Saurabh Verma
-
రన్నరప్ సౌరభ్ వర్మ
లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్ సాధించాలని ఆశించిన భారత షట్లర్, జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మకు నిరాశ ఎదురైంది. సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్ రన్నరప్‌తో సంతృప్తి చెందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్ 15–21, 17–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సౌరభ్ రెండు గేముల్లోనూ ప్ర్యత్యర్దికి పోటీనివ్వలేకపోయాడు. విజేత వాంగ్ జు వెకి 11,250 డాలర్లు (రూ. 8 లక్షలు), రన్నరప్ సౌరభ్ వర్మకు 5,700 డాలర్లు (రూ. 4 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది సౌరభ్ హైదరాబాద్ ఓపెన్, వియత్నాం ఓపెన్ టోరీ్నలలో టైటిల్స్ సాధించాడు. వాంగ్ జు వె నెగ్గడంతో... 2014 తర్వాత సయ్యద్ మోదీ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విదేశీ ఆటగాడికి టైటిల్ లభించినట్లయింది. 2014లో జుయ్ సాంగ్ (చైనా) విజేతగా నిలువగా... 2015లో పారుపల్లి కశ్యప్ (భారత్), 2016లో కిడాంబి శ్రీకాంత్ (భారత్), 2017, 2018లలో సమీర్ వర్మ (భారత్) చాంపియన్స్‌గా నిలిచారు. -
సూపర్ సౌరభ్
లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకునేందుకు భారత షట్లర్ సౌరభ్ వర్మ విజయానికి దూరంలో నిలిచాడు. సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్ వర్మ 21–17, 16–21, 21–18తో ప్రపంచ 44వ ర్యాంకర్ హివో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 15–18తో వెనుకబడిన సౌరభ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో సౌరభ్ ఆడతాడు.మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ ప్లేయర్ రితూపర్ణ దాస్ ని్రష్కమించింది. సెమీఫైనల్లో రితూపర్ణ దాస్ 22–24, 15–21తో ఫిట్టాయపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సౌరభ్
లక్నో: మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300’ ఈవెంట్లో సౌరభ్ వర్మ కూడా ముందంజ వేయగా... మిగతా భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌తో పాటు హెచ్.ఎస్.ప్రణయ్, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్ నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు టోర్నీకి దూరం కాగా... క్వాలిఫయర్లు రీతుపర్ణా దాస్, శ్రుతి ముందాడ క్వార్టర్స్ చేరారు. డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగింది. శ్రమించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ శ్రీకాంత్ 18–21, 22–20, 21–16తో తన సహచరుడు పారుపల్లి కశ్యప్‌ను ఓడించాడు. 2016లో టైటిల్ నెగ్గిన శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడినప్పటికీ శ్రీకాంత్ పుంజుకొని ఆడటంతో రెండు, మూడో గేమ్‌ల్లో గెలిచి మ్యాచ్ నెగ్గాడు.. మరో మ్యాచ్‌లో సౌరభ్ వర్మ కూడా భారత ఆటగాడిపైనే గెలిచి క్వార్టర్స్ చేరాడు. అతను 21–11, 21–18తో ఆలాప్ మిశ్రాను ఓడించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్... ఏడో సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో తలపడతాడు. సన్ వాన్ 21–14, 21–17తో లక్ష్యసేన్‌ను ఓడించాడు. సౌరభ్... కున్లవుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో తలపడతాడు. సిరిల్ వర్మ 9–21, 22–24తో హి క్వాంగ్ హీ (కొరియా) చేతిలో కంగుతిన్నాడు. పోరాడి ఓడిన అజయ్ మిగతావారిలో ఒక్క అజయ్ జయరామ్ మాత్రమే తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో ఓడినప్పటికీ చైనా గోడ... జావో జన్ పెంగ్‌ను దీటుగా ఢీకొట్టాడు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అజయ్ 18–21, 21–14, 28–30తో ఓటమి పాలయ్యాడు. ఈ సీజన్లో నిలకడైన విజయాలతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు సాయిప్రణీత్ రెండోరౌండ్లోనే చేతులెత్తేశాడు. అతను 11–21, 17–21తో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్ చేతిలో పరాజయం చవిచూశాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–14, 10–21, 14–21తో ఎనిమిదో సీడ్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. రీతుపర్ణా క్వార్టర్స్‌కు... మహిళల సింగిల్స్‌లో రీతుపర్ణా దాస్ 21–16, 21–13తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ తన్వీలాడ్‌ను ఇంటిదారి పట్టించింది. మరో మ్యాచ్‌లో శ్రుతి 21–18, 21–14తో బెల్జియం క్రీడాకారిణి లియానే తన్పై గెలిచింది. మరో క్వాలిఫయర్ అష్మిత 12–21, 16–21తో కిమ్ హో మిన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో క్లొయె బిర్చ్–లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జంటతో జరిగిన మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 0–2తో వెనుకబడిన దశలో రిటైర్ట్‌హర్ట్‌గా నిష్క్రమించింది. కె.మనీషా–రుతుపర్ణ పండా జంట 9–21, 10–21తో నాలుగో సీడ్ చాంగ్ యి న– కిమ్ హి రిన్ (కొరియా) ద్వయం చేతిలో ఓడింది. -
వియత్నాం ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
హో చి మిన్ సిటీ: అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న భారత షట్లర్ సౌరభ్ వర్మ ఈ ఏడాది తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్ నుంచి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫైనల్ చేరిన సౌరభ్ వర్మ... తుది పోరులో కీలక దశలో పైచేయి సాధించి టైటిల్‌ను కొల్లగొట్టేశాడు. 72 నిమిషాల మారథాన్ ఫైనల్లో రెండో సీడ్ సౌరభ్ 21–12, 17–21, 21–14తో సున్ ఫె జియాంగ్ (చైనా)పై నెగ్గాడు. మధ్యలో తడబడినా... పూర్తి ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆరంభించిన సౌరభ్ వర్మ ప్రత్యర్థి పేలవమైన రిటర్న్ షాట్లను ఆసరాగా చేసుకొని చెలరేగాడు. తొలి గేమ్‌లో మొదటి నాలుగు పాయింట్లు సాధించి 4–0 ఆధిక్యంలోకెళ్లాడు. మళ్లీ అదే దూకుడును కొనసాగించి 11–4తో విరామానికి వెళ్లాడు. అనంతరం మరోసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15–4తో గేమ్ విజయానికి చేరువయ్యాడు. ఈ దశలో కాస్త ప్రతిఘటించిన సున్ కొన్ని పాయింట్లు సాధించినా అంతరం భారీగా ఉండటంతో తొలి గేమ్‌ను 21–12తో సౌరభ్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న సున్ వరుస పాయింట్లు సాధిస్తూ సౌరభ్‌కు అందకుండా వెళ్లాడు. తొలుత 8–0తో అనంతరం 11–5తో ఆధిపత్యం ప్రదర్శించిన సున్ రెండో గేమ్‌ను చేజిక్కించుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో 4–2తో వెనుకబడ్డ సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో చెలరేగి 17–14తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. -
సెమీస్‌లో సౌరభ్ వర్మ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 21–13, 21–18తో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 112వ ర్యాంకర్ మినోరు కొగా (జపాన్)తో సౌరభ్ తలపడతాడు. -
విజేత సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. ‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్స్‌లో సౌరభ్ వర్మ
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో ఐదో సీడ్ శుభాంకర్ డే, ఏడో సీడ్ సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌కు చేరుకోగా... మహిళల సింగిల్స్ కేటగిరీలో ఆకర్షి కశ్యప్, చుక్కా సాయి ఉత్తేజితరావు పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శుభాంకర్ డే 21–16, 21–15తో చికో అరా వార్డొయో (ఇండోనేసియా)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–16, 21–11తో సన్ పెయ్ జియాంగ్ (చైనా)ను, అజయ్ జయరామ్ 21–18, 21–13తో జియా వీ తాన్ (మలేసియా)ను ఓడించారు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ 21–17, 15–21, 19–21తో లోహ్ కియాన్ యు (సింగపూర్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత రావు 10–21, 21–9, 8–21తో క్వాలిఫయర్ బెన్యప ఎమ్‌సార్డ్ (థాయ్‌లాండ్) చేతిలో, క్వాలిఫయర్ ఆకర్షి కశ్యప్ 18–21, 13–21తో రెండో సీడ్ అన్ సు యంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. -
ఆర్థిక సాయమందిస్తే...
న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాంకు మెరుగవ్వాలంటే అంతర్జాతీయ టోర్నీలే దిక్కని, దీని కోసం తనకు ఆర్థిక సాయమందించాలని జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ సౌరభ్ వర్మ అభ్యర్థించాడు. 26 ఏళ్ల వర్మ ఎనిమిదేళ్ల క్రితమే 2011లో సీనియర్ జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఖరీదైన శిక్షణకు నోచుకోకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, గాయాలు తదితర కారణాలతో అతను తరచూ టోర్నీలకు దూరమవుతున్నాడు. దీంతో 2012లో కెరీర్ బెస్ట్ 30వ ర్యాంకుకు చేరుకున్న సౌరభ్ ఇప్పుడు 55వ ర్యాంకుకు పడిపోయాడు. మీడియాతో అతను మాట్లాడుతూ ‘అంతర్జాతీయ టోర్నీలు ఆడేంత స్థోమత నాకు లేదు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. దీనికి తోడు కొత్త నిబంధన నాకు శాపమైంది. కేవలం టాప్–25 ర్యాంకర్లకు మాత్రమే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో నాకు అంతర్జాతీయ టోర్నీలు ఆడే అవకాశం కష్టమైంది. దాంతోపాటే ర్యాంకింగ్ కూడా దిగజారింది’ అని అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో నా ప్రతిభ చూసిన ‘బాయ్’ డచ్ ఓపెన్ ఆడేందుకు సాయపడిందని... అయితే మరిన్ని అంతర్జాతీయ టోర్నీలు ఆడేందుకు మరింత చేయూత కావాలని సౌరభ్ వర్మ కోరాడు. కనీసం 10 నుంచి 12 టోర్నీలు ఆడితేనే ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయన్నాడు. గతేడాది మోకాలి గాయం బాధించడంతో ఆటకు దూరమయ్యానని, ఇప్పుడైతే టోర్నీలను నా సొంత డబ్బులతోనే ఆడుతున్నానని చెప్పాడు. ఇది తనకు పెనుభారమవుతోందని తెలిపాడు. ‘త్వరలో స్విస్ ఓపెన్, ఒర్లియన్స్ ఓపెన్ ఆడేందుకు వెళుతున్నా. దీనికి అయ్యే ఖర్చంతా నాదే’ అని అన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక గతేడాది సౌరభ్... రష్యా ఓపెన్, డచ్ ఓపెన్లలో టైటిల్స్ గెలిచాడు. ఇటీవలే గువాహటిలో ముగిసిన జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఈ సీనియర్ టోర్నీలో అతను మూడో టైటిల్ గెలుచుకున్నాడు. -
తొలి రౌండ్లోనే కశ్యప్ ఓటమి
గ్వాంగ్జూ (కొరియా): వరల్డ్ టూర్ సూపర్–300 కొరియా ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. స్టార్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 17–21, 21–13, 8–21 లీ డాంగ్ క్యూన్ (కొరియా) చేతిలో... సౌరభ్ వర్మ 13–21, 21–12, 18–21తో ఈటూ హియానో (ఫిన్లాండ్) చేతిలో ఓడారు. గంటా 19 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కశ్యప్ తొలి రెండు గేమ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసినా... మూడో గేమ్‌లో పూర్తిగా తడబడి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. -
ప్రిక్వార్టర్స్‌లో అజయ్, సౌరభ్ వర్మ
తైపీ సిటీ: భారత షట్లర్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మలు చైనీస్ తైపీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 18–21, 21–17, 21–9తో హషిరు షిమోన (జపాన్)పై, సౌరభ్ వర్మ 18–21, 21–16, 21–13తో లీ చీ హో (చైనీస్ తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ కుర్రాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 11–21, 9–21తో లూ చి హంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, అభిషేక్ 5–21, 6–21తో ఐదో సీడ్ జాన్ ఒ జార్జెన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 15–21, 18–21తో చియాంగ్ ఇంగ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతినగా, హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21–23, 20–22తో లిన్ యింగ్ చన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిమ్ బ్రూన్ (డెన్మార్క్)తో అజయ్, రికి తకషిత (జపాన్)తో సౌరభ్ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్ కోన–లిమ్ కిమ్ వా (మలేసియా) ద్వయం 13–21, 10–21తో నాలుగో సీడ్ ఒగ్ యి సిన్–టే యి (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
అజయ్, సౌరభ్ సత్తా చాటుతారా!
తైపీ సిటీ: స్టార్ షట్లర్లు దూరమైన చైనీస్ తైపీ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్లో సత్తా చాటా లని భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ పట్టుదలగా ఉన్నారు. నేటినుంచి జరిగే ఈ టోర్నీకి పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు దూరంగా ఉన్నారు. ఈ నెలలోనే కీలకమైన డెన్మార్క్ ఓపెన్ (16 నుంచి 21 వరకు), ఫ్రెంచ్ ఓపెన్ (23 నుంచి 28 వరకు) టోర్నీలు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అజయ్ జయరామ్, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ లకు ఇది మంచి అవకాశం. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియలు బరిలోకి దిగుతున్నారు. వియ త్నాం, వైట్‌నైట్స్ టోర్నీలో ఫైనల్ చేరిన అజయ్ జయరామ్ ఈ టోర్నీలో టైటిల్‌పై కన్నేశాడు. తొలిరౌండ్లో అతను జపాన్‌కు చెందిన హషిరు షిమోనోతో తలపడనుండగా... ప్రపంచ 65వ ర్యాంకర్ సౌరభ్ వర్మ స్థానిక ఆటగాడు లీ చియ హవ్ను ఎదుర్కొంటాడు. మిగతా మ్యాచ్‌ల్లో చిట్టబోయిన రాహుల్... లు చియ హుంగ్ (తైపీ)తో, అభిషేక్... ఐదో సీడ్ జాన్ జొర్గెన్సన్ (డెన్మార్క్)తో పోటీపడతారు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత... చియాంగ్ యింగ్ లీ (తైపీ)తో, ముగ్ధ అగ్రే... ఏడో సీడ్ సోనియా (మలేసియా)తో, శ్రీకృష్ణప్రియ... లిన్ యింగ్ చన్ (తైపీ)తో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఒక్క తరుణ్ కోన మాత్రమే ఆడుతున్నాడు. అతను మలేసియాకు చెందిన లిమ్ కిమ్ వాతో జతకట్టగా, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత షట్లర్లు ఎవరూ పాల్గొనడం లేదు. -
రష్యా ఓపెన్‌లో సౌరభ్ జయకేతనం
వ్లాదివోస్టాక్ (రష్యా): రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన కోకి వటనబేపై సౌరభ్ విజయం సాధించి.. పసిడిని సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ 18-21తో కొల్పోయిన సౌరభ్.. ఆ తర్వాత తన అధిక్యాన్ని కనబరుస్తూ.. 21-12, 21-17లతో రెండు సెట్లను కైవసం చేసుకుని జయకేతనం ఎగరవేశాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)–మిన్ యుంగ్ కిమ్ (కొరియా) జోడితో జరిగిన మ్యాచ్‌లో 19-21, 17-21తో వరుస సెట్లు కొల్పోవడంతో ఓటమి చవిచూసింది. -
ఫైనల్లో సౌరభ్ వర్మ
వ్లాదివోస్టాక్ (రష్యా): జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అతను 21–9, 21–15తో భారత్‌కే చెందిన మిథున్ మంజునాథ్‌పై విజయం సాధించి తుదిపోరుకు చేరాడు. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో రెండో సీడ్ రోహన్ కపూర్–కుహూ గార్గ్ జంట 21–19, 11–21, 22–20తో చెన్ టాంగ్ జై–యెన్ వై పెక్ (మలేసియా)జోడీపై పోరాడి గెలిచింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అరుణ్ జార్జ్–సన్యమ్ శుక్లా జంట 15–21, 19–21తో రెండో సీడ్ కాన్‌స్టన్‌టిన్ అబ్రమోవ్–అలెగ్జెండర్ జిన్చెన్కో (రష్యా) జోడీ చేతిలో ఓడింది. ఫైనల్లో కోకి వటనబే (జపాన్)తో సౌరభ్ వర్మ; వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)–మిన్ యుంగ్ కిమ్ (కొరియా) ద్వయంతో రోహన్ కపూర్–కుహూ గార్గ్ జోడీ తలపడనుంది. -
మన పోరాటం ముగిసింది
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్‌లో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లోనే సౌరభ్ వర్మ, శుభాంకర్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21–18, 15–21, 11–21తో తైన్ మిన్హ్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, శుభాంకర్ 13–21, 14–21తో చౌ టైన్ చెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ కూడా ప్రిక్వార్టర్స్ దశను దాటలేకపోయారు. రుత్విక శివాని 8–21, 15–21తో సయాక తలకహాషి (జపాన్) చేతిలో... రితూపర్ణ దాస్ 21–15, 13–21, 16–21తో యూలియా యుసేఫిన్ సుసాంటో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 15–21, 11–21తో చాంగ్ తక్ చింగ్–వింగ్ యుంగ్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 14–21, 21–16, 14–21తో లీ చున్ హై రెగినాల్డ్–చౌ హై వాహ్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 18–21తో యున్ని –యియాన్‌గ్యు (చైనా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
ప్రణయ్, సౌరభ్ వర్మ ఓటమి
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో ప్రణయ్ 10–21, 22–20, 21–23తో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ) చేతిలో... సౌరభ్ వర్మ 19–21, 16–21తో అన్‌సీడెడ్ లీ చెయుక్ యుయి (హాంకాంగ్) చేతిలో ఓడారు. -
సిరిల్ శుభారంభం
సౌరభ్ వర్మకు షాక్ న్యూఢిల్లీ: చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ శుభారంభం చేశాడు. మం గళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో సిరిల్ 21–11, 10–21, 21–19తో వీ చి లియు (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. భారత ఆటగాళ్లు అభిషేక్, హర్షీల్ డాని కూడా తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సౌరభ్ వర్మ (భారత్) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. నాలుగో సీడ్ సౌరభ్ 19–21, 20–22తో లీ జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన రాహుల్ యాదవ్ తన ప్రత్యర్థి ఎన్ చియా చింగ్ (చైనీస్ తైపీ)కు ‘వాకోవర్’ ఇచ్చాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ సాయిప్రణీత్, సౌరభ్ వర్మ... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో సాయిప్రణీత్ 21–15, 21–13తో సతీశ్‌థరన్ (మలేసియా)పై, సౌరభ్ 21–17, 20–22, 21–14తో ఆనంద్ పవార్ (భారత్)పై గెలిచారు. అయితే కశ్యప్, ప్రతుల్ జోషి, శుభాంకర్ డే రెండో రౌండ్లోనే ఓడిపోయారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21–5, 21–10తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి ఉత్తేజిత 13–21, 24–22, 27–25తో జెస్సికా ముల్జాతి (ఇండోనేసియా)పై నెగ్గారు. శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, శైలి రాణే, రితూపర్ణ దాస్, రేష్మా కార్తీక్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
మెయిన్ ‘డ్రా’పై వర్మ బ్రదర్స్ దృష్టి
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు ‘వర్మ బ్రదర్స్’ సౌరభ్, సమీర్ సిద్ధమయ్యారు. నేడు జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్లో సమీర్ వర్మ, సౌరభ్ వర్మలు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. సమీర్ వర్మ జపాన్‌కు చెందిన సకాయ్తో, ఇండోనేసియా ఆటగాడు గింటింగ్‌తో సౌరభ్ ఆడతాడు. సైనా, సింధు, శ్రీకాంత్, జయరామ్, ప్రణయ్ నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. -
సాత్విక్ ‘డబుల్’
సింగిల్స్ చాంప్స్ రితూపర్ణ, సౌరభ్ వర్మ పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో డబుల్స్ విభాగాలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ రెండు టైటిల్స్‌ను సాధించగా... తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు (పీఎస్‌పీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ ఆటగాడు సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో రెండోసారి విజేతగా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వయం 21–17, 16–21, 21–14తో నందగోపాల్ (కాగ్)–సాన్యమ్ శుక్లా (ఎయిరిండియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ కె. మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో 21–14, 21–18తో వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (చత్తీస్‌గఢ్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ అమ్మాయి, రెండో సీడ్ రితూపర్ణ దాస్ 21–12, 21–14తో తొమ్మిదో సీడ్ రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలిచి తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2011 చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 21–12తో ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించాడు. -
రన్నరప్ సౌరభ్ వర్మ
సార్‌బ్రకెన్ (జర్మనీ): కెరీర్లో తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థారుు టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన బిట్‌బర్గర్ ఓపెన్ టోర్నమెంట్లో సౌరభ్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 19-21, 20-22తో షి యుకీ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన సౌరభ్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు) తోపాటు 5,950 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. కేసు నుంచి బంగ్లా క్రికెటర్‌కు విముక్తి ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హొస్సేన్ క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాడు. గతేడాది భార్య నిర్తోతో కలిసి షహదత్ తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను హింసించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. -
ఫైనల్లో సౌరభ్ వర్మ
బిట్‌బర్గర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సార్‌బ్రకెన్ (జర్మనీ): భారత యువ ఆటగాడు సౌరభ్ వర్మ బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అతని సోదరుడు, 12వ సీడ్ సమీర్ వర్మకు సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సౌరభ్ 21-15, 21-18తో డెన్మార్క్‌కు చెందిన 15వ సీడ్ అండర్స్ అంటొన్సెన్‌ను కంగుతినిపించాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 23 ఏళ్ల సౌరభ్ జోరుకు అంటొన్సెన్ తలవంచాడు. తొలి గేమ్‌ను అలవోకగా గెలిచిన భారత ఆటగాడికి రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. అరుుతే సౌరభ్ పట్టుదలగా ఆడటంతో విజయం సొంతమైంది. మరో సెమీస్‌లో సమీర్ 18-21, 15-21తో నాలుగో సీడ్ షి యుకి (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సౌరభ్... షి యుకితో తలపడతాడు. -
వర్మ బ్రదర్స్ అదుర్స్
సెమీస్‌లో సౌరభ్, సమీర్ సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సౌరభ్ వర్మ, సమీర్ వర్మ సోదరులు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సౌరభ్... మూడో సీడ్, ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ జ్వెబ్లెర్ (జర్మనీ)కు షాకిచ్చాడు. 51 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో అతను 21-15, 16-21, 21-15తో జ్వెబ్లర్ను కంగుతినిపించాడు. మరో క్వార్టర్స్‌లో 12వ సీడ్ సమీర్ 21-14, 21-16తో అర్టెమ్ పొచ్తరోవ్ (ఉక్రెరుున్)పై అలవోక విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 21-17తో కీరన్ మెరిలిస్ (స్కాట్లాండ్)పై గెలుపొందగా, సౌరభ్ వర్మ 21-11, 22-20తో ఆరో సీడ్ మౌలానా ఇహ్సాన్ (ఇండోనేసియా)కు షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజక్తా సావంత్-యోగేంద్రన్ కృష్ణన్ జంట 15-21, 11-21తో నాలుగో సీడ్ కియాన్ మెంగ్ తన్- పి జింగ్ లై (మలేసియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
విజయ ‘సౌరభం’...
చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన సౌరభ్ వర్మ తైపీ సిటీ: వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో (బెల్జియం, పోలాండ్ ఓపెన్) రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మకు మూడో టోర్నమెంట్ కలిసొచ్చింది. చైనీస్ తైపీ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 12-10, 12-10, 3-3తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచాడు. తొలి రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత మూడో గేమ్‌లో స్కోరు 3-3 వద్ద ఉన్నపుడు డారెన్ లూ భుజం గాయం కారణంగా వైదొలిగాడు. 28 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి రెండు గేముల్లోనూ సౌరభ్ ఒకదశలో వెనుకబడ్డాడు. కానీ వరుస పారుుంట్లతో చెలరేగి వాటిని సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో 7-10తో వెనుకంజలో ఉన్న సౌరభ్ వరుసగా ఐదు పారుుంట్లు... రెండో గేమ్‌లో 6-10తో వెనుకబడ్డపుడు వరుసగా ఆరు పారుుంట్లు గెలిచాడు. గతేడాది మోకాలి, మోచేతి గాయాలతో బాధపడిన 23 ఏళ్ల సౌరభ్ వర్మ ఈ సీజన్లో పునరాగమనం చేసి నిలకడగా రాణిస్తున్నాడు. ‘నాకిది గొప్ప విజయం. అవసరమైన సమయంలో ఈ టైటిల్ లభించింది. గత రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయాను. ఈసారి గత ఫైనల్స్‌లో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా ఆడాను. విజయం సాధించాను’ అని సౌరభ్ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్ వర్మకు 4,125 డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. -
సెమీస్‌లో సౌరభ్
తైపీ సిటీ: చైనీస్ తైపీ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 7-11, 11-1, 11-3, 11-7తో కెంటో హొరియుచి (జపాన్)పై విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో సౌరభ్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సౌరభ్ వరుసగా మూడో అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంటాడు. ఇప్పటికే బెల్జియం, పోలాండ్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన సౌరభ్ ఆ రెండింటిలోనూ రన్నరప్‌గా నిలిచాడు. -
క్వార్టర్స్‌లో సౌరభ్
తైపీ: చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రిలో భారత షట్లర్ సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన ర్యోటరో మరౌను 11-6, 11-8, 11-6తో ఓడించాడు. తొలి గేమ్‌లో 4-0తో దూసుకెళ్లినా ప్రత్యర్థి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా సౌరభ్ గేమ్‌ను ముగించాడు. ఇక రెండో గేమ్‌లో ఏకంగా 7-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి అద్భుతంగా రాణించాడు. చివరి గేమ్ ప్రారంభంలో కాస్త పోటీ ఎదురైనా ఫలితంపై ప్రభావం చూపలేదు. నేడు (శుక్రవారం) జరిగే క్వార్టర్స్‌లో కెంటో హొరియుచి (జపాన్)తో సౌరభ్ తలపడనున్నాడు.