
న్యూఢిల్లీ: ముంబైలో ఆగస్ట్‌లో జరగాల్సిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల భేటీ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమిలోని కొందరు నేతలు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నామంటున్నందున ఆగస్ట్ 25, 26వ తేదీల్లో సమావేశం జరక్కపోవచ్చని విశ్వసనీయ వర్గాలంటున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల మొదటి రెండు సమావేశాలు పట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే.