వల్సాడ్: రంజీ ట్రోఫీలో గ్రూప్ ‘సి’నుంచి హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. గురువారం ఇక్కడి ముగిసిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది. తమ రెండో ఇన్నింగ్‌సలో హైదరాబాద్ 122 పరుగులకు ఆలౌటై... ప్రత్యర్థికి 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అరుుతే ఛత్తీస్‌గఢ్ తమ రెండో ఇన్నింగ్‌సలో 241 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం హైదరాబాద్ 23 పారుుంట్లతో రెండో స్థానానికి చేరింది.
అగ్రస్థానంలోనే ఆంధ్ర: మరో వైపు ఆంధ్ర ఇదే గ్రూప్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆంధ్ర, కేరళ మధ్య జరిగిన మ్యాచ్ గురువారం ‘డ్రా’గా ముగిసింది. కేరళ తమ రెండో ఇన్నింగ్‌సను 6 వికెట్లకు 302 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆట ముగిసే సరికి 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. భరత్ (73), విహారి (53 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. 7 మ్యాచ్‌ల తర్వాత ఆంధ్ర 25 పారుుంట్లతో నంబర్‌వన్‌గా ఉంది.