'అమ్మ బతికుందో లేదో చెప్పాలి' | ppl want to know whether she alive or not Says sasikala pushpa | Sakshi
Sakshi News home page

'అమ్మ బతికుందో లేదో చెప్పాలి'

Published Mon, Dec 5 2016 12:34 PM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

'అమ్మ బతికుందో లేదో చెప్పాలి' - Sakshi

'అమ్మ బతికుందో లేదో చెప్పాలి'

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఏఐడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కోరారు. అమ్మ ఆరోగ్యంపై పార్టీ వర్గాలు చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత లేదని ఆమె అన్నారు. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని శశికళ పుష్ప అభిప్రాయపడ్డారు.

జయలలిత ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వదంతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని, ఉద్రిక్త పరిస్థితుల నుంచి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని శశికళ పుష్ప కోరారు. రెండున్నర నెలలుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన అనంతరం.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement