
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21–10, 12–21, 21–15తో ఐరా శర్మ (భారత్)పై శ్రమించి గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ డాయ్ వాంగ్‌తో సింధు ఆడుతుంది.
హైదరాబాద్‌కే చెందిన వలిశెట్టి శ్రియాన్షి సంచలనం సృష్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 21–12, 21–15తో ప్రపంచ 32వ ర్యాంకర్ మాళవిక (భారత్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment