జయలలితకు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే జయలలితను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
డీహైడ్రేషన్ సమస్యతో ఆమె బాధపడుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు వెల్లడించారు. అయితే జయలలితను అబ్వరేషన్ లో ఉంచామని కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం గురించి పార్టీ నేతలతో పాటు తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.