శ్రీకాంత్- శ్రావ్య రిసెప్షన్‌లో నాగార్జున సందడి(PC: Instagram)
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.
రిసెప్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున
బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.
కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్‌సూట్‌లో మెరిసిపోయాడు.
నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!
అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు.
‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్‌కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు
కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్‌వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.
అదే విధంగా.. 2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.
చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ
Comments
Please login to add a commentAdd a comment