Go Digit
-
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
గో డిజిట్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ మళ్లీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న కంపెనీ ఉద్యోగుల గుర్తింపు ఆధారిత రైట్స్ స్టాక్ పథకంలో తగిన సవరణలు చేసింది. తద్వారా సెబీకి మరోసారి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న సెబీ మరింత సమాచారాన్ని కోరుతూ 2022 ఆగస్ట్‌లో గో డిజిట్ సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి పంపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎప్రిషియేన్ రైట్స్ పథకం నిబంధనల అమలుపై తొలి ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఆపై ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకంలో సవరణలకు వాటాదారులు, బోర్డు ఆమోదముద్ర వేశాయి. రూ. 1,250 కోట్ల ఈక్విటీ జారీ ఐపీవో అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ ప్రకారం గో డిజిట్ రూ.1,250 కోట్ల ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి అదనంగా 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్తోపాటు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. -
గో డిజిట్ ఐపీవోకు బ్రేక్
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ బీమా సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీవో ప్రణాళికలకు సెబీ చెక్ పెట్టింది. ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. దీంతో అవసరమైన తాజా సమాచారాన్ని జత చేస్తూ ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. వెరసి కెనడియన్ కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ 2022 ఆగస్ట్‌లో సెబీకి తొలుత ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. వీటి ప్రకారం ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్క శర్మకు వాటాలున్న సంగతి తెలిసిందే. కంపెనీ మోటార్, ట్రావెల్, హెల్త్, ప్రాపర్టీ తదితర పలు బీమా ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది.