చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ లభించనందుకు తమిళనాడులో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అన్నా డీఎంకే కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్లో ఉడిపి హోటల్పై దాడి చేసి ధ్వంసం చేశారు.
కర్ణాటక బస్సులపైనా దాడి చేసి ధ్వంసం చేశారు. మంగళవారం కర్ణాటక హైకోర్టు తొలుత జయకు బెయిల్ మంజూరు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే బెయిల్ పిటీషన్ను కొట్టేయడంతో అన్నా డీఎంకే కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. కర్ణాటకకు చెందిన బస్సులపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
అమ్మకు బెయిల్ నిరాకరణ.. తమిళనాట ఆగ్రహం
Published Tue, Oct 7 2014 6:40 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement
Advertisement