
ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–11, 21–14తో జోషువా మాగీ (ఐర్లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 20–22, 21–17, 17–21తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 18–21తో ముగ్ధా అగ్రే (భారత్) చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment