లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సింధు 21–9, 21–9తో తాన్యా హేమంత్ (భారత్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సామియా 17–21, 21–11, 21–10తో శ్రుతి (భారత్)పై, చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–9, 21–12తో అంజన (భారత్)పై నెగ్గారు. శ్రీకృష్ణప్రియ 13–21, 13–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో... గద్దె రుత్విక శివాని 3–21, 4–21తో ప్రేరణ (భారత్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment