Prospectus
-
‘ఇండియా’ కూటమి భేటీ వాయిదా?
న్యూఢిల్లీ: ముంబైలో ఆగస్ట్‌లో జరగాల్సిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల భేటీ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమిలోని కొందరు నేతలు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నామంటున్నందున ఆగస్ట్ 25, 26వ తేదీల్లో సమావేశం జరక్కపోవచ్చని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల మొదటి రెండు సమావేశాలు పట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. -
ఐపీవోకు మళ్లీ ఫెడ్‌ఫినా రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్(ఫెడ్‌ఫినా) మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూనార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ.. విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ ఫండ్ 5.38 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కాగా.. ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలోనూ ఫెడ్‌ఫినా లిస్టింగ్ కోసం ఫెడరల్ బ్యాంక్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్ల ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్కు ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మళ్లీ ఐపీవోకు టీవీఎస్ సప్లై చైన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్ కంపెనీ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 2 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడం ద్వారా సెబీ నుంచి అదే ఏడాది మే నెలలో లిస్టింగ్‌కు అనుమతి పొందింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఐపీవో యోచనకు స్వస్తి పలికింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందాక గడువు(ఏడాది)లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టకుంటే తిరిగి తాజాగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
గో డిజిట్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ మళ్లీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న కంపెనీ ఉద్యోగుల గుర్తింపు ఆధారిత రైట్స్ స్టాక్ పథకంలో తగిన సవరణలు చేసింది. తద్వారా సెబీకి మరోసారి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న సెబీ మరింత సమాచారాన్ని కోరుతూ 2022 ఆగస్ట్‌లో గో డిజిట్ సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి పంపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎప్రిషియేన్ రైట్స్ పథకం నిబంధనల అమలుపై తొలి ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఆపై ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకంలో సవరణలకు వాటాదారులు, బోర్డు ఆమోదముద్ర వేశాయి. రూ. 1,250 కోట్ల ఈక్విటీ జారీ ఐపీవో అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ ప్రకారం గో డిజిట్ రూ.1,250 కోట్ల ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి అదనంగా 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్తోపాటు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
మెట్రో బ్రాండ్స్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు 2.19 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. మెట్రో, మోచీ, వాక్‌వే తదితర బ్రాండ్ల ఫుట్‌వేర్ కంపెనీ ప్రీఐపీవో ప్లేస్‌మెంట్‌కింద రూ. 10 కోట్లను సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు వెల్లడించింది. 1955లో మెట్రో బ్రాండుతో తొలిసారి ముంబైలో స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు సైతం పెట్టుబడులున్నాయి. 2021 మార్చికల్లా కంపెనీ దేశవ్యాప్తంగా 134 పట్టణాలలో 586 స్టోర్లను నిర్వహిస్తోంది. -
జెట్ ఎయిర్వేస్లో జీతాల రగడ!
న్యూఢిల్లీ: దేశీ ఎయిర్‌లైన్స్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్లో ప్రతిపాదిత జీతాల కోత, ఉద్యోగుల తొలగింపులపై దుమారం చెలరేగుతోంది. జీతాల తగ్గింపు విషయంలో కంపెనీ యాజమాన్యం, పైలట్ల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. వ్యయాలను తగ్గించుకోకపోతే రెండు నెలలకు మించి నడిపే పరిస్థితి లేదంటూ జెట్ యాజమాన్యం తమను బెదిరిస్తోందని పైలట్లు పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, జెట్ ఎయిర్వేస్ దీనిపై శుక్రవారం ఎక్సే్ఛంజీలకు వివరణ ఇచ్చింది. 60 రోజులకు మించి నడిచే పరిస్థితి లేదంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారంటూ స్పష్టం చేసింది. అదేవిధంగా సంస్థలో వాటా విక్రయ ప్రతిపాదనలేవీ లేవని కూడా తేల్చిచెల్పింది. అయితే, వ్యయాలను తగ్గించుకోవడం కోసం పలు చర్యలను అమలు చేస్తున్నామని చెప్పడం కొసమెరుపు!! అసలేం జరిగిందంటే... గత వారంలో పైలట్లు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులతో జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం ఒక సమావేశం ఏర్పాటుచేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కంపెనీ ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, వ్యయాలను తగ్గించుకోవడానికి సహకరించాల్సిందిగా సిబ్బందిని యాజమాన్యం కోరింది. భారీగా జీతాల కోత, కొన్ని విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు వంటి ప్రతిపాదనలను యాజమాన్యం తమ ముందుంచిందని పైలట్ వర్గాలు పేర్కొన్నాయి. రూ. కోటి వరకు వార్షిక వేతన ప్యాకేజీ ఉన్నవారికి 25 శాతం కోత, రూ.12 లక్షల వరకు ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు 5 శాతం కోతను కంపెనీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక పైలట్లకు 17 శాతం మేర వేతన కోత ఉండొచ్చని అంచనా. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్, సీఈఓ వినయ్ దూబే, డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వార్ తదితరులు ఈ భేటీకి హాజరైనట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తక్షణం వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టకపోతే 60 రోజులకు మించి ఎయిర్‌లైన్స్‌ను నడిపే పరిస్థితి లేదంటూ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. దీనికి పైలట్లు, ఇంజినీర్లు ససేమిరా అనడంతోపాటు ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియాకు వెల్లడించడంతో కంపెనీలో గగ్గోలు మొదలైంది. ఈ ఏడాది మార్చి నాటికి జెట్ ఎయిర్వేస్లో 16,558 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 6,306 మంది తాత్కాలిక/క్యాజువల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఉద్యోగుల వేతన బిల్లు ఏడాదికి దాదాపు రూ.3,000 కోట్లుగా ఉంది. తాజా కోత ప్రతిపాదనలతో దాదాపు రూ. 500 కోట్ల మేర ఆదా అవుతుందని కంపెనీ లెక్కలేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.1,040 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, జనరల్ మేనేజర్లు అంతకంటే పెద్ద స్థాయి(సీనియర్ మేనేజ్మెంట్) ఎగ్జిక్యూటివ్‌లకు ఇప్పటికే 25 శాతం వేతన కోతను అమల్లోకి తెచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఏమంటోంది... అధిక ఇంధన వ్యయాలు, నిర్వహణ భారం పెరిగిపోవడంతో వ్యయాల కోతపై దృష్టిపెట్టామని స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ వివరించింది. దీనికోసం పలు చర్యలు అమలు చేస్తున్నామని.. నిర్వహణ సామర్థ్యం పెంపు, సేల్స్–డిస్ట్రిబ్యూషన్, ఉద్యోగులు, మెయింటెనెన్స్ వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. పైలట్లు, ఇంజినీర్లు, ఇతరత్రా ఉద్యోగులందరితో ప్రస్తుతం పరిశ్రమతో పాటు కంపెనీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను చర్చించిన విషయాన్ని ఒప్పుకుంది. అయితే, ప్రతిపాదిత జీతాల కోతపై మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వక పోవడం గమనార్హం. టికెట్ ధరలు తగ్గడం, అధిక ఇంధన వ్యయాలు, రూపాయి విలువ పతనం వంటి పలు అంశాల కారణంగా విమానయాన పరిశ్రమ తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోందని జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, గడిచిన 25 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి విజయవంతంగా తామ వ్యాపారాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. వాటా విక్రయిస్తారా..! జెట్ ఎయిర్వేస్లో ప్రస్తుతం గల్ఫ్‌కు చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటా ఉంది. ఇప్పుడు మరో 20 శాతం వాటాను ఏదైనా అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు విక్రయించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ ఇతరత్రా దిగ్గజాలతో వాటా అమ్మకానికి సంబంధించి జెట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే, ఈ వార్తలను జెట్ యాజమాన్యం ఖండించింది. వాటా విక్రయంపై ఎలాంటి చర్చలూ జరపలేదని అంటోంది. కాగా, కంపెనీలో రాజుకున్న జీతాల రగడ, ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న అనుమానాల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేరు శుక్రవారం బీఎస్ఈలో 9 శాతం మేర కుప్పకూలింది. ఒకానొక దశలో రూ.301 కనిష్టాన్ని తాకింది. చివరకు 7 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. -
పబ్లిక్ ఇష్యూలు ఊరిస్తాయ్..!
• ప్రాస్పెక్టస్ చూశాకే పెట్టుబడి పెట్టాలి • రికమండేషన్లపై ఆధారపడితే అంతే గతి • రిస్కుల నుంచి అప్పుల వరకూ అన్నీ ప్రాస్పెక్టస్‌లో • ఐపీవో రంగు తేల్చటానికి కొన్ని అంశాలు చాలు.. • ధర సహేతుకమా? భవిష్యత్తు బంగారమేనా? కూడా చెప్పొచ్చు ఐపీవో మార్కెట్ మంచి జోరుమీద ఉంది. పేరున్న కంపెనీ, వినూత్న వ్యాపారంతో కూడిన కంపెనీ ఇష్యూ అయితే ఇన్వెస్టర్ల నుంచి ఎన్నో రెట్ల స్పందన ఉంటోంది. లిస్టింగ్‌తోనే మదుపరులను మురిపించి స్వల్ప కాలంలోనే మంచి రిటర్నులందించిన ఐపీవోలు గత రెండేళ్లలో రెండంకెల స్థాయిలో ఉన్నాయి కూడా. కాకపోతే అదే సమయంలో ఇన్వెస్టర్లను నష్టాల పాల్జేసిన ఇష్యూలూ ఉన్నాయ్. నిజానికి ఏ కంపెనీ ఐపీవోకైనా దరఖాస్తు చేసే ముందు... చాలా అంశాలు చూడాలి. ఇవన్నీ వదిలేసి రికమండేషన్లపై ఆధారపడడం అన్ని వేళలా మంచిది కాదు. అందుకే... ఐపీవో నుంచి మంచి ఫలితాలను రాబట్టుకునేందుకు అనుసరించాలన్సిన సూత్రాలేంటో చూద్దాం. ఐపీవోకు వచ్చే ప్రతి కంపెనీ విధిగా సమగ్ర వివరాలతో కూడిన పత్రాన్ని (ప్రాస్పెక్టస్) ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచాలి. చాలా మందికి ఐపీవోలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న ఆసక్తి ఈ ప్రాస్పెక్టస్‌ను చూసేందుకుండదు. నిజానికి ఈ ప్రాస్పెక్టస్ కూడా అంత సరళంగా ఏమీ ఉండదు. 500–600 పేజీలుంటుంది. అయినప్పటికీ కొన్ని కీలక అంశాలను స్పృశించడం ద్వారా ఆ ఐపీవోలో ఇన్వెస్ట్ చేయాలా, వద్దా అన్న నిర్ణయానికి సులభంగానే రావచ్చు. ఇంటర్నల్ రిస్క్స్.. కొత్తగా నిధుల సేకరణకు ఐపీవోకు వస్తున్న కంపెనీ లు తమ వ్యాపారం, సవాళ్ల విషయంలో వాస్తవాలను పూసగుచ్చినట్టు వివరించాల్సి ఉంటుంది. ఈ అంశా న్ని సెబీ సైతం పరిశీలనగా చూస్తుంది. అందుకే ఐపీవోకు వచ్చే కంపెనీలు తమ వ్యాపారానికి పొంచి ఉన్న సవాళ్లు, ప్రతి రిస్క్‌ను ‘రిస్క్ ఫ్యాక్టర్స్’ కాలమ్‌లో సాధ్యమైనంత వివరంగా ఇస్తాయి. కంపెనీ అంతర్గత సవాళ్లు (ఇంటర్నల్ రిస్క్స్) అనేవి ఆ కంపెనీకి మాత్రమే పరిమితం. వెలుపలి సవాళ్లు అనేవి సాధారణమైనవి. ఇటీవల ముగిసిన వరుణ్ బెవరేజెస్ ఐపీవో గుర్తుండే ఉంటుంది. ఈ కంపెనీ తన ప్రాస్పెక్టస్ చిట్టాలో అంతర్గత సవాళ్లను చాలా స్పష్టంగా పేర్కొంది. పెప్సీకో ఇండియాకు వరుణ్ బెవరేజెస్ దేశీయ తయారీ భాగస్వామి. పెప్సీకో ఇండియాతో వరుణ్ బెవరేజెస్‌కు ఉన్న అనుబంధం 17 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితం. అలాగే, ఈ ఒప్పందం కాల వ్యవధి కూడా పదేళ్ల వరకే. అంటే 2022తో పూర్తవుతుంది. పైగా ఈ ఫ్రాంచైజీ ఒప్పందం వరుణ్ బెవరేజెస్ సొంతం కాదు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కులు పెప్సీకో ఇండియాకు ఉన్నాయి. వీటన్నిం టినీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే మదుపరులు చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసు కోవాలి. అందుకేనేమో వరుణ్ బెవరేజెస్ ఐపీవోకు స్పందన అం తంత మాత్రంగానే వచ్చింది. అధిక ధరలో ఉందా..? పబ్లిక్ ఆఫర్లో భాగంగా ఒక్కో షేరు ధరను చాలా ఎక్కువగా నిర్ణయించారా? అన్నది తెలుసుకోవడం అవసరం. ముఖ విలువకు ఎన్ని రెట్లు అధికంగా నిర్ణయించారు? కంపెనీలో పెద్ద షేర్ హోల్డర్లుగా ఉన్న వారు లోగడ ఏ ధరకు కొనుగోలు చేశారన్న వివరాలు ఇందుకు కీలకంగా పరిగణించవచ్చు. గతంలో షేర్ల కొనుగోళ్ల వివరాలు ‘కేపిటల్ స్ట్రక్చర్’ అనే సెక్షన్లో ‘బిల్డ్ అప్ ఆఫ్ ప్రమోటర్ హోల్డింగ్స్’ అనే విభాగంలో ఉంటాయి. ఇటీవలి ఐపీవోకు వచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాస్పెక్టస్‌లో ఆ కంపెనీ గతంలో ఇన్వెస్టర్లకు ఏ ధరకు షేర్లను కేటాయించిందన్న వివరాలను పేర్కొంది. 2015 డిసెంబర్, 2016 మార్చిలో అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు, సింగపూర్‌కు చెందిన టెమసెక్ హోల్డింగ్స్‌కు ఒక్కో షేరును రూ.226.30కు కేటాయించింది. తాజాగా ఐపీవోలో ఒక్కో షేరును రూ.334కు విక్రయించింది. అంటే ఈ ధరకంటే 33 శాతం తక్కువకే గతంలో ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్టు అర్థమవుతోంది. ఇష్యూ ధరకు ఆధారం... ఇన్వెస్టర్ల చేతులు కాల్చిన ఐపీవోల గురించి కూడా తెలిసే ఉంటుంది. ఆయా కంపెనీలు వ్యాపార పరంగా సమస్యలు ఎదుర్కోవడం వల్లే ఇలా జరిగిందనుకోవడానికి లేదు. షేర్లను అధిక ధరలో కొనుగోలు చేయడం ఇందుకు ప్రధాన కారణం. ప్రతి కంపెనీ తన ప్రాస్పెక్టస్‌లో ఇష్యూ ధర ఖరారుకు ఆధారంగా కొన్ని వివరాలు ఇస్తుంటాయి. కొన్ని సరళంగా ఇస్తే... మరికొన్ని చాంతాడంత సమాచారాన్ని ఇస్తాయి. ‘అందుకే బేసిస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్’ విభాగాన్ని తప్పకుండా చూడాలి. అంత తీరిక లేకుంటే కనీసం ఇష్యూకు వస్తున్న కంపెనీ తాజా ఈపీఎస్ (ఒక్కో షేరు వారీ ఆర్జన) ఎంతుందన్నది, బుక్‌వేల్యూ వివరాలు తెలుసుకున్నా అంచనాకు రావచ్చు. సంబంధిత రంగం గురించి కూడా ఎక్కువ వృద్ధికి అవకాశమున్న బ్యాంకింగ్ వంటి రంగాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన శ్రమ ఉండదు. కానీ, పబ్లిక్ ఇష్యూకు వస్తున్న కంపెనీ పెద్దగా తెలియని రంగంలో పనిచేస్తుందనుకోండి. అప్పుడెలా..? ‘ఇండస్ట్రీ ఓవర్ వ్యూ’ సెక్షన్ ఈ విధమైన సందేహాలను తీర్చే విభాగం. కంపెనీ పనిచేస్తున్న రంగానికి సంబంధించి వృద్ధికి అవకాశాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఈ విభాగంలో ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలా? వద్దా అన్నది నిర్ణయించుకోవడానికి ఇది కీలకంగా ఉపకరిస్తుంది. ఇటీవల ఐపీవోకు వచ్చిన గ్రీన్ సిగ్నల్ బయో ఫార్మా ప్రాస్పెక్టస్ చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఈ కంపెనీ బీసీజీ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కోసం ప్రభుత్వం బీసీజీ వ్యాక్సిన్లను కేవలం రెండు కంపెనీల నుంచే సేకరిస్తుండగా... అందులో గ్రీన్‌సిగ్నల్ బయో ఫార్మా ఒకటి. మరొకటి సెరమ్ ఇనిస్టిట్యూట్. ప్రపంచ ఆరోగ్య సంస్థకు బీసీజీ టీకాల సరఫరాకు అర్హత సాధించిన కంపెనీల్లోనూ గ్రీన్ సిగ్నల్ కూడా ఒకటని కంపెనీ ఐపీవో పత్రాల్లో పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్ ట్రాక్ రికార్డు చివరగా మర్చంట్ బ్యాంకర్ల ట్రాక్ రికార్డు కూడా ఐపీవో ఇన్వెస్ట్‌మెంట్‌కు కీలకమైనది. ‘అదర్ రెగ్యులేటరీ డిస్క్లోజర్స్’ అనే విభాగంలో మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ఉంటుంది. సదరు మర్చంట్ బ్యాంకర్ అంతకుముందు ఏడాది కాలంలో నిర్వహించిన ఐపీవోల షేర్ల ధరల పనితీరు ఎలా ఉందన్న సమాచారం ఇక్కడ లభిస్తుంది.