వాషింగ్టన్: మోసం కేసులో భారత సంతతికి చెందిన తార్సెమ్ సింగ్ అనే వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. వర్జినియాలోని ఫెయిర్ ఫాక్స్ లో నివాసముంటున్న 61 ఏళ్ల తార్సెమ్ సింగ్ వ్యాపారం పేరుతో 6 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డాడు. 2000-2009 మధ్య కాలంలో తార్సెమ్ సింగ్, అతడి భార్య నిర్మాణ కంపెనీ పెట్టి పలు కాంట్రాక్టులు దక్కించుకుని మోసం చేశారు.
ఈ కేసులో గతేడాది డిసెంబర్లో కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. ఇప్పుడు శిక్ష ఖరారు చేసింది. అతడికి 15 నెలల కారాగార శిక్షతో పాటు 25 వేల డాలర్ల జరిమానా విధించింది. 119,165 డాలర్లు తిరిగి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మూడేళ్ల పాటు అతడిని కనిపెట్టి చూస్తుండాలని పోలీసులకు సూచించింది. శిక్ష ముగిసిన తర్వాత సమాజసేవ చేయాలని తార్సెమ్ సింగ్ ను కోర్టు ఆదేశించింది.
అమెరికాలో ఎన్నారైకు జైలు
Published Fri, Jul 8 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement
Advertisement