preliminary
-
Tania Zeng: జెంగ్ సైరన్
‘కొన్ని విజయాలు కూడా పరాజయాలే. కొన్ని పరాజయాలు కూడా విజయాలే’ నిజమే! ఆటలోని పరాజితులు లోకం దృష్టిగా పెద్దగా రారు. అయితే టానియా జెంగ్ పరిస్థితి వేరు. ఈ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణీ ప్రిలిమినరీ రౌండ్లోనే వైదొలగినా... ఆమె విజేతగానే వెలిగి΄ోయింది. దీనికి కారణం ఆమె వయసు. 58 సంవత్సరాల వయసులో తన ఒలింపిక్ కలను నిజం చేసుకున్న చైనీస్ – చిలీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టానియా జెంగ్ సంచలనం సృష్టించింది....తల్లి టేబుల్ టెన్నిస్ కోచ్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆ ఆటపై జెంగ్‌కు ఆసక్తి ఏర్పడింది. బడిలో కంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కనిపించిందే ఎక్కువ. అక్కడ ఎంతోమందిప్రొఫెషనల్ ప్లేయర్స్‌తో మాట్లాడే అవకాశం దొరికింది.వారితో మాట్లాడడం అంటే... ఆటల పాఠాలు నేర్చుకోవడమే!తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి టేబుల్ టెన్నిస్‌లో జెంగ్‌కు తల్లి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. 11 ఏళ్ల వయసులో ఎలిట్ స్పోర్ట్స్ అకాడమీలో చేరింది జెంగ్. పన్నెండేళ్ల వయసులోప్రొఫెషనల్ ప్లేయర్ అయింది. నేషనల్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. పదహారు సంవత్సరాలకు చైనీస్ టేబుల్ టెన్నిస్ టీమ్‌లో చోటు సంపాదించింది. ప్రామిసింగ్ ప్లేయర్’గా పేరు తెచ్చుకుంది.‘అంతా ఓకే’ అనుకొని ఉంటే జెంగ్ ప్రయాణం మరోలా ఉండేది. అయితే ఆ సమయంలో టేబుల్ టెన్నిస్‌కు సంబంధించి నిబంధనలు ఏవో మార్చడం జెంగ్‌కు చిరాకు తెప్పించింది. ఆ చిరాకు కోపంగా మారి తనకు ్రపాణసమానమైన టేబుల్ టెన్నిస్‌కు దూరం అయింది.కొంత కాలం తరువాత...తనకు అందిన ఆహ్వానం మేరకు చిలీలో స్కూల్ పిల్లల టేబుల్ టెన్నిస్ కోచ్‌గా కొత్త ప్రయాణం ్రపారంభించింది. జియాంగ్ జెంగ్ పేరు కాస్తా టానియా జెంగ్గా మారింది. ‘జెంగ్’ తాను పుట్టిపెరిగిన చైనా అస్తిత్వం. ‘టానియ’ తనకు ఎంతో ఇష్టమైన, కొత్త జీవితాన్ని ఇచ్చిన చిలీ అస్తిత్వం.తన కుమారుడికి టేబుల్ టెన్నిస్‌లో కోచింగ్ ఇస్తున్న సమయంలో పోటీలలో పాల్గొనాలనే ఉత్సాహం జెంగ్లో మొదలైంది. 2004, 2005 నేషనల్ లెవల్ టోర్నమెంట్స్‌ను గెలుచుకుంది.టేబుల్ టెన్నిస్‌లో చూపించే అద్భుత ప్రతిభాపాటవాలతో చిలీ మీడియా ఎట్రాక్షన్‌గా మారింది జెంగ్. ఆమె ఆట ఆడే తీరు చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌కు ఎంతో ఇష్టం.ఎప్పటి నుంచో నేస్తంగా ఉన్న ‘విజయం’ ఒలింపిక్స్‌లో ముఖం చాటేసినా... జెంగ్ ముఖంలోని వెలుగు తగ్గలేదు. అదేపోరాట స్ఫూర్తి! కుమార్తెను ఒలింపిక్స్‌లో చూడాలనేది 92 సంవత్సరాల తండ్రి కల. ఆ కలను నిజం చేసి తండ్రి కళ్లలో వెలుగు నింపింది జెంగ్.‘గో ఎట్ ఇట్, గో విత్ ఎవ్రీ థింగ్’ అంబరాన్ని అంటే సంతోషంతో అంటున్నాడు ఆ పెద్దాయన.‘ఒలింపిక్ గ్రాండ్ మదర్’‘కమ్ బ్యాక్ క్వీన్’... ఇలా రకరకాల కాప్షన్లతో జెంగ్ గురించి సోషల్ మీడియాలో గొప్పగాపోస్టులు పెడుతున్నారు నెటిజనులు.‘ఒలింపిక్స్ అనేది నా జీవితకాల కల. క్వాలిఫై అవుతానని ఊహించలేదు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. విరివిగా ఆటలు ఆడాలనే ఉత్సాహం పెరిగింది’ అంటుంది టానియ జెంగ్.వివిధ ్రపాంతాలకు కుమారుడు ఒంటరిగాపోటీలకు వెళ్లే సమయానికి జెంగ్ టెన్నిస్ రాకెట్‌కు దూరం అయింది. సుదీర్ఘ విరామం తరువాత రీజినల్ టోర్నమెంట్స్ కోసం మళ్లీ రాకెట్ పట్టింది. మళ్లీ విజయపరంపర మొదలైంది. 2023 పాన్ అమెరికన్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకోవడంతో చిలీలో జెంగ్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఒలిపింక్స్ 2024కు క్వాలిఫై కావడంతో జెంగ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశాంతం
సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్ కమిషన్ తెలిపింది. సెల్‌ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. స్థానిక క్విస్ కాలేజిలోని 121701 వెన్యూకోడ్‌లో హాల్ టికెట్ నంబర్ 121100538 ఉన్న ఒక అభ్యర్ధి ఐఫోన్‌తో ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ తీసుకునేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా ఆ అభ్యర్థి వాదనకు దిగాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలపగా ఆయన వచ్చి ఫోన్ తీసుకునేందుకు ప్రయ తి్నంచడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అదే సమయానికి పరీక్ష కేంద్రాల తనిఖీకి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వచ్చారు. దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించారు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులు -
ఐపీవోకు మళ్లీ ఫెడ్‌ఫినా రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్(ఫెడ్‌ఫినా) మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూనార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ.. విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ ఫండ్ 5.38 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కాగా.. ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలోనూ ఫెడ్‌ఫినా లిస్టింగ్ కోసం ఫెడరల్ బ్యాంక్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్ల ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్కు ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ పోటీల్లో అందాల భామల సందడి (ఫొటోలు)
-
వారాంతంలో గ్రూప్–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ వారాంతంలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వేగవంతం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత స్కానింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి శనివారం నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తి! ఈనెల 16న పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్‌కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. శుక్రవారం నాటికి స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. చదవండి: కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..! -
‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యక్తి , నేరస్తుడిగా ప్రకటితమైన వ్యక్తి ముందస్తు బెయిలుకు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం కేసులో పట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. వ్యాపార లావాదేవీల్లో మోసం చేసిన కేసు కావడంతో నిందితుడు ముందస్తు బెయిలుకు అర్హుడని హైకోర్టు భావించిందని తెలిపింది. అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ 406 (నేర ఉల్లంఘన), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 470 (నకిలీ డాక్యుమెంట్లు) ప్రకారం నేరాలు జరిగి ఉండొచ్చు. కేసులో ఆరోపణల స్వభావం పరిశీలించాలి. వ్యాపార లావాదేవీల నుంచే ఆరోపణ అని భావించరాదు’’ అని పేర్కొంది. నిందితుడిపై మేజిస్టేట్ కోర్టులో ఛార్జిషీటు నమోదైందని గుర్తుచేసింది. -
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెన్నై: ఆసియా ఆన్లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్‌పై... ఎనిమిదో మ్యాచ్‌లో 2.5–1.5తో కజికిస్తాన్‌పై... తొమ్మిదో మ్యాచ్‌లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్‌తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిస్తాన్‌తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి. -
కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, రూ. 25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్వేశ్వర్‌రెడ్డిని విచారించాలనుకుంటే, ఆయనకు నోటీసు జారీచేసి విచారణకు హాజరు కావాలని కోరవచ్చునని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై ఈ కేసు నమోదైందని తెలిపారు. పోలీసులే మొదట పిటిషనర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని, దీనిపై ఆయన ఫిర్యా దు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఆ తరువాత గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై మాత్రం స్పందించి, పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్నారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన పోలీసులనే నిర్భంధించి హిం సించారని తెలిపారు. ఈ కేసులో తాము అరెస్ట్ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేవలం ఆందోళనతోనే పిటిషనర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, విశ్వేశ్వర్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. -
జెట్ డీల్‌కు రంగం సిద్ధం
సాక్షి, ముంబై: గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన టాటాసన్స్, జెట్‌డీల్‌కు రంగం సిద్ధమైంది. ఈ వార్తలను ధృవీకరించిన టాటా సన్స్ ఈ కొనుగోలు సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన టాటా సన్స్‌బోర్డు ఆమోదం తెలిపిందనీ అయితే ఇంతరవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బోర్డు సభ్యులందరూ సమావేశ ముగింపు తర్వాత విలేఖరులతో మాట్లాడడానికి నిరాకరించారు. తాజా పరిణామంతో జెట్ ఎయిర్వేస్ కొనుగోలు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తలు ఇటీవల మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైందని మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఇరుక్కున్న జెట్ ఎయిర్వేస్ను కాపావాలని టాటా సన్స్‌ను ప్రభుత్వం కోరిందని బ్లూమ్‌బెర్గ్ వ్యాఖ్యానించింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ సుముఖంగా ఉన్నప్పటికీ, సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మాత్రం కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చినట్లు మరో కథనం. కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా, జెట్‌కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన టాటా సన్స్ బోర్డు సమావేశం టాటా-జెట్ డీల్ పై అంచనాలను మరింత పెంచింది. మరోవైపు ఇవి పూర్తిగా ఊహాజనిత వార్తలని నిన్న (గురువారం) జెట్ ఎయిర్వేస్ కొట్టిపారేసింది. దీనిపై ఎలాంటి చర్చలూ,నిర్ణయాలు లేవని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా జెట్ ఎయిర్‌వెస్‌లో అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ 24శాతం వాటా ఉండగా ఉండగా, వ్యవస్థాపకుడు గోయల్‌కు 51 శాతం వాటా ఉంది. -
నేడు ఏపీపీఎస్సీ ప్రిలిమినరి పరీక్ష
- దరఖాస్తుదారులు 3,663 మంది - ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష - కర్నూలులో 7 సెంటర్లు ఏర్పాటు కర్నూలు(అగ్రికల్చర్): అసిస్టెంట్ బీసీ, ట్రైబల్, సోషల్ వెల్పేర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఆదివారం ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్షకు 3,663 మంది హాజరుకానున్నారు. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు మరళీమోహన్, నాగరాజు తెలిపారు. కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు తహసీల్దార్లను లైజన్ ఆఫీసర్లుగా, ప్రతి సెంటరుకు ఒక డిప్యూటీ తహసీల్దారును అసిస్టెంటు లైజన్ ఆఫీసర్‌గా నియమించారు. కర్నూలులో సెయింట్ జోషప్ డిగ్రీ కళాశాల, మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం హైస్కూల్, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల, బి.క్యాంపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(ఫర్ మెన్), శ్రీకృష్ణ జూనియర్ కళాశాల, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ సూళ్లలో మొత్తంగా 7 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9.45 తర్వాత అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. -
రేపు 20 సెంటర్లలో ప్రిలిమినరీ పరీక్ష
పకడ్బందీ నిర్వహణకు ఏర్పాట్లు నిమిషం ఆలస్యమైన అనుమతించం డీఆర్ఓ గంగాధర్ గౌడ్ కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు–1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 7వ తేదీ (ఆదివారం) జరుగనుంది. ఈ పరీక్షకు 9258 మంది హాజరు కానున్నారు. పరీక్ష కోసం కర్నూలు నగరంలో 20 సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుంది.. ఈ సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంటు లైజన్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు మాట్లాడుతూ... పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు మొదలవుతుందని, అభ్యర్ధులను 10.15 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమన్నారు. కర్నూలు, కల్లూరు, నందికోట్కూరు, డోన్, పగిడ్యాల తహశీల్దార్లను లైజన్ అధికారులుగా నియమించామని తెలిపారు. ప్రతి సెంటరుకు ఓ డిప్యూటీ తహసీల్దారును సిట్టింగ్ స్క్వాడ్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ స సెక్షన్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు విధిగా హాల్ టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకరావాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, పరీక్షల సూపరింటెండెంటు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎస్ఐ ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష
– ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ – పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు – నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ కర్నూలు : పోలీసు శాఖలో ఎస్ఐ ఎంపికకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఎస్ఐ పోస్టులకు మొత్తం 15,622 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పరీక్ష నిర్వహణకు కర్నూలు నగరంలో మొత్తం 26 సెంటర్లలో ఏర్పాట్లను పూర్తి చేశారు. బయోమెట్రిక్ హాజరుతో పరీక్షకు అనుమతించనున్నారు.అభ్యర్థులు ఉదయం 9 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఏడుగురు సీఐలు, 21 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లను ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు విధులకు నియమించారు. డీఐజీ రమణకుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ ఆకే రవికృష్ణ శనివారం నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా సెయింట్ జోసెఫ్ కాలేజీని తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ కోసం కళాశాల యాజమాన్యం చేసిన ఏర్పాట్లను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టాలని సూచించారు. డీఎస్పీ రమణమూర్తి, సీఐలు డేగల ప్రభాకర్, కళాశాలల సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.