Syed Modi badminton competition
-
క్వార్టర్స్‌లో సింధు
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21–10, 12–21, 21–15తో ఐరా శర్మ (భారత్)పై శ్రమించి గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ డాయ్ వాంగ్‌తో సింధు ఆడుతుంది. హైదరాబాద్‌కే చెందిన వలిశెట్టి శ్రియాన్షి సంచలనం సృష్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రియాన్షి 21–12, 21–15తో ప్రపంచ 32వ ర్యాంకర్ మాళవిక (భారత్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
సింధు శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–17, 21–15తో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన వలిశెట్టి శ్రేయాన్షి, మాళవిక బన్సోద్, రక్షిత శ్రీ, అనుపమ ఉపాధ్యాయ్, తస్నిమ్ మీర్, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్, ఐరా శర్మ కూడా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడా కారులు, టాప్ సీడ్ లక్ష్య సేన్... రెండో సీడ్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–12, 21–12తో ఆదిల్ (మలేసియా)పై, ప్రియాన్షు 21–13, 21–12తో కార్తికేయ (భారత్)పై గెలిచారు. భారత్‌కే చెందిన మైస్నం మెరాబా, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి, రిత్విక్ కూడా తొలి రౌండ్లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీలు శుభారంభం చేశాయి. తెలంగాణకు చెందిన సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి ద్వయం... గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ జోడీ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సిక్కి–సుమీత్ 21–10, 21–18తో సంజీత్ సుబ్రమణియన్–గౌరీ కృష్ణ (భారత్)లపై... రుత్విక–రోహన్ 21–14, 21–12తో నితిన్– అనఘా (భారత్)లపై విజయం సాధించారు. హైదరాబాద్‌కే చెందిన కె.మనీషా–షేక్ గౌస్ జోడీ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో మనీషా–õÙక్ గౌస్ 21–16, 12–21, 21–19తో నితిన్ కుమార్–రిధి కౌర్ తూర్ (భారత్)లను ఓడించారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు నవ్య కందేరి, తన్వీ శర్మ, మాన్సి సింగ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో నవ్య 21–8, 21–8తో సాక్షి గహ్లావత్పై, తన్వీ శర్మ 21–12, 21–10తో ఆశి రావత్‌పై, మాన్సి సింగ్ 21–11, 14–21, 21–12తో బోనం ప్రశంసపై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు రిత్విక్, సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్, సనీత్ దయానంద్ మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగం నుంచి టాప్ సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ చివరి నిమిషంలో వైదొలిగింది. -
ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడి
లక్నో: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. సయ్యద్ మోదీ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సింధు శనివారం జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్‌ను 21–11తో అలవోకగా గెలిచింది. ఈ దశలో ఆమె ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. దీంతో 14 నిమిషాల్లోనే సింధు సెమీఫైనల్ గెలిచి తుది పోరుకు అర్హత సాధించినట్లయింది. సింధు నేడు జరిగే టైటిల్ పోరులో భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్తో తలపడనుంది. సెమీఫైనల్లో మాల్విక 19–21, 21–19, 21–7తో అనుపమా ఉపాధ్యాయపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ షట్లర్ అర్నాడ్ మెర్కెలె 21–19, 17–21, 21–9తో మిథున్ మంజునాథ్ పై గెలుపొందాడు. మరో సెమీస్‌లో లుకాస్ క్లేర్బొట్ (ఫ్రాన్స్) 15–21, 21–18, 21–15తో నాట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తుది పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో గాయత్రి జంట 17–21, 21–8, 21–16తో మలేసియాకు చెందిన లో యిన్ యువాన్–వాలెరీ స్లొవ్ ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–10, 21–9తో ప్రేమ్‌సింగ్ చౌహాన్–రాజేశ్ వర్మ జంటపై గెలిచి ఫైనల్ చేరింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–9, 21–9తో తాన్యా హేమంత్ (భారత్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సామియా 17–21, 21–11, 21–10తో శ్రుతి (భారత్)పై, చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–9, 21–12తో అంజన (భారత్)పై నెగ్గారు. శ్రీకృష్ణప్రియ 13–21, 13–21తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో... గద్దె రుత్విక శివాని 3–21, 4–21తో ప్రేరణ (భారత్) చేతిలో ఓడిపోయారు. -
పీవీ సింధుకు సదవకాశం.. రెండున్నరేళ్ల లోటు తీరేనా..!
లక్నో: రెండున్నరేళ్లుగా లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను తీర్చుకునేందుకు భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరో ప్రయత్నం చేయనుంది. నేడు మొదలయ్యే సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో సింధు మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన తర్వాత సింధు మరో అంతర్జాతీయ టైటిల్‌ను గెలవలేకపోయింది. గతవారం ఇండియా ఓపెన్ టోర్నీలో సింధు సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. సయ్యద్ మోదీ ఓపెన్ లో టాప్ సీడ్‌గా పోటీపడుతున్న సింధు తొలి రౌండ్లో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌తో తలపడనుంది. ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో తనను ఓడించిన థాయ్‌లాండ్ క్రీడాకారిణి సుపనిదతో సింధు ఈసారి క్వార్టర్ ఫైనల్లో పోటీపడే అవకాశముంది. సుపనిదపై సింధు గెలిస్తే ఆమె దారిలో మరో కఠిన ప్రత్యర్థి లేరనే చెప్పాలి. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, మామిళ్లపల్లి తనిష్క్, సామియా ఫారూఖీ, చుక్కా సాయి ఉత్తేజిత రావు, రుత్విక శివాని కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతవారం ఇండియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్... పురుషుల డబుల్స్ టైటిల్ సాధించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట సయ్యద్ మోదీ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. చదవండి: లీగ్ మధ్యలో చెక్కేసిన పాకిస్థాన్ క్రికెటర్లు -
సూపర్ సౌరభ్
లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకునేందుకు భారత షట్లర్ సౌరభ్ వర్మ విజయానికి దూరంలో నిలిచాడు. సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్ వర్మ 21–17, 16–21, 21–18తో ప్రపంచ 44వ ర్యాంకర్ హివో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 15–18తో వెనుకబడిన సౌరభ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో సౌరభ్ ఆడతాడు.మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ ప్లేయర్ రితూపర్ణ దాస్ ని్రష్కమించింది. సెమీఫైనల్లో రితూపర్ణ దాస్ 22–24, 15–21తో ఫిట్టాయపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సౌరభ్
లక్నో: మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300’ ఈవెంట్లో సౌరభ్ వర్మ కూడా ముందంజ వేయగా... మిగతా భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌తో పాటు హెచ్.ఎస్.ప్రణయ్, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్ నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు టోర్నీకి దూరం కాగా... క్వాలిఫయర్లు రీతుపర్ణా దాస్, శ్రుతి ముందాడ క్వార్టర్స్ చేరారు. డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగింది. శ్రమించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 18–21, 22–20, 21–16తో తన సహచరుడు పారుపల్లి కశ్యప్‌ను ఓడించాడు. 2016లో టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడినప్పటికీ శ్రీకాంత్ పుంజుకొని ఆడటంతో రెండు, మూడో గేమ్‌ల్లో గెలిచి మ్యాచ్ నెగ్గాడు.. మరో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ కూడా భారత ఆటగాడిపైనే గెలిచి క్వార్టర్స్ చేరాడు. అతను 21–11, 21–18తో ఆలాప్ మిశ్రాను ఓడించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్... ఏడో సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో తలపడతాడు. సన్ వాన్ 21–14, 21–17తో లక్ష్యసేన్‌ను ఓడించాడు. సౌరభ్... కున్లవుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో తలపడతాడు. సిరిల్ వర్మ 9–21, 22–24తో హి క్వాంగ్ హీ (కొరియా) చేతిలో కంగుతిన్నాడు. పోరాడి ఓడిన అజయ్ మిగతావారిలో ఒక్క అజయ్ జయరామ్ మాత్రమే తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో ఓడినప్పటికీ చైనా గోడ... జావో జన్ పెంగ్‌ను దీటుగా ఢీకొట్టాడు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అజయ్ 18–21, 21–14, 28–30తో ఓటమి పాలయ్యాడు. ఈ సీజన్లో నిలకడైన విజయాలతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు సాయిప్రణీత్ రెండోరౌండ్లోనే చేతులెత్తేశాడు. అతను 11–21, 17–21తో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్ చేతిలో పరాజయం చవిచూశాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–14, 10–21, 14–21తో ఎనిమిదో సీడ్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. రీతుపర్ణా క్వార్టర్స్‌కు... మహిళల సింగిల్స్‌లో రీతుపర్ణా దాస్ 21–16, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ తన్వీలాడ్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో శ్రుతి 21–18, 21–14తో బెల్జియం క్రీడాకారిణి లియానే తన్పై గెలిచింది. మరో క్వాలిఫయర్ అష్మిత 12–21, 16–21తో కిమ్ హో మిన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో క్లొయె బిర్చ్–లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జంటతో జరిగిన మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 0–2తో వెనుకబడిన దశలో రిటైర్ట్‌హర్ట్‌గా నిష్క్రమించింది. కె.మనీషా–రుతుపర్ణ పండా జంట 9–21, 10–21తో నాలుగో సీడ్ చాంగ్ యి న– కిమ్ హి రిన్ (కొరియా) ద్వయం చేతిలో ఓడింది. -
సాయిప్రణీత్ శుభారంభం
లక్నో: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ సయ్యద్ మోదీ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ భమిడిపాటి సాయిప్రణీత్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 2116, 2220తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై... శ్రీకాంత్ 2112, 2111తో మల్కోవ్ (రష్యా)పై... ప్రణయ్ 1821, 2220, 2113తో లి షి ఫెంగ్ (చైనా)పై... సౌరభ్ వర్మ 2111, 2116తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందారు. హైదరాబాద్ కుర్రాడు సిరిల్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సిరిల్ వర్మ 1221, 2115, 213తో హువాంగ్ పింగ్ సెయిన్ (చైనీస్ తైపీ)ను ఓడించాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన హైదరాబాద్ ఆటగాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 1621, 821తో కున్లావుత్ వితిత్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. వృశాలి, ఉత్తేజిత ఓటమి మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగమ్మాయిలు గుమ్మడి వృశాలి 1621, 1621తో అష్మిత చాలిహా (భారత్) చేతిలో... సాయి ఉత్తేజిత 1021, 2119, 1521తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడారు. సాత్విక్‌చిరాగ్ జంటకు షాక్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్ జోడీ, రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి (భారత్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. డి జి జియాన్‌వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 2112, 2321తో సాత్విక్‌చిరాగ్ జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డిఅశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 2113, 1621, 2119తో ఎన్జీ సాజ్ యావుయువెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జంటపై నెగ్గింది. -
మెయిన్ ‘డ్రా’కు రాహుల్ యాదవ్
లక్నో: సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో తొలి రౌండ్లో రాహుల్ 21–13, 21–17తో కార్తికేయ (భారత్)పై... రెండో రౌండ్లో 21–10, 21–16తో ఆర్యమాన్ (భారత్)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన ఆలాప్ మిశ్రా, అన్సల్ యాదవ్ కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషికి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో ప్రాషి 21–19, 18–21, 8–21తో భారత్‌కే చెందిన తన్వీ లాడ్ చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, లక్ష్య సేన్ : అన్ని విభాగాల్లో నేటి నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ బరిలోకి దిగకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. కశ్యప్‌తో ఆడాల్సిన లూకాస్ కోర్వీ (ఫ్రాన్స్)... లక్ష్య సేన్‌తో ఆడాల్సిన థామస్ రుక్సెల్ (ఫ్రాన్స్) టోర్నీ నుంచి వైదొలగడంతో భారత ఆటగాళ్లకు తొలి రౌండ్లో ‘వాకోవర్’ లభించింది. -
క్వార్టర్స్‌లో సైనా, ఉత్తేజిత
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సైనాతోపాటు తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రితూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–14, 21–9తో భారత్‌కే చెందిన అమోలిక సింగ్ సిసోడియాను అలవోకగా ఓడించింది. సాయి ఉత్తేజిత 21–12, 21–15తో రేష్మా కార్తీక్ (భారత్)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–15తో శ్రుతి ముందాడ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 16–21, 18–21తో రుసెలి హర్తావాన్ (ఇండోనేసియా) చేతిలో... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మామిళ్లపల్లి తనిష్క్ 10–21, 9–21తో హాన్ వైయువె (చైనా) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సాయి ఉత్తేజిత; రితూపర్ణ దాస్‌తో సైనా తలపడతారు. సమీర్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాబోయే భర్త పారుపల్లి కశ్యప్‌తోపాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... గురుసాయిదత్ ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కశ్యప్ 9–21, 22–20, 21–8తో ఫిర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలుపొందగా... సమీర్ వర్మ 22–20, 21–17తో జున్‌పెంగ్ జావో (చైనా)పై... సాయిప్రణీత్ 21–12, 21–10తో రుస్తావిటో (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఒకవేళ ఈ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిస్తే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. సిక్కి–అశ్విని జంట జోరు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–13తో ప్రీతి–ప్రియ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 21–10తో శివమ్ శర్మ–హేమనాగేంద్ర బాబు (భారత్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–దండు పూజ (భారత్); సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
సెమీస్‌లో సింధు, శ్రీకాంత్
సయ్యద్ మోడి బ్యాడ్మింటన్ టోర్నీ లక్నో: అంచనాలను నిలబెట్టుకుంటూ భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మరో తెలుగు ఆటగాడు భమిడిపాడి సాయిప్రణీత్ కూడా సెమీస్‌కు చేరుకున్నాడు. పురుషుల విభాగంలో నలుగురు భారత ఆటగాళ్లే సెమీస్‌లో తలపడనుండటం విశేషం. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–17 స్కోరుతో ఏడో సీడ్ జుల్ఫాద్‌లీ జుల్కిఫ్లీ (మలేసియా)ను చిత్తు చేశాడు. మరో క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ సాయిప్రణీత్ 21–19, 12–21, 21–10తో భారత ఆటగాడు సౌరభ వర్మపై గెలుపొందాడు. సెమీస్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ తలపడతాడు. మరో ఇద్దరు భారత షట్లర్లు క్వార్టర్స్‌లో సంచలన విజయాలు సాధించారు. ఎనిమిదో సీడ్, జాతీయ చాంపియన్ సమీర్ వర్మ 21–15, 21–13తో రెండో సీడ్ క్రిస్టియాన్ విటింగస్ (డెన్మార్క్)ను చిత్తుగా ఓడించాడు. మరో మ్యాచ్‌లో ముంబై ఆటగాడు, అండర్–19 మాజీ జాతీయ చాంపియన్ హర్షీల్ దానీ కూడా 21–16, 17–21, 21–11తో పన్నెండో సీడ్ ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)ను ఓడించి సమీర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు 21–15, 21–11తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ వైదేహీ చౌదరిపై ఘన విజయం సాధించింది. రితూపర్ణదాస్ (భారత్)ను 21–17, 13–21, 23–21తో చిత్తు చేసిన నాలుగో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా)ను సింధు సెమీస్‌లో ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో బీట్రిజ్ కొరాల్స్ (స్పెయిన్ )ను 21–9, 21–11తో ఓడించి గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)... శ్రీకృష్ణ ప్రియ (భారత్)ను 21–17, 21–15తో ఓడించి హనా రమదీని (ఇండోనేసియా) కూడా సెమీస్‌లోకి అడుగు పెట్టారు. సెమీఫైనల్లో సిక్కి రెడ్డి హైదరాబాద్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సెమీస్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో సిక్కి–అశ్విని పొన్నప్ప జోడి 21–14, 21–18తో మలేసియా జంట మీ కువాన్ చౌ–లీ మెంగ్ యీన్ ను ఓడించింది. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సిక్కి–ప్రణవ్ చోప్రా 21–16, 21–19తో యోగేంద్ర కృష్ణన్ –ప్రజక్తా సావంత్‌ను ఓడించగా, మరో క్వార్టర్స్‌లో యోంగ్ కై టెరీ–వీ హాన్ టాన్ పై సుమీత్ రెడ్డి–అశ్విని 21–18, 23–21తో నెగ్గారు.