
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్‌లో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లోనే సౌరభ్ వర్మ, శుభాంకర్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21–18, 15–21, 11–21తో తైన్ మిన్హ్ ఎన్‌గుయెన్ (వియత్నాం) చేతిలో, శుభాంకర్ 13–21, 14–21తో చౌ టైన్ చెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ కూడా ప్రిక్వార్టర్స్ దశను దాటలేకపోయారు.
రుత్విక శివాని 8–21, 15–21తో సయాక తలకహాషి (జపాన్) చేతిలో... రితూపర్ణ దాస్ 21–15, 13–21, 16–21తో యూలియా యుసేఫిన్ సుసాంటో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 15–21, 11–21తో చాంగ్ తక్ చింగ్–వింగ్ యుంగ్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 14–21, 21–16, 14–21తో లీ చున్ హై రెగినాల్డ్–చౌ హై వాహ్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 18–21తో యున్‌ని –యియాన్‌గ్యు (చైనా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment