ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. షమీమా (బంగ్లాదేశ్)తో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది. టైబ్రేక్ తొలి గేమ్‌లో హారిక 49 ఎత్తుల్లో గెలిచి... రెండో గేమ్‌ను 75 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మంగళవారం జరిగే రెండో రౌండ్ తొలి గేమ్‌లో దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో హారిక తలపడుతుంది.