న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ మళ్లీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న కంపెనీ ఉద్యోగుల గుర్తింపు ఆధారిత రైట్స్ స్టాక్ పథకంలో తగిన సవరణలు చేసింది.
తద్వారా సెబీకి మరోసారి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న సెబీ మరింత సమాచారాన్ని కోరుతూ 2022 ఆగస్ట్‌లో గో డిజిట్ సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి పంపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎప్రిషియేన్ రైట్స్ పథకం నిబంధనల అమలుపై తొలి ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఆపై ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకంలో సవరణలకు వాటాదారులు, బోర్డు ఆమోదముద్ర వేశాయి.
రూ. 1,250 కోట్ల ఈక్విటీ జారీ
ఐపీవో అప్‌డేటెడ్ ప్రాస్పెక్టస్ ప్రకారం గో డిజిట్ రూ.1,250 కోట్ల ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి అదనంగా 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్‌తోపాటు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment