సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యక్తి , నేరస్తుడిగా ప్రకటితమైన వ్యక్తి ముందస్తు బెయిలుకు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం కేసులో పట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. వ్యాపార లావాదేవీల్లో మోసం చేసిన కేసు కావడంతో నిందితుడు ముందస్తు బెయిలుకు అర్హుడని హైకోర్టు భావించిందని తెలిపింది.
అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ 406 (నేర ఉల్లంఘన), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 470 (నకిలీ డాక్యుమెంట్లు) ప్రకారం నేరాలు జరిగి ఉండొచ్చు. కేసులో ఆరోపణల స్వభావం పరిశీలించాలి. వ్యాపార లావాదేవీల నుంచే ఆరోపణ అని భావించరాదు’’ అని పేర్కొంది. నిందితుడిపై మేజిస్టేట్ కోర్టులో ఛార్జిషీటు నమోదైందని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment