హైకోర్టులో నితీష్ కుమార్కు ఎదురుదెబ్బ | nitish-kumar-elected-as-jd-u-lp-leader-is-illegal-says-patna-high-court | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 11 2015 3:33 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

బీహార్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ మరింత సంక్షోభంలో పడింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పాట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. బీహార్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షభం విషయంలో గవర్నర్ మాత్రమే జోక్యం చేసుకోగలరని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశించిన నితీష్కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ రోజు సాయంత్రం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఎమ్మెల్యేలతో కలసి పరేడ్ నిర్వహించేందుకు సిద్ధమైన నితీష్కు తాజా పరిణామాలు ప్రతికూలంగా మారాయి. మరో వైపు బలనిరూపణకు సిద్ధమని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మంఝి వ్యాఖ్యానించారు. మంఝికి బీజేపీ మద్దతు ఇవ్వనున్నట్టు తొలుత వార్తలు వచ్చినా.. బీజేపీ గైర్హాజరు కానున్నట్టు సమాచారం. తాజా పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీ రద్దయ్యే అవకాశముందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం బీహార్ ఎన్నికలు వచ్చే జూలై-ఆగస్టులో జరగాల్సివుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement