేవడానికి ఫడ్నవీస్ ప్రయత్నించి ఉండకపోతే, తాను సీఎంగా గద్దెనెక్కేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ 25 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని, ఎప్పటికీ స్నేహితుడిగానే ఉంటారని చెప్పారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. స్పీకర్‌గా రైతు బిడ్డ మహారాష్ట్ర అసెంబ్లీలో అనూహ్యంగా బీజేపీ స్పీకర్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్ కఠోర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సె పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పటోలెను సాదరంగా తోడ్కొని వచ్చి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. ఒకప్పుడు రైతు నాయకుడిగా పటోలె విశిష్టమైన సేవలు అందించారు. రైతు గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి స్పీకర్ పదవిని అందుకోవడం హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నానా పటోలె 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో విభేదాల కారణంగా 2017లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. విదర్భ ప్రాంతంలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటోలె ఇటీవల ఎన్నికయ్యారు. -
రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలని, ఇందుకోసం పాలకులు సరైన విధానాలను రూపొందించాలని ఏఐసీసీ కిసాన్ సెల్ చైర్మన్ నానాపటోలే అన్నారు. రైతులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నానా పటోలే మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చే వరకు పాలకులను నిద్రపోనివ్వద్దని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా రైతాంగం రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని, కార్పొరేట్ కంపెనీల కోసమే ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతాంగాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైఎస్ హయాంలో 15 రోజులకోసారి సమీక్ష ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ తాను చూసిన ముఖ్యమంత్రుల్లో రైతుల సమస్యలపై 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విదేశాల్లో తిరిగే మోదీ, సచివాలయానికి రాని కేసీఆర్‌ల పాలనలో రైతులు నానాకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావు తదితరులు సదస్సులో రైతులనుద్దేశించి ప్రసంగించారు. సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేశ్‌రెడ్డి, కె.వి.రామారావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట పరిహారం అందిన దాఖలాల్లేవు: భట్టి విక్రమార్క కిసాన్ కాంగ్రెస్ సదస్సులో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తమ హయాంలోనే వ్యవసాయం పండుగలా మారిందని అటు మోదీ, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్న దేశాన్ని ఆహార ధాన్యాలను ఎగుమతిచేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిందని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే రైతులు, రైతు కూలీలు ఈ మాత్రమైనా బతకగలుగుతున్నారని అన్నారు. -
మోదీపై నానా తీవ్ర విమర్శలు
సాక్షి, నాగ్‌పూర్ : సొంత పార్టీ బీజేపీపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పిన నానా పటోలే ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రధాని మోదీ ఓబీసీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓబీసీ కార్డులతో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతూ వారిని కూడా సొంత మేలుకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. రైతులపట్ల బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనంగానే తాను లోక్‌సభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని, ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరి అనుసరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. ప్రతిసారి ఓబీసీలను ఉపయోగించుకుంటున్న మోదీ వారికి చేస్తుంది మాత్రం ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తాను ఒక నీచ జాతి నుంచి వచ్చినట్లు చెప్పుకున్నారు. దీంతోనే తనకు మోదీ ద్వంద్వ వైఖరిపట్ల ఆగ్రహం వేసి ఎంపీ పదవికి రాజీనామా చేశాను. మోదీ చేసిన వాగ్దానాలను అటు కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ నెరవేర్చలేదు' అని ఆయన విమర్శించారు. -
విదర్భలో మందకొడిగా నామినేషన్లు
సాక్షి, ముంబై: విదర్భలో నామినేషన్ల ప్రక్రియ ఇంకా మందకొడిగానే కొనసాగుతోంది. శనివారంతో గడువు ముగియనుండటంతో ఆ రోజే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. కాగా, శుక్రవారం నాగపూర్ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ విలాస్ ముత్తెంవార్, భండారా-గోండియా నుంచి నానా పటోలే నామినేషన్లు దాఖలు చేశారు. అదే విధంగా రాంటెక్ లోకసభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ నామినేషన్ వేశారు. విదర్భలోని పది లోకసభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ పదవ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీని నిమిత్తం మార్చి 15వతేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. శనివారంతో నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియనుంది. 40కి పైగా నామినేషన్లు దాఖలు...? విదర్భలోని పది లోకసభ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మొత్తం 40 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిసిం ది. ఇంకా చాలామంది నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఇక గురువారం వరకు అందిన వివరాల మేరకు మాత్రం 34 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నాగపూర్‌నుంచి ఎనిమిది, రాంటెక్నుంచి నలుగురు, అమరావతి నుంచి ముగ్గురు, వార్దా ఆరుగురు, యావత్మాల్-వాషిం నుంచి అయిదుగురు, గడ్చిరోలి-చిమూర్ ఇద్దరు, అకోలా, బుల్డానాల్లో ఒక్కొక్కరున్నారు. నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న ప్రముఖులు... నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ఆప్ నాయకురాలు అంజలి దమానియా. భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ తదితరులున్నారు. కాగా, ప్రత్యేక విదర్భ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి.