
హారిక విజయం
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక శుభారంభం చేసింది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 47 ఎత్తు ల్లో విజయం సాధించింది. రెండు గేమ్‌ల మ్యాచ్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నానా జాగ్‌నిద్జెతోనే మంగళవారం జరిగే రెండో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది.