ముంబైలో జరిగే ‘ఇండియా’ భేటీకి సోనియా | Sonia Gandhi to attend INDIA alliance meet in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో జరిగే ‘ఇండియా’ భేటీకి సోనియా

Published Tue, Aug 29 2023 6:10 AM | Last Updated on Tue, Aug 29 2023 6:10 AM

Sonia Gandhi to attend INDIA alliance meet in Mumbai - Sakshi

ముంబై: త్వరలో ముంబైలో జరిగే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతల మూడో సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం ఈ విషయం వెల్లడించారు.

ఆగస్ట్‌ 31, సెప్టెంబర్‌ ఒకటో తేదీల్లో ముంబై శివారులోని ఓ లగ్జరీ హోటల్‌లో నేతలు భేటీ కానున్నారు. డజనుకుపైగా పార్టీల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఎజెండాపై చర్చించడంతోపాటు ఇండియా కూటమి అధికారిక లోగోను ఖరారు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement