International Badminton Tournament
-
ప్రిక్వార్టర్స్‌లో సింధు
లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–9, 21–9తో తాన్యా హేమంత్ (భారత్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సామియా 17–21, 21–11, 21–10తో శ్రుతి (భారత్)పై, చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–9, 21–12తో అంజన (భారత్)పై నెగ్గారు. శ్రీకృష్ణప్రియ 13–21, 13–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో... గద్దె రుత్విక శివాని 3–21, 4–21తో ప్రేరణ (భారత్) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 18–21, 21–15, 21–10తో మరీ బటోమెనె (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గింది. 51 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా... అనంతరం పుంజుకొని తర్వాతి రెండు గేముల్లోనూ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఐరా శర్మ (భారత్) 21–18, 21–13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై గెలిచి క్వార్టర్స్‌లో చోటు దక్కించుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 22–20తో చెమ్ జునే వీ (మలేసియా)పై గెలిచాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ పోరుల్లో అర్జున్– ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–11, 21–12తో రోరీ ఇస్టోన్–జాక్ రస్ జంట (ఇంగ్లండ్)పై, కృష్ణ ప్రసాద్– విష్ణువర్ధన్ (భారత్) జోడీ 21–7, 21–13తో క్రిస్టియన్ క్రెమర్–మార్కస్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–12, 21–18తో కాల మ్ హెమ్మింగ్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరింది. సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 7–21తో నిక్లాస్ నోర్– అమలీ మెగెలండ్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడింది. -
సైనా నెహ్వాల్‌కు కరోనా.. టోర్నమెంట్ నుంచి అవుట్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. నేటి నుంచి(మంగళవారం) థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళన కరంగా మారింది. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి సైనా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నిర్వాహకులు ముందస్తు చర్యల్లో భాగంగా పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు పరీక్షలను నిర్వహించారు ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. చదవండి: నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్ జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొన్న మొత్తం 824 మంది కోవిడ్ నెగిటివ్‌గా పరీక్షించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొనే వారందరూ బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు తమ దేశంలోనే కరోనా నెగటీవ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడామళ్లీ మళ్లీ కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. Badminton players Saina Nehwal, HS Prannoy and Parupalli Kashyap withdraw from Yonex Thailand Open after Nehwal and Prannoy tested positive for COVID19. While Kashyap is under quarantine due to close proximity with a player: Badminton Association of India (BAI) — ANI (@ANI) January 12, 2021 -
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో 14 ర్యాంకర్ శ్రీకాంత్ భారత్‌కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. -
శ్రీకాంత్ ఆరో‘సారీ’...
ఒడెన్స్: ఏడు నెలల తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ 22–20, 13–21, 16–21తో ఓడిపోయాడు. చౌ తియెన్ చెన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. శ్రీకాంత్ ఏకైకసారి 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్పై గెలిచాడు. ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో తలపడిన ఆరుసార్లూ (2015 వరల్డ్ సూపర్‌సిరీస్ ఫైనల్స్; 2017 వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్; 2018 చైనా ఓపెన్; 2019 ఫ్రెంచ్ ఓపెన్; 2020 మలేసియా మాస్టర్స్ టోర్నీ; 2020 డెన్మార్క్ ఓపెన్) శ్రీకాంత్‌ను పరాజయమే పలకరించింది. 62 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... రెండో గేమ్ నుంచి ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ తడబడ్డాడు. ఒకదశలో 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. నిర్ణాయక మూడో గేమ్ లోనూ తియెన్ చెన్ పైచేయి సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్‌కు 4,125 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బ్యాడ్మింటన్‌కు వేళాయె!
ఒడెన్స్ (డెన్మార్క్): కరోనా వైరస్ కారణంగా మార్చి నెల రెండో వారం నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఏడు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు మళ్లీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సందడి మొదలుకానుంది. నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ జరగనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు లక్ష్య సేన్, అజయ్ జయరామ్, శుభాంకర్ డే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సరైన సన్నాహాలు లేని కారణంగా సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టోబీ పెంటీ (ఇంగ్లండ్)తో శ్రీకాంత్; జేసన్ ఆంథోనీ (కెనడా)తో శుభాంకర్; అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో అజయ్ జయరామ్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో లక్ష్య సేన్ ఆడనున్నారు. -
మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దయ్యాయి. ఆగస్టులో జరగాల్సిన చైనా మాస్టర్స్ సూపర్–100తోపాటు అక్టోబర్‌లో జరగాల్సిన డచ్ ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించింది. కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీడబ్ల్యూఎఫ్ కార్యవర్గం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. -
ప్రణయ్ ప్రతాపం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అన్ని గొప్ప టోర్నమెంట్లలో టైటిల్స్ సాధించి దిగ్గజ క్రీడాకారుడి హోదా పొందిన చైనా సూపర్ స్టార్ ప్లేయర్ లిన్ డాన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచి, రెండుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించి ఎందరో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఆరాధ్యుడిగా మారిన లిన్ డాన్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ షాక్ ఇచ్చాడు. హోరాహోరీ పోరులో లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్ ఈ క్రమంలో మూడుసార్లు చైనా స్టార్‌ను ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్‌కు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుంది. బాసెల్ (స్విట్జర్లాండ్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్నా... జాతీయ క్రీడా పురస్కారాల్లో హెచ్ఎస్ ప్రణయ్‌కు ఈసారీ మొండిచేయి లభించడంతో ఆ కసినంతా అతను ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శనలో చూపిస్తున్నాడు. తొలి రౌండ్లో తనకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్‌ను ఓడించడానికి ఇబ్బంది పడ్డ ఈ కేరళ ఆటగాడు... రెండో రౌండ్లో మాత్రం జూలు విదిల్చాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 21–11, 13–21, 21–7తో గెలుపొంది సంచలనం సృష్టించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లిన్ డాన్‌తో ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డ ప్రణయ్ ముఖాముఖి రికార్డులో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు 2015 ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 ఇండోనేసియా ఓపెన్‌లో లిన్ డాన్‌పై ప్రణయ్ గెలిచాడు. తద్వారా లిన్ డాన్‌ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో లిన్ డాన్‌పై పుల్లెల గోపీచంద్ రెండుసార్లు... ప్రస్తుత భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఒకసారి గెలిచారు. 62 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ ఆద్యంతం దూకుడుగా ఆడాడు. లిన్ డాన్ స్థాయిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడిన ప్రణయ్ తొలి గేమ్‌లో 10–5, 19–11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్... నిర్ణాయక మూడో గేమ్‌లో రెచ్చిపోయాడు. స్కోరు 6–5తో ఉన్నదశలో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14–5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత చైనా ప్లేయర్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. టోర్నీ తొలి రోజు సోమవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్, భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో లో కీన్ యెయి (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో సుమీత్–మనూ జంట డబుల్స్ విభాగంలోభారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటకు చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ తున్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి వాకోవర్ లభించింది. దండు పూజ–సంజన ద్వయం 15–21, 14–21తో సు యా చింగ్–హు లింగ్ ఫాంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి 21–13, 21–13తో థామ్ గికెల్–రోనన్ లేబర్ (ఫ్రాన్స్)లపై... ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 21–14, 21–16తో తొబియాస్ కుయెంజి–ఒలివర్ షాలెర్ (స్విట్జర్లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా 18–21, 11–21తో టకుటో ఇనుయు–యుకీ కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు. లిన్ డాన్‌తో తొలి గేమ్‌లో, చివరి గేమ్‌లో బాగా ఆడాను. అయితే రెండో గేమ్‌లో నా వ్యూహం బోల్తా కొట్టింది. దీంతో కోచ్‌ల సలహాలతో కీలకదశలో నా ఆటతీరు మార్చుకొని మంచి ఫలితం సాధించాను. సంయమనం కోల్పోకుండా సుదీర్ఘ సమయం ఆడాను. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటాతో తలపడనున్నాను. ఈ మ్యాచ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను. –ప్రణయ్ -
ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: కోట్ డి ఐవరీ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్న మెంట్లో హైదరాబాద్ అమ్మాయి కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ ఫైనల్లోకి ప్రవేశించింది. ఐవరీకోస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకృష్ణప్రియ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 21–16, 21–19తో అజోక్ అడ్సోకన్ (నైజీరియా)పై నెగ్గింది. శ్రీకృష్ణప్రియ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–2, 21–4తో నఫీసాతు (ఐవరీకోస్ట్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–17, 21–17తో దోహా హ్యానీ (ఈజిప్ట్)పై విజయం సాధించింది. -
సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–12, 21–12తో భారత్‌కే చెందిన వైభవ్–ప్రకాశ్ రాజ్ జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా, మనూ అత్రితో కలిసి దక్కించుకుంది. ఫైనల్లో మనీషా–మనూ జంట 21–17, 22–20 తో కుహూ గార్గ్–రోహన్ (భారత్) ద్వయంపై గెలిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. మూడో సీడ్ సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్)తో జరిగిన ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 22–20, 16–21, 25–27తో పోరాడి ఓడిపోయింది. -
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
సింగపూర్ సిటీ: ఈ ఏడాది బరిలోకి దిగిన నాలుగో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం మొదలైన సింగపూర్ ఓపెన్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో గురుసాయిదత్ క్వాలిఫయింగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెయిన్ ‘డ్రా’లో బెర్త్ దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో 21–7, 21–10తో రొసారియో మదోలొని (ఇటలీ)పై నెగ్గిన గురుసాయిదత్... రెండో రౌండ్లో 21–18, 21–18తో నాలుగో సీడ్ లియోంగ్ జున్ హావో (మలేసియా)ను ఓడించాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో కియావో బిన్ (చైనా)తో గురుసాయిదత్ ఆడతాడు. హైదరాబాద్‌కే చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 22–20, 10–21, 18–21తో లు చియా హంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ మ్యాచ్‌లో రితూపర్ణ దాస్ 13–21, 21–16, 21–12తో చౌ జెన్గ్రేస్ (సింగపూర్)పై గెలిచి మెయిన్ ‘డ్రా’ అర్హత పొందింది. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జంట... మిక్స్డ్ డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 21–16, 21–19తో అందిక రమదాన్సియా–మిచెల్లి బందాసో (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో కశ్యప్, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే, వైష్ణవి రెడ్డి, రితూపర్ణ దాస్ బరిలోకి దిగుతారు. -
క్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి
ఫ్రాన్స్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ కశ్యప్ 18–21, 14–21తో మూడో సీడ్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో కశ్యప్
ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–11, 21–14తో జోషువా మాగీ (ఐర్లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 20–22, 21–17, 17–21తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 18–21తో ముగ్ధా అగ్రే (భారత్) చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురుసాయిదత్ 21–12, 24–22తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై గెలుపొందగా... కశ్యప్ 21–16, 21–7తో దుర్కిన్‌జాక్ (క్రొయేషియా)ను ఓడించాడు. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 23–25, 13–21తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ఫైనల్లో సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: బెల్జియం ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బెల్జియంలోని లెవెన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరభ్ 21-15, 21-16తో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఫైనల్లో లుకాస్ కార్వీ (ఫ్రాన్స్)తో సౌరభ్ ఆడతాడు. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర ఆటగాళ్లు చిట్టబోరుున రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో, ఆనంద్ పవార్ తొలి రౌండ్లో ఓడిపోయారు. -
సమీర్ వర్మకు టైటిల్
న్యూఢిల్లీ: బహ్రెయిన్ చాలెంజ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. బహ్రెయిన్‌లోని ఇసా టౌన్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు 21-14, 21-10తో నాలుగో సీడ్, ప్రపంచ 47వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై సంచలన విజయం సాధించాడు. వారం రోజుల వ్యవధిలో సమీర్ వర్మ రెండో సింగిల్స్ టైటిల్ సాధించడం విశేషం. గతవారం ఇదే వేదికపై జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన సమీర్ అదే జోరును చాలెంజ్ టోర్నీలోనూ కొనసాగించాడు. మరోవైపు భారత్‌కే చెందిన శైలి రాణే వరుసగా రెండో టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో శైలి రాణే 22-24, 10-21తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది.