చెన్నై: ఆసియా ఆన్‌లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్‌పై... ఎనిమిదో మ్యాచ్‌లో 2.5–1.5తో కజికిస్తాన్‌పై... తొమ్మిదో మ్యాచ్‌లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్‌తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిస్తాన్‌తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment