bail reject
-
లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్ర పిళ్లైకు షాక్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిళ్లై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక, అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఈ స్కామ్‌లో ఇతర విషయాల్లో పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు భాగస్వామిగా వ్యవహరించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ (ఎల్1) లో యాక్సెస్ వచ్చిందంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ను ఈడీ ప్రస్తావించింది. కవిత తెలంగాణ సీఎం కూతురని లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుకు పిళ్లై వివరించినట్లు తెలిపింది. మరోసారి విందులో పిళ్లై ఫోన్ ద్వారా ‘ఫేస్ టైమ్’లో సమీర్‌ను కవితతో మాట్లాడించినట్లు వివరించింది. ఈ సందర్భంగా కవిత, సమీర్‌ను అభినందించడమే కాకుండా, లిక్కర్ బిజినెస్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. కవిత, అరుణ్ పిళ్లైలు ఆప్ నేత, లిక్కర్ స్కామ్‌లో కీలకమైన విజయ్ నాయర్, దినేశ్ అరోరాలను గతేడాది ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో కలిసినట్లు పేర్కొంది. 2022లో హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను, సమీర్ కలిశారని, ఈ భేటీలో శరత్ చంద్రా రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ప్రస్తావించింది. ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్! -
T20 world cup 2022: గుణతిలకకు బెయిల్ తిరస్కరణ
సిడ్నీ: ఆస్ట్రేలియాలో రేప్ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అత్యాచారం కేసులో నిందితుడైన 31 ఏళ్ల క్రికెటర్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. తీవ్రమైన క్రిమినల్ నేరానికి పాల్పడిన అతనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని శ్రీలంక క్రీడాశాఖ ఆదేశించింది. ఆస్ట్రేలియా అధికారులకు సహకరిస్తామని ఎస్ఎల్సీ వర్గాలు తెలిపాయి. డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టు మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ ముందు వర్చువల్ (వీడియో కాల్) పద్ధతిలో గుణతిలకను ప్రవేశపెట్టారు. అతని తరఫున లాయర్ ఆనంద అమరనాథ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. దీనిపై స్పందించిన లాయర్ ఆనంద అతిత్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామన్నారు. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు స్వదేశానికి బయల్దేరే ముందు గుణతిలకను అరెస్టు చేయడంతో అతను మినహా మొత్తం జట్టు లంకకు పయనమైంది. -
‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యక్తి , నేరస్తుడిగా ప్రకటితమైన వ్యక్తి ముందస్తు బెయిలుకు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం కేసులో పట్నా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. వ్యాపార లావాదేవీల్లో మోసం చేసిన కేసు కావడంతో నిందితుడు ముందస్తు బెయిలుకు అర్హుడని హైకోర్టు భావించిందని తెలిపింది. అయినప్పటికీ ఐపీసీ సెక్షన్ 406 (నేర ఉల్లంఘన), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 470 (నకిలీ డాక్యుమెంట్లు) ప్రకారం నేరాలు జరిగి ఉండొచ్చు. కేసులో ఆరోపణల స్వభావం పరిశీలించాలి. వ్యాపార లావాదేవీల నుంచే ఆరోపణ అని భావించరాదు’’ అని పేర్కొంది. నిందితుడిపై మేజిస్టేట్ కోర్టులో ఛార్జిషీటు నమోదైందని గుర్తుచేసింది. -
ఆ పోలీసు అధికారి దోషి
వాషింగ్టన్: అమెరికా సహా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికాన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది జ్యూరీ సభ్యులున్న కోర్టు ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్ అని మంగళవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. చౌవిన్ బెయిల్‌ని రద్దు చేసింది. మూడు వారాల పాటు 45 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు సోమవారం 10 గంటలకు పైగా తుది విచారణ జరిపింది. అయితే శిక్షను న్యాయస్థానం వాయిదా వేసింది. న్యాయమూర్తి పీటర్ కాహిల్ 8 వారాల్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా అమెరికా చట్టాల ప్రకారం చౌవిన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. తీర్పు వెలువరించిన సమయంలో డెరెక్ చౌవిన్‌కు ముఖానికి సర్జికల్ మాస్కు ధరించి ఉండడంతో అతని ముఖంలో భావాలేవీ బయటకు రాలేదు. మరోవైపు ఫ్లాయిడ్ మృతితో జాతి వివక్షకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు, ఫ్లాయిడ్ మద్దతు దారులు న్యాయస్థానం తీర్పు చెప్పినప్పుడు కోర్టు హాలు బయటే వేచి ఉన్నారు. తీర్పు వెలువడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ నినదించారు. ఈ తీర్పు ఓ ముందడుగు: బైడెన్ జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పు అతి పెద్ద ముందడుగు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి వైట్ హౌస్నుంచి ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకి కాంగ్రెస్ సభ్యులందరూ ఇంకా కృషి చేయాలన్నారు. ‘‘ఈ తీర్పు చాలదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. అయితే న్యాయవ్యవస్థలో ఇదో పెద్ద ముందడుగు’’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన బైడెన్ ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు తో తాను ఊరట పొందానని అన్నారు. ఐ కాంట్ బ్రీత్ అన్న జార్జ్ ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని, ప్రతీ అమెరికన్ సమస్యని అన్నారు. అందరికీ న్యాయం అని తాము కంటున్న కలల్ని జాతి వివక్ష దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి పీల్చుకున్నాం : ఫ్లాయిడ్ సోదరుడు పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనుకూలంగా తీర్పు వచ్చినా జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఊపిరి ఆడట్లేదు... కాలు తీయండి నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మిన్నియాపాలిస్‌లోని ఒక దుకాణంలో నకిలీ 20 డాలర్ల నోటుతో సిగరెట్లు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దుకాణంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిగా ఉన్న శ్వేతజాతీయుడు డెరెక్ చౌవిన్ 2020, మే 25 రాత్రి ఫ్లాయిడ్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. 46 ఏళ్ల వయసున్న ఫ్లాయిడ్‌ను రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చాడు. తన మోకాలితో ఫ్లాయిడ్ మెడపై గట్టిగా నొక్కి పెట్టి ఉంచాడు. ఫ్లాయిడ్ ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా చౌవిన్ కర్కశ హృదయం కరగలేదు. తొమ్మిది నిమిషాలు పైగా అలా తొక్కి పెట్టి ఉంచాడు. దీంతో ఫ్లాయిడ్ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రజలు ఆగ్రహోద్రిక్తులయ్యారు. ‘‘ఐ కాంట్ బ్రీత్. ఐ కాంట్ బ్రీత్’’అన్న ఫ్లాయిడ్ చివరి మాటలు విన్న వారి హృదయాలు కరిగి నీరయ్యాయి. -
అర్నాబ్‌కు బెయిల్ నో
ముంబై/న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సోమవారం అర్నాబ్ బెయిల్ అర్జీని పరిశీలించిన డివిజన్ బెంచ్..బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. సెషన్స్ కోర్టు దీనిపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఓ ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న 2018నాటి కేసులో ఆయన్ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయిగఢ్ జిల్లా కోర్టు అర్నాబ్‌కు 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రిపబ్లిక్ టీవీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను టీవీ చానళ్లలో చూపడం, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం ఆపివేస్తున్నామంటూ హామీ ఇవ్వాలని ఏజీఆర్ మీడియా, బెన్నెట్ కోల్మన్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమపై బాధ్యతరాహితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ ఈ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు కూడా నోటీసులిచ్చింది. -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
నిరసన రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: సాక్ష్యాలేవీ లేకుండానే భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను నిర్బంధంలో ఉంచడం, బెయిల్‌ను వ్యతిరేకించడంపై పోలీసుల తీరును ఢిల్లీ న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోవడం వల్లనే ప్రజలు వీధుల్లోకి వచ్చారని, ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం పాకిస్తాన్‌కు చెందిదా? అన్నట్టు పోలీసులు ప్రవర్తించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆ ప్రాంతం పాకిస్తాన్ దైనా శాంతియుతంగా ధర్నా చేసే అవకాశం అందరికీ ఉందని తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆజాద్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జి కామినీ లౌ మాట్లాడుతూ ఆజాద్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనేందుకు సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. అలాగే జామా మసీదు ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదనే నిబంధనలను కూడా తెలపాలన్నారు. కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆందోళనలకు సంబంధించి తమ వద్ద డ్రోన్ రికార్డులు మాత్రమే ఉన్నాయని పోలీసులు విచారణ సందర్భంగా చెప్పడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. న్యాయ శాస్త్ర పట్టభద్రుడైన ఆజాద్ కోర్టుల్లోనూ నిరసన తెలపవచ్చునన్నారు. కాగా, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు (ఎన్హెచ్ఆర్సీ) పోలీసుల దాడిలో గాయపడ్డ 50 జామియా మిలియా వర్సిటీకి చెందిన విద్యార్థుల వాంగ్మూలాలను మంగళవారం నమోదు చేశారు. -
మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు
తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీపా మోహన్ లిఖిత పూర్వకంగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు. దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ జయచంద్రన్ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు. మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించింది. -
హిమాచల్ సీఎం, జస్టిస్ కర్ణన్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. మనీ లాండరింగ్ కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. కాగా మనీ లాండరింగ్ కేసులో వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబంపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. జస్టిస్ కర్ణన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ మరోవైపు కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. కోర్టు ధిక్కర నేరానికిగానూ విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాగా కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు. దీంతో కర్ణన్ అరెస్టు కోసం కోల్‌కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రం చేశారు. ఎట్టకేలకు గతనెలలో అరెస్ట్ చేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు. -
అమ్మకు బెయిల్ నిరాకరణ.. తమిళనాట ఆగ్రహం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ లభించనందుకు తమిళనాడులో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అన్నా డీఎంకే కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్లో ఉడిపి హోటల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. కర్ణాటక బస్సులపైనా దాడి చేసి ధ్వంసం చేశారు. మంగళవారం కర్ణాటక హైకోర్టు తొలుత జయకు బెయిల్ మంజూరు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే బెయిల్ పిటీషన్‌ను కొట్టేయడంతో అన్నా డీఎంకే కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. కర్ణాటకకు చెందిన బస్సులపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.