
హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ తమ రెండో రౌండ్ రెండో గేమ్‌లను కూడా ‘డ్రా’ చేసుకున్నారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను హారిక 22 ఎత్తుల్లో... జావో జుయ్ (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని కూడా 22 ఎత్తుల్లో నే ‘డ్రా’గా ముగించారు.
నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత హరిక–దినారా... పద్మిని–జాయ్ జుయ్ స్కోర్లు 1–1తో సమమయ్యాయి. దాంతో గురువారం వీరి మధ్యనే టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. గెలిచినవారు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.