అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి | Heavy Rainfall And Flash Flooding In USA States | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి

Published Mon, Feb 17 2025 10:43 AM | Last Updated on Mon, Feb 17 2025 10:50 AM

Heavy Rainfall And Flash Flooding In USA States

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షంతో పాటుగా భారీ గాలులు వీస్తున్న కారణంగా పలు భవనాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయిన‍ట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.)

అమెరికాలో భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డ్‌ స్థాయిలో వర్షం కురిసింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.

అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. వర్జీనియా(#Virginia), పశ్చిమ వర్జీనియా, టేనస్సీలో కూడా వరదలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. కొద్దిరో​జుల పాటు వర్షాలు, భారీ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్‌ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్‌ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్‌ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement