వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. రోహిత్‌ శర్మ వీడియో వైరల్‌ | That 1 Per Cent: Rohit Sharma Joins Viral Trend Internet Goes Wild Video | Sakshi
Sakshi News home page

వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. రోహిత్‌ శర్మ వీడియో వైరల్‌

Published Wed, Sep 11 2024 1:34 PM | Last Updated on Wed, Sep 11 2024 1:53 PM

That 1 Per Cent: Rohit Sharma Joins Viral Trend Internet Goes  Wild Video

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనలోని మరో కోణాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వ్యాయామ సమయంలో 99 శాతం తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన ఒక్క శాతం మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెడతానన్నట్లుగా సరదా వీడియో షేర్‌ చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్‌ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

నలభై రోజులకు పైగా విరామం
ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం శ్రీలంక పర్యటన సందర్భంగా వన్డే సిరీస్‌ ఆడిన హిట్‌మ్యాన్‌.. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఎల్లప్పుడూ వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియాకు దాదాపు నలభై రోజులకు పైగా విశ్రాంతి దొరకడంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే, సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు షెడ్యూల్‌ ఖరారు కావడంతో రీఎంట్రీ ఇచ్చేందుకు రోహిత్‌ సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే జిమ్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్న రోహిత్‌ శర్మ... ఫిట్‌నెస్‌ మరింత మెరుగుపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ‘వన్‌ పర్సెంట్‌’ ట్రెండ్‌కు అనుగుణంగా తన వీడియోను షేర్‌ చేశాడు. 

స్నేహితులను ఏడిపించిన రోహిత్‌
ఇందులో రోహిత్‌ వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో.. కాస్త విరామం దొరకగానే తన ట్రెయినీలు, స్నేహితులను టీజ్‌ చేయడం కనిపిస్తుంది. తన సరదా చేష్టలతో వారిని ఉడికిస్తున్నట్లుగా ఆ దృశ్యాలు ఉన్నాయి.

ఈ వీడియో రోహిత్‌ శర్మ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. షేర్‌ చేసిన గంటల్లోనే మిలియన్ల కొద్దీ లైకులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో.. ‘‘వాళ్లు ఎలా భరిస్తున్నారో భయ్యా!.. నిజంగా నువ్వింకా చిన్నపిల్లాడిలానే ఫ్రెండ్స్‌ను ఆటపట్టిస్తున్నావు’’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. 

వారి రీ ఎంట్రీ కూడా..
కాగా సెప్టెంబరు 19న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. అయితే, కెప్టెన్‌ రోహిత్‌కు డిప్యూటీగా ఎవరు ఉంటారన్నది మాత్రం చెప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌తోనే విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. మిగతా వాళ్లలో చాలా మంది దులిప్‌ ట్రోఫీ-2024లో ఆడి ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నారు.

చదవండి: హిట్‌మ్యాన్‌ మరో 10 పరుగులు చేస్తే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement