Patna High Court
-
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
Patna High Court: భార్యను భూతం.. పిశాచి అనడం క్రూరత్వం కాదు
పట్నా: వైవాహిక జీవితం విఫలమైన సందర్భంలో ఒక భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కాదని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. తననుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆమె మాజీ భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్కుమార్గుప్తాకు 1993లో బిహార్‌లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. అదనపు కట్నం కింద కారు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన భర్త, అతడి తండ్రి సహదేవ్ గుప్తా కలిసి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె 1994లో నవదాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రీకుమారులపై కేసు నమోదైంది. వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. నరేశ్‌కుమార్ గుప్తా, సహదేవ్ గుప్తాకు 2008లో నలందా కోర్టు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ వారిద్దరూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి అప్పీల్‌ను పదేళ్ల తర్వాత కోర్టు తిరస్కరించడంతో పట్నా హైకోర్టుకు వెళ్లారు. ఇంతలో జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 21వ శతాబ్దంలో ఒక మహిళను ఆమె అత్తింటివారు భూతం, పిశాచి అంటూ ఘోరంగా దూషించడం దారుణమని విడాకులు తీసుకున్న మహిళ తరపున ఆమె లాయర్ వాదించారు. ఇది ముమ్మాటికీ క్రూరత్వమేనని, తండ్రీ కుమారులను కఠినంగా శిక్షించాలని కోరారు. అందుకు జస్టిస్ బిబేక్ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం దూషించుకొనే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయపడింది. భర్త తన భార్యను భూతం, పిశాచి అంటూ దూషించడం క్రూరత్వం కిందికి రాదని తేల్చిచెప్పింది. పైగా సదరు మహిళ నిర్దిష్టంగా ఏ ఒక్కరిపైనా ఆరోపణలు చేయలేదని పేర్కొంది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. -
అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు
‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’ – పట్నా హైకోర్టు ‘సెక్షన్ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ – డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ ను అడ్డంపెట్టుకొని బయటపడాలని చేస్తున్న ప్రయత్నాలు చెల్లవని పట్నా, కర్ణాటక హైకోర్టులు రెండు వేర్వేరు కేసుల్లో ఇచ్చిన తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. సెక్షన్ 17ఏ అవినీతిపరులకు రక్షణ కవచం కాదని ఈ నెల 7న పట్నా హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17 ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ నుంచి సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ చేసిన వాదనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. సెక్షన్ 17ఏ అమలులోకి రాకముందే శివకుమార్‌పై కేసు నమోదు చేసినందున అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరంలేదన్న సీబీఐ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం, రిమాండ్‌కు పంపడం న్యాయపరంగా సరైనదేనని ఈ తీర్పుల ద్వారా స్పష్టమవుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇదీ బిహార్ కేసు బిహార్ రాష్ట్రం ఈస్ట్ చంపారన్ జిల్లాలోని సుగాలి పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కిశోర్ కుమార్ అక్రమంగా మద్య రవాణా చేస్తున్న వారిని విడిచిపెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన్ని చకియాకు బదిలీ చేశారు. ఆయన చకియాకు బదిలీ అయిన తరువాత సుగాలి పోలీసు స్టేషన్లో మూసివేసిన ఓ కేసును మళ్లీ నమోదు చేసి సంబంధిత వ్యక్తుల నుంచి లంచం వసూలు చేశారు. దీంతో ఆ జిల్లా ఎస్పీ ఆయన్ని అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కిశోర్ కుమార్ పట్నా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 17ఏ కింద తనను అరెస్టు చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ అనుమతి ఉండాలని వాదించారు. పట్నా హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. అవినీతి నిరూపితమైనందున ఆయన అరెస్టుకు అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 17ఏను అడ్డంపెట్టుకుని అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని కూడా స్పష్టంగా చెప్పింది. ఇదీ శివకుమార్ కేసు.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం అపాయింటింగ్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోనందున సీబీఐ తనపై నమోదు చేసిన కేసు చెల్లదని కర్ణాటక హోం మంత్రి డీకే శివకుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సెక్షన్ 17 ఏ అమల్లోకి రావడానికి (2018 జులై 26కి) ముందు 2013 నుంచి 2018 ఏప్రిల్ మధ్య శివకుమార్ అవినీతికి పాల్పడినందున ఆయనకు ఈ సెక్షన్ వర్తించదని తెలిపింది. అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వంగా అవినీతి చేయటం ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావని కూడా చెప్పింది. సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. శివకుమార్ వినతిని తిరస్కరించింది. చంద్రబాబుదీ అవే అడ్డగోలు వాదనలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా ఇదే అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోనందున అరెస్ట్ చెల్లదని, కేసు కొట్టివేయాలని వాదిస్తున్నారు. ఈ వాదనను సీఐడీ న్యాయవాదులు సమర్థంగా తిప్పికొట్టారు. అవినీతి వ్యవహారాల నుంచి గంపగుత్తగా రక్షణ కల్పించడం సెక్షన్ 17ఏ ఉద్దేశం కాదని వాదించారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పించదని చెప్పారు. అందువల్ల చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ఈ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ఏ విధంగా అర్హులు కారో వారు విశ్లేషించి మరీ చెబుతున్నారు. ► కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. నకిలీ ఇన్వాయిస్లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ కింద రక్షణ పొందలేరన్నది నిర్ధారణ అయ్యింది. ► ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 17ఏ కింద రక్షణ లభించదని పట్నా హైకోర్టు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదన్నది సుస్పష్టం. ► సెక్షన్ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది. ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది. కాబట్టి ఈ కేసులో సెక్షన్ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు ద్వారా స్పష్టమైంది. స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ► సెక్షన్ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరని పట్నా హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఆయన చెప్పడం లేదు. సెక్షన్ 17ఏ ప్రకారం తనపై సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదని మాత్రమే చెబుతున్నారు. అందువల్ల స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్
పాట్నా: బీహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన కులగణన అన్ని కులాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీని వలన ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని అన్నారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు. కొంతమంది ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నారు కానీ అఖిలపక్షాల అభిప్రాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సర్వే ద్వారా సాంఘిక, ఆర్ధిక అసమానతలకు గురైన వారికందరికీ సంక్షేమ పథకాలు అందించి మెరుగైన సేవ చేయడానికి వీలుంటుందని తెలిపారు. మొదటి నుంచి కులాల ప్రాతిపదికన సంక్షేమం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే కులగణన చేశామని అన్నారు. కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరడంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను నిలిపివేయమని ఎప్పుడూ చెప్పదు. ఇక పాట్నా హైకోర్టు అయితే ఇదే అంశంపై నమోదైన అనేక పిల్లను కొట్టి పారేసిందని గుర్తు చేశారు. మరి 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కేంద్రం ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ తదుపరి వాయిదా తేదీ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఈలోపే ఈ సర్వే పూర్తి కావడం విశేషం. ఇది కూడా చదవండి: మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్ -
బిహార్‌లో కుల గణనపై స్టే
పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణనకు ఎదురు దెబ్బ తగిలింది. వెంటనే ఈ సర్వేని నిలిపివేయాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సేకరించిన డేటాని తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల ఆధారంగా జనాభా లెక్కలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలో హైకోర్టు బెంచ్ పిటిషన్‌దారులు డేటా సమగ్రత, భద్రతపై వెలిబుచ్చిన ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదంటూ పిటిషన్‌దారులు పేర్కొనడాన్ని కూడా ప్రస్తావించింది. కులాల గణాంకాలు ఇతరుల చేతుల్లో పడితే దాని వల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. నితీశ్ ప్రభుత్వం జనవరి 7 నుంచి 21 వరకు తొలి విడత కులగణన నిర్వహించింది. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మే 15వరకు జరగాల్సి ఉంది. ప్రభుత్వం ఇది కులగణన కాదని, ఆర్థికంగా వెనుకబడిన వారు ఏయే కులాల్లో ఉన్నారో తెలిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్న ఉద్దేశంతోనే దీనిని చేపట్టినట్టుగా వాదిస్తోంది. -
Bihar: నితీష్ కుమార్‌కు షాకిచ్చిన పాట్నా హైకోర్టు..
పాట్నా: నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేపై హైకోర్టు స్టే విధించింది. కుల గణనపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ మధురేష్ ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కుల, ఆర్థిక సర్వేలు నిర్వహిస్తోందని పిటిషనర్లలో ఒకరైన దిను కుమార్ కోర్టుకు తెలిపారు. సర్వేలు నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధికి మించినదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రస్తుతం జరుగుతున్న సర్వేపై తక్షణమే స్టే విధించాలని, ఇప్పటివరకు సేకరించిన సర్వే డేటాను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. కాగా మహాఘట్బంధన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రూ. 500 కోట్లు ఖర్చుపెడుతోంది. రెండు దశల్లో చేపట్టిన ఈ గణన జనవరి 7న ప్రారంభమైంది. మొదటి దశలో 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కులాల లెక్కింపు జరిగింది. రెండో సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమవ్వగా మే 15వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో.. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరుగుతూ ప్రజల కులం, విద్య, ఆర్థిక, సామాజిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. వాస్తవానికి కులగణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్రం కుల గణన చేపట్టాలని నితీష్ కుమార్ పలుమార్లు కోరారు. కానీ కేంద్రం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో బిహార్ సీఎం స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టింది. అవసరమైన వారికి సేవలు అందించడంలో సర్వే ఉపయోగపడుతుందని సీఎం నితీశ్ తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై వస్తున్న వ్యతిరేకతపై నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వెనకబడిన వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకే ప్రభుత్వం లక్ష్య సాయాన్ని సులువగా చేర్చేందుకు దోహదపడుతందన్నారు. చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా? #WATCH | Bihar Deputy CM Tejashwi Yadav speaks after Patna HC puts a stay on Caste-based census, says, "Caste-based census is for welfare of the people, we want to eradicate poverty, backwardness. One thing is clear, it is bound to happen" pic.twitter.com/GZG7V5m7de — ANI (@ANI) May 4, 2023 -
మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట..
పట్నా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. 2019లో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు రాహల్‌ను ఏప్రిల్ 12న కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. అయితే తాను సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసే పనిలో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని రాహుల్ చెప్పారు. దీంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ఏప్రిల్ 25న హాజరుకావాలని చెప్పింది. అయితే మోదీ ఇంటిపేరు కేసుకు సంబంధించి ఇప్పటికే సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఓకే కేసుకుసంబంధించి రెండు కోర్టుల్లో విచారణ జరగడం చట్టవిరుద్ధమని, సుషీల్ మోదీ పిటిషన్‌ను కొట్టివేయాలని రాహుల్ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం మే 15 వరకు దిగువ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కాగా.. 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉందని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం పిటిషన్ వేశారు. రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రాహుల్ ఎంపీ పదవి కూడా పోయింది. ఆయనపై లోక్‌సభ సెక్రెటేరియెట్ అనర్హత వేటు వేసింది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయించింది. చదవండి: కమెడియన్ మునావర్ ఫరూకీకి ఊరట.. ఇండోర్‌కు అన్ని కేసులు బదిలీ -
జడ్జీల జీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేస్తారా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఖాతాలను నిలిపివేశారని పేర్కొంటూ పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు దాఖలు చేసిన విజ్ఞప్తి పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఏడుగురు జడ్జీల జీపీఎఫ్ ఖాతాలను క్లోజ్ చేశారని వారి తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభించాలని కోరారు. న్యాయమూర్తుల జీపీఎఫ్ ఖాతాలను మూసేయడం ఏమిటని సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు -
అదేం డ్రెస్సింగు? ఐఏఎస్‌కు మందలింపు
పాట్నా: ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కోర్టు ప్రోటోకాల్ ఫాలో కాక జడ్జి చేతిలో తిట్లు తిన్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. బీహార్ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆనంద్ కిశోర్. సీఎం నితీశ్ కుమార్ ఆయన దగ్గర కూడా. ఓ కేసులో ఈమధ్యే ఆయన పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వేసుకున్న దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి చిరాకు తెప్పించాయి. ‘‘ఇదేమైనా సినిమాహాల్ అనుకుంటున్నారా? సాధారణ డ్రెస్సింగ్‌లో రావడానికి!. సివిల్స్ సర్వెంట్లు ఎలాంటి డ్రెస్‌లో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ శిక్షణ తీసుకున్నారు మీరు? ముస్సోరీ ట్రైనింగ్‌లో ఈ విషయాలేవీ మీకు చెప్పలేదా? మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని, కనీసం మీద కోట్ అయినా ధరించాలి అని తెలియదా? అంటూ ఆ సీనియర్ అధికారిపై జడ్జి అసహనంగా వ్యక్తం చేశారు. -
‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యక్తి , నేరస్తుడిగా ప్రకటితమైన వ్యక్తి ముందస్తు బెయిలుకు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం కేసులో పట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. వ్యాపార లావాదేవీల్లో మోసం చేసిన కేసు కావడంతో నిందితుడు ముందస్తు బెయిలుకు అర్హుడని హైకోర్టు భావించిందని తెలిపింది. అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ 406 (నేర ఉల్లంఘన), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 470 (నకిలీ డాక్యుమెంట్లు) ప్రకారం నేరాలు జరిగి ఉండొచ్చు. కేసులో ఆరోపణల స్వభావం పరిశీలించాలి. వ్యాపార లావాదేవీల నుంచే ఆరోపణ అని భావించరాదు’’ అని పేర్కొంది. నిందితుడిపై మేజిస్టేట్ కోర్టులో ఛార్జిషీటు నమోదైందని గుర్తుచేసింది. -
ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు?
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక బాలుడి హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బీహార్‌కు చెందిన అర్బినా ఇన్ఫాత్ వలస కార్మికురాలు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోసం వలస వెళ్లిన ఆమె తన కొడుకు రహమత్‌తో కలసి గుజరాత్ నుంచి శనివారం శ్రామిక్ రైలులో తిరుగు పయనమైంది. అయితే ఎండ వేడిమితో పాటు వందల కిలోమీటర్లు తిండీ, తిప్పలు లేకపోవడంతో అనారోగ్యానికి గురై రైలులోనే తుది శ్వాస విడిచారు. తాజాగా ఈ వీడియోను పరిగణలోకి తీసుకొని పట్నా హైకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం కేసుపై విచారణ జరిపింది. (హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ..) ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. 'ఆ ఘటన ఇప్పటికి షాకింగ్‌గా ఉంది.. నిజంగా అలా జరగడం దురదృష్టకరం' అంటూ పేర్కొంది. ఈ సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలంటూ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా బీహార్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 'చనిపోయిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారా? నిజంగానే అర్బీనా ఆకలితో చనిపొయిందా లేక ఇంకా ఏమైనా కారణముందా? చట్టం అమలు చేసే విధంగా ఏజెన్సీలు ఏం చర్య తీసుకుంటాయి? ఒకవేళ ఆ మహిళకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు సంప్రదాయ పద్దతిలో నిర్వహించారా? తల్లి చనిపోవడంతో అనాథగా మారిన ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు? ' అంటూ హైకోర్టు జడ్జీలు ప్రశ్నల వర్షం కురిపించారు. ('కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి') దీనిపై ప్రభుత్వం తరపున రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఎస్డీ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' అర్బినా ఇన్ఫాత్‌ది సహజ మరణమే. సూరత్ నుంచి రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సమయానికి తిండి లేక ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతోనే మృతి చెందింది. ఈ విషయాన్ని మృతురాలి చెల్లి, ఆమె భర్త స్వయంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అర్బీనా మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించలేదు. అంతేగాక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులకు అనుమతి కూడా ఇచ్చాము. మృతదేహాన్ని ముజఫర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై విడిచిపెట్టి వెళ్లడంపై అధికారుల వద్ద వివరాలను ఆరా తీశాము. అర్బీనా స్వస్థలం కతిహార్ అని, తన భర్తతో విడిపోయాక చెల్లి ఆమె భర్తతో కలిసి ఉంటుంది. అర్బినాకు మొదట కొడుకు ఒకడే అని పొరబడ్డాం. తరువాత అర్బినాకు ఇద్దరు కొడుకులని రహమాన్‌కు అన్న ఉన్నాడని, అతని పేరు ఫర్మాణ్ అని తెలిసింది. ప్రస్తుతం వారిద్దరిని తామే సంరక్షిస్తామని అర్బినా చెల్లి, ఆమె భర్త పేర్కొన్నారు. అంతేగాక ఈ కేసును మేము ప్రత్యేకంగా తీసుకున్నాం. అర్బినా కుటుంబాన్ని కలవడానికి కొంతమంది అధికారులను పంపించాం. వారికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు.(మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత) ఎస్డీ యాదవ్ వాదనలు విన్న హైకోర్టు జూన్ 3న మరోసారి కేసును పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటిలోగా మీరు చెప్పిన ఆధారాలను ప్రత్యేక నివేదిక రూపంలో అందజేయాలని కోరింది. అయితే అర్భినా తండ్రి మహ్మద్ నెహ్రూల్ స్పందిస్తూ.. 'నా కూతురు ఏ వ్యాధితో బాధపడడం లేదని, కానీ ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా' అంటూ ఆవేదనతో తెలిపాడు. -
కన్నీరు పెట్టుకున్న సోషల్ మీడియా
-
జస్టిస్ రాకేష్ కుమార్ ఏపీ హైకోర్టుకు బదిలీ
సాక్షి, అమరావతి: పాట్నా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం ఈ నెల 15న సమావేశమై పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై చర్చించింది. ఈ సందర్భంగా పాట్నా హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ రాకేష్ కుమార్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు తీర్మానం చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసి జస్టిస్ రాకేష్ కుమార్ ఇటీవల వార్తల్లో నిలిచారు. పాట్నా సివిల్ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. కింది కోర్టుల్లో అవినీతి విషయంలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ నేపథ్యం జస్టిస్ రాకేష్ కుమార్ 1959 జనవరి 1న జన్మించారు. ఎల్ఎల్బీ పూర్తి చేసి 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పాట్నా హైకోర్టులో క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. 26 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సాగించారు. 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ప్రభుత్వ న్యాయవాదిగా, స్పెషల్ పీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2009 డిసెంబర్ 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2011 అక్టోబర్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2020 డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. -
కోర్టులో లొంగిపోయిన రాఖీ యాదవ్
పట్నా: టీనేజ్ యువకుడి హత్య కేసులో నిందితుడు రాకేశ్ రంజన్ అలియాస్ రాఖీ యాదవ్ శనివారం ఉదయం గయా సివిల్ కోర్టులో లొంగిపోయాడు. కాగా రాఖీ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బిహార్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో రాఖీ యాదవ్ లొంగిపోవడంతో అతడికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కుమారుడితో పాటు బహిష్కృత జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి, ఆమె భర్త కూడా కోర్టుకు వచ్చారు. ఈ ఏడాది మే నెలలో తన కారును ఓవర్ టేక్ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. అనంతరం పరారీలో ఉన్న అతడిని అదే నెల 11న పోలీసులు అరెస్ట్ చేయగా, పట్నా హైకోర్టు ఈ నెల 19న బెయిల్ మంజూరు చేసింది. కాగా రాఖీ యాదవ్‌కు పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. -
రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు..
న్యూఢిల్లీ : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. టీనేజ్ యువకుడి హత్య కేసులో రాఖీ యాదవ్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. దీంతో అతడు తిరిగి జైలుకు వెళ్లనున్నాడు. కాగా రాఖీ యాదవ్ బెయిల్ మంజూరు కావడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ ఈ ఏడాది మే నెలలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. గత వారమే పట్నా హైకోర్టు రాఖీ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయటంతో మృతుడి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. -
ఎదురుదెబ్బ తగిలినా.. వెనక్కి తగ్గని సీఎం
పాట్నా: మద్య నిషేధంపై బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినా.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేదం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాట్నా హైకోర్టు శుక్రవారం కొట్టివేసినా.. నితీశ్ మాత్రం ఈ విషయంపై పట్టుదలగానే ఉన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున సీఎం కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ఎక్సైజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ 2016 పేరుతో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని ఆదివారం ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ చట్టం ప్రకారం దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్), దేశీయ మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. పాత చట్టంలోని నిబంధనలకు తోడు జరిమానా, జైలుశిక్ష విషయంలో కఠినమైన నిబంధనలను ఈ కొత్త చట్టంలో చేర్చారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం ‘అసంబద్ధం, నిరంకుశం’ అని కోర్టు శుక్రవారం తీర్పులో పేర్కొంది. ఈ చట్టం అమలుకోసం సర్కారు తీసుకొచ్చిన చర్యలు నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్‌ల ధర్మాసనం బిహార్ ఎక్సైజ్ సవరణ (2016) చట్టంలోని 19 (4) సెక్షన్ ‘రాజ్యాంగ విరుద్ధం, అమలుకు నోచుకోవటం కష్టం’ అని వెల్లడించింది. అయితే కొన్ని సవరణలు తీసుకొస్తూ బిహార్ ప్రభుత్వం చట్టం అమలులోకి తీసుకొచ్చింది. -
మద్యం ప్రియులకు కిక్కు..నితీష్‌కు షాక్
-
బిహార్‌లో మద్యనిషేధం చెల్లదు
నోటిఫికేషన్‌ను కొట్టేసిన పట్నా హైకోర్టు పట్నా: మద్య నిషేధంపై బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మద్యనిషేధంపై ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను పట్నా హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయం ‘అసంబద్ధం, నిరంకుశం’ అని కోర్టు పేర్కొంది. ఈ చట్టం అమలుకోసం సర్కారు తీసుకొచ్చిన చర్యలు నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్‌ల ధర్మాసనం బిహార్ ఎక్సైజ్ సవరణ (2016) చట్టంలోని 19 (4) సెక్షన్ ‘రాజ్యాంగ విరుద్ధం, అమలుకు నోచుకోవటం కష్టం’ అని వెల్లడించింది. బిహార్ మద్య నియంత్రణ చట్టం 1938 ప్రకారం తక్కువ మొత్తంలో మద్యం తీసుకోవటం వల్ల హానికరం కాదని తెలిపింది. ఏప్రిల్ 5, 2016 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన బిహార్ సర్కారు.. అంతకుముందే రాష్ట్రంలో మద్యం తయారీదారులపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం మద్యం సేవించినా, అమ్మినా, నిల్వచేసినా కఠిన శిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తారు. కాగా, ఈ చట్టంపై మద్యం తయారీ సంస్థలు, పలు సంఘాలు మే 20న కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధ చట్టానికి బిహార్ సర్కారు సవరణలు కూడా చేసింది. వీటి ప్రకారం జైలు శిక్ష, జరిమానా పెంచారు. ఇంట్లో మద్యం దొరికితే.. ఇంటి పెద్దకు కఠిన శిక్ష తప్పదు. దీనికి వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదించాయి. సవరించిన ఈ చట్టం అక్టోబర్ 2న నోటిఫై కావాల్సి ఉండగా.. శుక్రవారం కోర్టు కొట్టేసింది. అయితే ఉత్తర్వుల కాపీ అందిన తర్వాతే స్పందిస్తామని జేడీయూ వెల్లడించింది. ‘మా ప్రభుత్వం మద్యనిషేధానికి కట్టుబడి ఉంది. అవసరమైన మార్పులు చేసైనా అమలుచేస్తాం’ అని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రభుత్వాల విధానాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. -
రేప్ కేసులో ఆ ఎమ్మెల్యేకు బెయిల్
పాట్నా: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులలో ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ ఒకరని మహిళా పోలీస్ స్టేషన్లో 205 పేజీల ఛార్జ్ షీటు గతంలోనే దాఖలైంది. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా అరెస్టు ఉత్తర్వులు జారీకావడంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆ తర్వాత కోర్టులో లొంగిపోయారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన పిటిషన్ ను విచారించిన పాట్నా హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది. గత ఫిబ్రవరి 6న పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో రాజ్ బల్లాబ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఎమ్మెల్యే వద్దకు అమ్మాయిలను పంపించే ఇద్దరు మహిళల పేర్లను కూడా ఈ ఛార్జ్ షీటులో పేర్కొన్నట్లు పాట్నా పోలీసులు తెలిపారు. నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. బాధిత పదో తరగతి విద్యార్థిని ప్రత్యేక భద్రత మధ్య గోప్యంగా ఓ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్స్ రాసిన విషయం తెలిసిందే. -
మద్యం ప్రియులకు కిక్కు..నితీష్‌కు షాక్
న్యూఢిల్లీ : బిహార్‌ను సంపూర్ణ మద్య నిషేధంగా మలుస్తానని ప్రకటించిన నితీష్ ప్రభుత్వానికి పట్న హైకోర్టు షాకిచ్చింది. యాంటీ-లిక్కర్ యాక్ట్ చట్టవిరుద్ధమని తేల్చేసింది .ఆ చట్టాన్ని నిలిపివేస్తున్నట్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. సంపూర్ణంగా మద్యం నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిల్లు-2016ను పట్నా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చట్టం ప్రకారం ఎవరి ఇంట్లోనైనా లిక్కర్ బాటిల్ కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ అరెస్టు చేసే అవకాశముంటుంది. ఈ చట్టానికి బిహార్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదం తెలిపాయి. చట్టసభల ఆమోదం తర్వాత నెలకే ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 1నుంచి ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టాన్ని తప్పుపడుతూ చట్టవిరుద్ధమని పట్న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కొత్త బిల్లులోని సెక్షన్లలన్నింటిలోనూ బెయిల్ లభించదు. కేవలం కోర్టులు మాత్రమే బెయిల్ మంజూరు చేయగలవు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేవలం స్పెషల్ కోర్టులు మాత్రమే మద్య నిషేధ ఉల్లంఘన కేసులను విచారించగలవు. ఈ స్పెషల్ కోర్టులు ఇప్పటివరకు అవినీతి, సీబీఐకు సంబంధించిన కేసుల విచారణలోనే ఊపిరి సలుపుకోకుండా ఉన్నాయి.ఈ చట్టంలో మరో కఠినమైన నిబంధనన ఏమిటంటే, ఏ ప్రాంతంలోనైనా బెల్లం, ద్రాక్షపండ్లు కనిపించినా సరే లిక్కర్ తయారు చేస్తున్నట్టు భావించి అరెస్ట్ లు చేసే అధికారం ముంటోంది. ఈ బిల్లుపై పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలి
- పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి - బార్ అసోసియేషన్ వార్షిక వేడుకలు షురూ వరంగల్ లీగల్ : న్యాయవాదులు అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలని, ధనాపేక్ష రుగ్మతలకు మూలమని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి అన్నారు. బార్ అసోసియేషన్ వార్షికోత్సవం జిల్లా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ సత్యం, అహింస వంటి విలువలు పాటించడం కష్టమని, అయితే ఆచరించిన వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. న్యాయవాదులు కక్షిదారుడిని వదులుకోవద్దని, న్యాయమూర్తులు న్యాయస్థానాలపై గౌరవంతో ఉండాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పర్యాద అంజిరెడ్డి సాధారణ రైతు వేషధారణ అయిన తలపాగాతో విశేషంగా అకట్టుకున్నారు.ఆయన మాట్లాడుతూ అవసరం ఉన్నంత సంపాదించాలనే నానుడి స్థానంలో అవతలి వాడికంటే ఎక్కువ సంపాదించాలని వచ్చిందని వ్యంగ్య చలోక్తులు విసిరారు. ఒక్కనాడు గ్రామ స్వరాజ్యంలో విరిసిన రోజు న్యాయం ఉండేదని... నేడు న్యాయాన్ని కొనుక్కోవాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. ప్రతి చట్టం మాతృభాషలో ఉండాలని ,సగటు కక్షిదారుడికి న్యాయస్థానంలో ఏమి జరుగుతుందో తెలియనంత వరకు అన్యాయం జరిగినట్లుగానే భావించాలన్నారు. సమాజ హితం కోసం అన్ని శాస్త్రాలు పనిచేయాలని, కానీ దేశానికి వెన్నముక అయిన రైతుకు స్వాతంత్య్రం రాలేదన్నారు. పత్తి పంటకు నిలయమైన ఓరుగల్లులో విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు, పత్తి మిల్లు యాజమానులు ధనవంతులైతే రైతులు మాత్రం అత్మహత్యలు చేసుకుంటున్నారని... ఈ స్థితికి కారణాలు వెలికి తీయాలని న్యాయవాదులకు అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పల్లా మహాత్మ, ఉపాధ్యక్షులు ఇ.అనంద్‌మోహన్, సహాయ కార్యదర్శి పత్తిపాటి శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శి నారగొని సునీత, కోశాధికారి డేవిడ్ రాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు దేవేందర్, శివకుమార్, శివరామకృష్ణ, మురళీ, సంతోష్, సంపత్‌రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మహిళా కార్యవర్గ సభ్యులు గౌసియా బేగం పాల్గొన్నారు. న్యాయవాదులు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి, రైతు నాయకుడు అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. తాడూరి రేణుక శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. -
నితీష్ కుమార్ కు ఊరట
పాట్నా: బిహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కు ఊరట లభించింది. శాసనసభపక్ష నేత ఎన్నికపై స్టే ఇచ్చేందుకు పాట్నా హైకోర్టు నిరాకరిచింది. నితీష్ ఎన్నిక చట్ధవిరుద్దమంటూ నిన్న ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సవరించింది. జేడీ(యూ) శాసనసభా పక్ష నేతగా నితీష్ కుమార్ కొనసాగొచ్చని స్పష్టం చేసింది. జేడీ(యూ) సహా ఏ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాలతో సీఎం పదవి చేపట్టేందుకు నితీష్ కుమార్ కు అడ్డంకులు తొలగాయి. -
హైకోర్టులో నితీష్ కుమార్‌కు ఎదురుదెబ్బ
-
హైకోర్టులో నితీష్ కుమార్‌కు ఎదురుదెబ్బ
పాట్నా: బీహార్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ మరింత సంక్షోభంలో పడింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. బీహార్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షభం విషయంలో గవర్నర్ మాత్రమే జోక్యం చేసుకోగలరని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశించిన నితీష్‌కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ రోజు సాయంత్రం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఎమ్మెల్యేలతో కలసి పరేడ్ నిర్వహించేందుకు సిద్ధమైన నితీష్‌కు తాజా పరిణామాలు ప్రతికూలంగా మారాయి. మరో వైపు బలనిరూపణకు సిద్ధమని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మంఝి వ్యాఖ్యానించారు. మంఝికి బీజేపీ మద్దతు ఇవ్వనున్నట్టు తొలుత వార్తలు వచ్చినా.. బీజేపీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. తాజా పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీ రద్దయ్యే అవకాశముందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం బీహార్ ఎన్నికలు వచ్చే జూలై-ఆగస్టులో జరగాల్సివుంది. -
పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి
సుప్రీంకోర్టుకు సమ్మతి తెలిపిన హైకోర్టు న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి పదోన్నతిపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులు కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నది. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం ఆయన సమ్మతిని కోరింది. ఇందుకు ఆయన సమ్మతి తెలియజేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం పాట్నా హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రేఖామన్హర్‌లాల్ దోషిత్ వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తరువాత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పాట్నా హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడుతారు. పాట్నా వెళ్లేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి సమ్మతి తెలియచేసిన నేపథ్యంలో త్వరలోనే సుప్రీంకోర్టు కొలీజియం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపనున్నది. కేంద్రం కూడా ఆమోదముద్ర వేసిన తరువాత సంబంధిత ఫైలు రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన తరువాత పాట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి జరుగుతున్న మొట్టమొదటి నియామకం ఇదే. ఒకవేళ అన్నీ కలిసొస్తే, తెలంగాణ రాష్ట్ర కోటాలో జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకోర్టుకు సైతం వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ టూగా కొనసాగుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి.. వరంగల్ జిల్లా, గవిచర్ల గ్రామంలో 1953 ఆగస్టు 1న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అక్కడి నుంచే పీజీ డిగ్రీ కూడా చేశారు. 1979లో న్యాయవాదిగా నమోదు చేసుకుని.. ప్రముఖ న్యాయకోవిదుడు పి.బాబుల్‌రెడ్డి వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1983 వరకు బాబుల్‌రెడ్డి వద్ద ఉన్న జస్టిస్ నర్సింహారెడ్డి.. 1984 నుంచి స్వతంత్రంగా కేసులు వాదించడం మొదలు పెట్టారు. 1988-90 సంవత్సరాల్లో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. తరువాత పలు ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు న్యాయసలహాదారుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా వ్యవహరించారు. 2001లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఎన్నో సంచలన కేసుల్లో జస్టిస్ నర్సింహారెడ్డి తీర్పులు వెలువరించారు.