Padmini
-
వైట్‌హౌజ్‌కు బ్రైట్ స్టార్స్
అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుండగా, న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్‌లో పనిచేస్తుంది. ‘వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్‌హౌజ్ వెబ్సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్‌కు నాయకత్వం వహించింది.2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్‌బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది. -
ఆటో డ్రైవర్‌తో గొడవపడ్డ నటి.. డబ్బులివ్వకుండా చెక్కేసింది! ఇంత ఘోరమా?
కన్నడ బుల్లితెర నటి పద్మిని ఆటో డ్రైవర్‌తో గొడవపడింది. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఆటో మధ్యలో ఆపి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్.. నటి తనను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి పద్మిని మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్ నుంచి బాణశంకరికి ఆటో బుక్ చేసింది. దీనికిగానూ ఆమె రూ.437 చెల్లించాల్సి ఉంటుందని ఉబర్ యాప్‌లో చూపించింది. ఆమె డ్రైవ్‌ను ఓకే చేసిన కుల్దీప్ అనే వ్యక్తి తనను ఆటోలో పికప్ చేసుకున్నాడు. మార్గమధ్యంలో వీరి ఆటో కొంత ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో పద్మిని ఆటో డ్రైవర్ మీద అరిచింది. అసలు ఈ రోడ్లో నుంచి ఎందుకు తీసుకొచ్చావ్? ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది.. నువ్వు సరిగా ఆటో నడపట్లేదు అని తిట్టిపోసింది. ట్రాఫిక్ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదు. మార్గమధ్యంలోనే ఆటో దిగిపోయింది. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టింది. డబ్బులివ్వమని అడిగితే ఇవ్వనని తెగేసి చెప్పింది. ఎక్కువ మాట్లాడితే ఉబర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. చివరకు అన్నంతపని చేయడంతో ఉబర్ యాజమాన్యం అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అయితే ఆటో డ్రైవర్ నటి గొడవను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. తను ఏ తప్పూ చేయకున్నా నటి గొడవపడిందని, డబ్బులివ్వకపోవడమే కాకుండా తనపైనే ఫిర్యాదు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. నటి పద్ధతి అస్సలు బాగోలేదని విమర్శిస్తున్నారు. నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇంత కక్కుర్తా? అలాంటప్పుడు ఆటో బుక్ చేసుకోవడం దేనికని విమర్శిస్తున్నారు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి.. దానివల్ల భయంగా ఉందంటూ.. -
Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!
కుట్టి పద్మిని దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళంలో బాల నటిగా నటన జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ బిజినెస్‌లో బిజీ ఆయిపోయారు. ఇటీవల ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. (ఇది చదవండి: రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి) పద్మిని మాట్లాడుతూ.. 'కమల్ హాసన్.. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణీ గణపతితో సహా మరో ఇద్దరు నటీమణులతో కలిపి ఒకేసారి ఆరుగురితో ప్రేమ వ్యవహారం నడిపించారు. కానీ చివరికి వాణీ గణపతిని కమల్ హాసన్ పెళ్లాడారు. వీరి పెళ్లి వార్త శ్రీదేవి, శ్రీవిద్యలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రీవిద్య కమల్‌హాసన్‌ను ఎంతో ఇష్టపడింది. ఆయనకు పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నేను కమల్‌తో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వాణితో ప్రేమలో పడ్డారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు బహుమతి కూడా కొన్నాడు. ఆ తర్వాత మద్రాస్‌కు చెందిన నటి రేఖతో ప్రేమాయణం కొనసాగించారు. ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పా. కానీ ఆమె నమ్మలేదు. కమల్‌కు 'సకలకళా వల్లభుడు' అన్న బిరుదు రావడానికి ఇదే కారణం.' ఆమె పేర్కొంది. (ఇది చదవండి: విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!) అయితే కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత.. శ్రీవిద్య చాలా రోజులు ఈ వాస్తవాన్ని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు పద్మిని తెలిపింది. కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే విడాకాలు తీసుకుంది. సినిమాల నుంచి తప్పుకున్న శ్రీవిద్య తిరువనంతపురంలో స్థిరపడింది. తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్‌కు రాసిచ్చింది. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడంతో 2006లో మరణించింది. తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీవిద్య నటించారు.ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటించారు. -
జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి
చేత గొడ్డలి కళ్లల్లో తీక్షణత ‘అడవికి నేను కాపలా’ అనే ప్రకటన. 65 ఏళ్ల పద్మిని మాఝీ ఒరిస్సాలో తన పల్లె చుట్టూ ఉన్న 100 హెక్టార్ల అడవిలో పుల్ల కూడా పోకుండా ఒక్క కొమ్మా తెగి పడకుండా కాపలా కాస్తోంది. కలప మాఫియా ఆమె దెబ్బకు తోక ముడిచింది. అందుకే ఆమెను ఆ ప్రాంతంలో జంగిల్ రాణి అని పిలుస్తుంటారు. ఉదయం ఆరూ ఆరున్నరకంతా పద్మిని మాఝీ ఇంటి పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆమె తన అసలైన ఇంటికి బయలుదేరుతుంది. అంటే దాపున ఉన్న అడవికి. అదే ఆమె రోజంతా గడిపే ఇల్లు. ఒరిస్సాలోని నౌపడా జిల్లాలో బిర్సింగ్పూర్ అని చిన్న పల్లె ఆమెది. ఆ పల్లెకు ఆనుకునే చిన్న కొండ. దాని చుట్టుపక్కల విస్తారమైన అడవి. అందులో చాలా విలువైన కలప చెట్లు, మందు మొక్కలు, అడవి పళ్లు అన్నీ దొరుకుతాయి. ‘మేము అడవి మీద ఆధారపడి బతుకుతాము. అడవిని నరికి, అడవిలో ఉండే జంతువులను చంపి కాదు’.. అంటుంది పద్మిని. కిరాసాగర్ మాఝీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ముప్పై ఏళ్ల క్రితం ఆ అడవి పక్క ఊరికి కోడలిగా వచ్చింది పద్మిని. అడవికి వెళ్లి వంట చెరుకు, తేనె, దుంపలు... ఇవన్నీ తెచ్చుకుని బతకడం తొందరగా నేర్చుకుంది. ‘కాని అడవిలో ఆ రోజుల్లో కలప దొంగలు విచ్చలవిడిగా తిరిగేవారు. వేటగాళ్లు ఉండేవారు. వారి వల్ల అడవి నాశనమవుతోందని నాకు అర్థమైంది. అడవి పచ్చగా ఉంటే మేము పచ్చగా ఉంటాము. అడవి ఉంటేనే వానలు పడతాయని మా నాన్న నా చిన్నప్పుడు చెప్పేవాడు. అందుకే అడవిని కాపాడాలనుకున్నా’ అంటుందామె. తనకు తానుగా వేసుకున్న ఈ డ్యూటీని పాతికేళ్లు గడిచినా ఆమె వదల్లేదు. రోజూ ఉదయం ఆరున్నరకంతా భుజాన గొడ్డలి వేసుకొని అడవిలోకి బయలుదేరుతుందామె. పుట్టి బుద్ధెరిగాక ఆమె చెప్పులు వేసుకోలేదు. ఇన్నాళ్లుగా ఆమె అడవిలో ఉత్త పాదాలతోనే తిరుగుతుంది. అడవిలోని ప్రతి అడుగు తెలిసినవారే ఉత్త పాదాలతో తిరగ్గలరు. అడవిని ఆమె ఐదారు భాగాలుగా చేసుకుంది. ఒకోరోజు ఒకో భాగంలో తిరుగుతుంది. దారిలో తనకు కనపడిన ఎండుపుల్లల్ని ఒకచోటకు చేరుస్తుంది. అడ్డంగా ఉన్న కొమ్మలను, తీగలను కొట్టి దారి చేస్తుంది. నిన్న ఉన్న అడవే ఇవాళా ఉందా అని చెక్ చేస్తుంది. ఇక పరాయి వ్యక్తి ఎవరైనా కనిపించాడో గొడ్డలి చేతికందుకుంటుంది. ‘మొదట వాణ్ణి భయపెడతాను. నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి సాయం వచ్చేలా చేస్తాను. ఊరి వాళ్లు ఎవరో ఒకరు అడవిలో తిరుగుతూనే ఉంటారు. వారొచ్చి పట్టుకుంటారు. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. అడవిలో రోజూ నేను తిరుగుతానని ఎదురు పడతానని కలప దొంగలకు, వేటగాళ్లకు తెలిసిపోయింది. అందుకే రావడం మానేశారు. మా అడవి మాకు మిగిలింది’ అంటుంది పద్మిని. ఇన్నేళ్లుగా ఆమె ఒక పైసా ఎవరి నుంచి ఆశించకుండా, ఏ జీతం తీసుకోకుండా ఈ పని చేస్తున్నందు వల్ల ఊళ్లో పద్మిని అంటే చాలా గౌరవం. ఆమెను జంగిల్ రాణి అని పిలుస్తారు. ఫారెస్ట్ రేంజర్లు, గార్డులు ఆమె కనిపిస్తే గౌరవంగా మాట్లాడతారు. ‘నాకు జీతం ఎందుకు? ఇది ప్రతి మనిషి బాధ్యత’ అంటుంది మాఝీ. ఈ అడవి పచ్చగా ఉండటం వల్ల వీకెండ్స్‌లో విహారానికి వచ్చేవారి సంఖ్య ఎక్కువ. వారి ఆనందానికి కారణం ఒక బక్కపలుచని ఆదివాసి మహిళ అని వారికి తెలియకపోవచ్చు. ఇలాంటి తెలియని మహానుభావుల వల్లే మన దేశంలో ప్రకృతి ఈ మాత్రమైనా మిగిలి ఉంది. ఇలాంటి స్పూర్తిదాయక కథలు ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. పద్మిని మాఝీతో పాటు ఆమెలాంటి మహిళా మణులందరికీ ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! నన్ను చూడగానే చాలామంది పారిపోతారు. అడ్డం తిరిగితే పెద్దగా అరిచి ఊరివాళ్లు సాయం వచ్చేలా చేస్తాను. ఊర్లోకి తీసుకెళ్లి వాణ్ణి కట్టేస్తాం. వాడు క్షమాపణలు చెప్పి మళ్లీ అడవి ముఖం చూడను అని ప్రమాణం చేస్తే వదిలేస్తాం. -
రెండో పెళ్లి చేసుకున్నా.. మొదటి భర్త కూడా 12 ఏళ్లు నాతోపాటే..
'అంబల అంజులం' అనే తమిళ సినిమాతో మూడేళ్లకే బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నటి కుట్టి పద్మిని. కుళంద్యం దైవమమ్ అనే సినిమాకు గానూ ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె వైష్ణవి ఫిలింస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా మారింది. తెలుగులో లేత మనసులు, చిక్కడు దొరకడు, విచిత్ర కుటుంబం వంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. '23 ఏళ్ల వయసులోనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మందుకు బానిసవడంతో అతడితో విడిపోయాను. 10 ఏళ్ల తర్వాత ప్రభు అనే వ్యక్తితో మరోసారి ప్రేమలో పడ్డాను. మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. కానీ కొంతకాలానికి నా మొదటి భర్తకు పూట గడవడం కూడా కష్టంగా ఉందని నా కూతురు ద్వారా తెలిసింది. ఆయనతో మళ్లీ బెడ్ షేర్ చేసుకోలేను కానీ తననలా వదిలేయాలన్పించలేదు. మా ఆఫీస్ కింద ఆయనకంటూ ఒక రూమ్ కట్టించాను. ఆఫీస్‌లో రూ.30,000 జీతానికి పని కల్పించాను. 12 ఏళ్లు అతడిని నాతో పాటే ఉంచుకున్నాను. ఒక ఫ్రెండ్‌లా మాతోనే ఉన్నారు, గతేడాది చనిపోయారు. రెండో భర్త ప్రభు నా సెక్రటరీతో లవ్‌లో పడ్డాడు. అతడికి నేను అడ్డుచెప్పలేదు. నేనిప్పుడు ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది పద్మిని. చదవండి: నా సెక్రటరీతో భర్త ఎఫైర్: నటి కుట్టి పద్మిని -
రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి
కుట్టి పద్మిని సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించిది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైన నటులతో కలిసి నటించింది. ఆమె నటనకు తమిళనాడు రాష్ట్రం జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్న తొలినటిగా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పద్మిని మాట్లాడూతూ.. 'అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అప్పట్లో సావిత్రి, జమున ఉన్న సమయం. అప్పట్లో దర్శకులు కొంచెం అడ్జస్ట్మెంట్లు చేస్తారా అని అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు. నాకు గ్లామర్ డ్రెస్ అంటే ఇష్టముండదు. అలాంటి డ్రెస్సులు నాకు నచ్చవు. నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. అలా కొన్ని సినిమాలు మిస్సయ్యా. హీరోయిన్గా చాలా అవకాశాలు వదులుకున్నా. నాకన్న శ్రీదేవి బాగా ఫేమస్ అయింది. ఆ అదృష్టం నాకు రాలేదు.' అని అన్నారు. అనంతరం పద్మిని మాట్లాడూతూ.. 'కానీ నేను ఇప్పుడు రోజు 140 మందికి జీతాలు ఇస్తున్నా. ఎవరెవరు నాకు అవకాశం ఇవ్వలేదో వారికే నేను ఉపాధి కల్పించా. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఎవరైతే నన్ను రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలని పిలిచారో వారికే సాయం చేస్తున్నా. నేను బాగున్నానంటే నేను చేసిన పనులే. నా భర్త పెళ్లయిన 22 ఏళ్ల తర్వాత నా సెక్రెటరీని లవ్ చేశారు. పెళ్లయి పిల్లలు కన్నాక సడన్‌గా భర్తపై కోపం ఎలా వస్తుంది. నేను అడ్జస్ట్ చేసుకుని ఉండాలి లేదా ఒంటరిగా ఉండాలి. నేను ఒంటరిగానే ఉంటున్నా. చాలా సంతోషంగా ఉన్నా' అని అన్నారు. -
బొమ్మల కథావాహిని
బొమ్మతో అనుబంధం... బొమ్మతో ఆడుకోవడం మన బాల్య జ్ఞాపకం. బొమ్మను నేస్తంలా, బిడ్డలా హత్తుకునే చిట్టి మనసులకు ఆ బొమ్మతోనే పదేళ్లుగా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ సామాజిక సమస్యలపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు పప్పెట్రీ కథకురాలు పద్మినీ రంగరాజన్. హైదరాబాద్‌లో ఇరవై ఏళ్లుగా బొమ్మలతో దోస్తీ చేసిన ఈ కథల నేస్తం గురించి... ‘పిల్లలూ.. ఇప్పుడు ఈ మల్లూ మీతో మాట్లాడతాడు..’ అని ఆసక్తిగా బొమ్మలతో కథలు చెప్పడమే కాదు, జానపద సాహిత్యాన్ని మన కళ్లకు కడతారు. సోషియాలజీలో పరిశోధకురాలుగా ఉన్నారు. పదేళ్ల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరుతో సంస్థను నెలకొల్పిన పద్మిని రంగరాజన్‌ని కలిస్తే మనకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు పరిచయం అవుతాయి. పిల్లలకు తోలుబొమ్మల ద్వారా కష్టమైన గణితాన్ని, ఆంగ్లవ్యాకరణాన్ని సులువుగా నేర్పించవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, సామాజిక సమస్యలపై అవగాహన ఆసక్తి కలిగేలా చెప్పవచ్చనే విషయం స్పష్టం అవుతుంది. అనుకోకుండా మొదలైన పప్పెట్రీ తన జీవిత విధానంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు పద్మినీ రంగరాజన్. ‘‘మల్లు అనేది నా మొదటి గ్లౌజ్ కోతి తోలుబొమ్మ. నేరుగా నేను కాకుండా బొమ్మ మాట్లాడుతుంటే పిల్లలు ఒళ్లంతా కళ్లు, చెవులు చేసుకుని వింటుంటారు. ఆ సమయంలో ఎంత ఉత్సాహంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇరవై ఏళ్ల క్రితం.. నా కొడుకు ఆసక్తి గా కథ వినడం కోసం ఈ బొమ్మల కళను ఎంచుకున్నాను. అలా మొదటిసారి తోలుబొమ్మతో మా అబ్బాయికి పురాణకథను చెప్పాను. ఆ తర్వాత్తర్వాత పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో తోలుబొమ్మతో కథలు చెప్పడం మొదలయ్యింది. స్నేహితుల సంఖ్య పెరిగింది. బొమ్మలతో పిల్లలకు లెక్కలు చెప్పడం, ఇంగ్లిష్ గ్రామర్ చెప్పడం సులువయ్యింది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ పప్పెట్రీ నా జీవితంలో భాగమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అబ్బాయితోపాటు నాలోనూ ఈ కళ పట్ల ఇష్టం బాగా పెరిగిపోయింది. ఇంటినుంచి మొదలైన ఈ బొమ్మల కథ బయటి నా ప్రపంచాన్ని విస్తృతం చేసింది. స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌ను ఏర్పాటు చేసేలా చేసింది. పిల్లలే అభిమానులు తోలుబొమ్మలాట కళ అంతరించిపోతుందునుకున్న నాకు కథల ద్వారా ఈ కళను కాపాడవచ్చని, ఇంకా ఇష్టంతో కష్టపడేలా చేసింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాల్లోని అమ్మాపురంలో తీగతోలుబొమ్మలాట పునరుద్ధరణ గుర్తించిన వాటిలో ఒకటి. స్కూళ్లలోనూ పప్పెట్రీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. పిల్లలకోసమే వర్క్‌షాప్స్ నిర్వహించాను. ముందుకన్నా పిల్లలంతా ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా మారడం గమనించాను. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకూ దగ్గరయ్యాను. నాన్న మార్గనిర్దేశం.. ఇంట్లో పురాణాలు, ఇతిహాసాలు కథలుగా మా పెద్దలు చెబుతుండేవారు. నేనూ నా తర్వాతి తరానికి అందించడానికి అదే ప్రయత్నం చేశాను. అయితే, తోలుబొమ్మలతో కథలు చెప్పడం మాత్రం మా నాన్న మార్గనిర్దేశం చేశారు. రామాయణ, మహాభారతం, పురాణాల నుండి మాత్రమే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో కథలు చెప్పడం ప్రారంభించాను. తోలుబొమ్మలాట శతాబ్దాలుగా మన జీవనంలో ఇమిడి ఉంది. ఇది వినోదం మాత్రమే కాదు అవగాహన నింపే విద్య కూడా. ఈ కళను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రస్తుత కాలానికి తగినట్టు ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా వింటున్నారు. కథే స్ఫూర్తి స్ఫూర్తి థియేటర్ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ 2005లో ప్రారంభించినప్పటి నుంచి గిరిజన విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఉట్నూర్‌లో ఆరోగ్య సమస్యల గురించి గోండు భాషలో వివరించిన కార్యక్రమం చాలా ప్రశంసలు పొందింది. టైప్ 1 డయాబెటిస్ పిల్లల ఆరోగ్య స్థితిపైనా పప్పెట్రీ వర్క్ చేస్తున్నాను. పుతాలికా మాస పత్రిక కరోనా సమయంలో పుతాలిక పేరుతో నెలవారీగా ఇ–మ్యాగజైన్ తీసుకువస్తున్నాను. ఇది ప్రపంచంలో ఉన్న తోలుబొమ్మల కళాకారులందరినీ పరిచయం చేస్తుంది. దీంతోపాటు పప్పెట్రీ గురించి ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాను. కిందటేడాది స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ లభించింది. దీంట్లో భాగంగా వ్యర్థాలతో ముఖ్యంగా ప్లాసిక్, ఖాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్లలోని దూది, కొబ్బరి చిప్పలు, పాత బట్టలు, పాత టీ స్ట్రెయినర్లు, వార్తాపత్రికలతో బొమ్మలను తయారు చేయిస్తుంటాను. దీనివల్ల వ్యర్థాలను అర్థాలుగా మార్చడం ఎలాగో పిల్లలకు తెలుస్తుంది. మనుగడకు పోరాటం మనదేశంలో తోలుబొమ్మలాట అనేది కుటుంబ సంప్రదాయం. దీనికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సంప్రదాయం అంతరించిపోయే అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉన్నవాళ్లు తమ మనుగడ కోసం వేరే దారులను వెతుకుతున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలలో తోలుబొమ్మలాటలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కళను బతికించడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నాను. ఇందుకోసం నా జీవితాంతం కృషి చేస్తూనే ఉంటాను’ అని వివరించారు పద్మినీ రంగరాజన్. తోలుబొమ్మల ద్వారా పురాణ కథలను ఆసక్తిగా చెప్పడమే కాదు బాల్యవివాహాలను అరికట్టడం, పరిశుభ్రత కోసం ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ.. వంటి సామాజిక సమస్యలపై సమర్థంగా పనిచేసే మాధ్యమం తోలుబొమ్మలు అని తెలిపే పద్మినీ రంగరాజన్ ‘తోలుబొమ్మ కఠినంగా మాట్లాడినా ఎవరూ అంతగా బాధపడరు’ అని నవ్వుతూ వివరిస్తారు. – నిర్మలారెడ్డి -
Padmini Govind: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చి..
పద్మిని గోవింద్, ఒక అందమైన బంధాన్ని ముందు తరాలకు తీసుకువెళ్తున్న చక్కటి అనుబంధానికి ప్రతీక. నలభై ఐదేళ్ల కిందట అమ్మ నాటిన మొక్క మహావృక్షంగా విస్తరించింది. అమ్మకు వయసైపోయింది. ఆ మహావృక్షానికి నీరు పోసేదెవ్వరు? ఆ మహావృక్షం నీడన చల్లగా బతుకుతున్న వాళ్లు ఏమవుతారు? వాళ్లంతా కలిసి ప్రాణం పోసిన తరతరాల కళను ముందు తరాలకు తీసుకు వెళ్లేదెవ్వరు? ఇవన్నీ ఆలోచించిన పద్మిని అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చేసింది. అమ్మ నెలకొల్పిన పరిశ్రమను వారసత్వంగా అందిపుచ్చుకుంది. భారతీయ వారసత్వ కళకు కొండంత ఆసరాగా నిలుస్తోంది. అమ్మకు కళతో అల్లుకుపోయిన బంధానికి పందిరి వేస్తోంది. నాటి ముందడుగు అది 1960, లక్ష్మీ శ్రీవత్స తనకు ఇష్టమైన కళలను శాస్త్రబద్ధంగా అధ్యయనం చేయాలనుకుంది. ఢిల్లీలోని త్రివేణి కళాసంగమ్లో చేరి ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. అక్కడ ఆమెకు కమలాదేవి చటోపాధ్యాయ ఆధ్వర్యంలో పని చేసే అవకాశం వచ్చింది. చదువు పూర్తయి తిరిగి బెంగళూరుకు వచ్చిన తర్వాత ఆమె తన కెరీర్ గురించి సుదీర్ఘంగా ఆలోచించింది. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కూడా మెండుగానే ఉండేవి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్న ఎన్నో ఉద్యోగాలు ఆమె ముందున్నాయి. కానీ కమలాదేవి చటోపాధ్యాయ ప్రభావంపై చేయి సాధించింది. కళను పరిరక్షించడమే వృత్తిగా స్వీకరించాలని నిర్ణయించుకుంది. అద్భుతమైన నిర్మాణశైలిలో ఒదిగిపోయే డిజైన్లను బ్లాక్ ప్రింటింగ్ రూపంలో దుస్తుల మీదకు తీసుకురావడానికి సిద్ధమైంది. మొత్తానికి 1977లో బెంగుళూరులో తరంగిణి స్టూడియోని ప్రారంభించింది. అప్పటికి మహిళలకు కనిపించని పరిధులు పతాకస్థాయిలోనే రాజ్యమేలుతున్నాయి. కాలేజీల్లో ఓ పదిమంది, ఉద్యోగాల్లో ఒకరిద్దరు తప్ప... సమస్త మహిళాలోకానికి ఇంటి నాలుగ్గోడలే ప్రపంచం. అలాంటప్పుడు వస్త్రప్రపంచంలో ఒక మహిళ పరిశ్రమ స్థాపించాలనుకోవడమే పెద్ద సాహసం. ఆ సాహసాన్ని చేసింది లక్ష్మీ శ్రీవత్స. ఆమె ఏ చిత్రలేఖనాన్ని చూసినా అందులో నుంచి బ్లాక్ ప్రింటింగ్‌కు అనుకూలించే ఒక కొత్త డిజైన్‌ను గుర్తించేది. ఏ నిర్మాణాన్ని చూసినా అంగుళం అంగుళం నిశితంగా పరిశీలించేది. ఒక్కొక్క డిజైన్‌కు తన సృజనాత్మకత జోడించి బ్లాక్స్ తయారు చేయించింది. అలా రూపొందించిన బ్లాక్‌లు వేలల్లో పద్మినికి వారసత్వపు మూలధనంగా అందించింది లక్ష్మీ శ్రీవత్స. అమ్మ కళ్లలో వెలుగు పద్మిని కంప్యూటర్ సైన్స్ చదివి యూఎస్ వెళ్లింది. ఉద్యోగం, వివాహం, పిల్లలు... యూఎస్‌లో కొనసాగుతున్న సమయంలో తల్లి ఆరోగ్యం క్షీణించడంతో పద్మిని 2007లో ఇండియాకి వచ్చేసింది. మరో నాలుగేళ్లకు లక్ష్మీ శ్రీవత్స కాలం చేసింది. ఆ సంగతులను గుర్తు చేసుకుంటూ ‘‘అమ్మ తాను ప్రారంభించిన స్టూడియో మీద ప్రాణాలు పెట్టుకుంది. బెంగళూరులో తొలి బ్లాక్ ప్రింటింగ్ స్టూడియో ఇది. ఆమె కళ్ల ముందే ఇలాంటి యూనిట్లు లెక్కకు మించి వచ్చాయి. ఆమె చూస్తుండగానే మిగిలిన యూనిట్లు ఒక్కటొక్కటిగా మూతపడ్డాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఆమె తన స్టూడియోను వదల్లేదు. ఆ స్టూడియో మీద ఆధారపడిన జీవితాలకు మరో ఆసరా కావాలి కదా అనేది. అలాంటి అమ్మ... తన ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ‘ఈ బరువును మీరు మొయ్యలేరు. మెల్లగా వదిలేయండి’ అని చెప్పింది. అయితే... ఆ మాట ఆమె మనస్ఫూర్తిగా అనడం లేదని ఆమె గొంతు చెప్పింది. నేను ఈ బాధ్యతను కొనసాగిస్తాను’’ అని మాటిచ్చాను. అప్పుడు ఆమె కళ్లలో మెరుపులాంటి సంతోషాన్ని చూశాను’’ అని చెప్పింది పద్మిని. కష్టకాలాన్ని గట్టెక్కాం ‘‘తరంగిణి స్టూడియోలో పని చేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్లే వారాంతపు సెలవులుంటాయి. స్టూడియోలో పని చేసే వాళ్లను మా అమ్మ ఎప్పుడూ తన కింద ఉద్యోగులుగా చూడలేదు. అందరూ కలిసి చేసే పనికి తానొక ఫెసిలిటేటర్ని అనేది. మెడికల్ ఇన్సూరెన్స్, ఇంక్రిమెంట్‌తోపాటు సంవత్సరం చివరిలో లెక్క చూసుకుని మిగులును బోనస్‌గా అందరికీ పంచేది. భగవంతుడి దయ వల్ల కరోనా క్లిష్టపరిస్థితుల్లో కూడా మా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించగలిగాం’’ అని వివరించింది 45 ఏళ్ల తరంగిణి స్టూడియోకి ఈ తరం నిర్వహకురాలు పద్మినీ గోవింద్. చదవండి: Nalini Jameela: అందుకే ‘పడుపు వృత్తి’లోకి.. కానీ ఇప్పుడు ఆమె.. -
రిషికపూర్ నా ప్రాణదాత
రిషికపూర్, పద్మినీ కొల్హాపూరి అనగానే ట్రైన్ మీద సాగే ‘హోగా తుమ్ సే ప్యారా కౌన్.. హే కంచన్’ పాట గుర్తుకొస్తుంది. ‘జమానే కో దిఖానాహై’, ‘ప్రేమ్‌రోగ్’, ‘హవాలాత్’ తదితర సినిమాల్లో వీరు నటించి హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందారు. ఇటీవల ‘ఇండియన్ ఐడెల్ 12’ ఎపిసోడ్ కోసం పాల్గొన్న (ఈ శనివారం టెలికాస్ట్ అవుతుంది) పద్మినీ కొల్హాపురి రిషి కపూర్‌ను తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ‘జమానే కో దిఖానాహై సినిమా సెట్లో, ఆ తర్వాత ప్రేమ్‌రోగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. రెండుసార్లూ రిషి కపూర్ నన్ను కాపాడారు. ఆయన చాలామంచి మనిషి. ఎదుటివాళ్లకు సాయం చేయడానికి తప్పకుండా ముందుండేవారు. ఆయన మనందరికి దూరం కావడం బాధాకరం’ అని చెప్పి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పద్మినీ కొల్హాపురి ఒక కాలంలో అత్యంత బిజీ హీరోయిన్గా బాలీవుడ్లో వెలిగారు. 1985లో ఆమె, మిథున్ చక్రవర్తి నటించిన ‘ప్యార్ ఝక్తా నహీ’ అతి పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ఇది కృష్ణ, శ్రీదేవిల ‘పచ్చని కాపురం’గా వచ్చింది. పద్మినీ కొల్హాపురి నటి శ్రద్ధా కపూర్‌కు పిన్ని. పద్మిని అక్కను నటుడు శక్తికపూర్ వివాహం చేసుకున్నాడు. -
హోదా పక్కన పెట్టి.. కొడవలి చేత పట్టి
సాక్షి, జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా శాసనసభలో అడుగిడిన పలువురు ఆదివాసీ ప్రజా ప్రతినిధులు వారు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా తమ అసలైన జీవితాన్ని ఎన్నడూ మరువలేదని పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. ఇటీవల నవరంగపూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి నాగలి పట్టి పొలం దున్ని వ్యవసాయం చేసిన ఫొటోలు సోషల్ మీడియా, వార్తా పత్రికలలో ప్రజలను ఆకర్షించాయి. నేడు అటువంటి మరో సంఘటన జిల్లా ప్రజలను ఆకట్టుకుంది. కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ శాసనసభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి అలంకరించిన పద్మిని ధియాన్ కొట్‌పాడ్ సమితిలోని దమనహండి గ్రామంలో గల తమ సొంత పొలంలో పండిన వరి చేనును బుధవారం స్వయంగా కొడవలి పట్టి ఇతరులతో కలిసి కోశారు. గతంలో తమతో పాటే పొలం పనులు చేసినా మంత్రి అయిన తరువాత కూడా ఆమె హోదాను పక్కన పెట్టి కొడవలి పట్టి వరి చేను కోయడం ఆమె నిరాడంబరతకు దర్పణం పడుతోందని ఆ ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు. చదవండి: (వైరల్ వీడియో.. పోలీసుపై ప్రశంసలు) -
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెన్నై: ఆసియా ఆన్లైన్ నేషన్స్ కప్ టీమ్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత మహిళల జట్టు... ప్రిలిమి నరీ దశను అగ్రస్థానంతో ముగించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ప్రిలిమినరీ దశలో ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. మొత్తం 16 పాయింట్లతో టీమిండియా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఏడో మ్యాచ్‌లో భారత్ 3–1తో ఫిలిప్పీన్స్‌పై... ఎనిమిదో మ్యాచ్‌లో 2.5–1.5తో కజికిస్తాన్‌పై... తొమ్మిదో మ్యాచ్‌లో 2.5–1.5తో వియత్నాంపై విజ యాలను నమోదు చేసింది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ నందిత, మేరీఆన్ గోమ్స్ విజయాలు సాధించగా... వైశాలి, పద్మిని తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. కజికిస్తాన్‌తో జరిగిన పోరులో భక్తి ‘డ్రా’ చేసుకోగా... వైశాలి, పద్మిని, నందిత నెగ్గారు. వియత్నాంతో జరిగిన పోరు లో వైశాలి, మేరీఆన్ గోమ్స్ గెలిచారు. పద్మిని ‘డ్రా’ చేసుకోగా... భక్తి ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత్ ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. ఈ నెల 23న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిస్తాన్‌తో భారత మహిళల జట్టు... మంగోలియాతో పురుషుల జట్టు తలపడనున్నాయి. -
తేట తెలుగు వనిత
మాతృభాష అనేకన్నా మదర్‌టంగ్ అంటేనే తొందరగా అర్థమవుతుంది.. ఇది నేటిపరిస్థితి. కెరీర్అవకాశాలే లక్ష్యంగా సాగుతున్న నేటిచదువుల్లో మాతృభాష అధ్యయనంపై దృష్టితగ్గుతోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు చక్కటి తెలుగు తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువ. రేపటి తరాలు తెలుగు భాషకు మరింత దూరమయ్యేఅవకాశాలు లేకపోలేదు. అచ్చంగా తెలుగు ద్వారా నెట్లో తెలుగు రాసే వారి సంఖ్యను, తెలుగు మాట్లాడేవారి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం.– భావరాజు పద్మిని సాక్షి,సిటీబ్యూరో: ‘కాఫీ సరస్సు లాంటిది.. నిర్ణీత పాలల్లో పాలు చక్కెర, డికాషన్ కలిస్తేనే దానికి రుచి. కానీ టీ సముద్రం లాంటిది. తనతో ఏ ఫ్లేవర్నైనా కలుపుకు పోతుంది.. ఆ పరిమళాన్ని ఆపాదించుకుని, కొత్త రుచిని సంతరించుకుంటుంది’.. ఈ మాటలు అచ్చంగా ‘తెలుగు ఆన్లైన్’ మాసపత్రిక ఎడిటర్ భావరాజు పద్మిని రాసినవి. నిజంగా ఆమె కూడా ఇంతే, కొత్త పరిమళాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తూ, కొత్తదనాన్ని అందుకుంటూ, పంచుకుంటూ సాగుతున్నారు. ఇంట్లో ఉండి ఏం చెయ్యగలం అని డీలా పడే మహిళలెంతో మందికి మహిళలు ఎక్కడున్నా అనుకున్నది సాధించగలరని ఆదర్శంగా నిలుస్తున్నారు. వీణ వాయిద్యం, సంగీతం, సంప్రదాయ నృత్యాల్లో ప్రవేశమున్న పద్మిని లాభాపేక్షతో కాకుండా ఆసక్తితో ఏడేళ్లుగా తెలుగు భాషకు తనవంతు సేవ చేస్తున్నారు. తెలుగులో ఈ మెయిల్స్ రాయటం నుంచి 60 వేల సభ్యులుతో తెలుగు గ్రూపుని, తెలుగు ఆన్లైన్ మ్యాగ్జైన్ని, 10కి పైగా బ్లాగులను, యూట్యూబ్ చానల్స్‌ని నిర్వహిస్తున్నారు. వీలైనంత మందితో తెలుగులో రాయించటం, చదివించటం తెలుగు బిడ్డగా నా కర్తవ్యంమంటున్న పద్మిని చెప్పిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే.. మాటా.. మంతీ.. ఎల్బీ శ్రీరాంతో.. గుంటూరు దగ్గరలో చిన్న పల్లెలో పెరిగాను. నాన్న కృష్ణ ప్రసాద్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ పద్మావతి గృహిణి. అమ్మ చాలా కథలు చెప్పేది. ముగ్గులు, కుట్లు, అల్లికలతో పాటు వీణ వాయించటం కూడా నేర్పించారు. అమ్మ చెప్పిన కథలే సాహిత్యం వైపు నడిపించాయి. ప్రభుత్వ తెలుగు మీడియంలో చదువుకున్నాను. పాఠాలు బాగా చెప్పేవారు. పండగలప్పుడు పాటలు, కథలు రాయించేవారు. అది రచన వైపుకి మళ్లించింది. ఇంటర్ కాగానే హైదరాబాద్ వచ్చేశాం. డిగ్రీ చదువుతున్నప్పుడే కథ రాశాను. కొత్తగా నగరానికి వచ్చిన మాకు అన్నీ విచిత్రంగా కనిపించేవి. అప్పట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఇంటికి రావడానికి చాలా రోజులు పట్టేది. ఎన్నో చోట్లకి ఒకరి ఇంటి నుంచి ఇంకో ఇంటికి తిరిగి తిరిగి వచ్చేది. దీనినే ‘చక్రభ్రమణం’ పేరుతో కథగా రాశాను. నగరంలో పూలు దొరక్కపోవటంపై ‘మహానగరంలో మందారపువ్వు’ కథ రాసాను. తర్వాత నుంచి నా రచనలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కొన్ని ఆన్లైన్లోను వచ్చాయి. ఉద్యోగం చేయకున్నా.. చదువులో క్లాస్‌లో టాపర్‌ని. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీతో పాటు బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సు పూర్తి చేశాను. పెళ్లికి ముందు లెక్చరర్‌గా పనిచేశాను. పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం చేయడం సాధ్యం కాదని తెలిసింది. జీమెయిల్లో తెలుగు టైపింగ్ 2011లో వచ్చింది. అప్పటి నుంచి అందరికీ తెలుగులో మెయిల్స్ పంపించేదాన్ని. చదివిన వారు, చాలా మంది బాగుందని ప్రోత్సహించే వారు. దాంతో 2012లో ఫేస్బుక్లో అచ్చంగా తెలుగు పేజీని ప్రారంభించాను. రోజు జరిగే విషయాలను సరదాగా ఉండేలా రాసి పోస్ట్ చేసే దాన్ని. అలా ఫేస్బుక్ గ్రూప్‌లో 60 వేల మంది చేరారు. ఐదేళ్ల క్రితం ఆన్లైన్ పత్రికను ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకి సాహిత్య వారధిలా పనిచేస్తోంది. ఫ్రీలాన్సర్‌గా రేడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏడాదిగా డిడి యాదగిరి లో ’సాహితీ సౌరభాలు’ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నాను. ‘మైండ్ మీడియా’ ఆన్లైన్ రేడియోకు ప్రోగ్రాం డైరెక్టర్‌గా పని చేశాను. ఈ ప్రస్థానంలో అనేకమంది సాహిత్యదిగ్గజాలను కలుసుకున్నాను. సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి, భువనచంద్ర నా రచనలు చదివి ప్రశంసించడం మరువలేను. అప్పుడు ఒక్కదాన్నే.. ఇప్పుడు ఎంతో మంది సహకారం తోడైంది. -
‘పద్మినీ రెడ్డి బీజేపీ సానుభూతిపరురాలు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి వ్యవహారంలో అభాసుపాలైన బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం తమ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపబోదని చెప్పుకొచ్చింది. పద్మినీ రెడ్డి తమ పార్టీ సానుభూతిపరురాలని బీజేపీ శాసనసభ పక్ష మాజీ నేత జి. కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా పార్టీలో చేరాలనుకుని వచ్చిన ఆమెను స్వాగతించాం. ఏమి ఇబ్బంది అయిందో తెలియదు. తర్వాత ఆమె మనసు మార్చుకున్నార’ని పేర్కొన్నారు. (చదవండి: మధ్యాహ్నం బీజేపీకి జై.. రాత్రి సొంతగూటికి..) ప్రత్యేక తెలంగాణ వద్దన్న మజ్లిస్ పార్టీని భుజాన వేసుకున్న టీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీఠ వేసి పాలన చేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు కచ్చితంగా తెలంగాణ ప్రజలు తమ చైతన్యాన్ని రుచి చూపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు తగిన శాస్తి చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, మహిళా మంత్రిలేని కేబినెట్ చూసి ప్రజలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయనందుకు, గిరిజన రిజర్వేషన్ల వ్యవహారంలో కేసీఆర్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ టూ కాంగ్రెస్ వయా బీజేపీ
-
దామోదర సమేత పద్మిని..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి పార్టీ మార్పు అంశం లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యకర పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్న పద్మిని.. రాత్రికల్లా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలు నచ్చే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. నిర్ణయం మార్చు కున్నారు. తన భర్త దామోదర రాజనర్సింహ, కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకొని తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అటు, పద్మిని పార్టీ మార్పుతో కలవరం చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. కథ సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా బీజేపీలోకి! రాజకీయంగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అనూహ్యంగా పద్మినీరెడ్డి గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికపై మీడియా, బీజేపీలోని కీలక నేతలు, జిల్లా నేతలకు కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ వార్తలు మొదట బీజేపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రముఖ ఆ«ధ్యాత్మికవేత్త, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పద్మినీ రెడ్డి.. బీజేపీలో చేర్చే దిశగా పావులు కదిపినట్టు సమాచారం. పద్మిని చేరిక సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఆమె చేసిన సేవలను కొనియాడారు. సామాజిక సేవలో ముందుండే పద్మినీ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని, సేవా రంగంలో ఆమెకు మంచి పేరుందని ప్రశంసించారు. ఆమె రాకతో పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఆమె సేవలను బీజేపీ తప్పకుండా వినియోగించుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. కొండగట్టులో మొక్కులు తీర్చుకొని, బీజేపీ గెలుపు కోసం ప్రార్థించి నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి పద్మినీ రెడ్డి తమ పార్టీలో చేరారని చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో పద్మిని చేసిన కృషి మరువలేమన్నారు. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతందన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాల, ప్రజోపయోగ కార్యక్రమాలు నచ్చే బీజేపీలో చేరానని పద్మినీ రెడ్డి వెల్లడించారు. గతంలో తాను కాంగ్రెస్ టికెట్ అడిగిన మాట వాస్తవమేనని.. అయితే ఈసారి మాత్రం టికెట్ ఆశించట్లేదన్నారు. సంగారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘అవకాశం ఇస్తే పోటీ చేస్తాన’న్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన తన భర్త (రాజనర్సింహ)పై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయమై మాట్లాడబోనన్నారు. కాంగ్రెస్‌లో కలకలం.. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీని విస్మయానికి గురిచేసింది. అటు పార్టీ వర్గాలు కూడా విస్మయానికి గురయ్యాయి. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, మేనిఫెస్టో తయారీలో దామోదర బిజీగా ఉన్న సమయంలో ఈ పరిణామం చోటచేసుకోవడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగాలని పద్మిని భావించారని.. అది కుదిరే అవకాశాలు లేకపోవడంతోనే (కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇవ్వాలన్న అధిష్టానం నిర్ణయంతో) ఆమె బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. ఈ పరిణామం వ్యక్తిగతంగా దామోదరకు, పార్టీకి ఇబ్బంది పెట్టే అంశమేనని గాంధీభవన్‌లో చర్చ జరిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆందోల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న దామోదరతో పార్టీ సీనియర్లు మాట్లాడారు. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలను ఆయన వద్దకు పంపి పార్టీకి నష్టం కలగకుండా చూడాలని కోరారు. దీనిపై వివరణ ఇచ్చిన దామోదర.. ఆమెది తొలి నుంచీ స్వతంత్రంగా వ్యహరించే మనస్తత్వమని పేర్కొన్నారు. అయినా పార్టీకి నష్టం జరుగకుండా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యకర్తల ఒత్తిడితోనే ఈ అంశమై వెంటనే రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో ఉన్న పద్మినితో ఫోన్లో మట్లాడారు. కీలక సమయంలో పార్టీ మార్పుతో వ్యక్తిగతంగా తనకు, పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. ఇదే సమయంలో ఆందోల్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు వాహనాల్లో హైదారాబాద్‌లోని పద్మిని నివాసానికి చేరుకొని ఆమె వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా కార్యకర్తలు కన్నీరుపెట్టుకున్నారు. కీలక సమయంలో పార్టీ మార్పు సరైన నిర్ణయం కాదని.. కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీయొద్దని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ సహా కొందరు మహిళా నేతలు ఆమెకు విన్నవించారు. పద్మిని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే.. ఆత్మహత్యలకు వెనుకాడబోమని కొందరు యువకులు హెచ్చరించినట్లుగా తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన పద్మిని ఫోన్లో దామోదరతో మాట్లాడారు. ఆయన సూచన మేరకు సంగారెడ్డి చేరుకొని తన పార్టీ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పద్మినీ తిరిగి కాంగ్రెస్‌గూటికి చేరడంలో ఆమె కూతురు త్రిష పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నా: పద్మినీరెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీలో చేరాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని వెల్లడించారు. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆమె గురువారం రాత్రి సంగారెడ్డిలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘కార్యకర్తల మనోవేదనను దృష్టిలో పెట్టుకుని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఇంత రియాక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు. అదంతా (బీజేపీలో చేరడం) అనుకోకుండా జరిగింది. కార్యకర్తల బాధను చూడలేకపోతున్నా’ అని పద్మిని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పద్మిని వెంట టీపీసీసీ నాయకురాలు ఇందిర శోభన్, కాటా సుధారాణి ఉన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్
-
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో రాజకీయ వర్గల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌లు గురువారం ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువాతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ ‘పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతమవుతుంది. దేవాలయాల పునరుద్దరణలో ఆమె కృషి అభినందనీయం. రాబోయే రోజులో వారి సేవలు వినియోగించుకుంటాం. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై పద్మినీ బీజేపీ పార్టీలో చేరార’ని తెలిపారు. మహిళా రుణాలు పూర్తిగా మాఫీ బీజేపీలోకి పద్మినీ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నా తప్పేం కాదని, ఆ స్వేచ్చ వారికి ఉందని తెలిపారు. మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఉంటుందని వెల్లడించారు. దామోదరకు సంకటం కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండటం ఏంటని చర్చించుకుంటున్నారు. తన సతీమణి ప్రత్యర్థి పార్టీలో చేరడంతో మున్ముందు దామోదరకు ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు ఆయన ఏవిధంగా కాచుకుంటారో చూడాలి. అయితే బీజేపీలో చేరేందుకు పద్మినీ రెడ్డి తన భర్తను అనుమతి తీసుకున్నారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
ప్రొడ్యూసర్స్ సెక్టార్ అధ్యక్షుడిగా రమేశ్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల విభాగానికి (ప్రొడ్యూసర్స్ సెక్టార్) అధ్యక్షునిగా అశోక్, ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, గోపి గోపిక గోదావరి తదితర చిత్రాలు నిర్మించిన వల్లూరిపల్లి రమేశ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పద్మిని–బాబ్జీ, కార్యదర్శులుగా బోడపాటి మురళి–రాజేశ్వరి ఎన్నికయ్యారు. -
హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’
టెహరాన్ (ఇరాన్): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. సొపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో... తాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన పద్మిని 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. శనివారం జరిగే రెండో రౌండ్లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక, పద్మిని
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్ టెహరాన్ : ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. గురువారం జరిగిన రెండో రౌండ్ టైబ్రేక్ పోరులో వీరిద్దరు తమ ప్రత్యరు్థలను 1.5–0.5 పాయింట్ల (ఓవరాల్‌గా 2.5–1.5) తేడాతో ఓడించారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్ )తో జరిగిన తొలి టైబ్రేక్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడి హారిక 57 ఎతు్తల్లో విజయం సాధించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండో గేమ్ 49 ఎతు్తల్లో డ్రాగా ముగియడంతో హారికను విజయం వరించింది. జావో జుయ్ (చైనా)తో జరిగిన టైబ్రేక్‌లో కూడా పద్మిని తొలి గేమ్‌ను 65 ఎతు్తల్లో గెలుచుకుంది. నల్ల పావులతో ఆడినా పద్మిని దూకుడు ప్రదర్శించింది. రెండో గేమ్ 76 ఎతు్తల్లో డ్రాగా ముగిసింది. ఫలితంగా ఆమె కూడా ముందంజ వేసింది. -
హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ తమ రెండో రౌండ్ రెండో గేమ్‌లను కూడా ‘డ్రా’ చేసుకున్నారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను హారిక 22 ఎత్తుల్లో... జావో జుయ్ (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని కూడా 22 ఎత్తుల్లో నే ‘డ్రా’గా ముగించారు. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత హరిక–దినారా... పద్మిని–జాయ్ జుయ్ స్కోర్లు 1–1తో సమమయ్యాయి. దాంతో గురువారం వీరి మధ్యనే టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. గెలిచినవారు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
బాలిక అనుమానాస్పద మృతి
వేటపాలెం: ఓ బాలిక పురుగుమందు తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక బీబీహెచ్ జూనియర్ కళాశాల ఎదుట బుధవారం జరిగింది. వివరాలు.. పేరాలకు చెందిన పోగుల బ్రహ్మయ్యకు ఇద్దరు కుమార్తెలు. 9 ఏళ్ల కిందట భార్య చనిపోయింది. బ్రహ్మయ్య ఇల్లు వదిలి ఎటో వె ళ్లిపోయాడు. ఇద్దరు కుమార్తెలను వేటపాలెం నాయినపల్లికి చెందిన మేనమామ చుండూరి శ్రీనివాసరావు తీసుకెళ్లి పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట మద్దులూరి సీతామహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు బాలిక పద్మినిని తమ ఇంటికి తీసుకెళ్లారు. బాలికతో వారు ఇంటి పనులు చేయించుకుంటున్నారు. దుస్తులు సరిగా సర్దలేదని ఇంటి యజమాని బాలికను మందలించింది. మనస్తాపం చెంది ఇంట్లో పూల మొక్కలకు ఉపయోగించే పురుగుమందు తాగింది. ఇంటి యజమాని స్థానిక వైద్యుల వద్ద బాలికకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందింనట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఇంటి యజమాని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎండీ షరీఫ్ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆ తంతును ఆపించారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, రూరల్ సీఐ ఎండీకే ఆల్తాఫ్‌హుసేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించారు. మృత దేహన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!
దేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా.. లింగమార్పిడి చేయించుకున్న ఓ మహిళ న్యూస్‌రీడర్‌గా అవతారం ఎత్తింది. దాంతో ఇప్పటికి తనకు సామాజికంగా, వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాత్రి 7 గంటలకు ఆమె తొలిసారిగా కెమెరా ముందు నిలబడి లోటస్ న్యూస్ ఛానల్ స్టూడియోలో వార్తలు చదివింది. ఇంతకుముందు ఆమె కొన్ని టీవీ సీరియళ్లలో నటించింది. ఇంతకాలం ఆమెకు రకరకాల ఒత్తిళ్లు వచ్చాయి. ప్రధానంగా లింగమార్పిడి చేయించుకున్నవాళ్ల హక్కుల కోసం ఉద్యమించినప్పుడు, తమపై చూపుతున్న వివక్షకు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఆమెకు వచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఎట్టకేలకు న్యూస్ రీడర్‌గా రావడంతో అవన్నీ తొలగిపోయాయని చెబుతోంది. ఇది పెద్ద బాధ్యతేనని, ప్రత్యక్షంగా చదువుతున్నప్పుడు ఏ చిన్న తప్పు రాకుండా చూసుకోవాలని అంటోంది. మొదట్లో తాను కొంత భయపడ్డానని, కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా తనను అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి ప్రసారమయ్యే లోటస్ న్యూస్ ఛానల్లో ప్రతిరోజూ రాత్రి 7గంటలకు ప్రసారమయ్యే బులెటిన్‌లో ఆమెను చూసేందుకే చాలామంది టీవీలు పెడుతున్నారట! -
విచక్షణ మూవీ స్టిల్స్
-
సంగారెడ్డి నుంచి పోటీ చేస్తా: పద్మిణి