లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకునేందుకు భారత షట్లర్ సౌరభ్ వర్మ విజయానికి దూరంలో నిలిచాడు. సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్‌లో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్ వర్మ 21–17, 16–21, 21–18తో ప్రపంచ 44వ ర్యాంకర్ హివో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు.
75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 15–18తో వెనుకబడిన సౌరభ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో సౌరభ్ ఆడతాడు.మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ ప్లేయర్ రితూపర్ణ దాస్ ని్రష్కమించింది. సెమీఫైనల్లో రితూపర్ణ దాస్ 22–24, 15–21తో ఫిట్టాయపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment