Quarter-final
-
Qatar FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్
అమెరికాకు తొలి నాకౌట్ దెబ్బ పడింది. నెదర్లాండ్స్ మొదటి క్వార్టర్స్ బెర్తు సాధించింది. ప్రపంచకప్‌లో లీగ్ దశ వెనువెంటనే మొదలైన నాకౌట్ పోరులో మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్ 3–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. డచ్ డిఫెండర్లు ప్రత్యర్థి స్ట్రయికర్లను నిలువరించగా... ఫార్వర్డ్ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో సఫలమయ్యారు. దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డచ్ టీమ్ 3–1 గోల్స్ తేడాతో అమెరికాపై జయభేరి మోగించింది. నెదర్లాండ్స్ ఆటగాడు డెంజెల్ డంఫ్రైస్ అసాధారణ ఆటతీరు కనబరిచాడు. డచ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలి రెండు గోల్స్‌కు మెరుపు పాస్‌లు అందించిన డెంజెల్... ఆట ముగింపు దశలో స్వయంగా తనే గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యానికి ఎదురేలేకుండా పోయింది. డచ్ తరఫున మెంఫిస్ డిపే (10వ ని.), డెలీ బ్లైండ్ (ఇంజ్యూరి టైమ్ 45+1వ ని.), డంఫ్రైస్ (81వ ని.) గోల్ చేశారు. అమెరికా జట్టులో హజి రైట్ (76వ ని.) గోల్ సాధించాడు. ఆట ఆరంభంలో అమెరికా స్ట్రయికర్లే నెదర్లాండ్స్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. రెండో నిమిషం నుంచే అమెరికా గోల్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫినిషింగ్ లోపాలతో ఏ ఒక్కటి సఫలం కాలేదు. అయితే ఆట పదో నిమిషంలో కళ్లు చెదిరే గోల్‌కు డంఫ్రైస్ కారణమయ్యాడు. ప్రత్యర్థి డి ఏరియాకు సమీపంలో కుడివైపు నుంచి డంఫ్రైస్ దూసుకొస్తూ ఇచ్చిన క్రాస్పాస్ను మెంఫిస్ డిపే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే మెరుపువేగంతో గోల్‌కీపర్‌కు అవకాశం లేకుండా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. మళ్లీ తొలి అర్ధభాగం స్టాపేజ్ (ఇంజ్యూరి టైమ్)లో అదే రకమైన క్రాస్ పాస్‌ను డెలీ బ్లైండ్‌కు ఇవ్వగా అతను కూడా చాకచక్యంగా బంతిని లక్ష్యం చేర్చడంలో సఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో అమెరికా బృందంలో 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ అయిన హజి రైట్ (76వ ని.) వచ్చిన 9 నిమిషాలకే అమెరికాకు గోల్ చేసి పెట్టాడు. డచ్ ఆధిక్యం 2–1కు తగ్గిన కాసేపటికే డంఫ్రైస్ మళ్లీ గర్జించాడు. ఈసారి తానే ఏకంగా గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో 81వ నిమిషంలో నెదర్లాండ్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మ్యాచ్‌లో డచ్‌ను నడిపించిన డెంజెల్ డంఫ్రైస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అర్జెంటీనా–ఆస్ట్రేలియా మ్యాచ్ విజేతతో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది. ప్రపంచకప్‌లో నేడు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) ఫ్రాన్స్ X పోలాండ్ రాత్రి గం. 8:30 నుంచి ఇంగ్లండ్ X సెనెగల్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డంఫ్రైస్ -
పసిడిపై గురి
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం క్వార్టర్ ఫైనల్లో 6–0తో చి చుంగ్ టాన్, యు చెంగ్ డెంగ్, చున్ హెంగ్ చెలతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తొలి సెట్‌ను 55–52తో, రెండో సెట్‌ను 55–48తో, మూడో సెట్‌ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు. సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో వాన్ డెన్ బెర్గ్, వాన్ డెర్ వెన్, స్టీవ్ విజ్లెర్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టుపై గెలిచింది. తొలి సెట్‌ను నెదర్లాండ్స్ 56–54తో, రెండో సెట్‌ను భారత్ 52–49తో, మూడో సెట్‌ను నెదర్లాండ్స్ 57–56తో, నాలుగో సెట్‌ను భారత్ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించగా... భారత్ 29–28తో నెదర్లాండ్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. చివరిసారి 2005లో భారత్ ఫైనల్ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్‌దీప్ రాయ్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ పోటీపడుతుంది. -
సైనా... వరుసగా 13వ‘సారీ’
బర్మింగ్హమ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్స్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 18 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరదించుతారని భావిస్తే అలాంటిదేమీ జరగలేదు. మనోళ్లందరూ కనీసం క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయారు. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. 2015లో రన్నరప్‌గా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ నంబర్‌వన్, చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. 37 నిమిషాల్లోనే ముగిసిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 15–21, 19–21తో టాప్ సీడ్ తై జు యింగ్ చేతిలో ఓటమి చవిచూసింది. గతేడాది ఇదే టోర్నీ తొలి రౌండ్లో తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ చైనీస్ తైపీ చేతిలో ఆమెకిది 15వ ఓటమి. 2013లో స్విస్ ఓపెన్‌లో చివరిసారి తై జు యింగ్‌పై గెలిచిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణిని ఓడించలేకపోయింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. రెండో గేమ్‌లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్‌ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్‌కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 16–21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మొమోటా చేతిలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్‌కిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. వాంతులు, విరేచనాలతో బాధపడ్డాను. కడుపులో నొప్పి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌లు ఆడి గెలవగలిగాను. తై జు యింగ్‌తో పదే పదే ఆడటం మంచిదే. ఆమెను ఎలా ఓడించాలనే విషయం నేర్చుకోవాల్సి ఉంది. సైనా నెహ్వాల్ -
క్వార్టర్స్‌లో అర్జెంటీనా
భువనేశ్వర్: రియో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనా హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–5 గోల్స్ తేడాతో 20వ ర్యాంకర్ ఫ్రాన్స్ చేతిలో ఓడినా పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో నేరుగా క్వార్టర్స్ చేరింది. ఈ మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఫ్రాన్స్ క్రాస్ ఓవర్ గేమ్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు ఆచితూచి ఆడినా... రెండో క్వార్టర్లో దూకుడు పెంచిన ఫ్రాన్స్ ఐదు గోల్స్‌తో దుమ్మురేపింది. గెనెస్టాట్ హ్యూగో (18వ నిమిషంలో), చార్లెట్ విక్టర్ (23వ నిమిషంలో), కాయిస్ అరిస్టిడ్ (26వ నిమిషంలో), బూమ్గార్టెన్ గాస్పర్డ్ (30వ నిమిషంలో), ఫ్రాన్సిస్ గోయెట్ (54వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు. అర్జెంటీనా తరఫున గొన్జాలో (44వ, 48వ నిమిషాల్లో) రెండు, మార్టినెజ్ లుకాస్ (28వ నిమిషంలో) ఒక గోల్ సాధించిన తమ జట్టును గెలిపించలేకపోయారు. స్పెయిన్, న్యూజిలాండ్ మ్యాచ్ ‘డ్రా’ స్పెయిన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. స్పెయిన్ తరఫున అల్బర్ట్ బెల్ట్రాన్ (9వ నిమిషంలో), అల్వారో ఇగ్లేసియాస్ (27వ నిమిషంలో) చెరో గోల్ చేయగా... న్యూజిలాండ్ తరఫున ఫిలిప్స్ (50వ నిమిషంలో), కేన్ రసెల్ (56వ నిమిషంలో) గోల్స్ చేశారు. పూల్ ‘ఎ’లో లీగ్ మ్యాచ్‌లు పూర్తి కావడంతో అగ్రస్థానంలో నిలిచిన అర్జెంటీనా (6 పాయింట్లు) నేరుగా క్వార్టర్స్ చేరగా... రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఫ్రాన్స్ (4 పాయింట్లు), న్యూజిలాండ్ (4 పాయింట్లు) క్రాస్ ఓవర్ గేమ్‌కు అర్హత సాధించాయి. -
శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ
టోక్యో: గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది మాత్రం కలిసి రావడంలేదు. తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–19, 16–21, 18–21తో ప్రపంచ 33వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడు గేమ్‌లూ హోరాహోరీగా సాగాయి. అయితే కీలకదశలో లీ డాంగ్ పైచేయి సాధించాడు. శ్రీకాంత్‌పై లీ డాంగ్కిది వరుసగా రెండో విజయం. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ శ్రీకాంత్‌పై మూడు గేముల్లో లీ డాంగ్ గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–15, 21–14తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి ఆసియా క్రీడల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ (భారత్) 14–21, 17–21తో గిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గావో ఫాంగ్‌జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 19–21తో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 18–21, 21–16, 12–21తో హీ జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 16–21తో చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
వైరల్: వింబుల్డన్‌లో క్రికెట్!
లండన్ : వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ కదా.. క్రికెట్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? లేక వింబుల్డన్ పేరిట క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారా? అని అనుకుంటున్నారా? ఇలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇది టెన్నిస్ కోర్టు మైదానంలో జరిగిందే. అవును రికార్డుస్థాయిలో ఎనిమిది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరరే కోర్టులో టెన్సిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్ షాట్ ఆడాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ సంధర్బంగా ఫెడరెర్ డిఫెన్స్ షాట్స్‌ను సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అభిమానులే కాదు వింబుల్డన్ అధికారిక ట్విటర్లో ఐసీసీని ట్యాగ్ చేస్తూ అధికారులు ట్వీట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అడ్రియన్ మనారినోపై అలవోకగా గెలిచాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు. Ratings for @rogerfederer's forward defence, @ICC?#Wimbledon pic.twitter.com/VVAt2wHPa4 — Wimbledon (@Wimbledon) July 9, 2018 -
ఎదురులేని ఫెడరర్
లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 6–0, 7–5, 6–4తో అలవోకగా గెలిచాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 36 ఏళ్ల ఫెడరర్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. 20 అనవసర తప్పిదాలు చేసిన అతను 44 విన్నర్స్ కొట్టాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ఓవరాల్‌గా అతని కెరీర్లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ ఆడతాడు. నాదల్ కూడా... మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6–3, 6–3, 6–4తోజిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్) 4–6, 7–6 (7/5), 7–6 (12/10), 6–1తో గుల్బిస్ (లాత్వియా)పై, జాన్ ఇస్నెర్ (అమెరికా) 6–4, 7–6 (10/8), 7–6 (7/4)తో సిట్సిపాస్ (గ్రీస్)పై, రావ్‌నిచ్ (కెనడా) 6–3, 6–4, 6–7 (5/7), 6–2తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (7/4), 7–6 (7/2), 5–7, 7–6 (7/3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. సెరెనా సునాయాసంగా... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) సునాయాస విజయంతో 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6–2, 6–2తో రొడీనా (రష్యా)ను ఓడించింది. మరోవైపు ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–7 (1/7)తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలైంది. ప్లిస్కోవా ఓటమితో మహిళల సింగిల్స్‌లో టాప్–10 సీడెడ్ క్రీడాకారిణిలందరూ క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిదారి పట్టడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కెర్బర్ (జర్మనీ) 6–3, 7–6 (7/5)తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 7–6 (7/4), 6–0తో సస్నోవిచ్ (బెలారస్)పై, జూలియా జార్జెస్ (జర్మనీ) 6–3, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, కామిలా గియోర్గి (ఇటలీ) 6–3, 6–4తో మకరోవా (రష్యా)పై, సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–1తో సె సు–వె (చైనీస్ తైపీ)పై, దరియా కసత్కినా (రష్యా) 6–7 (6/8), 6–3, 6–2తో అలీసన్ వాన్ ఉత్వానక్ (బెల్జియం)పై గెలిచారు. మంగళవారం జరిగే క్వార్టర్స్‌లో సిబుల్కో వాతో ఒస్టాపెంకో; కసత్కినాతో కెర్బర్; బెర్టెన్స్తో జూలియా; కామిలాతో సెరెనా తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో శరణ్ జంట పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్) –ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) ద్వయం అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మూడో రౌండ్లో శరణ్–సితాక్ జంట 1–6, 6–7 (3/7), 6–4, 6–4, 6–4తో జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)–మట్కోవ్‌స్కీ (పోలాండ్) జోడీపై గెలిచింది. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయిన శరణ్ జంట ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం సాధించడం విశేషం. -
రష్యా షూట్... స్పెయిన్ ఔట్
78 వేల మంది ప్రేక్షకులు దిక్కులు పిక్కటిల్లేలా ఇచ్చిన మద్దతుతో సొంతగడ్డపై రష్యా గర్జించింది. ఎలాంటి అంచనాలు లేని నేపథ్యంలో బరిలోకి దిగి ఏకంగా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పెనాల్టీ షూటౌట్లో మాజీ చాంపియన్ స్పెయిన్‌ను చిత్తు చేసి సగర్వంగా ముందంజ వేసింది. అద్భుత ఆటతో స్పెయిన్‌కు అడ్డు గోడలా నిలిచిన కెప్టెన్, గోల్ కీపర్ అకిన్‌ఫీవ్... ఆఖర్లో రెండు స్పాట్ కిక్‌లను ఆపి రష్యా దేశం చిరకాలం గుర్తుంచుకునే కొత్త హీరోగా అవతరించాడు.120 నిమిషాల ఆటలో రికార్డు స్థాయిలో ఏకంగా 1006 పాస్‌లు...ఆటలో 74 శాతం పాటు బంతి తమ ఆధీనంలోనే... అయినా సరే షూటౌట్ వరకు వెళ్లకుండా గెలుపు అందుకోవడం స్పెయిన్ వల్ల కాలేదు. అతి రక్షణాత్మక ధోరణి ఆడి... గోల్ చేసేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది. మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న రష్యా షూటౌట్లో చెలరేగి వరల్డ్ నంబర్ 10 స్పెయిన్ జట్టును ఇంటిదారి పట్టించింది. ఆదివారం ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా 4–3 స్కోరు (పెనాల్టీ షూటౌట్)తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. నిర్ణీత సమయంతో పాటు మరో అర గంట అదనపు సమయం ముగిసేసరికి కూడా ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో రష్యా ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన సెల్ఫ్‌గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యం లభించగా... 41వ నిమిషంలో జ్యూబా గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయాయి. ఈ టోర్నీలో తొలిసారి ఫలితం షూటౌట్ ద్వారా తేలగా, రష్యా 48 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ చేరింది. మ్యాచ్‌లో స్పెయిన్ కొట్టిన 24 షాట్లను గోల్ కాకుండా నిరోధించిన కీపర్ అకిన్‌ఫీవ్ షూటౌట్లోనూ అదే జోరు కొనసాగించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వరుసగా ఐదో వరల్డ్ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే నెగ్గడం విశేషం. డిఫెన్స్...డిఫెన్స్... రష్యా జట్టు తమ ఫుట్‌బాల్ చరిత్రలోనే ‘అతి పెద్ద’ మ్యాచ్‌లో అభిమానుల ఆశలను మోస్తూ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలో 38 ఏళ్ల సీనియర్ ఆటగాడు సెర్గీ ఇగ్నాషెవిచ్ చేసిన తప్పుతో తొలి గోల్ స్పెయిన్ ఖాతాలో పడింది. రష్యా గోల్ పోస్ట్ ఎడమ వైపు నాచోను జిర్కోవ్ అడ్డుకోవడంతో స్పెయిన్‌కు ఫ్రీ కిక్ లభించింది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఇగ్నాషెవిచ్ తన వైపు దూసుకొస్తున్న బంతిపై దృష్టి పెట్టకుండా స్పెయిన్ స్టార్ సెర్గియో రామోస్‌ను మార్కింగ్ చేసే ప్రయత్నం చేస్తూ అతడిని పడేశాడు. ఈ క్రమంలో ఇగ్నాషెవిచ్ కాలికి తగిలిన బంతి రష్యా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోయింది. ఈ టోర్నీలో రష్యాకు ఇది రెండో సెల్ఫ్ గోల్. 1966లో బల్గేరియా తర్వాత ఒకే జట్టు రెండు సెల్ఫ్ గోల్స్ ఇవ్వడం ఇదే మొదటి సారి. అయితే స్పెయిన్ తమదైన శైలిలో ‘టికీ టకా’ పాస్‌లకే కట్టుబడగా... రష్యా మాత్రం ఆ తర్వాత ధాటిని పెంచింది. 41వ నిమిషంలో రష్యా శ్రమ ఫలించింది. ఫ్రీ కిక్‌ను హెడర్ ద్వారా జ్యూబా గోల్‌గా మలిచే ప్రయత్నంలో ఉండగా, బాక్స్ ఏరియాలో గెరార్డ్ పికే చేతితో దానిని అడ్డుకున్నాడు. పికేకు ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు రిఫరీ రష్యాకు పెనాల్టీ కిక్ అవకాశం కల్పించాడు. దీనిని జ్యూబా సునాయాసంగా గోల్‌గా మలచడంతో స్టేడియంలో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 1986 తర్వాత నాకౌట్ దశలో రష్యా చేసిన తొలి గోల్ ఇదే కావడం విశేషం. రెండో అర్ధ భాగంలో రష్యాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చినా, అది చేజార్చుకుంది. కొద్దిసేపు గడిచే సరికి ఇరు జట్లు బాగా అలసిపోయినట్లు కనిపించాయి. దాంతో అంతా డిఫెన్స్ తరహా ఆటను ప్రదర్శించారు. ఒక దశలో పరిస్థితి ‘వాకింగ్ ఫుట్‌బాల్’లా కనిపించింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మరో అర గంట అదనపు సమయంలో కూడా పరిస్థితి ఏమీ మారలేదు. -
క్వార్టర్ ఫైనల్లో కశ్యప్
ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–11, 21–14తో జోషువా మాగీ (ఐర్లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 20–22, 21–17, 17–21తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 18–21తో ముగ్ధా అగ్రే (భారత్) చేతిలో పరాజయం పాలైంది. -
సానియా జంటకు షాక్
మాడ్రిడ్: తన కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)తో కలిసి బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో నాలుగో సీడ్ సానియా–ష్వెదోవా జంట క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–ష్వెదోవా జోడీ 3–6, 6–3, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇరీనా కమెలియా బేగూ–సిమోనా హలెప్ (రొమేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను మూడుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్‌లో మాత్రం సానియా జంట తడబడి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన సానియా జోడీకి 40,740 యూరోల (రూ. 28 లక్షల 53 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 215 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
∙ శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా... ∙ సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ సిటీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్‌లు కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలుగుతేజం సింధు చెమటోడ్చి నెగ్గింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె 19–21, 21–17, 21–8తో ఇండోనేసియాకు చెందిన ఫిత్రియాని ఫిత్రియానిపై గెలిచింది. క్వార్టర్స్‌లో సింధు... కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడనుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 18–21, 21–19, 22–20తో మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)పై శ్రమించి నెగ్గాడు. భమిడిపాటి సాయిప్రణీత్ కూడా 21–15, 21–23, 21–16తో కియావో బిన్ (చైనా)పై చెమటోడ్చి గెలిచాడు. క్వార్టర్స్‌లో శ్రీకాంత్... ఐదో సీడ్ షి యుకి (చైనా)తో, సాయిప్రణీత్... తనోంగ్సక్ సెన్సోంబున్సుక్ (థాయ్‌లాండ్)తో తలపడతారు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సుమీత్ రెడ్డి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 17–21, 21–17, 21–16తో జె హాన్ కిమ్– లి సో హి (దక్షిణ కొరియా) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని ద్వయం 11–21, 21–19, 12–21తో టాప్ సీడ్ మిసాకి మత్సుతొమొ–అయక తకహషి (జపాన్) జోడి చేతిలో కంగుతింది. ఐదుకు పడిపోయిన సింధు ర్యాంకు న్యూఢిల్లీ: సింధు కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకు వారం రోజుల ముచ్చటే అయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో ర్యాంకుకు పడిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో ఆమె మూడు స్థానాలు దిగజారింది. మలేసియా ఓపెన్‌లో 21 ఏళ్ల సింధు తొలి రౌండ్లోనే కంగుతినడంతో టాప్–2 ర్యాంకును కోల్పోయింది. సైనా కూడా అదే టోర్నీలో మొదటి రౌండ్లోనే ఓడినా... ఆమె తొమ్మిదో ర్యాంకు మాత్రం మారలేదు. పురుషుల సింగిల్స్ ర్యాంకుల్లో అజయ్ జయరామ్ 14వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మిగతావారెవరూ టాప్–20 జాబితాలో లేరు. -
క్వార్టర్స్‌లో సానియా జంట
మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా–స్ట్రికోవా ద్వయం 1–6, 6–1, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో తిమియా బాబోస్ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీపై గెలిచింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను మూడేసి సార్లు కోల్పోయాయి. అయితే సూపర్ టైబ్రేక్‌లో సానియా–స్ట్రికోవా జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో వానియా కింగ్ (అమెరికా)–ష్వెదోవా (కజకిస్తాన్)లతో సానియా–స్ట్రికోవా తలపడతారు. -
సానియా జంటకు నిరాశ
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్) –బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 4–6తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన సానియా–స్ట్రికోవా జంటకు 48,010 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 31 లక్షల 52 వేలు) లభించింది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
కాలిఫోర్నియా: మరో అలవోక విజయంతో ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా–బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ సానియా–స్ట్రికోవా ద్వయం 6–2, 6–3తో సారా ఎరాని (ఇటలీ)–అలీసా రొసోల్‌స్కా (పోలాండ్) జోడీపై గెలిచింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–చెక్ జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఎరాని–రొసోల్‌స్కా జంట మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)–మారియా జోస్ మార్టినెజ్ (స్పెయిన్); మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)–యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)ల మధ్య జరిగే రెండో రౌండ్ మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో సానియా జంట తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో భువన
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో క్వాలిఫయర్ భువన 6–2, 6–3తో మూడో సీడ్, హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టిపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రాంజల 5–7, 6–7 (5/7)తో టాప్ సీడ్ ఫాత్మా అల్ నభాని (ఒమన్) చేతిలో... పెద్దిరెడ్డి శ్రీవైష్ణవి రెడ్డి 1–6, 3–6తో మెహక్ జైన్ (భారత్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి చిలుముల–ప్రేరణ జంట 7–6 (7/4), 4–6, 10–6తో రష్మీ –ఇతీ మెహతా (భారత్) జోడీపై నెగ్గింది. -
హారిక విజయం
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక శుభారంభం చేసింది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 47 ఎత్తు ల్లో విజయం సాధించింది. రెండు గేమ్‌ల మ్యాచ్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నానా జాగ్నిద్జెతోనే మంగళవారం జరిగే రెండో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ
పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21–19, 21–14తో పదో సీడ్ బోధిత్ జోషి (ఉత్తరాఖండ్)పై గెలుపొందాడు. అంతకుముందు మూడో రౌండ్లో సిరిల్ 24–22, 21–10తో నీరజ్ వశిష్ట్ (రైల్వేస్)ను ఓడించాడు. తెలంగాణకే చెందిన రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–17, 21–23, 11–21తో డానియల్ ఫరీద్ (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, ప్రమద, సాయి ఉత్తేజిత రావు మూడో రౌండ్లో పరాజయం పాలయ్యారు. -
సెరెనా జోరు...
క్వార్టర్ ఫైనల్లో అమెరికన్ స్టార్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌పై గురి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్తోపాటు ఇతర సీడెడ్ క్రీడాకారిణులు నిష్క్రమించడంతో... ఈ అవకాశాన్ని అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ పూర్తిస్థాయిలోసద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రత్యర్థులను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడుతూ, ఒక్కో అడ్డంకినిఅధిగమిస్తూ, తన లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బార్బరా స్ట్రికోవాపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సెరెనా... ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు ఓపెన్ శకంలో అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. మెల్బోర్న్: ఒకవైపు సీడెడ్ క్రీడాకారిణులు ఒక్కొక్కరు ఇంటిదారి పడుతుంటే... మరోవైపు సెరెనా విలియమ్స్ మాత్రం పూర్తి విశ్వా సంతో ఆడుతూ తన జోరు కొనసాగిస్తోంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ అమెరికన్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సెరెనా 7–5, 6–4తో 16వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ గెలుపుతో సెరెనా వరుసగా పదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరడం విశేషం. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనాకు గట్టిపోటీనే లభించింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన ఈ మాజీ చాంపియన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేయగలిగింది. 46 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా కీలక దశల్లో పైచేయి సాధించింది. నెట్ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ టాప్ ర్యాంకర్ 28 విన్నర్స్ సంధించింది. క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)తో సెరెనా ఆడుతుంది. ‘ఈ టోర్నీతో నేను కొత్తగా సాధించేది ఏమీ లేదు. ఇక్కడ వచ్చే ఫలితం నాకు బోనస్ లాంటిదే. విజయం సాధించేందుకు ఇక్కడకు వచ్చాను. మున్ముందు మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా ఆడతాననే నమ్మకం ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో 22వ సీడ్ దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)పై, జొహనా కొంటా 6–1, 6–4తో 30వ సీడ్ మకరోవా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 20 ఏళ్లకు: మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన 34 ఏళ్ల మిర్యానా లూసిచ్ బరోని 6–4, 6–2తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై గెలిచింది. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మొదటిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 1997లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడిన మిర్యానా 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకోవడం విశేషం. 1999లో వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన మిర్యానా కెరీర్ వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా తడబడింది. 2003 నుంచి 2009 వరకు ఆమె ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఆడలేకపోయింది. 2010 నుంచి ఇప్పటివరకు 25 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మిర్యానా ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటుకుంది. నాదల్, రావ్‌నిచ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ రావ్‌నిచ్ (కెనడా), తొమ్మిదో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), 15వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో రావ్‌నిచ్ 7–6 (8/6), 3–6, 6–4, 6–1తో 13వ సీడ్ అగుట్ (స్పెయిన్)పై గెలుపొందగా... గాఫిన్ 5–7, 7–6 (7/4), 6–2, 6–2తో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఇంటిముఖం పట్టించాడు. మాజీ చాంపియన్ నాదల్ 2 గంటల 55 నిమిషాల పోరులో 6–3, 6–3, 4–6, 6–4తో ఆరో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గగా... దిమిత్రోవ్ 2–6, 7–6 (7/2), 6–2, 6–1తో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో పేస్–హింగిస్ జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్లో పేస్–హింగిస్ ద్వయం 6–2, 6–3తో మాట్ రీడ్–కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జీల్ దేశాయ్ (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో జీల్ 6–4, 6–2తో జూల్ నిమియెర్ (జర్మనీ)పై గెలిచింది. నేటి ముఖ్య మ్యాచ్‌లు (క్వార్టర్ ఫైనల్స్) వీనస్ విలియమ్స్ (అమెరికా) పావ్లీచెంకోవా (రష్యా) ముగురుజా (స్పెయిన్) కోకో వాండెవె (అమెరికా) వావ్రింకా (స్విట్జర్లాండ్) సోంగా (ఫ్రాన్స్) ఫెడరర్ (స్విట్జర్లాండ్) మిషా జ్వెరెవ్ (జర్మనీ) -
క్వార్టర్ ఫైనల్లో సానియా–బెథానీ జంట
బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా–బెథానీ జోడీ 6–1, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్)–ఎలిజ్ మెర్టెన్స్ (బెల్జియం) జంటపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఇరీనా బెగూ (రొమేనియా)–దరియా కసత్కినా (రష్యా)లతో సానియా–బెథానీ తలపడతారు. -
పోరాడి ఓడిన హైదరాబాద్
రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై రాయ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై విజయం సాధించే అవకాశాన్ని హైదరాబాద్ జట్టు చేజార్చుకుంది. మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ ఐదు రోజుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 121/7తో ఆట చివరిరోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ మరో 80 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లను ముంబై బౌలర్ అభిషేక్ నాయర్ తీయడం విశేషం. బాలచందర్ అనిరుధ్ (84 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిలింద్ (29; 4 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడంతో హైదరాబాద్ జట్టులో విజయంపై ఆశలు చిగురించాయి. అయితే మిలింద్ అవుటయ్యాక హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఒకవైపు అనిరుధ్ పట్టుదలతో ఆడినా మరోవైపు ఆఖరి బ్యాట్స్‌మన్ రవి కిరణ్ (1) కూడా నాయర్ బౌలింగ్‌లో అవుటవ్వడంతో హైదరాబాద్‌కు పరాజయం తప్పలేదు. జనవరి 1 నుంచి 5 వరకు సెమీఫైనల్స్ జరుగుతాయి. నాగ్‌పూర్‌లో జార్ఖండ్‌తో గుజరాత్... రాజ్‌కోట్‌లో తమిళనాడుతో ముంబై తలపడతాయి. -
హైదరాబాద్ చేజారిన ఆధిక్యం
ముంబైతో రంజీ క్వార్టర్ ఫైనల్ రాయ్‌పూర్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించే అవకాశం చేజారింది. ఓవర్‌నైట్ స్కోరు 167/3తో మూడో రోజు ఆటను కొనసాగించిన హైదరాబాద్ 280 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (82; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొల్లా సుమంత్ (44; 5 ఫోర్లు), మెహదీ హసన్ (32; 4 ఫోర్లు, ఒక సిక్స్) ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడం ఖాయమనిపించింది. అయితే హసన్ అవుటయ్యాక హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. హైదరాబాద్ చివరి ఐదు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. 14 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 102 పరుగులు చేసింది. ఇతర క్వార్టర్ ఫైనల్ స్కోర్లు lగుజరాత్ తొలి ఇన్నింగ్స్: 263; ఒడిశా తొలి ఇన్నింగ్స్: 199; గుజరాత్ రెండో ఇన్నింగ్స్: 246/3 (సమిత్ 110 బ్యాటింగ్, ప్రియాంక్ 81). lహరియాణా తొలి ఇన్నింగ్స్: 258; జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 345; హరియాణా రెండో ఇన్నింగ్స్: 146/2. -
హైదరాబాద్ 167/3
రాయ్‌పూర్: ముంబైతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 167 పరుగులు చేసింది. తన్మయ్ (63 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా... కెప్టెన్ బద్రీనాథ్ (56) అర్ధ సెంచరీ చేశాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (5/80), సిరాజ్ (4/64) ఆకట్టుకున్నారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్ స్కోర్లు హరియాణా తొలి ఇన్నింగ్స్: 258 ఆలౌట్; జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 228/3. lగుజరాత్ తొలి ఇన్నింగ్స్: 263 ఆలౌట్; ఒడిషా: 184/8. -
సెంచరీతో ఆదుకున్న సిద్ధేశ్
ముంబై 250/5 ∙హైదరాబాద్‌తో రంజీ క్వార్టర్స్ రాయ్‌పూర్: హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్... ఒక దశలో ముంబై 34 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (3/64), సిరాజ్ (2/58) చెలరేగడంతో ఆ జట్టు టాపార్డర్ తడబడింది. అయితే సిద్ధేశ్ లాడ్ (101 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో ముంబైని ఆదుకున్నాడు. ఫలితంగా మ్యాచ్ మొదటి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు చేసింది. కెప్టెన్ ఆదిత్య తారే (73; 14 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో లాడ్‌తో పాటు అభిషేక్ నాయర్ (46 బ్యాటింగ్; 7 ఫోర్లు) ఉన్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 111 పరుగులు జత చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కెవిన్ అల్మీడా (9)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించిన మిలింద్... మరో రెండు బంతులకే ముంబై స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (0)ను పెవిలియన్‌కు పంపించాడు. సూర్యకుమార్ యాదవ్ (5)ను సిరాజ్ అవుట్ చేయగా, ప్రఫుల్ వాఘేలా (13)ను మిలింద్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో సిద్ధేశ్, తారే కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అనంతరం సిరాజ్ బౌలింగ్‌లోనే తారే వెనుదిరిగాడు. ఆ తర్వాత లాడ్ 194 బంతుల్లో కెరీర్లో నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 88 పరుగులకే కుప్పకూలిన కర్ణాటక సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు మీడియం పేసర్ అశ్విన్ క్రైస్ట్ (6/31) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇక్కడ ప్రారంభమైన మరో మ్యాచ్‌లో కర్ణాటక మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మనీశ్ పాండే (28)దే అత్యధిక స్కోరు. దట్టమైన పచ్చికతో సీమ్‌కు అనుకూలించిన పిచ్‌పై అశ్విన్ చెలరేగిపోవడంతో కర్ణాటక బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ నిలబడలేకపోయారు. చెన్నై టెస్టు హీరోలు కరుణ్ నాయర్ (14), కేఎల్ రాహుల్ (4) విఫలమయ్యారు. అనంతరం తమిళనాడు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (34), దినేశ్ కార్తీక్ (31 బ్యాటింగ్) నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టును నడిపించారు. ప్రస్తుతం తమిళనాడు 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. గుజరాత్ 197/6 జైపూర్: ఒడిషాతో జరుగుతున్న క్వార్టర్స్ మ్యాచ్‌లో తొలి రోజు గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. 71 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా... చిరాగ్ గాంధీ (62 బ్యాటింగ్), రుష్ కలారియా (59 బ్యాటింగ్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 126 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీపక్ బెహెరాకు 3 వికెట్లు దక్కాయి. నదీమ్‌కు 5 వికెట్లు వడోదర: జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి హరియాణా 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. రజత్ పలివాల్ (42), చైతన్య బిష్ణోయ్ (41) ఫర్వాలేదనిపించారు. జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ (5/75) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. -
క్వార్టర్స్‌లో సైనా, సాయిప్రణీత్
కశ్యప్ అవుట్ మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి మకావు: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రిలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో సారుు ప్రణీత్ కూడా క్వార్టర్స్‌కు చేరగా పారుపల్లి కశ్యప్‌కు నిరాశ ఎదురైంది. దినార్ ద్యా ఆయుస్టిన్ (ఇండోనేసియా)తో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సైనా 17-21, 21-18, 21-12 స్కోరుతో గెలిచింది. గాయం నుంచి కోలుకున్నాక పూర్తి ఫామ్ కోసం తంటాలు పడుతున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్ సైనాకు తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. 3-1తో ప్రత్యర్థి ఆధిక్యంలో ఉన్న దశలో సైనా 5-5తో స్కోరును సమం చేసింది. ఓ దశలో 11-7తో జోరు కనబరిచినప్పటికీ... వరుస పారుుంట్లతో రెచ్చిపోరుున ఆయుస్టిన్ తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ పోటీ ఎదురైనా సైనా స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. 11-3 తో ముందంజలో ఉన్నా... వెంటనే పుంజుకున్న ఆయుస్టిన్ 18-18తో స్కోరును సమం చేసింది. అరుుతే ఈ దశలో నిలకడగా ఆడిన సైనా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. ఆ తర్వాత చివరి గేమ్‌లో పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవడంతో సైనా విజయం సులువైంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో తను చైనాకు చెందిన జాంగ్ రుుమన్తో తలపడుతుంది. పరుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సారుు ప్రణీత్ 21-15, 21-17తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో జావో జున్ పెంగ్ (చైనా)తో ఆడతాడు. మరో మ్యాచ్‌లో కశ్యప్ 13-21, 20-22తో లియ్ యు సీన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి జంట 20-22, 19-21తో డానీ బవా-హెండ్రా విజయ (సింగపూర్) చేతిలో ఓడారు. -
క్వార్టర్స్ రేసులోకి హైదరాబాద్
వల్సాడ్: రంజీ ట్రోఫీలో గ్రూప్ ‘సి’నుంచి హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. గురువారం ఇక్కడి ముగిసిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది. తమ రెండో ఇన్నింగ్సలో హైదరాబాద్ 122 పరుగులకు ఆలౌటై... ప్రత్యర్థికి 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అరుుతే ఛత్తీస్‌గఢ్ తమ రెండో ఇన్నింగ్సలో 241 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం హైదరాబాద్ 23 పారుుంట్లతో రెండో స్థానానికి చేరింది. అగ్రస్థానంలోనే ఆంధ్ర: మరో వైపు ఆంధ్ర ఇదే గ్రూప్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆంధ్ర, కేరళ మధ్య జరిగిన మ్యాచ్ గురువారం ‘డ్రా’గా ముగిసింది. కేరళ తమ రెండో ఇన్నింగ్‌సను 6 వికెట్లకు 302 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆట ముగిసే సరికి 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. భరత్ (73), విహారి (53 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. 7 మ్యాచ్‌ల తర్వాత ఆంధ్ర 25 పారుుంట్లతో నంబర్‌వన్‌గా ఉంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
జయరామ్ కూడా... చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫుజౌ (చైనా): భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ కూడా క్వార్టర్స్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ సింధు 18-21, 22-20, 21-17తో బెవెన్ జంగ్ (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్ ఆరంభంలో సింధు ఒక దశలో 11-7తో ఆధిక్యంలో నిలిచింది. అరుుతే అమెరికన్ ప్రత్యర్థి వరుసగా పారుుంట్లు సాధించి 13-13తో స్కోరును సమం చేసింది. అదే జోరుతో ఆమె 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అక్కడి నుంచి వరుసగా పారుుంట్లు సాధించి గేమ్‌ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధుకు ఓడినంత పనైంది. మొదట 8-0తో ఆధిక్యం పొందినప్పటికీ తర్వాత జంగ్... సింధుకు అవకాశమివ్వకుండా రెచ్చిపోరుుంది. 16-16తో స్కోరును సమం చేసి అనంతరం 19-17తో ఆధిక్యంలోకి వచ్చింది. అరుుతే సింధు ఐదు పారుుంట్లు సాధించి గేమ్‌ను కై వసం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ బెవెన్ జంగ్ పట్టుదలను ప్రదర్శించినప్పటికీ సింధు సమయస్ఫూర్తితో ఆడి విజయం సాధించింది. తదుపరి క్వార్టర్ ఫైనల్లో ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోతో తలపడుతుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 20-22, 21-19, 21-12తో వే నాన్ (హాంకాంగ్)పై కష్టపడి గెలిచాడు. క్వార్టర్స్‌లో జయరామ్‌కు ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో భమిడిపాటి సారుుప్రణీత్ 16-21, 9-21తో మార్క్ జ్వెబ్లెర్ (జర్మనీ) చేతిలో, హెచ్.ఎస్.ప్రణయ్ 17-21, 19-21తో కియావో బిన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్
కోల్‌కతా: ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలోక్ గోయల్‌తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-1తో గెలిచాడు. భారత్‌కే చెందిన రంజిత్ విరాళీ మురుగేశన్, పరీక్షిత్ సొమాని, రోహిత్ రామ్పురియా, జగ్మీత్ సింగ్, నితిన్ కుమార్, సౌరవ్ సుకుల్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. -
కొత్త భాగస్వామి కోసం అన్వేషణ: పేస్
పుణే: తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యం పెట్టుకున్నానని... వచ్చే ఏడాది దీనిని సాకారం చేసుకునేందుకు కొత్త భాగస్వామి కోసం అన్వేషణ చేస్తున్నానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ఇప్పటికే కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న పేస్‌కు ఈ ఏడాది అంతగా కలసిరాలేదు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అతను ఏటీపీ సర్కూ ్యట్లో ఒక్క టైటిల్‌నూ గెలవలేదు. చాలెంజర్ స్థారుులో మాత్రం రెండు టైటిల్స్ సాధించాడు. పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌తో బరిలోకి దిగిన పేస్ తొలి రౌండ్లో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 1991లో ప్రొఫెషనల్‌గా మారిన పేస్ ఇప్పటివరకు పురుషుల డబుల్స్‌లో 110 మంది భాగస్వాములతో... మిక్స్డ్ డబుల్స్‌లో 24 మంది భాగస్వాములతో కలిసి ఆడాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6-0, 2-6, 6-1తో భారత్‌కే చెందిన సిద్ధార్థ్ రావత్‌ను ఓడించాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విష్ణువర్ధన్ 4-6, 4-6తో దిమిత్రీ పోప్కో (కజకిస్తాన్) చేతిలో, ఐదో సీడ్ రామ్‌కుమార్ రామనాథన్ 2-6, 5-7తో సాడియో డుంబియా (ఫ్రాన్స) చేతిలో, సుమీత్ నాగల్ 7-6 (7/2), 6-7 (6/8), 4-6తో అడ్రియన్ మెనెన్‌డెజ్ (స్పెరుున్) చేతిలో ఓడిపోయారు. 19 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆడుతోన్న లియాండర్ పేస్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో పేస్-రామ్‌కుమార్ ద్వయం 6-3, 6-4తో అన్విత్ బెంద్రే-సిద్ధార్థ్ రావత్ (భారత్) జంటపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో విష్ణువర్ధన్-శ్రీరామ్ బాలాజీ జంట 3-6, 4-6తో పెట్రోవిచ్-మిలోజెవిచ్ (సెర్బియా) జోడీ చేతిలో, మొహిత్-కాజా వినాయక్ శర్మ ద్వయం 2-6, 4-6తో జీవన్-విజయ్ జంట చేతిలో ఓడిపోయారుు. -
క్వార్టర్ ఫైనల్లో సానియా జంట
న్యూఢిల్లీ: వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన రెండో రౌండ్లో 3-6, 6-3, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా)-మారియా జోస్ మార్టినెజ్ శాంచెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన సానియా జంట రెండో సెట్లో పుంజుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లోనూ పైచేరుు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. బోపన్న జోడీ శుభారంభం: చైనాలోనే జరుగుతున్న చెంగ్డూ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో రోహన్ బోపన్న-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-జీవన్ జంట 6-2, 6-4తో ఫెలిసియానో లోపెజ్ (స్పెరుున్)-యువాన్ మొనాకో (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. -
జయరామ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకై క ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఇండోనేసియాలోని బాలిక్పాపన్ పట్టణంలో శుక్రవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ జయరామ్ 12-21, 10-21తో ప్రపంచ 41వ ర్యాంకర్ యూకీ షి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ ఆరంభంలో చైనా ప్లేయర్‌కు కాస్త పోటీనిచ్చిన జయరామ్ ఆ తర్వాత తడబడ్డాడు.ఈ టోర్నీలో భారత్ తరఫున పాల్గొన్న సారుుప్రణీత్, ప్రణయ్ మూడో రౌండ్లో, కశ్యప్ రెండో రౌండ్లో, సిరిల్ వర్మ, హర్షిల్ డాని, కౌశల్ తొలి రౌండ్లో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో రుత్విక శివాని, పీసీ తులసీ, తన్వీ లాడ్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. -
క్వార్టర్స్‌లో పేస్ జోడి
విన్స్టన్-సలేమ్ (యూఎస్ఏ):విన్స్టన్-సలేమ్ ఓపె న్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్- బెగి మన్ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో పేస్ (భారత్)- ఆండ్రి బెగిమన్ (జర్మని) జోడి 6-4, 6-4తో క్రిస్ గుచినె (ఆస్ట్రేలియా)- ఆండ్రి సా (బ్రెజిల్) జంటపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో పేస్ జోడి టాప్ సీడ్ లూకాస్ కుబోట్ (పొలాండ్)- జిమోంజిక్ (సెర్బియా) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
అర్జెంటీనాపై 2-1తో విజయం రియో డీ జనీరో : రియో ఒలింపిక్స్ పురుషుల హాకీ లో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత జట్టు అర్జెంటీనాపై 2-1తేడాతో గెలుపొందింది. భారత్ తరపున చింగ్లెన్సానా సింగ్, కోథాజిత్ సింగ్ చెరో గోల్ చేయగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అర్జెంటీనా పెనాల్టీ కార్నర్లకు అడ్డుగోడగా నిలిచాడు. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆరు పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు చాలా దూకుడును ప్రదర్శించింది. ఆట ఏడో నిమిషంలోనే తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చింది. అయితే.. రూపిందర్ సింగ్ ఫ్లిక్‌ను అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే తర్వాత నిమిషంలోనే చెంగ్లెన్సానా వేగంగా స్పందించటంతో భారత్‌కు తొలిగోల్ దక్కింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. మూడో క్వార్టర్ ముగిసే సమయంలో కోథాజిత్ రెండో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. అయితే ఆట నాలుగో క్వార్టర్లో ప్రత్యర్థికి నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలొచ్చాయి. అర్జెంటీనా డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ గంజాలో పీల్లెట్ మొదటి కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే.. మిగిలిన మూడింటినీ భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ విజయవంతంగా అడ్డుకున్నాడు. తదుపరి మ్యాచులలో నెదర్లాండ్స్, కెనడాలతో భారత్ తలపడనుంది. బ్రిటన్ చేతిలో ఓడిన మహిళలు మహిళల హాకీలో భారత జట్టు బ్రిటన్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైంది. బ్రిటన్ తరఫున జిష్లే అంస్లీ, నికోలా వైట్, అలెక్సా డాన్సర్ ఒక్కో గోల్ చేశారు. రోయింగ్: భోకనాళ్ ఔట్ పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో భారత రోయర్ దత్త బబన్ భోకనాళ్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. హీట్స్‌లో 7.21.67 టైమింగ్‌తో 2వేల మీటర్ల రేసును పూర్తి చేసిన భోకనాళ్.. క్వార్టర్స్‌లో 6.53.52 టైమింగ్ సాధించినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్: హీనా సిద్ధు అవుట్ రియోలో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిద్ధు క్వాలిఫయింగ్ దశలోనే నిష్ర్కమించింది. 600కు గానూ 576 పాయింట్లు సాధించి.. మొత్తం 40 మంది పోటీదారుల్లో 20వ స్థానంలో నిలిచింది. ఆర్చరీ: ప్రి క్వార్టర్స్‌లో అతాను పురుషుల వ్యక్తిగత ఆర్చరీలో అతాను దాస్ ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. క్యూబా ఆర్చర్ పెరేజ్తో జరిగిన రెండోరౌండ్లో అతాను 6-4తో గెలుపొందాడు. తొలి రౌండ్లో 6-0తో నేపాల్‌కు చెందిన జీత్బహదూర్పై నెగ్గాడు. శుక్రవారం జరిగే ప్రి క్వార్టర్ ఫైనల్లో కొరియన్ ఆర్చర్ లీ సుంగ్యున్తో అతాను తలపడనున్నాడు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ప్రకాశ్ నంజప్ప, జీతూరాయ్ సాయంత్రం 5.30 నుంచి (ఫైనల్ రాత్రి 8.30కు) ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఈవెంట్ (రౌండ్ 64) బొంబేలా దేవ x లారెన్స్ బాల్డఫ్ (ఆస్ట్రేలియా) సాయంత్రం 6.10 నుంచి దీపికా కుమార x క్రిస్టిన్ సెబువా (జార్జియా) గురువారం తెల్లవారుజామున 1.30 నుంచి జూడో పురుషుల 90 కేజీల విభాగం అవతార్ సింగ x పొపోల్ రెసెంగా (శరణార్థుల బృందం) రాత్రి 7.20 నుంచి మహిళల హాకీ భారత x ఆస్ట్రేలియా రాత్రి 7.30 నుంచి బాక్సింగ్ పురుషుల లైట్‌వెయిట్ (64 కేజీల విభాగం) మనోజ్ కుమార్ x ఎవల్దస్ పెట్రాస్కస్ (లిథువేనియా) గురువారం తెల్లవారుజామున 3గంటలకు -
ఫెడరర్ రికార్డు
ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్ రోజర్ ఫెడరర్ అలవోకగా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్ 6-2, 6-3, 7-5తో స్టీవ్ జాన్సన్ (అమెరికా)పై గెలిచాడు. వింబుల్డన్‌లో ఫెడరర్ క్వార్టర్స్‌కు చేరడం ఇది 14వ సారి కాగా... ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్‌లలో 48వ సారి. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో అత్యధిక మ్యాచ్‌లు (306) గెలిచిన మార్టినా నవ్రతిలోవా రికార్డును ఫెడరర్ సమం చేశాడు. ఈసారి స్విస్ స్టార్ ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా ఓడిపోకపోవడం విశేషం. మరో ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో సిలిచ్ (క్రొయేషియా) 6-1, 5-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి నిషికోరి (జపాన్) గాయంతో వైదొలిగాడు. జొకోవిచ్‌ను ఓడించిన సామ్ క్వారీ (అమెరికా) 6-4, 7-6(5), 6-4తో మహుత్ (ఫ్రాన్స్)పై గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కు చేరాడు. -
రికార్డు సృష్టిస్తారా...
ఐస్‌లాండ్‌తో ఫ్రాన్స్ క్వార్టర్స్ పోరు నేడు రా. గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: సొంతగడ్డపై జరుగుతున్న యూరోలో ఇప్పటివరకూ నిలకడగా ఆడిన ఫ్రాన్స్... పసికూన ఐస్‌లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయిం ది. ఈసారి టైటిల్ గెలవడం ద్వారా మూడుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని ఫ్రాన్స్ ఆరాటపడుతోంది. మరోవైపు కేవలం 3.3 లక్షల జనాభా ఉన్న ఐస్లాండ్ ప్రి క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ను కంగుతినిపించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ జట్టుపై అంచనాలు లేనందున ఒత్తిడి కూడా పెద్దగా లేదు. ఫ్రాన్స్ మాత్రం సొంతగడ్డపై ఆడుతున్నందున కొంత ఒత్తిడిలో ఉంది. ఫ్రాన్స్ స్టార్ గ్రిజ్మెన్ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ చేశాడు. మరోసారి తనే కీలకం అయ్యే అవకాశం ఉంది. అటు ఐస్లాండ్ సిగర్డ్సన్ను నమ్ముకుంది. -
క్వార్టర్స్‌లో ఓడిన నిఖత్
ప్రపంచ మహిళల బాక్సింగ్ టోర్నీ అస్తానా (కజకిస్తాన్): సీనియర్ స్థాయిలో తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. మంగళవారం జరిగిన 54 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 0-3తో పియాపియో (చైనా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాతెర్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోగా... సవీటి బోరా (81 కేజీలు), సర్జూబాలా దేవి (48 కేజీలు), సీమా పూనియా(+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించారు. సోనియా 3-0తో అనెతా రిగిల్స్కా (పోలండ్)పై విజయం సాధించగా... సవీటి 0-3తో ఎలిఫ్ గునెరి (టర్కీ) చేతిలో, సర్జూబాలా 0-3తో నజిమ్ కిజైబే (కజకిస్తాన్) చేతిలో, సీమా 0-3తో లజత్ కుంగ్బయేవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
భారత కుర్రాళ్లు కుమ్మేశారు..
ఫతుల్లా: ఐసీసీ అండర్ -19 ప్రపంచ కప్‌లో నమీబియాతో క్వార్టర్ ఫైనల్లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 349 పరుగులు సాధించింది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఓపెనర్ ఆర్ఆర్ పంత్ (111) సెంచరీకి తోడు సర్ఫరాజ్ ఖాన్ (76), అర్మాన్ జాఫర్ (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. అన్మోల్ ప్రీత్ సింగ్ 41, లొమ్రోర్ 41 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్ కోయెట్జీ మూడు వికెట్లు పడగొట్టాడు. -
క్వార్టర్స్ లో శ్రీకాంత్, సింధు
పెనాంగ్ (మలేసియా): భారత టాప్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధులు... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ శ్రీకాంత్ 21-17, 21-10తో 16వ సీడ్ బున్సాక్ పోన్సానా (థాయ్‌లాండ్)పై గెలిచాడు. 33 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలి గేమ్‌లో స్కోరు 11-11తో సమమైన తర్వాత శ్రీ వెనుదిరిగి చూడలేదు. వరుస పాయింట్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. ఇక రెండో గేమ్‌లో ఆరంభం నుంచే శ్రీకాంత్ హవా చూపెట్టాడు. 7-0తో మొదలుపెట్టి చకచకా రెండు, మూడు పాయింట్లతో గేమ్‌ను ఏక పక్షంగా మార్చేశాడు. సింగిల్ పాయింట్లకే పరిమితమైన పోన్సానా ఏ దశలోనూ శ్రీకాంత్‌ను అందుకోలేకపోయాడు. మరో మ్యాచ్‌లో 10వ సీడ్ అజయ్ జయరామ్ 11-21, 21-8, 22-20తో జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా)ని ఓడించాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21-13, 13-21, 21-14తో కారి ఇమాబీప్ (జపాన్)పై గెలిచింది. గంటా మూడు నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీకి ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో హోరాహోరీగా తలపడిన సింధు... రెండో గేమ్‌ను చేజార్చుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తన అనుభవాన్ని రంగరించి స్పష్టమైన ఆధిక్యంతో చెలరేగింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో జ్వాల-అశ్విని 14-21, 17-21తో షిజుకా మత్స్వో-మామి నైటో (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. -
కర్ణాటకకు షాక్
ముంబై: వరుసగా రెండేళ్ల పాటు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటక ఈసారి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్రపై కనీసం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా నాకౌట్‌కు అర్హత సాధించే స్థితిలో... కర్ణాటక జట్టు 53 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్ ‘ఎ’లో 24 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. ఈ గ్రూప్ నుంచి విదర్భ (29 పాయింట్లు), బెంగాల్ (28), అస్సాం (26) క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. హర్యానా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. గ్రూప్ ‘బి’ టాపర్ ముంబై ఇక గ్రూప్ ‘బి’ నుంచి ముంబై జట్టు అగ్రస్థానం (35 పాయింట్లు)తో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ (26), మధ్యప్రదేశ్ (24) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు చేరాయి. ఈ గ్రూప్‌లో గుజరాత్ కూడా మధ్యప్రదేశ్‌తో 24 పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఎంపీ ముందుకెళ్లింది. ఇదే గ్రూప్ నుంచి ఆంధ్ర జట్టు ఆఖరి స్థానంలో నిలవడం ద్వారా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. వచ్చే ఏడాది ఆంధ్ర జట్టు హైదరాబాద్‌తో కలిసి గ్రూప్ ‘సి’లో మ్యాచ్‌లు ఆడుకుంటుంది. నాకౌట్‌కు సౌరాష్ట్ర, జార్ఖండ్ ఇక గ్రూప్ ‘సి’ నుంచి సౌరాష్ట్ర, జార్ఖండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది గ్రూప్ ‘ఎ’... ‘బి’లలో ఆడేందుకు అర్హత సాధిం చాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ 10 వికెట్లతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో 31 పాయింట్లతో సౌరాష్ట్ర (36) తర్వాత రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్ 8 మ్యాచ్‌ల ద్వారా 8 పాయింట్లు సాధించి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. -
క్వార్టర్స్‌లో జోష్నా చినప్ప
దోహా: ఖతార్ క్లాసిక్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జోష్నా 16-14, 11-8, 11-8తో యత్రెబ్ అదెల్ (ఈజిప్టు)పై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ 7-11, 8-11, 3-11తో ఫరెస్ దెసూకి (ఈజిప్టు) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
బెంగళూరు: ఎయిర్ ఆసియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్‌లోనూ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6-4, 7-6 (11/9)తో డేల్ ప్రొపొజియా (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ 7-6 (7/3), 6-1తో ఇగోర్ జెరసిమోవ్-ఇల్యా ఇవస్కా (బెలారస్) జంటపై గెలిచాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్-సుమీత్ నాగల్ (భారత్) జోడీ 6-7 (5/7), 4-6తో తి చెన్ (చైనీస్ తైపీ)-డేన్ ప్రొపొజియా (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఆసియా బాస్కెట్‌బాల్ క్వార్టర్స్‌లో భారత్
చాంగ్షా (చైనా): ఆసియా సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో 12 ఏళ్ల తర్వాత భారత జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 65-99 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున విశేష్ భృగువంశీ 21 పాయింట్లు, అమృత్‌పాల్ సింగ్ 18 పాయింట్లు, అమ్‌జ్యోత్ సింగ్ 11 పాయింట్లు స్కోరు చేశారు. లీగ్ దశ పోటీలు ముగిశాక భారత్, పాలస్తీనా ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఇ’లో సమఉజ్జీగా నిలిచాయి. అయితే ముఖాముఖి మ్యాచ్‌లో పాలస్తీనాపై భారత్ గెలుపొందడంతో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇదే గ్రూప్ నుంచి ఫిలిప్పీన్స్, ఇరాన్, జపాన్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. -
క్వార్టర్స్‌లో భారత్ ఓటమి
న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. చాంపియన్ డివిజన్లో టాప్ సీడ్ చైనా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 0-3తో పరాజయం పాలైంది. భారత ఆటగాళ్లు హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ బరిలోకి దిగిన మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశారు. ఇక భారత జట్టు 5 నుంచి 8 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. అంతకుముందు లీగ్ దశలో భారత్ 3-0తో ఉజ్బెకిస్తాన్‌పై, 3-2తో థాయ్‌లాండ్‌పై నెగ్గి చాంపియన్ డివిజన్‌కు అర్హత సాధించింది. -
క్వార్టర్స్‌లో మనోజ్, మదన్‌లాల్
ఆసియా సీనియర్ బాక్సింగ్ బ్యాంకాక్: కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (64 కేజీలు) ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మనోజ్‌తోపాటు భారత్‌కే చెందిన మదన్ లాల్ (52 కేజీలు), కుల్దీప్ సింగ్ (81 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 3-0తో దీపక్ శ్రేష్ట (నేపాల్)పై, మదన్ లాల్ 3-0తో ముర్తదా అల్ సుదాని (ఇరాక్)పై గెలుపొందగా... చైనా బాక్సర్ ఒలిన్ జాంగ్‌పై కుల్దీప్ విజయం సాధించాడు. ఇప్పటికే దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ (75 కేజీలు), మన్‌ప్రీత్ (ప్లస్ 91 కేజీలు), సతీశ్ (91 కేజీలు) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. తదుపరి బౌట్లలో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంటే వీరందరికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. -
క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్
సాంటియాగో: నిషేధం కారణంగా కెప్టెన్ నెయ్మర్ లేకపోయినా... సమష్టిగా ఆడిన బ్రెజిల్ జట్టు కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 గోల్స్ తేడాతో వెనిజులాను ఓడించి గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. బ్రెజిల్ తరఫున థియాగో సిల్వా (9వ నిమిషంలో), రొబెర్టో ఫిర్మినో (51వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... వెనిజులాకు నికొలస్ ఫెడరో 84వ నిమిషంలో ఏకైక గోల్‌ను అందించాడు. నాలుగు మ్యాచ్‌ల నిషేధం కారణంగా ఇక కోపా అమెరికా కప్‌లో ఆడే అవకాశం లేని నెయ్‌మార్‌కు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామని సిల్వా తెలిపాడు. క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ జూన్ 24: చిలీ =ఉరుగ్వే జూన్ 25: బొలివియా= పెరూ జూన్ 26: అర్జెంటీనా = కొలంబియా జూన్ 27: బ్రెజిల్ = పరాగ్వే -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి యూకీ బాంబ్రీతో కలిసి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తైపీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్-యూకీ బాంబ్రీ ద్వయం 6-3, 2-6, 10-7తో యుయా కిబి-తకుటో నికి (జపాన్) జంటపై గెలిచింది. సింగిల్స్‌లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. రామ్‌కుమార్ 6-2, 3-6, 6-7 (3/7)తో జిమ్మీ వాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
క్వార్టర్స్‌లో స్నేహ, సాయిశరణ్
ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్నేహ పడమట, సాయిశరణ్ రెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ క్లబ్ టెన్నిస్ కోర్టుల్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో నగరానికి చెందిన వీరిద్దరూ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో స్నేహ 1-6, 6-1, 6-3తో సహచర క్రీడాకారిణి తీర్థ ఇస్కాపై, నిహారిక (ఏపీ) 6-3, 6-2తో కర్ణాటకకు చెందిన ఉజ్జినిపై గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో ఈతి మెహతా (గుజరాత్) 6-0, 6-0తో రేష్మ (తమిళనాడు)పై, ఆర్తి (తమిళనాడు) 6-4, 6-1తో సాన్యా మదన్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గారు. అక్షర ఇస్కా (ఏపీ) 7-6, 2-6, 3-6తో వానియా దంగ్వాల్ (ఢిల్లీ)పై, పళని వాలే (తమిళనాడు) 7-6, 6-3తో మాన్య నాగ్‌పాల్ (ఢిల్లీ)పై గెలుపొందారు. పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిశరణ్ రెడ్డి 6-2, 6-4తో రోహన్ భాటియా (మహారాష్ట్ర)ను ఓడిం చగా, అబ్దుల్లా (ఏపీ) 6-4, 6-2తో పుంగ్లియా జయేశ్ (మహారాష్ట్ర)పై గెలిచాడు. విఘ్నేశ్ (ఏపీ) 2-6, 4-6తో రోనిత్ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూడగా, జయప్రకాశ్ (తమిళనాడు) 6-3, 6-4తో విశ్వకర్మ (యూపీ)పై నెగ్గాడు. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా
చైనా ఓపెన్ టోర్నీ ఫుజౌ (చైనా): సొంతగడ్డపై చైనా క్రీడాకారులను ఓడించి... భారత ప్లేయర్స్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-17, 19-21, 21-14తో హువాన్ గావో (చైనా)ను ఓడించగా... కశ్యప్ 11-21, 21-11,21-13తో జుయ్ సాంగ్ (చైనా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-18, 21-18తో జింగ్జింగ్ కిన్ (చైనా)పై నెగ్గింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో కశ్యప్; కెంటో మొమొటా (జపాన్)తో శ్రీకాంత్; దీ సుయో (చైనా)తో సైనా తలపడతారు. -
సాకేత్ జోరు
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: తన విజయపరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టిన ఈ వైజాగ్ ప్లేయర్... డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ కేవలం 55 నిమిషాల్లో 6-1, 6-2తో హిరోకి మొరియా (జపాన్)పై అలవోకగా గెలిచాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 7-6 (7/2), 6-2తో రెండో సీడ్ యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంటను బోల్తా కొట్టించింది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్, భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్ రెండో రౌండ్లోనే ఓడిపోయారు. విష్ణువర్ధన్ 2-6, 6-3, 3-6తో కిమెర్ కాప్‌జాన్స్ (బెల్జియం) చేతిలో; సోమ్‌దేవ్ 3-6, 6-7 (3/7)తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో; సనమ్ సింగ్ 1-6, 2-6తో ఆడ్రియన్ మెనెడెజ్ (స్పెయిన్) చేతిలో; విజయ్ సుందర్ 0-6, 6-7 (5/7)తో కుద్రయెత్సెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయారు. యూకీ బాంబ్రీ 7-5, 6-4తో గిగౌనోన్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరాడు. గురువారం జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో సాకేత్; యూచి సుగిటా (జపాన్)తో యూకీ బాంబ్రీ తలపడతారు. -
క్వార్టర్స్‌కు సైనా బృందం
హాంకాంగ్‌పై 4-1తో గెలుపు - సింగిల్స్‌లో సైనా, సింధు, తులసీ విజయం - లీగ్ దశలోనే పురుషుల జట్టు అవుట్ - థామస్, ఉబెర్ కప్ టోర్నీ న్యూఢిల్లీ: స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్‌లో తమ తొలి లక్ష్యాన్ని సాధించింది. వరుసగా రెండో విజయంతో ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందింది. హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘వై’ మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21-9, 21-10తో పుయ్ యిన్ యిప్‌పై నెగ్గి శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి 21-17, 21-13తో హోయ్ వా చౌ-లోక్ యాన్ పూన్ జంటను ఓడించింది. మూడో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-8, 21-10తో యింగ్ మీ చుయెంగ్పై గెలిచి భారత్‌కు 3-0తో విజయాన్ని ఖాయం చేసింది. నాలుగో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడి 14-21, 11-21తో సాజ్ కా చాన్-యింగ్ సుయెత్ త్సె జంట చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పి.సి.తులసీ 19-21, 21-16, 21-7తో హుంగ్ యుంగ్ చాన్‌పై నెగ్గి భారత ఆధిక్యాన్ని 4-1కి పెంచింది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గితే గ్రూప్ ‘వై’లో అగ్రస్థానం పొందుతుంది. ఫలితంగా భారత్‌కు క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా డిఫెండింగ్ చాంపియన్ చైనా బదులు ఇంగ్లండ్ లేదా చైనీస్ తైపీ ఉంటుంది. కశ్యప్, గురుసాయిదత్ నెగ్గినా... మరోవైపు థామస్ కప్‌లో మాత్రం భారత పురుషుల జట్టు పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. పారుపల్లి కశ్యప్ నేతృత్వంలోని టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మలేసియాతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-4తో ఓడిన సంగతి విదితమే. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 18వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ జట్టుకు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాన్ హో సన్తో జరిగిన ఈ పోటీలో శ్రీకాంత్ 21-17, 12-21, 18-21తో ఓడిపోయాడు. వాన్ హో సన్తో గతంలో ఆడిన రెండుసార్లు నెగ్గిన శ్రీకాంత్ సొంతగడ్డపై మాత్రం నిరాశపరిచాడు. డబుల్స్ మ్యాచ్‌లో యోన్ సియోంగ్ యూ-యోంగ్ డే లీ ద్వయం 21-18, 21-17తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంటను ఓడించి కొరియాను 2-0తో ఆధిక్యంలో నిలిపింది. అయితే మూడో మ్యాచ్‌లో కశ్యప్ 21-17, 21-14తో లీ డాంగ్ కియోన్‌పై నెగ్గడంతో భారత ఆశలు నిలిచాయి. కానీ నాలుగో మ్యాచ్‌లో కిమ్ సా రంగ్-కిమ్ కీ జంగ్ జోడి 21-16, 21-16తో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జంటను ఓడించడంతో కొరియా 3-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో గురుసాయిదత్ 24-22, 21-13తో హవాంగ్ జాంగ్ సూపై నెగ్గినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు రెండేసి ఓటములతో నాకౌట్ దశకు అర్హత పొందడంలో విఫలమయ్యాయి. ఇదే గ్రూప్ నుంచి మలేసియా, కొరియా నాకౌట్‌కు చేరుకున్నాయి. -
క్వార్టర్స్‌లో సాకేత్, విష్ణు
భీమవరం, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. కాస్మోపాలిటన్ క్లబ్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-2, 6-1తో మొహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్)పై, విష్ణువర్ధన్ 6-1, 6-1తో రోనక్ మనూజా (భారత్)పై గెలిచారు. మొహిత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్); విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడిలు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ ద్వయం 6-2, 6-4తో మొహిత్-అజయ్ సెల్వరాజ్ (భారత్) జోడిపై; విష్ణు-జీవన్ జంట 6-4, 7-5తో జతిన్ దహియా-విజయంత్ (భారత్) జోడిపై నెగ్గాయి. -
సాయి దేదీప్య గెలుపు
జింఖానా, న్యూస్‌లై న్: నేషనల్ సీరీస్ (ఎన్ఎస్) టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఢిల్లీలోని ఆర్కే ఖ న్నా స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీ రెండో రౌండ్లో సాయి దేదీప్య 7-5, 6-1తో రివ్దీ శర్మ (హర్యానా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైన ల్లో తను మహారాష్ట్ర క్రీడాకారిణి శివానితో తలపడనుంది. దీంతో పాటుగా డబుల్స్ కేటగిరీలో సాయి దేదీప్య- మెహక్ జైన్ (మహారాష్ట్ర) జోడి సెమీఫైనల్లోకి అడుగు పెట్టంది. ఈ జోడి సెమీస్‌లో సామా సాత్విక (ఆంధ్రప్రదేశ్)- శివాని (మహారాష్ట్ర) జోడితో పోటీపడనుంది.