క్వార్టర్స్‌లో భారత్ ఓటమి | India's defeat in the quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో భారత్ ఓటమి

Published Sun, Sep 27 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

India's defeat in the quarterfinals

న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. చాంపియన్ డివిజన్‌లో టాప్ సీడ్ చైనా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 0-3తో పరాజయం పాలైంది. భారత ఆటగాళ్లు హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ బరిలోకి దిగిన మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశారు.

ఇక భారత జట్టు 5 నుంచి 8 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. అంతకుముందు లీగ్ దశలో భారత్ 3-0తో ఉజ్బెకిస్తాన్‌పై, 3-2తో థాయ్‌లాండ్‌పై నెగ్గి చాంపియన్ డివిజన్‌కు అర్హత సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement