న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్(ఫెడ్‌ఫినా) మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూనార్త్ ఫండ్ వీఐ ఎల్‌ఎల్‌పీ.. విక్రయానికి ఉంచనున్నాయి.
వీటిలో ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ ఫండ్ 5.38 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కాగా.. ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలోనూ ఫెడ్‌ఫినా లిస్టింగ్ కోసం ఫెడరల్ బ్యాంక్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్ల ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్‌కు ప్రణాళికలు వేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment