Anant -Radhika: రాయల్‌ టెంట్‌ అదుర్స్‌! వీడియో షేర్‌ చేసిన సైనా | Anant Ambani And Radhika Pre Wedding: Saina Nehwal Shares Video Of Royal Tents Provided For Guests, Goes Viral - Sakshi
Sakshi News home page

Jamnagar Pre-Wed Guests Room Tour: రాయల్‌ టెంట్‌ అదుర్స్‌..! అదరగొట్టిన సైనా- కశ్యప్‌

Published Sat, Mar 2 2024 3:35 PM | Last Updated on Sat, Mar 2 2024 3:58 PM

Anant Ambani Radhika Pre Wedding Saina Nehwal Shares Royal Tent Glimpse - Sakshi

భర్త పారుపల్లి కశ్యప్‌తో సైనా నెహ్వాల్‌ (PC: Saina Nehwal Insta)

Anant Ambani Radhika Pre Wedding: అంబానీల వారసుడు అనంత్‌- రాధికల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సెలబ్రిటీ లోకం తరలివెళ్లింది. క్రీడా, సినీ ప్రముఖులు గుజరాత్‌లో సందడి చేస్తూ అంబానీ కుటుంబ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్‌- పారుపల్లి కశ్యప్‌దంపతులు కూడా జామ్‌నగర్‌కు విచ్చేశారు.

ఈ నేపథ్యంలో సైనా.. ‘‘పర్‌ఫెక్ట్‌ అంబానీ వెడ్డింగ్‌’’ పేరిట తాము ఉండబోయే రాయల్‌ టెంట్‌ టూర్‌ వీడియో షేర్‌ చేసింది. ముందస్తు పెళ్లి వేడుకల కోసం వచ్చే అతిథుల కోసం దాదాపు అరవై దాకా ఈ టెంట్లు వేయించినట్లు తెలుస్తోంది.

పచ్చని మైదానంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ తాత్కాలిక నివాసాన్ని నాలుగు గదులుగా విభజించారు. ఇందులో లివింగ్‌ ఏరియా, మాస్టర్‌ బెడ్‌రూం హైలైట్‌గా నిలిచాయి. ఇండోర్‌ ప్లాంట్లను కూడా జతచేసి మనసుకు హాయి కలిగించేలా.. అన్ని రకాల సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దారు. 

సైనా నెహ్వాల్‌ షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు కూడా అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు జామ్‌నగర్‌కు వెళ్లారు. 

చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్‌- రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement