Fairfax
-
ఐడీబీఐపై ఫెయిర్‌ఫాక్స్ కన్ను
ముంబై: పీఎస్‌యూ.. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి కెనడియన్ పీఈ దిగ్గజం ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రూపేణా చెల్లించేందుకు డీల్ కుదుర్చుకోవడం ద్వారా బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఫెయిర్‌ఫాక్స్ అధినేత బిలియనీర్ ప్రేమ్ వత్సా ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం కొనుగోలు తదుపరి సైతం బ్యాంక్ గుర్తింపును కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలపనుంది. రెండు వారాల క్రితమే ఆర్థిక శాఖకు ఫెయిర్‌ఫాక్స్ తాజా ప్రతిపాదనలు చేరాయి. నిజానికి షేర్ల మారి్పడి ద్వారా బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇందుకు సన్నద్ధంగా లేదు. దీంతో నగదు చెల్లింపును ఫెయిర్‌ఫాక్స్ తెరపైకి తీసుకువచి్చంది. కెనడా, భారత్‌ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్బీ విలీనం దేశీయంగా సీఎస్బీ బ్యాంక్‌కు ఫెయిర్‌ఫాక్స్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఐడీబీఐను సొంతం చేసుకుంటే సీఎస్బీ ప్రమోటర్‌గా కొనసాగేందుకు వీలుండదు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక ఇన్వెస్టర్ రెండు బ్యాంకులకు ప్రమోటర్‌గా వ్యవహరించేందుకు అనుమతి లభించదు. వెరసి ఐడీబీఐలో సీఎస్బీ బ్యాంకును విలీనం చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 90,440 కోట్లుకాగా.. సీఎస్బీ విలువ రూ. 6,000 కోట్లు మాత్రమే. కొంతకాలం ఐడీబీఐను విడిగా కొనసాగించాక తదుపరి దశలో సీఎస్బీ బ్యాంకులో విలీనం చేసేందుకు గతంలో ఫెయిర్‌ఫాక్స్ ప్రతిపాదించింది. అయితే విస్తారిత కార్యకలాపాలు కలిగిన ఐడీబీఐ బ్యాంక్ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ప్రతిపాదనలను తాజాగా సవరించింది. ఐడీబీఐ బ్యాంకులో సీఎస్బీ విలీనానికి ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి సమ్మతిని పొందే ప్రయత్నాల్లో ఉంది. వాటా విక్రయానికి ప్రభుత్వం తెరతీశాక ఐడీబీఐ బ్యాంక్ షేరు రూ. 60 నుంచి రూ. 84 వరకూ బలపడింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐపై కన్నేసిన కొటక్ మహీంద్రా బ్యాంక్.. సవరించిన ఆఫర్ ద్వారా ఫెయిర్‌ఫాక్స్‌కు చెక్ పెడుతుందా లేదా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
గో డిజిట్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ మళ్లీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న కంపెనీ ఉద్యోగుల గుర్తింపు ఆధారిత రైట్స్ స్టాక్ పథకంలో తగిన సవరణలు చేసింది. తద్వారా సెబీకి మరోసారి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న సెబీ మరింత సమాచారాన్ని కోరుతూ 2022 ఆగస్ట్‌లో గో డిజిట్ సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి పంపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎప్రిషియేన్ రైట్స్ పథకం నిబంధనల అమలుపై తొలి ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఆపై ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకంలో సవరణలకు వాటాదారులు, బోర్డు ఆమోదముద్ర వేశాయి. రూ. 1,250 కోట్ల ఈక్విటీ జారీ ఐపీవో అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ ప్రకారం గో డిజిట్ రూ.1,250 కోట్ల ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి అదనంగా 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్తోపాటు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. -
సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన హీరోయిన్
ఆసక్తికరమైన వ్యవహారంలో తీర్పు వెలువడింది. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జానీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు అంబర్ హర్డ్‌కు జరిమానా విధించింది కోర్టు. పైగా ఆమె ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది కోర్టు. వర్జీనీయాలోని ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నటుడు జానీ డెప్(58), అతని మాజీ భార్య అంబర్ హర్డ్(36) ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ పేర్కొంటూనే.. డెప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ ఇచ్చిన తీర్పుతో కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్పష్టమైన వాదనలు, పోటాపోటీ ఆరోపణల(సంచలన)తో ఆరు వారాలపాటు సాగింది విచారణ. బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించిన జ్యూరీ.. నటి అంబర్ హర్డ్ తన మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్ల(తర్వాత దానిని 13.5 మిలియన్ డాలర్లకు కుదించింది) పరిహారం చెల్లించాలని తెలిపింది. 2018లో ఆమె రాసిన సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ ఒకటి.. జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం అంబర్ బోరున ఏడ్చేసింది. తన గుండె బద్ధలైందని, నిరాశ చెందానని, ఈ తీర్పు తనకే కాదని.. మహిళలందరికీ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించింది. కేవలం తన పరపతితోనే తన మాజీ భర్త నెగ్గాడంటూ ఆరోపణలు చేసింది ఆమె. ఇదిలా ఉంటే జానీ డెప్ పేరును ప్రస్తావించకుండానే.. వైవాహిక జీవితపు హింస గురించి.. 2018లో ఆమె ది వాషింగ్టన్ పోస్టులో ఒక కథనం రాసింది. దాని ఆధారంగా 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2019 ఫిబ్రవరిలో కోర్టుకు ఎక్కాడు పైరెట్స్ ఆఫ్ కరేబియన్ నటుడు. అంతేకాదు ఆమె తనకు నరకం చూపించేదని, అవమానించేదని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో(ఎలన్ మస్క్)తో ఎఫైర్ నడిపించిందని, అదే ఆమెను ప్రభావితం చేసిందని దావాలో ఆరోపించాడు. ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్.. ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది ఆమె. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం(జూన్ 1) తీర్పు జానీ డెప్‌కు అనుకూలంగానే వచ్చినా.. అంబర్ హర్డ్ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్‌కు ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్ కోర్టు. నా జీవితం నాకు దక్కింది కోర్టు తీర్పు పట్ల ‘జాక్ స్పారో’ జానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అనుకూలంగా రావడంతో.. జానీ డెప్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇది వాళ్ల వాళ్ల కెరీర్‌ను సైతం దెబ్బ తీయడం గమనార్హం. -
అమెరికాలో ఎన్నారైకు జైలు
వాషింగ్టన్: మోసం కేసులో భారత సంతతికి చెందిన తార్సెమ్ సింగ్ అనే వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. వర్జినియాలోని ఫెయిర్ ఫాక్స్ లో నివాసముంటున్న 61 ఏళ్ల తార్సెమ్ సింగ్ వ్యాపారం పేరుతో 6 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డాడు. 2000-2009 మధ్య కాలంలో తార్సెమ్ సింగ్, అతడి భార్య నిర్మాణ కంపెనీ పెట్టి పలు కాంట్రాక్టులు దక్కించుకుని మోసం చేశారు. ఈ కేసులో గతేడాది డిసెంబర్లో కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. ఇప్పుడు శిక్ష ఖరారు చేసింది. అతడికి 15 నెలల కారాగార శిక్షతో పాటు 25 వేల డాలర్ల జరిమానా విధించింది. 119,165 డాలర్లు తిరిగి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మూడేళ్ల పాటు అతడిని కనిపెట్టి చూస్తుండాలని పోలీసులకు సూచించింది. శిక్ష ముగిసిన తర్వాత సమాజసేవ చేయాలని తార్సెమ్ సింగ్ ను కోర్టు ఆదేశించింది.